బ్రాహ్మణం
From Wikipedia, the free encyclopedia
బ్రాహ్మణాలు (దేవనాగరి: ब्राह्मणम्) హిందూ మతం శ్రుతి సాహిత్యం యొక్క భాగంగా ఉన్నాయి. ఇవి ఆచారాలు సరైన పనితీరును వివరించే నాలుగు వేదాల మీద వ్యాఖ్యానాలు ఉన్నాయి. ప్రతి వేద శాఖ (పాఠశాల), దాని సొంత బ్రాహ్మణులను కలిగి ఉంది. ఈ అనేక గ్రంథాలు మహాజనపదులు కాలంలో ఎన్ని ఉనికిలో ఉన్నాయో తెలియదు.
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
![]() | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవాగమం · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
వేదభాగము
- బ్రాహ్మణము ఒక వేదభాగము. ఇది ప్రతి వేదంలో ఉంటుంది. ఇది సంహిత యొక్క యాగవినియోగవ్యాఖ్య. ఈ భాగములో మహా యాగముల గూర్చి తెలపడం జరిగింది. అశ్వమేధము వంటి యాగముల ప్రశస్తి వివరించడం జరిగింది. యజ్ఞ యాగాదులు ఎలా చేయాలి? వాటి వెనుక రహస్యాలు ఏమిటి వంటి విషయాలు ఉన్నాయి.
ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి
- సంహితలు- మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు
- బ్రాహ్మణాలు- సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.
- అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.
- ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి.
బ్రాహ్మణాలు నిర్వచనము
- బ్రాహ్మణాలు,లో పురాణాలు, తత్వశాస్త్రం, వేదాల ఆచారాలు గురించి వ్యాఖ్యానాలు ఉంటాయి. వేదసంహితలు తదుపరి మహోన్నత స్థానం బ్రాహ్మణాలు కలిగి ఉన్నాయి. ఇవి వేదాలలోని అంతర్భాము. చతుర్వేదాలలోని సంహిత (శ్లోక, మంత్ర) భాగములకు బ్రహ్మ పదాన్ని, వ్యాఖ్యాన రూపంగా ఉన్నదానికి బ్రాహ్మణం అని చెప్పబడు తున్నది. ఈ నాలుగు వేదాలలో గల మంత్రాలను, ఎక్కడెక్కడ, ఏఏ యజ్ఞములకు ఈ మంత్రాలను ఎలా వినియోగించాలి, ఆయా వాటిని అవసరమైన చోట వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి గ్రంథాలకు బ్రాహ్మణాలు అని అంటారు. బ్రాహ్మణాల గ్రంథాలందు సంహితలలోని శ్లోకాల నిగూఢ అర్థాన్ని చెబుతూ అనేక వివరణలతో పాటుగా, ఉపాఖ్యానలు కూడా తెలియజేస్తాయి.[1]
ఋక్సంహిత బ్రాహ్మణం
- సంహిత యొక్క ప్రతి ప్రధాన శాఖకు ఒక బ్రాహ్మణం ఉండాలి/ఉండేది.
- ఋక్సంహితకు 21 శాఖలు ఉన్నట్లుగా తెలియుచున్నది. ఆ విధముగా 21 బ్రాహ్మణాలు తప్పకుండా ఉండాలి.
- ఋగ్వేదానికి కౌషీతకి బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం, అశ్వలాయన బ్రాహ్మణం గాలవ బ్రాహ్మణం బహ్వృచ బ్రాహ్మణం పైంగి బ్రాహ్మణం అని ఆరు బ్రాహ్మణములు మాత్రమే దృశ్యించినారని తెలుస్తున్నది.
- ఈ ఆరింటిలోనూ, ప్రస్తుతము ఐతరేయ బ్రాహ్మణం, కౌషీతకి బ్రాహ్మణం అను రెండు బ్రాహ్మణాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతావన్నీ చరిత్రలో కలసి పోయి నామమాత్రంగానే మిగిలిపోయాయి.
- ఐతరేయ బ్రాహ్మణాన్ని బహ్వృచ బ్రాహ్మణం అని కూడా కొందరి వాదన, అభిప్రాయము ఉంది.
యజుస్సంహిత బ్రాహ్మణం
- కృష్ణ యజుస్సంహిత బ్రాహ్మణం, శుక్ల యజుస్సంహిత బ్రాహ్మణం అను రెండు ప్రధానశాఖలు మాత్రమే లభ్యమవుతున్నాయి.
- కాలగర్భములో కలసి పోయిన శాఖలు అయిన చరక బ్రాహ్మణం, కాఠక బ్రాహ్మణం, ఖాండికేయ బ్రాహ్మణం, కంకతి బ్రాహ్మణం, శ్వేతాశ్వతర బ్రాహ్మణం, ఛాగలేయ బ్రాహ్మణం, తుంబురు బ్రాహ్మణం, మైత్రాయణీ బ్రాహ్మణం, ఔఖేయ బ్రాహ్మణం, జాబాల బ్రాహ్మణం, హరిద్రవిక బ్రాహ్మణం, అహ్వారక బ్రాహ్మణంలు మొత్తం 12 వున్నాయి అని దర్శించారు.
కృష్ణ యజుస్సంహిత బ్రాహ్మణం
- తైత్తిరీయశాఖలకు చందినది తైత్తిరీయ బ్రాహ్మణం
శుక్ల యజుస్సంహిత బ్రాహ్మణం
- మాధ్యందిన, కాణ్వ భేదముతో వీటికి రెండు శాఖలు ఉన్నాయి.
- మాధ్యందిన శాఖకు మాధ్యందిన శతపథ బ్రాహ్మణం ఉంది.
- కాణ్వ శాఖకు కాణ్వ శతపథ బ్రాహ్మణం ఉంది.
సామస్సంహిత బ్రాహ్మణం
- మూడు ప్రధాన బ్రాహ్మణములు, నాలుగు ఉప బ్రాహ్మణములు ఉన్నాయి.
- తలవకార బ్రాహ్మణం దీనికి జైమిని బ్రాహ్మణం అని పేరు.
- తాండ్య బ్రాహ్మణా న్ని పంచవింశ బ్రాహ్మణం లేదా ప్రౌఢ బ్రాహ్మణం అని కూడా వ్యవహరింతురు.
- ఛాందోగ్య బ్రాహ్మణం దీనిని మంత్ర బ్రాహ్మణం అని కూడా పేరు.
నాలుగు ఉప బ్రాహ్మణాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. కాలగర్భములో కలసి, పేర్లు తెలిసిన బ్రాహ్మణాలు మరో నాలుగు ఉన్నాయి.
- వీటికి వంశ బ్రాహ్మణం, సంహితోపనిషద్బ్రాణం, దైవత బ్రాహ్మణం, సామవిధాన బ్రాహ్మణం అని నాలుగు బ్రాహ్మణాలు ఉన్నాయి.
- వీటిని అనుబ్రాహ్మణములు అని కొందరి అభిప్రాయము.
- పేర్లు తెలిసిన రౌరుకి బ్రాహ్మణము, భాల్లవి బ్రాహ్మణము, శాఠ్యాయన బ్రాహ్మణము, కాలబవి బ్రాహ్మణము అను సామస్సంహిత బ్రాహ్మణాలు కాలగర్భములో కలసి పోయినవి.
అథర్వస్సంహిత బ్రాహ్మణము
- అథర్వస్సంహితకు ఒకే ఒక బ్రాహ్మణము ఉంది. అదే గోపథ బ్రాహ్మణం. అథర్వవేదానికి యజ్ఞ, యాగాలకు ప్రాముఖ్యం లేనందు వలన, ఈ వేదానికి సంబంధించిన ఇతర వివరములు, పేర్లు తదితరములు ఏవియునూ లభ్యము కావడము లేదు.
మూలాలు
ఇవి కూడా చూడండి
గమనికలు
సూచనలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.