జూలై 15 , గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 196వ రోజు (లీపు సంవత్సరములో 197వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 169 రోజులు మిగిలినవి.
1893 : విజయనగరం - విశాఖపట్నం మధ్య రైల్వే లైన్ మొదలయ్యింది.
2013 : భారతదేశంలో టెలిగ్రాఫ్ వ్యవస్థ మూయబడింది.
అక్షయ్ కుమార్ దత్తా ఫోటో
1820 : అక్షయ్ కుమార్ దత్తా , బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు ఆద్యులలో ఒకరు. (మ.1886)
1885 : పి.ఏ.థాను పిళ్లై , భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1970)
1895 : చేబియ్యం సోదెమ్మ , ఆంధ్రరాష్టం గర్వపడే స్వాతంత్ర్య సమరయోధురాలు. సంఘసేవకురాలు
1899 : కొలచల సీతారామయ్య , ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణుడు . (మ.1977)
1901 : చెలికాని రామారావు , స్వాతంత్ర్య సమరయోధుడు, 1వ లోక్సభ సభ్యుడు. (మ.1985)
1901 : వేముల కూర్మయ్య , స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1970)
1902 : కానూరు లక్ష్మణ రావు , ఇంజినీరు. (మ.1986)
1902 : కోకా సుబ్బారావు , ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. (మ.1976)
1909 : దుర్గాబాయి దేశ్ముఖ్ , స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. (మ.1981)
1920 : డి.వి.నరసరాజు , రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (మ.2006)
1920 : కందాళ సుబ్రహ్మణ్య తిలక్ , స్వాతంత్ర్యసమరయోధుడు, మొదటి లోక్సభ సభ్యుడు (మ.2018).
1922 : లియోన్ లెడర్మాన్ , భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత
1928 : వీరమాచనేని విమల దేవి , భారతీయ కమ్యూనిష్ఠు పార్టీ నాయకురాలు, ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుండి 3వ లోక్సభ సభ్యురాలు.
1941 : రావెల సాంబశివరావు , నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా పనిచేశారు. కవిరాజు విజయం రూపకం రాశారు.
1942 : నేదురుమల్లి రాజ్యలక్ష్మి , వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిణిగా పనిచేసింది.
1956 : అలీమ్ ఖాన్ , సామాజికవేత్త.
1964 : వాసిరెడ్డి వేణుగోపాల్ , సీనియర్ పాత్రికేయుడు.
1972: వి.ఎన్.ఆదిత్య, తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత .
సోషల్ మీడియా గివింగ్ డే
ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం
నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డే
జూలై 14 - జూలై 16 - జూన్ 15 - ఆగష్టు 15 -- అన్ని తేదీలు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
మూసివేయి