సోనీపత్ జిల్లా

హర్యానా లోని జిల్లా From Wikipedia, the free encyclopedia

సోనీపత్ జిల్లా

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో సోనీపత్ జిల్లా (హిందీ:सोनीपत ज़िला, పంజాబీ:ਸੋਨੀਪਤ ਜ਼ਿਲਾ) ఒకటి. జిల్లా ముఖ్య పట్టణం సోనీపత్. హర్యానా రాష్ట్రంలోని ఢిల్లీ, గుర్‌గావ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్ ( ఉత్తరప్రదేశ్) వంటి జాతీయ రాజధాని ప్రాంతాల్లో సోనీపత్ జిల్లా ప్రాంతం ఒకటి. జిల్లా దక్షిణ సరిహద్దులో కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ, ఉత్తర సరిహద్దులో పానిపట్, వాయవ్య సరిహద్దులో జింద్, తూర్పు సరిహద్దులో యమునానదీ తీరంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతాలు, పశ్చిమ సరిహద్దులో రోహ్‌తక్ ఉన్నాయి.

త్వరిత వాస్తవాలు సోనీపత్ జిల్లా सोनीपत ज़िला ਸੋਨੀਪਤ ਜ਼ਿਲਾ, దేశం ...
సోనీపత్ జిల్లా
सोनीपत ज़िला
ਸੋਨੀਪਤ ਜ਼ਿਲਾ
Thumb
హర్యానా పటంలో సోనీపత్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యానా
డివిజనురోహ్‌తక్
ముఖ్య పట్టణంసోనీపత్
మండలాలు1. Sonipat, 2. Kharkhauda, 3. Gohana, 4. Gannaur
విస్తీర్ణం
  మొత్తం2,260 కి.మీ2 (870 చ. మై)
జనాభా
 (2001)
  మొత్తం12,78,830
  జనసాంద్రత570/కి.మీ2 (1,500/చ. మై.)
  Urban
3,21,432
జనాభా వివరాలు
  అక్షరాస్యత73.71
  లింగ నిష్పత్తి839/1000
ప్రధాన రహదార్లుNH-1 NH-71
సగటు వార్షిక వర్షపాతం624 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి
మూసివేయి

పేరు వెనుక చరిత్ర

జిల్లా పరిపాలక రాజధానిగా వున్న సోనిపట్ పేరును ఈ జిల్లాకు పెట్టారు. సోనిపట్ అనే పేరు స్వర్ణ, ప్రస్థ అనే రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది, స్వర్ణ అంటే బంగారం, ప్రస్థ అంటే ప్రదేశం - స్వర్ణప్రస్థ అంటే బంగారు భూమి అని చెప్పవచ్చు. కాలాను గుణంగా ఈ పేరు స్వర్ణ ప్రస్థ ఉచ్ఛారణ దాని ప్రస్తుత రూపంలో, సోనీపత్ గా మారింది. మహాభారతంలో ఈ నగరం ప్రస్తావన వస్తుంది, ఆ సమయంలో, అది హస్తినాపుర రాజ్యంలో భాగంగా వుండేది. పాండవుల రాయబార సమయంలో పాండవులు అడిగిన అయిదు ఊళ్ళలో ఇది కూడా ఒకటి.

చరిత్ర

మునుపటి రోహ్‌తక్ జిల్లా నుండి కొంత భూభాగాన్ని వేరుచేసి 1972లో ఈ జిల్లాను ఏర్పరచారు.

భౌగోళికం

సోనీపత్ జిల్లా అంతా పంజాబు మైదానంలో భాగంగా ఉంది. అయినప్పటికీ కొన్ని భూభాలలో నేల చదరంగా ఉండదు. జిల్లాలో అత్యధిక భాగం మెత్తని మట్టి ఉంటుంది. కొన్ని భూభాగాలలో ఇసుక ఉంటుంది. మైదానాలు తూర్పు, దక్షిణంగా వాలుగా ఉంట్జుంది. భౌగోళికంగా జిల్లా 3 భూభాగాలుగా విభజించబడింది : ఖదార్, ఎగువభూమి, ఇసుక భూమి.

కదార్

యమునానదీ తీరం వెంట 2-4 మైళ్ళ వెడల్పున వరదభూములుగా ఉన్నాయి. ఖాదర్ మైదానం 20-30 మైళ్ళపొడవు ఉంటుంది. ఈ భూభాగంలో యమునానది తీసుకువద్తున్న మెత్తని బంక మట్టి ఉంటుంది. ఖాదర్ ప్రాంత వ్యవసాయదారులు వరి, చెరుకు పండించబడుతుంది. సమీపకాలంలో జిల్లారైతులు అరటి, బొప్పాయి పంటలు వేయడం మొదలు పెట్టారు.

ఎగువమైదానం

ఖదార్ పశ్చిమంలో సోనీపత్ తాలూకా ఉంది: ఎగువ మైదానం సారవంతమైన మట్టితో కప్పబడి ఉంది. దీనికి చక్కగా సాగునీరు అందుతూ విస్తారమైన పంటలను అందిస్తుంది. నూనెగింజలు, హార్టికల్చర్ మొక్కలు,మ్నూనెగింజలు, కూరగాయలు, పూలు ఉత్పత్తి ఔతున్నాయి. గొహనా తాలూకా లోయలు ఆరవల్లి ఉత్తరభాగంగా పరిగణించబడుతుంది.

ఇసుక భూమి

జిల్లాలో స్వల్పభాగం ఇసుక, ఇసుకరాళ్ళతో కప్పబడి ఉంది.

విభాగాలు

జిల్లాలో 3 ఉపభాగాలు ఉన్నాయి: గనూర్, సోనీపత్, గోహన. అవి అదనంగా 4 తాలూకాలుగా విభజించబడ్డాయి: గనూర్, సోనిపట్, ఖర్ఖుడా, గొహన. సోనిపట్, ఖర్ఖౌడా సోనిపట్ న్యాయపరిధిలో ఉన్నాయి. గనూర్, గొహనాలు వరుసగా వాటివాటి న్యాయపరిధిలో ఉన్నాయి. అదనంగా ఇవి 7 బ్లాకులుగా విభజించబడ్డాయి: గనూర్, సోనీపత్, రాజ్, ఖర్ఖొడా, గొహనా, కథురా, ముంద్లనా. జిల్లాలో 343 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 15 నిర్జనగ్రామాలుగా ఉన్నాయి. జిల్లాలో 6 విధానసభ నియోజకవర్గాలు ఉన్నాయి : గనౌర్, రాజ్, ఖర్ఖౌడా, సోనీపత్, గొహన, బరొడా. ఇవన్నీ సోనీపత్ పార్లమెంటు నియోజక వర్గంలో భాగంగా ఉన్నాయి. సోనీపత్ పార్లమెంటు నియోజక వర్గంలోజింద్ జులానా, సాఫీడన్, జింద్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.[1] జిల్లాలో ఒకేఒక మునిసిపల్ కౌంసిల్, 3 మునిసిపల్ కమిటీలు ఉన్నాయి: గనౌర్,గొహన, ఖర్ఖొడా.

సోనీపత్ న్యాయపరిధిలో ఉన్న గ్రామాలు :

  • బిచ్పరి
  • భయాంపూర్
  • జఖౌలి
  • ఖెవ్రా, హర్యానా
  • కుండ్లి
  • నహ్రి
  • రైపూర్ (సోనీపట్)
  • సిస్నా

విద్య

సోనీపత్ జిల్లా ఉత్తర భారతదేశంలోని ప్రధాన విద్యాకేంద్రాలలో ఒకటి. జిల్లాలో పలు పాఠశాలలు, కళాశాలలతో జిల్లాలో పలు విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి. 1987లో ముర్తల్ లో " స్థాపించబడున దీనబంధు చోటురాం రాం యూనివర్శిటీ ఆఫ్ సైంస్ అండ్ టెక్నాలజీ ", 2006లో సోనిపట్‌లో " భగత్ ఫూల్ సింగ్ మహిళా విశ్వవిద్యాలయం ", 2009లో రాత్ధానా వద్ద స్థాపించబడిన " ఒ.పి. జిండల్ గ్లోబల్ యూనివర్శిటీ మొదలైనవి ఉన్నాయి.

ప్రయాణ సౌకర్యాలు

సోనిపట్ రైల్వే స్టేషను " నార్తన్ రైల్వే జోన్ " లో భాగంగా ఉంది. అంబాలా-ఢిల్లీ రైల్ మార్గం , పలు పాసెంజర్ రైళ్ళు ఈ మర్గంద్వారా పయనిస్తుంటాయి. జాతీయరహదారి 1 , జాతీయరహదారి 71 ఈ జిల్లాను దాటిపోతుంది.

2001 లో గణాంకాలు

మరింత సమాచారం విషయాలు, వివరణలు ...
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,480,080,[2]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 338 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 697 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 15.71%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 853:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 80.8%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.
మూసివేయి

వెలుపలి లింకులు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.