భక్తి యోగము

From Wikipedia, the free encyclopedia

భక్తి యోగము

భక్తి యొగమును గురించి భగవద్ గీతలో చక్కగ వివరించబడింది. భక్తి యోగము పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి.

శివాలయంలో శివునికి అర్చన చేస్తున్న భక్తులు

నారద భక్తి సూత్రాలు

తొమ్మిది రకాల భక్తిని నారద మహర్షి భక్తి సూత్రాలలో వివరించారు. వీటినే నవవిధభక్తులు అని పిలుస్తారు.

  1. శ్రవణము
  2. గానము
  3. స్మరణము
  4. పాద సేవనము
  5. అర్చనము
  6. వందనము
  7. దాస్యము
  8. సఖ్యము
  9. ఆత్మ నివేదనము

శైవాచార్యులు

వైష్ణవాచార్యులు

  1. ఆళ్వారులు
  2. గోదాదేవి
  3. రామానుజాచార్యులు
  4. మధ్వాచార్యులు
  5. నింబార్క స్వామి
  6. వల్లభాచార్యులు
  7. రాఘవేంద్రస్వామి
  8. చైతన్య ప్రభువు
  9. ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.