కర్నాల్
హర్యానా రాష్ట్రం లోని నగరం From Wikipedia, the free encyclopedia
హర్యానా రాష్ట్రం లోని నగరం From Wikipedia, the free encyclopedia
కర్నాల్ హర్యానా రాష్ట్రం లోని నగరం, కర్నాల్ జిల్లాకు ముఖ్య పట్టణం. ఇది జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) లో భాగం. పర్షియాకు చెందిన నాదర్ షాకు, మొఘల్ సామ్రాజ్యానికీ మధ్య1739 లో జరిగిన యుద్ధం ఇక్కడే జరిగింది. 1857 లో జరిగిన భారత తిరుగుబాటు సమయంలో, ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన సైన్యం ఇక్కడ తలదాచుకుంది.
కర్నాల్ | |||
---|---|---|---|
నగరం | |||
Coordinates: 29.686°N 76.989°E | |||
దేశం | India | ||
రాష్ట్రం | హర్యాణా | ||
జిల్లా | కర్నాల్ | ||
Named for | కర్ణుడు | ||
Government | |||
• Body | Municipal Corporation Karnal | ||
జనాభా (2011) | |||
• Total | 2,86,827[1] | ||
భాషలు | |||
• అధికారిక | హిందీ, పంజాబీ, ఇంగ్లీషు | ||
Time zone | UTC+5:30 (IST) | ||
PIN | 132001 | ||
Vehicle registration | HR-05 | ||
అక్షరాస్యత | 84.60%[1] | ||
లింగనిష్పత్తి | 996/1000 స్త్రీ/పురుషుడు |
గొప్ప దాత, యోధుడూ ఐన కర్ణుడితో నగరానికి సంబంధం ఉంది. నగరంలో కర్ణుడి పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.[2] నగరంలోని కర్ణ తల్ అనే పేరుతో ఒక సరస్సు ఉంది. నగర ద్వారాన్ని కర్ణ గేట్ అని పిలుస్తారు.
క్రీస్తుశకం 6 వ శతాబ్దం చివరలో, ఈ ప్రాంతం థానేసర్‌కు చెందిన వర్ధనుల పాలనలో ఉండేది.[3] 7 వ శతాబ్దంలో ఇండో-గంగా మైదానాలలో బౌద్ధమతం క్షీణిస్తూ హిందూ మతం తిరిగి పుంజుకుంటోంది. అప్పుడు ఈ ప్రాంతం బెంగాల్ పాల చక్రవర్తి (సా.శ. 770-810) క్రింద కనౌజ్ పాలనలో ఉండేది. కనౌజ్ ప్రతీహార పాలకుడు మిహిర భోజుడి (సా.శ. 836-885) అధికారం కర్నాల్‌తో సహా పెహోవా వరకు విస్తరించి ఉండేది.[4]
రాజా జౌలా వారసులైన తోమరులు 9 వ శతాబ్దం మధ్యలో ఈ ప్రాంతానికి పాలకులయ్యారు.[4] 10 వ శతాబ్దం ప్రారంభంలో, ప్రతీహార శక్తి క్షీణించడం మొదలవగానే, తోమరులు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. తోమర పాలకులలో ఒకడైన అనంగపాల్ తోమర్, ఢిల్లీ నగరాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు. కర్నాల్‌తో సహా ఆధునిక హర్యానా ప్రాంతమంతా అతని రాజ్యంలో భాగంగా ఉండేది. తోమరులకు శాకంబరి చౌహాన్లతో తగాదాలుండేవి. 12 వ శతాబ్దం మధ్యకాలంలో చాహమాన విగ్రహరాజ IV వారిని పదవీచ్యుతులను చేసాడు.[5] కర్నాల్‌తో సహా సత్లజ్, యమునల మధ్య ఉన్న ప్రాంతమంతా ఒకటిన్నర శతాబ్దం పాటు, గజనీ మహమూద్ దండయాత్రల సమయాన్ని తప్పించి, సాపేక్షికంగా ప్రశాంతంగా ఉంది.
సా.శ. 1739 లో, నాదిర్ షా మొఘల్ సామ్రాజ్యంపై దాడి చేసాడు. కర్నాల్ వద్ద జరిగిన యుద్ధంలో నాదిర్ షా, మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షాను నిర్ణయాత్మకంగా ఓడించాడు.[6] ముహమ్మద్ షా తన అపారమైన సైన్యంతో సహా కర్నాల్ వద్ద దుర్గమమైన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాని నాదిర్షా, బయటి నుండి వాళ్ళకు ఆహార సరఫరాలేమీ జరగనీయకుండా దిగ్బంధనం చేసాడు. దానితో ఆకలిని తట్టుకోలేని ముహమ్మద్ షా ఆక్రమణదారుడికి లొంగిపోయాడు. ఈ ఓటమి మొఘల్ సామ్రాజ్యాన్ని తీవ్రంగా బలహీనపరిచింది, పర్షియన్ సామ్రాజ్యం అభివృద్ధి చెందింది. తరువాత, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన వేగవంతమవడానికి కారణమైంది.
18 వ శతాబ్దంలో సిక్కులు ఈ ప్రాంతంలో తొలిసారిగా కనిపించారు. జింద్ రాష్ట్రానికి చెందిన రాజా గజ్‌పత్ సింగ్ కాలంలో కర్నాల్ ప్రాముఖ్యత పెరిగింది. అతడు సా.శ. 1763 లో దీన్ని స్వాధీనం చేసుకుని సరిహద్దు గోడను, ఒక కోటనూ నిర్మించాడు. అతడి పాలనలో పట్టణం పరిమాణం కూడా గణనీయంగా పెరిగింది.[7] 1764 జనవరి 14 న, సిక్కు నాయకులు దుర్రానీ గవర్నరైన జైన్ ఖాన్ సిర్హిందీని ఓడించి చంపారు. కర్నాల్‌తో సహా పానిపట్ వరకు దక్షిణాన ఉన్న సిర్హింద్ ప్రావిన్స్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో, లాలా లాజ్‌పత్ రాయ్ చైర్మన్‌గా కర్నాల్‌లో జిల్లా రాజకీయ సమావేశం ఏర్పాటు చేశారు. "హర్యానా గాంధీ" అని పిలువబడే మూల్ చంద్ జైన్ కర్నాల్‌కు చెందినవాడే. అతను భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ నాయకులలో ఒకడు.[8]
శీతోష్ణస్థితి డేటా - Karnal (1981–2010, extremes 1949–2012) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 31.2 (88.2) |
33.2 (91.8) |
37.5 (99.5) |
45.2 (113.4) |
46.0 (114.8) |
45.6 (114.1) |
43.9 (111.0) |
42.0 (107.6) |
38.3 (100.9) |
39.3 (102.7) |
34.4 (93.9) |
28.5 (83.3) |
46.0 (114.8) |
సగటు అధిక °C (°F) | 19.1 (66.4) |
22.4 (72.3) |
27.7 (81.9) |
35.3 (95.5) |
38.3 (100.9) |
37.9 (100.2) |
33.9 (93.0) |
32.8 (91.0) |
32.5 (90.5) |
31.7 (89.1) |
27.4 (81.3) |
21.8 (71.2) |
30.1 (86.1) |
సగటు అల్ప °C (°F) | 7.1 (44.8) |
9.4 (48.9) |
13.5 (56.3) |
18.8 (65.8) |
23.3 (73.9) |
25.5 (77.9) |
25.6 (78.1) |
25.1 (77.2) |
23.2 (73.8) |
17.4 (63.3) |
12.0 (53.6) |
8.0 (46.4) |
17.4 (63.3) |
అత్యల్ప రికార్డు °C (°F) | −0.3 (31.5) |
0.6 (33.1) |
3.5 (38.3) |
9.0 (48.2) |
14.5 (58.1) |
18.0 (64.4) |
16.0 (60.8) |
18.4 (65.1) |
16.0 (60.8) |
9.4 (48.9) |
3.0 (37.4) |
−0.4 (31.3) |
−0.4 (31.3) |
సగటు వర్షపాతం mm (inches) | 26.7 (1.05) |
24.8 (0.98) |
17.8 (0.70) |
8.4 (0.33) |
24.2 (0.95) |
65.7 (2.59) |
171.8 (6.76) |
157.5 (6.20) |
115.9 (4.56) |
3.5 (0.14) |
1.9 (0.07) |
9.0 (0.35) |
627.2 (24.68) |
సగటు వర్షపాతపు రోజులు | 1.5 | 1.8 | 1.6 | 0.9 | 1.6 | 3.9 | 7.9 | 7.8 | 4.7 | 0.2 | 0.4 | 0.8 | 33.1 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) | 64 | 58 | 51 | 31 | 33 | 44 | 67 | 73 | 68 | 54 | 53 | 60 | 55 |
Source: India Meteorological Department[9][10] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.