Remove ads
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా నగరం From Wikipedia, the free encyclopedia
ఒంగోలు నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం, ఒంగోలు మండలానికి కేంద్రం. ఒంగోలు గిత్త అనే ఎద్దుల స్థానిక జాతి పేరు ఒంగోలు నుండి వచ్చింది.[5]
ఒంగోలు | |
---|---|
City | |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానం | |
Coordinates: 15.506°N 80.049°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
పురపాలకసంఘం | 1876 |
నగరపాలకసంస్థ | 2012 జనవరి 25 |
వార్డులు | 50 |
Government | |
• Type | స్థానిక స్వపరిపాలన |
• Body | ఒంగోలు నగరపాలక సంస్థ |
• శాసనసభ్యుడు(రాలు) | బాలినేని శ్రీనివాసరెడ్డి, YSRCP |
• పార్లమెంటు సభ్యుడు(రాలు) | మాగుంట శ్రీనివాసులురెడ్డి YSRCP |
విస్తీర్ణం | |
• Total | 132.45 కి.మీ2 (51.14 చ. మై) |
జనాభా | |
• Total | 2,08,344 |
• జనసాంద్రత | 1,600/కి.మీ2 (4,100/చ. మై.) |
• నివాసగృహాలు | 51,768 |
నివాసగృహాలు [4] | |
అక్షరాస్యత వివరాలు | |
• అక్షరాస్యులు | 1,53,628 |
• అక్షరాస్యత | 83.04% |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 523001, 523002 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91–8592 |
ఒంగోలు సమీపంలోని చినగంజాంలో దొరికిన ఆధారాలను అనుసరించి మౌర్య, శాతవాహనుల పాలన కాలంలోనే ఈ పట్టణం రూపుదిద్దుకున్నట్లు ఋజువౌతుంది. శాతవాహనుల తరువాత కాకతీయుల పాలనలో ఈ పట్టణం వెలుగులోకి వచ్చింది. ఆ సమయలో మోటుపల్లి, వాడరేవు ప్రసిద్ధ రేవు పట్టణాలుగా ఉన్నాయి. రెడ్డి రాజులు మొదట ఒంగోలు సమీపములోని అద్దంకిని రాజధానిగా పాలించారు. వంగవోలు రాజులు పరిపాలించారు కాబట్టి ఈ ప్రాంతానికి వంగవోలు అనే పేరు వచ్చింది.[ఆధారం చూపాలి] కాలక్రమేణా వంగవోలు పేరు ఒంగోలుగా స్థిరపడి పోయింది. కడప నవాబుల పాలనలో ఉన్న ఒంగోలు ప్రాంతం కర్ణాటక నవాబు హైదర్ అలీకి దత్తం చేయబడింది. 1801లో టిప్పూ సుల్తాన్ వద్ద నుండి బ్రిటీషు పాలనలోకి వచ్చింది.[6]
ఒంగోలుజాతి ఎద్దులు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఎద్దులు. ప్రఖ్యాతిచెందిన జేబూ (Zebu) జాతి ఎద్దులలో ఇవి ఒకటి.
2011 జనగణన ప్రకారం, జనాభా 204,746. ఇందులో 102,835 మగవారు, 101,911 ఆడవారు ఉన్నారు. 0–6 వయసు లోపు వారు 19,744 మంది ఉన్నారు. ఇందులో 10,228 అబ్బాయిలు, 9,516 అమ్మయిలు. అక్షరాస్యత 83.04%.[7] జనాభాపరంగా ఆంధ్రప్రదేశ్ లో 13వ పెద్ద నగరం.[8]
1876లో ఒంగోలు పురపాలకసంఘం ఏర్పాటుచేశారు.[9] దీని ప్రస్తుత అధికార పరిది 25.00 కి.మీ2 (9.65 చ. మై.).
జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 216 నగరం గుండా వెళ్ళే జాతీయ రహదార్లు. ఒంగోలు బస్ స్టేషన్ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు నడుపుతుంది.[10][11]
ఒంగోలు రైల్వే స్టేషను హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము పై ఉంది. ఇది విజయవాడ రైల్వే డివిజను లోని దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెందిన A-గ్రేడ్ రైల్వే స్టేషను.[12]
ఒక కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని 2014 ఫిబ్రవరిలో ఆమోదించారు.[13]
రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,,[14] క్యు.ఐ.ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ,[15] ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ,[16] పేస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వంటి కళాశాలలు ఒంగోలులో వున్నాయి
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఒంగోలు ఒక పెద్ద కేంద్రమే. పట్టణం చుట్టూ వున్నా పల్లెల వలన ఒంగోలుకు వచ్చి పాఠశాల చదువు పొందేవారు సంఖ్యా ఎక్కువే.
భరద్వాజ మహర్షి వేద విద్యా మండలి (అలూరి సీతారామమ్మ-రామకోటేశ్వరరావు పాఠశాల)
ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్ తో పాటు పలు అల్లోపతి ప్రైవేటు ఆసుపత్రులున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్లో వర్జీనియా రకం పొగాకు పంటకు ఒంగోలు ఒక ప్రధాన ఉత్పత్తి, వాణిజ్య కేంద్రము. గ్రానైటు గనులకు ప్రసిద్ధి చెందినది.
ఒంగోలులోని పెద్ద వ్యాపార సంస్థలు రైతుకుటుంబాలచే స్థాపించబడ్డాయి. పొగాకు కంపెనీలు, పంట, వ్యాపారం బాగా జరుగుతూ వచ్చింది. 1970, 80 దశాబ్దాలలో షూ, పెయింట్, మందులకంపెనీ, పివిసి మొదలైన పరిశ్రమలు ప్రారంభించబడ్డాయి. కానీ వీటిలో చాలావరకు పోటీకి నిలిచి మనుగడ సాగించడంలో విఫలమయ్యాయి. ఎనభై, తొభైయవ దశాబ్దంలో నూతన సెకండరీ, ఇంటర్మీడియట్ కళాశాలలు, ఆసుపత్రుల స్థాపనలు అధికమైనాయి. ఎనభైయ్యవ దశకంలో ఒంగోలు పశ్చిమ దిశలో గ్రానైట్ నిక్షేపాలు వెలుగు చూడటంతో వ్యాపార పరంగా సరికొత్త అధ్యాయం మొదలైంది.
ప్రతి దీపావళికి ముందు నరకాసుర వధ ప్రదర్శన సాంప్రదాయం 1902 నుంచి కొనసాగుతుండటం విశేషం. నరక చతుర్దశి రోజు అర్ధరాత్రి ఈ ప్రదర్శన మొదలై తెల్లవారు జామున నాలుగు గంటలకు ముగుస్తుంది. ఒంగోలు శ్రీయువజన మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుగుతాయి. పట్టణంలోని తూర్పుపాలెం నివాసి సింగరాజు సుబ్బయ్య నేతృత్వంలో ఈ కార్యక్రమం మొట్టమొదటి సారిగా ప్రారంభమైంది.[17]
ప్రతీ యేడు ఇక్కడ ఎన్.టి.ఆర్ కళా పరిషత్, ఒంగోలు ఆధ్వర్యంలో జరిగే నాటకోత్సవాలు జరుగుతాయి. ఒంగోలు నుండి ఎంతో మంది ప్రముఖులు నాటక, చిత్ర రంగమందు ప్రసిద్ధి చెందారు. "కంచు కంఠం"గా పేరొందిన నటుడు కొంగర జగ్గయ్య ఈ ప్రాంతంనుండి భారత లోక్ సభ సభ్యుడిగా, ఎన్నికైన తొలి భారతీయ కళాకారునిగా కూడా చరిత్రకెక్కారు.[ఆధారం చూపాలి]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.