From Wikipedia, the free encyclopedia
మాగుంట శ్రీనివాసులురెడ్డి (జననం 1953 అక్టోబరు 15) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు ఆంధ్ర ప్రదేశ్ లోని ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుండి 14వ లోక్సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
మాగుంట శ్రీనివాసులురెడ్డి | |||
![]() | |||
పదవీ కాలం 2019 - ప్రస్తుతం | |||
ముందు | వై.వి.సుబ్బారెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఒంగోలు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ | 15 అక్టోబరు 1953||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెసు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | మాగుంట గీతలత | ||
సంతానం | 2 కుమారులు (రాఘవరెడ్డి) | ||
నివాసం | ఒంగోలు | ||
మూలం | biodata |
మాగుంట శ్రీనివాసులరెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1998, 2004, 2009 ఎన్నికల్లో ఒంగోలు ఎంపిగా కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచాడు. ఆయన 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, 2014 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుధేశం పార్టీలో చేరి 2014లో ఒంగోలు ఎంపిగా పోటీ చేసి ఓటమి చెందాడు. ఆయన 2015లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల తరుపున శాసనమండలి సభ్యునిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1]
మాగుంట శ్రీనువాసులు రెడ్డి 2019 మార్చి 16న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2] ఆయన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ స్థానం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. ఆయన 2024 ఫిబ్రవరి 28న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి [3] మార్చి 16న తెలుగుదేశం పార్టీలో చేరాడు.[4]
మాగుంట శ్రీనివాసులురెడ్డి 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై 50199 ఓట్ల తేడాతో లోక్సభ సభ్యుడిగా గెలిచాడు.[5] ఆయన పార్లమెంట్ లో గృహ, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా 2024 సెప్టెంబర్ 27న నియమితుడయ్యాడు.[6]
Seamless Wikipedia browsing. On steroids.