From Wikipedia, the free encyclopedia
రెండవ దేవ రాయలు వీర విజయ బుక్క రాయలు కుమారుడు, దేవ రాయలు యొక్క మనుమడు. ఇతను తండ్రి పాలనలోనే పగ్గాలు చేతబట్టినవాడు, సమర్థుడు, అధికార దక్షుడు, ఏనుగులు వేటాడటంలో నేర్పరుడు. ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యం చాలా ప్రసిద్ధి చెందినదీ, నాలుగు చెరగులా వ్యాపించింది. దేశము సుసంపన్నము అయినది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ఇతని కాలమునాటికి కొండవీడు బలహీనమైనది, దీనిని ఆసరాగాతీసుకోని తీరాంధ్రను జయించి, 1424 నాటికి కొండవీడు రాజ్యము అంతరించినది, అనేక చిన్న చిన్న సామంత దండనాయకులు స్వతంత్రించారు. రెండవ దేవరాయలు తీరాంధ్రపైకి దిగ్విజయ యాత్రచేసి నరసరావుపేట, ఒంగోలు లను పంట మైలారరెడ్డిని ఓడించి స్వాధీనం చేసుకున్నాడు. పొదిలిని ఏలుతున్న తెలుగు రాయలును ఓడించాడు. చివరికి వారిని తమ సామంతులుగా స్వీకరించాడు. ఇక్కడ ఓ ముఖ్య విషయం ఏమిటంటే ఈ తెలుగు రాయలు సాళువ వంశమునకు చెందినవాడు.
అలాగే దిగ్విజయ యాత్రను సాగించుతూ 1428 వ సంవత్సరమున కొండవీడు దుర్గమును జయించాడు, తరువాత సింహాచల ప్రాంతములను వానియందలి పర్వత ప్రాంత భూభాగములను విజయనగర రాజ్యమున విలీనం చేసాడు.
1444లో కళింగ అధిపతులైన కపిలేశ్వర గజపతి తీరాంధ్రముపైకి దండయాత్రకు వచ్చాడు, అతడు రాజమహేంద్రవరం వరకూ వచ్చాడు, కానీ తరువాత రెండవ దేవరాయలు పంపించిన మల్లపవడయ చమూపతి ఈ దురాక్రమణను తిప్పికొట్టినాడు.
ఈ కాలమునాటికి దక్షిణ భారతమంతయూ విజయనగరాధీనములోనికి వచ్చింది.
లక్కన్న అను దండనాయకుని సారథ్యంలో దేవరాయ సైన్యం జాఫ్నా పై దండెత్తి కప్పమును స్వీకరించెను. రెండవ దేవరాయ రాజ్యము సింహళము నుండి గుల్బర్గ వరకూ, ఓడ్ర దేశము నుండి మలబారు తీరము వరకూ వ్యాపించింది.
బహుమనీ సుల్తాను అహ్మద్ షా గొప్ప సైన్యమును ఏర్పాటుచేసుకోని దండెత్తి తొలి సారి విజయం సాధించాడు. తరువాత అతడు పద్మనాయకులుపై దండెత్తినాడు, కానీ సరిఅయిన సమయానికి విజయనగర సైన్యం రానికారణంగా పద్మనాయకులు ఈ యుద్ధమున ఓడిపొయినారు. అప్పటినుండి పద్మనాయకులూ, విజయనగరాధీశులూ మరల శతృత్వము వహించారు.
ఈ సారి దేవరాయలు 1443నందు బహుమనీ రాజ్యముపై దండెత్తి ముద్గల్లు, బంకాపూర్, రాయచూర్, లను ఆధీనం చేసుకోని బీజాపూర్, సాగర్ లపైకి సైన్యమును నడిపినాడు. ఈ యుద్ధం అతి భయంకరంగా రెండు నెలలు జరిగినది, ఇరువైపులా చాలా నష్టాలు కలిగినాయి, చివరకు సంధి కుదిరినది, బహుమనీ, విజయనగర రాజ్యాల మధ్య కృష్ణా నది ఎల్లలుగా గుర్తించబడినాయి.
ఇతని సైన్యము చాలా బలవంతమైనది, ఇతను చక్కని ముస్లిం సైనికాధికారులను పిలిపించి తన సైన్యానికి శిక్షణ ఇప్పించాడు. తన సైన్యంలో రెండువేలమంది ముస్లింలను చేర్చుకున్నాడు. (ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదాలకు దారితీసినది, ఎందుకంటే అచ్యుతరాయల కాలం నాటికి సైన్యంలో ముస్లింల సంఖ్య చాలా పెరిగినది, కానీ వారు రాక్షస తంగడి యుద్దమున అచ్యుత రాయలకు వెన్నుపోటుపొడిచి యుద్ధంలో రాయల మరణానికీ, తద్వారా విజయనగర పతనానికీ హేతువులలో ఒకరుగా నిలిచారు)
ఇతని సైన్యంలో రెండు లక్షల కాల్బలము, 80 వేల అశ్విక దళము, 60 వేల ధనుర్విద్య విశారదులూ ఉండేవారు.
ఇతను శైవమతాభిమాని, పరమత సహనము కలవాడు, ఈ కాలములో అందరికీ ఆలయములు నిర్మించాడు, ముఖ్యముగా జైనులకూ, ముస్లింలకూ, వైష్ణవులకూ, శైవులకూ ఆలయములు నిర్మించాడు.
ప్రసిద్ధ డిండిమ భట్టారకుడు ఈ కాలమునందలివాడే, ఇతనినే శ్రీనాథుడు ఓడించి కవిసార్వభౌమ బిరుదును తీసుకున్నాడు. కంచు డక్కను పగల గొట్టినాడు.
ఇది ఏడు ప్రాకారములు కలది, ప్రాకారముల మధ్యలో పంట పొలాలు ఉన్నాయి. దీని చుట్టుకొలత సుమారుగా 100 కిలోమీటర్లు.
ఆనాటి పండుగలు చాలా ఉత్సాహంతో జరుపుకునేవారు, ముఖ్యముగా దీపావళి, శివరాత్రి, వసంతోత్సవములు ఘనంగా జరుపుకునేవారు.
ఇందు 300 ఓడరేవులు ఉన్నాయి. సామ్రాజ్యము ధనవంతమైనది. విజయనగరం చాలా అద్భుతంగా ఉండెడిది. రాజప్రాసాదము అత్యున్నతమైనది, మనోహరమైనది, నగర వీధులందు స్వర్ణరత్నాభరణములు, వజ్రవైడూర్యములు రాసులుగా పోసు అమ్ము వర్తక శ్రేష్ఠులు ఉన్నారు, సామ్రాజ్య ప్రజలు విలాసమయ జీవితము గడిపేవారు।
విజయనగర రాజులు | |
---|---|
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం |
ఇంతకు ముందు ఉన్నవారు: వీర విజయ బుక్క రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1424 — 1446 |
తరువాత వచ్చినవారు: మల్లికార్జున రాయలు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.