మార్చి 23 , గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 82వ రోజు (లీపు సంవత్సరములో 83వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 283 రోజులు మిగిలినవి.
1931 : భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన భగత్ సింగ్ (జ. 1907, రాజ్గురు (జ. 1908), సుఖ్దేవ్ (జ. 1907) లు ఉరి తీయబడ్డారు. వారి మరణాలకు గుర్తుగా ఆ రోజు అమరవీరుల దినొత్సవంగా గుర్తిస్తారు.
1942 : రెండవ ప్రపంచ యుద్ధంలో హిందూ మహాసముద్రములో అండమాన్ దీవులను జపనీయులు ఆక్రమించుకున్నారు.
1956 : ప్రపంచంలో మొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా పాకిస్తాన్ అవతరించింది. (పాకిస్థాన్ గణతంత్ర దినోత్సవం)
1749 : పియర్ సైమన్ లాప్లేస్ , ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. (మ.1827)
1893 : భారతదేశ ఆవిష్కర్త, ఇంజనీర్ జి.డి.నాయుడు (మరణం:1974)
1909: సుంకర సత్యనారాయణ, పాటల రచయిత, నాటకాల రచయిత, బుర్ర కథ రచయిత, (మ.1975)
1910 : రామమనోహర్ లోహియా, సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త
1934 : కె.బి.కె.మోహన్ రాజు , సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. (మ.2018)
1950 : వి.డి.రాజప్పన్ , మలయాళ సినిమా హాస్యనటుడు. (మ.2016)
1953 : అశోక్ దాస్ , భారతీయ అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త.
1968 : మేకా శ్రీకాంత్ , తెలుగు సినిమా నటుల్లో ఒకడు
1979: విజయ్ ఏసుదాస్, గాయకుడు.
1987: కంగనా రనౌత్, భారతీయ చలనచిత్ర కథానాయకి.
Statues of Bhagat Singh, Rajguru and Sukhdev
1931 : భగత్ సింగ్ , భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1907)
1931 : సుఖ్ దేవ్ , భారత జాతీయోద్యమ నాయకుడు, భగత్ సింగ్ సహచరుడు. (జ.1907)
1931 : రాజ్ గురు , స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు, భగత్ సింగ్ సహచరుడు. (జ.1908)
1992 : ఫ్రెడరిక్ హేయక్ , ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత.
2015 : లీ క్వాన్ యూ , సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్ జాతి పితగా ప్రసిద్ధుడు. (జ.1923)
2015 : మల్లి మస్తాన్ బాబు , ప్రపంచ పర్వతారోహకుడు. (జ.1974)
2022 : ఆర్.సి. లహోటి , భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి. (జ.1940)
మార్చి 22 - మార్చి 24 - ఫిబ్రవరి 23 - ఏప్రిల్ 23 -- అన్ని తేదీలు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
మూసివేయి