మండూక మహర్షి ప్రోక్తమైనందున దీనిని మాండూక్యోపనిషత్తు అంటారు. ఇది అథర్వ వేదానికి చెందినది. ఆన్నిటికన్నా చిన్నదైన ఈ ఉపనిషత్తులో 12 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. అయినా మొత్తం ఉపనిషత్తుల సారం ఇందులో నిక్షిప్తమై ఉంది. శంకరాచార్యుడు దీనికి విస్తృత భాష్యం రచించి, తన అద్వైత సిద్ధాంతానికి ఆధారంగా చేసుకున్నాడు. నాలుగు మహా వాక్యాలలో ఒకటైన "అయమాత్మా బ్రహ్మ" అనేది ఈ ఉపనిషత్తులోనే ఉంది.
ఈ శాంతి మంత్రం యొక్క భావము సమున్నతమైనది, ఇది భారత దేశము యొక్క సనాతన ధర్మం యొక్క అవున్నత్యాన్ని చాటి చెప్పుతుంది అంటే అతి శాయోక్తి కాదు. ఈ పద్యం యొక్క ఆర్థము,
ఓ దేవతలారా! మా చెవులు ఎల్లవేళలా శుభమైన దానినే వినెదముగాక! మా నేత్రములు సర్వ కాల సర్వావస్థల యందు శుభప్రదమగు దానినే దర్శించెదము (చూచేదము) గాక! మేము ఎల్లప్పుడూ మాకు ప్రసాదించిన ఆయుష్యు, దేహము, అవయవములతో మిమ్ములను సదా స్తుతించు చుందుము కనుక మాకు మంచి ఆయుష్యు, దేహ ధారుడ్యము, మంచి అవయవ సౌష్టవము శక్తి ని ప్రసాదించుము. ఆది కాలము నుంచి మహర్షులు, ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభములు జేకూర్చుగాక! సర్వజ్ఞుడు ప్రత్యక్ష దేవుడైన సూర్యుడు మాకు శుభమును కలుగ జేయుగాక! ఆపదలనుండి మమ్ములను గరుత్మంతుడు రక్షించి మాకు శుభమును అనుగ్రహించుగాక! బృహస్పతి మాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యమును కల్పించి సదా మాకు శుభమును ప్రసాదించుగాక!
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఆర్థం
మాకు తాపత్రయముల నుండి విముక్తి, శాంతి కలుగు గాక. తాపత్రయములు అనగా "మూడు తాపములు" అని ఆర్థము. అవి ఆది దైవిక తాపము, ఆది బౌతిక తాపము, ఆధ్యాత్మిక తాపము. ఈ మూడు తపముల నుండి మాకు శాంతి కలుగు గాక అని మూడు శాంతి మాత్రముల ఆర్థము.
ఓమిత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం
భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ
యచ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోoకార ఏవ ||1||
అర్థం
ఈ లోకం ఏవత్తూ ఓంకారమే. ఓంకార వివరణ గమనిద్దాం. గతించినవీ, ఉన్నవీ, రాబోయేవీ అన్నీ ఓంకారమే. మూడుకాలాలకూ అతీతమైనది ఏముందో అది కూడా ఓంకారమే.
సర్వం హ్యేతద్ బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ సో2యమాత్మా చతుష్పాత్ ||2||
ఇవన్నీ భగవంతుడే. ఆ ఆత్మ కూడా భగవంతుడే. ఈ ఆత్మ నాలుగు పరిమాణాలు గలది.
ఆత్మలో మొదటి పరిమాణం వైశ్వానరుడు అనబడుతున్నాడు. ఈ వైశ్వానరుడి చైతన్యం బాహ్యముఖంగా ఉంది. 7 అవయవాలు, 19 నోళ్ళుగల వైశ్వానరుడు జాగ్రదావస్థలో బాహ్యజగత్తును అనుభవిస్తాడు.
కోర్కెలు, కలలు ఏదీలేని గాఢనిద్రాస్థితి ఆత్మయొక్క మూడవ పరిమాణమవుతుంది. ఈ స్థితి అనుభవించేవాడు ప్రాజ్ఞుడు. ఈ స్థితిలో అనుభవాలు ఏవీ ఉండవు. గ్రహణశక్తి బహిర్గతమై ఒక రాశిగా ఉంటుంది. అందువలన ఇది జాగ్రత్, స్వప్న స్థితి చేతనలకు ద్వారంగా ఉంది. ఆనంద స్వరూపుడైన ప్రాజ్ఞుడు ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తాడు.
ఇతడే సర్వేశ్వరుడు. ఇతడే సర్వమూ తెలిసినవాడు. ఇతడే అన్ని ప్రాణుల లోపల కొలువై నడిపిస్తున్నాడు. సమస్తానికీ మూల కారణం ఇతడే. ప్రాణుల ఉత్పత్తికి, వినాశనానికీ కూడా ఇతడే
నాన్తః ప్రజ్ఞమ్ న బహిః ప్రజ్ఞమ్ నోభయతః ప్రజ్ఞమ్ న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞమ్ నా ప్రజ్ఞమ్
ఏకాత్మప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యన్తే స ఆత్మా స విజ్ఞేయః ||7||
5
అర్థం
నాలుగవ పరిమాణం. అది అంతర్ముఖ స్థితి కాదు. బహిర్ముఖ స్థితి కాదు. రెండూ చేరిన స్థితి కాదు. అది చైతన్యం సమకూరిన స్థితి కాదు. అది కనిపించదు. చేతలులేని, గ్రహించశక్యం కాని, గుర్తులు లేని, ఊహాతీతమైన, వర్ణనాతీతమైన స్థితి అది. దాన్ని ఆత్మ చైతన్యంగా మాత్రమే తెలుసుకోగలం. అక్కడ ప్రాపంచిక చైతన్యం లేదు. అది ప్రశాంతమైనది. మంగళకరమైనది. అద్వైతం. ఇదే నాలుగవ పరిమాణం. ఇదే ఆత్మ. దీన్నే తెలుసుకోవాలి.
సో2యమాత్మా2ధ్యక్షరమ్ ఓంకారో2ధిమాత్రం పాదా
మాత్రా మాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి ||8||
అర్థం
ఈ ఆత్మను శబ్దపరంగా చెప్పాలంటే అదే ఓంకారం. అక్షరాలలో అ; ఉ; మ అనే మూడు అక్షరాలతో ఓం రూపొందింది.
ఆప్నోతి హ వై సర్వాన్ కామానాదిశ్చ భవతి య ఏవం వేద ||9||
అర్థం
ఓంకార మంత్రం మొదటి భాగమైన అకారం జాగ్రదావస్థ పరిమాణమైన వైశ్వానరునితో పోల్చబడుతుంది. వ్యాపకత్వంచేత, ఆరంభత్వంవల్ల ఈ రెండూ సమానంగా ఉన్నాయి. ఈ విధంగా ఉపాసన చేసినవారి అన్ని కోర్కెలు ఈడేరుతాయి. అట్టి ఉపాసకుడు ధన కనక వస్తు వాహనాదులతో అగ్రగణ్యుడౌతాడు.
ఓంకార మంత్ర రెండవ భాగమైన ఉకారం స్వప్నావస్థను ఆధారంగా చేసుకున్న తైజసుడు. ఎందుకంటే శ్రేష్ఠత్వంచేత, రెండింటి సంబంధంచేత రెండూ సమానంగా ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకున్నవాడు నిశ్చయంగా జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. సుఖ-దుఃఖాలవంటి ద్వంద్వాలలో సమతుల్యంతో వ్యవహరిస్తాడు. జ్ఞానికానివారు ఎవరూ అతని వంశంలో జన్మించరు.
ఓంకార మంత్రం మూడవ భాగమైన మకారం సుషుప్తిని ఆధారంగా చేసుకున్న ప్రాజ్ఞుడు. ఎందుకంటే కొలతవేసే స్వభావంచేతా, గ్రహించే స్వభావంచేతా రెండూ సమానంగా ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకున్నవాడు సమస్తాన్నీ కొలతవేసేవాడుగా గ్రహించేవాడుగా అవుతాడు.
ఓంకార మంత్రంలో నాలుగవ భాగం, భాగమని చెప్పలేనిది. నిర్వికారమైనది, ప్రాపంచిక చైతన్యానికి అతీతమైనది. మంగళకరమైనది. అద్వైతం. ఈ ఓంకారమే ఆత్మ. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మను ఆత్మ చేత పొందుతాడు.
ఈ సమస్త జగత్తు ఓంకారమే. భూత భవిష్యద్వర్తమానాలు కూడా ఓంకారమే. ఈ త్రికాలాలకు అతీతమైనది ఏదైనా ఉంటే అది కూడా ఓంకారమే. ఈ జగత్తుకు, దానికి అతీతమైన పరమ సత్యానికి, అన్నిటికి ఓంకారం శబ్ద రూపమైన ప్రతీక. ఈ ఓంకారం దేనికైతే ప్రతీకగా ఉన్నదో అదే బ్రహ్మం. ప్రతీ జీవుడిలో ఉన్న ఆత్మయే బ్రహ్మం.
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.