శ్రీమద్భాగవతం From Wikipedia, the free encyclopedia
ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసం
తెలుగులో పోతన రచించిన గ్రంథాన్ని గురించి ప్రత్యేకంగా శ్రీమదాంధ్ర భాగవతం అనే వ్యాసంలో వ్రాయండి.
భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత, ధర్మశాస్త్రం సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భాగవత అవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి.
ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కథను వారికి చెప్పినట్లుగాను, దానిని వేద వ్యాసుడు గ్రంథస్తం చేసినట్లుగాను ఈ కథ చెప్పబడింది. భాగవతంలో వివిధ భాగాలను "స్కంధాలు" అంటారు. వివిధ స్కంధాలలో భగవంతుని అవతార కార్యాల వర్ణనలు, భక్తుల గాథలు, పెక్కు తత్వ బోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరచబడినాయి. భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. అతని ౨౧ (21) అవతారాలు వర్ణింపబడ్డాయి. వైష్ణవులందరికీ ఇది పరమ పవిత్రమైన గ్రంథము. ఇది మొత్తం ద్వాదశ (12) స్కంధములుగా విభజించబడింది.
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
వేదాంత పరంగా భాగవతం ప్రాముఖ్యత భాగవతంలోనే క్రింది శ్లోకంలో చెప్పబడింది.
సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే
తద్రసామృత తృప్తస్య నాన్యత్ర స్యాద్రతి క్వచిత్
శ్రీమద్భాగవతం సకల వేదాంత సారంగా చెప్పబడింది. భాగవత రసామృతాన్ని పానం చేసినవారికి మరే ఇతరములు రుచించవు (12.13.15) [1] వైష్ణవ సిద్ధాంతాలలో వేదాంత సూత్రాలకు భాగవత పురాణమే సహజమైన వ్యాఖ్యగా పరిగణింపబడుతున్నది. పురాణాలలో ఇది ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది.[2]
భాగవతం ప్రాముఖ్యత గురించి ఏల్చూరి మురళీధరరావు ఇలా వ్రాశాడు - అష్టాదశ మహాపురాణాలను ప్రస్తావించిన దేవీభాగవతంలోని శ్లోకంలో భాగవతం ఉపపురాణంగా చెప్పబడింది. అప్పటిలో (దేవీభాగవతం 12వ శతాబ్దంలో రచింపబడిందని ఒక అభిప్రాయం) శాక్తేయమతానికి ప్రాధాన్యత కల్పించే ప్రయత్నంలో ఇలా వ్రాయబడి ఉండవచ్చునని ఒక అభిప్రాయం ఉంది. లోకంలో మహాభాగవతానికి ఉన్న ప్రసిద్ధి సామాన్యమైనది కాదు. "ఈ మహా గ్రంథం ఆసేతుశీతాచల వ్యాప్త పండిత మండలీ కంఠస్థగిత విపుల మణిహారమై, నానా మత ప్రస్థాన సిద్ధాంతావిరుద్ధ ప్రమాణ తర్క సాధనోపాలంభ పూర్వక దుర్విగాహ భక్తి స్వరూప నిరూపణ ఫల వ్యాచి ఖ్యాసువులకు ఆలవాలమై, గీర్వాణ వాణీ తరుణారుణ చరణారవింద మరందాస్వాదలోల హృన్మత్త మిళింద చక్రవర్తులచే బహుభాషలలోనికి అనూదితమై, మోక్షాభిలాషుల మనస్సులలో భద్రముద్రాంకితమై, నిజానికి పురాణమంటే ఇదేనన్నంత అవిరళమైన ప్రచారాన్ని గడించింది. .. ఆధ్యాత్మిక శిఖరాల నధిరోహించిన ఈ ఉద్గ్రంథం భారతదేశంలోని సారస్వతేయుల మహాప్రతిభకు ప్రధమోదాహరణమై శాశ్వతంగా నిలిచి ఉంటుంది." [3]
చారిత్రికంగా భాగవతం 9వ, 10వ శతాబ్దాల సమయంలో, భక్తి మార్గం ప్రబలమైన సమయంలో, రూపు దిద్దుకొన్నదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.[4] కాని హిందూ మత సంప్రదాయాలలోని విశ్వాసం ప్రకారం కలియుగారంభంలో వేద వ్యాసునిచే రచింపబడినదని చెబుతారు.[5]
కొందరి వాదనల ప్రకారం వేదాలలో సరస్వతీ నదిని ఒక మహానదిగా ప్రస్తావించినందున ఈ రచన చాలా పురాతనమైనది అయ్యుండాలి. [6] ఎందుకంటే సరస్వతీ నది సుమారు సా. పూర్వం 2000 BCE సమయంలో కనుమరుగయ్యింది.[7].
భాగవతం ప్రస్తుత పాఠం సా.శ. 6వ శతాబ్ది కాలంలో రూపొంది ఉండాలని, అయితే మత్స్యపురాణంలో ఉన్న భాగవత ప్రశంసను బట్టి అంతకు పూర్వమే (సా.శ. 4వ శతాబ్ది ముందే) ఒక మూలపాఠం ఉండి ఉండొచ్చునని ప్రొఫెసర్ హజరా భావించాడు. "ఫిలాసఫీ ఆఫ్ భాగవత" అనే విపుల పరిశోధన గ్రంథం ఉపోద్ఘాతంలో ప్రొఫెసర్ సిద్ధేశ్వర భట్టాచార్య ఇలా చెప్పాడు - "మొత్తం మీద శ్రీ మద్భాగవతానికి మూడు దశలలో మార్పులు, చేర్పులు జరిగాయని నిర్ణయించవచ్చును. మొదటి దశలో అతి ప్రాచీనమైన విషయ జాతకం మాత్రమే మాతృకాప్రాయమై సమకూడింది. సాధారణ యుగారంభ కాలానికి రెండవ దశలో దీనికి మహాపురాణ లక్షణాలకు అనురూపమైన సంసిద్ధి లభించింది. ఇక చిట్టచివరి దశలో తముళదేశపు సాధుమండలి కృషి వలన నేటి రూపం సిద్ధించింది.ఈదృక్కోణంనుండి పరిశీలిస్తే శ్రీమద్భాగవత ప్రకృత పాఠం ఆళ్వారులకు సమకాలంలో రూపొందిందని నమ్మవచ్చును.[3]
భాగవత పురాణము సంభాషణల రూపంలో రచించబడింది. పరీక్షీత్తు మహారాజు ( పాండవ మద్యముడైన అర్జునుని మనుమడు) ఒక బ్రాహ్మణునిచే శాపగ్రస్తుడై ఏడు దినములలోపు మరణిస్తాడని తెలిసి తన రాజ్య విధులన్నీ పక్కనబెట్టి ప్రతీ జీవి యొక్క అంతిమ లక్ష్యాన్ని తెలియగోరాడు. అదే సమయంలోనే తను సంపాదించిన అపార జ్ఞాన సంపదను ఎవరికి బోధించాలో తెలియక, ఒక మంచి శిష్యుని కోసం వెతుకుతున్న శుకుడు అనే ముని రాజుకు తారసపడి ఆ రాజుకు బోధించడానికి అంగీకరిస్తాడు. ఈ సంభాషణ ఎడతెరిపిలేకుండా ఏడు రోజులపాటు కొనసాగింది. ఈ వారం రోజుల సమయంలో రాజుకు నిద్రాహారాలు లేవు. ఒక జీవి యొక్క అంతిమ లక్ష్యం, నిత్య సత్యమైన భగవంతుడు శ్రీకృష్ణుడు గురించి తెలుసుకోవడమేనని వివరిస్తాడు.[8]
పురాణాలలో వర్ణించవలసిన విషయాలను క్రీ..శ. 6వ శతాబ్దిలో అమర సింహుడు తన "నామలింగానుశాసనం"లో ఇలా చెప్పాడు.
వ్యాస భాగవతంలో పది మహాపురాణ లక్షణాలున్నాయి:
(1) సర్గము (2) విసర్గము (3) వృత్తి (4) రక్షణము (5) మన్వంతరము (6) వంశము (7) వంశానుచరిత (8) నిరోధము (9) హేతువు (10) అపాశ్రయం.
ఈ లక్షణాలన్నీ భాగవతంలో ఉండడం వల్లనే అది మహాపురాణంగా ప్రసిద్ధమైనది.
భాగవతం | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
భాగవతంలోని వివిధ స్కంధాలలో ఉన్న ముఖ్య విషయాలు సంక్షిప్తంగా క్రింద తెలుపబడ్డాయి. (మరింత విపులమైన వివరాలకోసం ఆయా స్కంధాల గురించిన ప్రత్యేక వ్యాసాలు చూడండి)
ఆధునిక కాలంలో శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనల ద్వారా తరచి చూస్తున్న కొన్ని విషయాలు భాగవతంలో అప్పటి సిద్ధాంతాల ప్రకారం ప్రస్తావించబడ్డాయి. మూడవ స్కంధం (11వ అధ్యాయం) లో సమయ విభాగం గురించి చెప్పబడింది. అందులో సూక్ష్మకాలం పరమాణు ప్రక్రియలకు పట్టే కాల పరిమాణం రేంజిలో ఉంది. స్థూల కాలం విశ్వం వయస్సుగా చెప్పబడే కాలం పరిధిలో ఉంది.[9]
అలాగే 9వ స్కంధంలో తన కకుద్ముడు అనే రాజు తన కుమార్తె రేవతిని బ్రహ్మ లోకానికి తీసికొని వెళ్ళి, కొద్ది సమయం (నిముషాలు, గంటలు?) బ్రహ్మను దర్శించి తిరిగి భూలోకానికి తిరిగి వచ్చే సరిగి భూలోకంలో ఎన్నో వేల సంవత్సరాలు గతించాయి. ఈ సంఘటన ఆధునిక సాపేక్ష సిద్ధాంతంలో చెప్పబడే "కాలం వ్యవధి కుంచించుకుపోవడం లేదా పెరగడం" (Time Dilation) అనే విషయానికి సారూప్యతను కలిగి ఉంది.[10]
3వ స్కంధంలో గర్భం ఏర్పడిన దగ్గర నుండి పిండం పెరిగే ప్రక్రియ వర్ణింపబడింది.
భగవంతుని దివ్య స్వరూపం భాగవతంలో ఒకచోట ఇలా వర్ణించబడింది.
భాగవతంలో విష్ణువు యొక్క 25 అవతారాల లీలలు వర్ణించబడ్డాయి.[12]
యమునా నది తీరాన బృందావనంలో కృష్ణుని బాల్య లీలలు భాగవతంలో విపులంగా వర్ణించబడ్డాయి. వెన్నదొంగగా, గోపాల బాలకునిగా, గోపీజన మానస చోరునిగా, నందగోకుల సంరక్షకునిగా బాలకృష్ణుని చేష్టలు, తల్లికి తన నోట సకల భువనాలు చూపిన లోకాధినాధుని స్వరూపము, గోవర్ధన గిరిధారిగా కొండనెత్తిన వాని మహిమ - ఇవన్నీ శ్రీకృష్ణావతారం కథలో ముఖ్యమైన విశేషాలు. కృష్ణుడు తమనుండి దూరమైనపుడు గోపికలు పడే వేదన భక్తి భావానికి సంకేతంగా వర్ణిస్తారు.
15వ శతాబ్దిలో బమ్మెర పోతన, అతని శిష్యుడు వెలిగందల నారయ, ఇంకా గంగన, ఏర్చూరి సింగన ఆంధ్రీకరించిన భాగవతానికి తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం ఉంది. పోతన రచనా శైలి, భక్తి భావం, పద్యాలలోని మాధుర్యం తెలుగునాట బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. దీనిలో ఎన్నో పద్యాలు నిత్య వ్యవహారంలో ఉదహరింపబడుతున్నాయి. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఒక ప్రచురణ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఒక ప్రచురణ సాధారణంగా అందుబాటులో ఉన్నాయి.
ఇవి కాకుండా తెలుగులో భాగవతానికి, సంబంధిత పురాణాలకు సంబంధించిన పెక్కు రచనలు సంప్రదాయ సాహితయంలోను, ఆధునిక సాహిత్యంలోను, జానపద సాహిత్యంలోను ప్రముఖ స్థానం వహిస్తున్నాయి. వాటిలో కొన్ని
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.