From Wikipedia, the free encyclopedia
ఉగ్రశ్రవసుడు మహాభారతం, [1] భాగవత పురాణం, [2][3] హరివంశం, [4] పద్మ పురాణం [5] వంటి అనేక పురాణాలను ప్రవచించిన కథకుడుగా కనిపిస్తాడు. ఇతనికి సూతుడు, శౌతి అనే పేర్లు కూడా ఉన్నాయి. నైమిశారణ్యంలో ఋషులు గుమిగూడి వింటూండే కథలను ఉగ్రశ్రవసుడే చెబుతూంటాడు. అతను రోమహర్షణుడి కుమారుడు.[4] మహాభారత కర్త వ్యాసునికి శిష్యుడు.
మహాభారత ఇతిహాసం యావత్తూ ఉగ్రశ్రవసుడికీ (కథకుడు) శౌనకుడికీ (కథకుడు) మధ్య జరిగిన సంభాషణగా రూపొందింది. భరత చక్రవర్తుల చరిత్ర గురించి వైశంపాయనుడు జనమేజయ చక్రవర్తికి చెప్పడం ఈ ఉగ్రశ్రవసుని వ్యాఖ్యానంలో అంతర్భాగం. వైశంపాయన కథనంలో మళ్ళీ కురుక్షేత్ర యుద్ధం గురించి సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పిన ప్రత్యక్ష కథనం నిక్షిప్తమై ఉంటుంది. ఈ విధంగా మహాభారతం, కథలో అంతర్గతంగా కథ అనే నిర్మాణం ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.