ఆసియా లో ఒక దేశం From Wikipedia, the free encyclopedia
ఉత్తర కొరియా (listen), అధికారిక నామం కొరియా ప్రజాస్వామ్య ప్రజల గణతంత్రం (డి.పి.ఆర్.కె.; Chosŏn'gŭl: 조선민주주의인민공화국; Hancha: 朝鮮民主主義人民共和國; MR: Chosŏn Minjujuŭi Inmin Konghwaguk),తూర్పు ఆసియా కౌటీగా ఉంది. ఇది కొరియన్ ద్వీపకల్పంలో ఉత్తర భూభాగంలో ఉంది. కొరియా అనే పదానికి " కింగ్డం ఆఫ్ గొగురియో మూలం. దీనిని కొర్యో అని కూడా అంటారు. ప్యొంగ్యాంగ్ నగరం ఉత్తర కొరియా రాజధాని , అతిపెద్ద నగరంగా ఉంది. ఉత్తర కొరియా ఉత్తర , వాయవ్య సరిహద్దులో చైనా, యలు నది, తుమెన్ నది ఉన్నాయి. తుమెన్ నది కొతభాగం ఉత్తరకొరియా , రష్యా మద్య ప్రవహిస్తుంది. [4] ఉత్తరకొరియా , దక్షిణ కొరియాల కొరియన్ సైనికరహిత భూభాగం ఉంది.
조선민주주의인민공화국 朝鮮民主主義人民共和國 Chosŏn Minjujuŭi Inmin Konghwaguk[1] కొరియా ప్రజాస్వామ్య ప్రజల గణతంత్రం |
||||||
---|---|---|---|---|---|---|
|
||||||
నినాదం 강성대국 (強盛大國) (A powerful and prosperous country) |
||||||
జాతీయగీతం Aegukka |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | Pyongyang 39°2′N 125°45′E | |||||
అధికార భాషలు | కొరియన్ | |||||
ప్రభుత్వం | Juche Communist Dictatorship | |||||
- | Eternal President of the Republic | Kim Il-sunga | ||||
- | Chairman of the NDC | Kim Jong-ilb | ||||
- | President of the SPA | Kim Yong-nam | ||||
- | Premier' | Kim Yong-il | ||||
Establishment | ||||||
- | Independence declared | March 1 1919c | ||||
- | Liberation | August 15 1945 | ||||
- | Formal declaration | September 9 1948 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 120,540 కి.మీ² (98th) 46,528 చ.మై |
||||
- | జలాలు (%) | 4.87 | ||||
జనాభా | ||||||
- | 2007 అంచనా | 23,301,725[2] (48th) | ||||
- | జన గణన | n/a | ||||
- | జన సాంద్రత | 190 /కి.మీ² (55th) 492 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2006[3] అంచనా | |||||
- | మొత్తం | $22.85 billion (85th) | ||||
- | తలసరి | $1,007 (149th) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2003) | n/a (n/a) (unranked) | |||||
కరెన్సీ | North Korean won (₩) (KPW ) |
|||||
కాలాంశం | Pyongyang Time (UTC+8:30) | |||||
- | వేసవి (DST) | not observed (UTC+8:30) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | none (.kp reserved) | |||||
కాలింగ్ కోడ్ | +850 | |||||
aDied 1994, named "Eternal President" in 1998 b Kim Jong-il is the nation's most prominent leading figure and a government figure head, although he is not the head of state or the head of government; his official title is Chairman of the National Defence Commission of North Korea, a position which he has held since 1994. c Kim Yong-nam is the "head of state for foreign affairs". |
1910లో కొరియాను జపాన్ విలీనం చేసుకుంది. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో జపాన్ లొంగిపోయిన తరువాత యునైటెడ్ స్టేట్స్ , సోవియట్ యూనియన్ కొరియాను రెండుగా విభజించబడింది. కొరియా తిరిగి సైఖ్యపరచాలని చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. 1948లో రెండు ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడ్డాయి: ఉత్తర భాగంలో ది డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, దక్షిణ ప్రాంతంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా. ఉత్తర కొరియా నాయకత్వంలో జరిగిన దాడి కొరియన్ యుద్ధానికి (1950-53) దారితీసింది. కొరియన్ యుద్ధవిరమణ అంగీకారం కారణంగా యుద్ధం నిలిపి వేయబడినప్పటికీ అధికారికంగా ఎలాంటి శాంతి ఒప్పందం జరగలేదు.[5] 1991 ఐక్యరాజ్యసమితి నిర్ణయాన్ని రెండుదేశాలు అంగీకరించాయి. [6] డి.పి.ఆర్.కె అధికారికంగా తనకు తాను " సెల్ఫ్ - రిలయంట్ సోషలిస్ట్ స్టేట్ " వర్ణిస్తుంది.[7] విమర్శకులు ఉత్తర కొరియాను నిరంకుశ ప్రభుత్వంగా భావిస్తుంటారు. పలువురు దీనిని స్టాలినిస్ట్ అంటూ ఉంటారు.[16][17][18] ప్రత్యేకంగా ఉత్తరకొరియా సంస్కృతి కిం రాజవంశం కుటుంబం , రెండవ కిమ్- సుంగ్ సంబంధితమై ఉంది. ఉత్తర కొరియా మానవ హక్కుల ఉల్లంఘన ప్రత్యేక మైనదని ప్రపంచంలోని ఏ ఇతర దేశాలతో పోల్చడానికి వీలుకానిదని అంతర్జాతీయ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.[19][20][21] కొరియా వర్కర్స్ పార్టీకి అధికారంలో ఉన్న కుటుంబసభ్యుడు నాయకత్వం వహిస్తున్నాడు. [18]" డెమొక్రటిక్ ఫ్రంట్ ఫర్ ది రీయూనిఫికేషన్ ఆఫ్ ది ఫాదర్ లాండ్ " అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సభ్యులుగా ఉన్నారు. [22] కాలానుగతంగా ఉత్తర కొరియా క్రమంగా కమ్యూనిస్ట్ ఉద్యమ ప్రంపచానికి దూరమైంది. 1992లో మాక్సిజం- లెనినిజం ప్రభావితమైన జూచె సిద్ధాంతం ఉత్తర కొరియా రాజ్యానికి పరిచయం చేయబ డింది.[23][24] ఉత్పత్తి రంగ సంస్థలు , సంఘటిత వ్యవసాయం ప్రభుత్వంచేత నిర్వహించబడుతున్నాయి. ఆరోగ్యసరక్షణ, విద్య, నివాసగృహాలు , ఆహార ఉత్పత్తికి రాయితీలు ఇవ్వడం , ప్రభుత్వం నిధితో పనిచేస్తుంటాయి. [25] 1990 లో ఉత్తర కొరియాను " ఉత్తర కొరియా కరువు " బాధించింది. అది లక్షలాది పౌరుల మరణానికి కారణం అయింది. ఉత్తర కొరియాలో ఆహార కొరత కొనసాగుతూనే ఉంది.[26] ఉత్తర కొరియా " సొంగున్ " లేక " మిలటరీ - ఫస్ట్ " విధానం అనుసరిస్తుంది.[27] అత్యధిక సంఖ్యలో సైన్యం కలిగిన దేశాలలో ఉత్తర కొరియా ఒకటి. ఉత్తర కొరియా క్రియాశీలక సైన్యం, రిజర్వ్ దళం , పారామిలటరీ సైకుల మొత్తం సంఖ్య 9,495,000. కొరియా క్రియాశీలక సైనికులు సంఖ్యాపరంగా(1,21 మిలియన్లు) ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాలలో చైనా, అమెరికా , భారతదేశాలు ఉన్నాయి. [28] ఉత్తరకొరియా అణ్వస్త్రాలను కలిగి ఉంది.[29][30]
కొరియా అనేపేరుకు మూలం " గొర్యో " . దీనికి మూలం గొగుర్యో రాజ్యం. ఈ రాజ్యాన్ని మొదటిసారిగా సందర్శించిన పర్షియన్ వ్యాపారులు ఈ ప్రాంతాన్ని " కొర్యో " అని పిలిచారు. అది క్రమంగా కొరియాగా మారింది.[31] గొగుర్యోను అధికంగా కొర్యో అని పిలిచేవారు.గొగుర్యో 5వ శతాబ్దం నుండి తన పేరును కొర్యోగా మార్చుకుంది. .[32] ఆధునిక కొరియా అనే మాట 17వ శతాబ్దం నుండి వాడుకలోకి వచ్చింది. డచ్ ఈస్టిండియా కంపెనీకి చెందిన హెండ్రిక్ హమెల్ యాత్రాపుస్తకంలో ఈ ప్రాంతాన్ని కొరియాగా పేరుకున్నాడు.[32] 1392 లో గొర్యో పతనం తరువాత ఈ ప్రాంతానికి జొసెయోన్ (చొసన్) అధికారిక నామం అయింది. అయినప్పటికీ అంతర్జాతీయంగా ఈ పేరుకు అంగీకారం లభించలేదు. కొత్త అధికారిక నామానికి పురాతన దేశం గొజొసెయోన్ మూలం. 1897 లో జొసెయోన్ రాజవంశం జొసెయోన్ పేరును మార్చి దీహన్ జెగుక్‌ను నిర్ణయించింది. దీహాన్ అంటే గొప్ప హన్ అని అర్ధం. ఇది సంహన్ (మూడు హన్లు) అని అర్ధం. అయినప్పటికీ దేశవ్యాప్తంగా కొరియన్లు తమదేశాన్ని జొసెయోన్ అనే పిలిచారు. అందుకని అది ఎక్కువ రోజులు అధికారిక నామంగా నిలబడలేదు. కొరియా జపాన్ పాలనలో ఉన్నసమయంలో హన్, జొసెయొన్ పేర్లు రెండూ వాడుకలో ఉన్నాయి.
కొరియన్ పురాణ ఆధారంగా కొరియన్ చరిత్ర క్రీ.పూ 2333 లో డంగన్లు జొసెయాన్ స్థాపనతో ఆరంభం ఔతుంది.[33] గొజొసియాన్ కొరియా ద్వీపకల్పం అంతటినీ, మంచూరియాలోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకునే వరకు విస్తరిస్తూనే ఉంది. క్రీ.పూ 12వ శతాబ్దంలో ఉద్దేశ్యపూర్వకంగా గిజా జొసెయాన్ స్థాపించబడింది. ఆధునిక శకంలో గిజా జొసెయాన్ ఉనికి, నిర్వహించిన పాత్ర వివాదాద్పదంగా ఉంది.[34] క్రీ.పూ 2వ శతాబ్దంలో గొజొసెయాన్ - హాన్ యుద్ధంలో విమన్ జొసెయాన్‌ను హాన్ చైనా ఓడించింది. తరువాత క్రీ.పూ 108 లో 4 హాన్ రాజాస్థానాలు ఏర్పాటు చేయబడ్డాయి. తరువాత శతాబ్దంలో కొరియా ద్వీపకల్పంలోని ఉత్తర భూభాగం మీద చైనా ప్రభావం అధికం అయింది. లెలాంగ్ రాజాస్థానం 4 శతాబ్ధాల కాలం నిలిచిఉంది. తరువాత లెలాంగ్‌ను గాగురియో జయించింది.[35] చైనా హాన్ రాజవంశంతో పలు పోరాటాలు జరిగిన తరువాత గొజొసెయాన్ పతనమై కొరియా ద్వీపకల్పంలో మూడు రాజ్యాలు ఏర్పడ్డాయి. కామన్ ఎరా, ఆరంభ శతాబ్ధాలలో బుయేయో సామ్రాజ్యం, ఒక్జియో, డాంగ్యే, సంహాన్ కొరియా ద్వీపకల్పం, దక్షిణ మంచూరియాను ఆక్రమిచుకున్నాయి. తరువాత గొగుర్యెయో, బీక్జే, సిల్లా రాజ్యాలు కొరియా ద్వీపకల్పాన్ని (కొరియా మూడు సామ్రాజ్యాలు) ఆక్రమించుకున్నాయి. 676 లో సిల్లా మూడు రాజ్యాలను సమైక్యం చేయడం ఉత్తర కొరియా రాజ్యపాలనకు దారి తీసింది. అత్యధిక ద్వీపకల్ప భూభాగం సిల్లా ఆధీన ంలో ఉండగా ఉత్తర ద్వీపకల్ప భూభాగం బల్హయే ఆధీనంలో ఉండేది. సమైక్య సిల్లా రాజ్యంలో కవిత్వం, కళలు వర్ధిల్లాయి. బుద్ధ సంస్కృతి ఈ ప్రాంతంలో వర్ధిల్లింది. చైనా, కొరియాల మద్య సంబంధాలు శాంతియుతంగా సాగాయి. అంతర్గత కలహాల కారణంగా సిల్లా సామ్రాజ్యం పతనమై ద్వీపకల్పం గొరియోలకు స్వాధీనం అయింది. ఈ సమయంలో బల్హయే ఆధీనంలో మంచూరియా భూభాగం, 936లో రాజా తయేజో ద్వీపకల్పాన్ని సమైక్యం చేసాడు. సిల్లా మాదిరిగా గొర్యెయో అత్యంత ఉన్నత సంస్కృతి కలిగిన రాజ్యంగా ఉండేది. 1377 కదిలించే లోహపు అచ్చుయంత్రం తయారు చేయబడింది.[36] 13వ శతాబ్దంలో కొరియా మీద మంగోలియన్ సాగించిన దాడులు గొర్యెయోను బలహీనం చేసాయి. దాదాపు 30 సంవత్సరాల దాడుల తరువాత గొర్యెయో గొర్యెయోలు పాలన కొనసాగినా మంగోలియన్లకు కప్పంకట్టవలసిన పరిస్థితి ఎదురైంది. మంగోలియన్ సామ్రాజ్యం పతనం అయిన తరువాత పలు రాజకీయ కలహాల తరువాత 1392లో గొర్యెయో స్థానంలో జొసెయెన్ రాజవంశం పాలన ఆరంభం అయింది. తరువాత జెసెయెన్ గనరల్ తయేజో సాంరాయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసాడు.
రాజా తయేజో కొరియాకు జొయేసన్ అని కొత్త నామకరణం చేసాడు. తరువాత రాజధానిని హెంసెంగ్‌కు మార్చాడు. (పురాతన సెయోల్). తరువాత రెండు శతాబ్ధాల కాలం జొసెయాన్ రాజవంశం పాలన శాంతియుతంగా సాగింది. 15వ శతాబ్దంలో రాజా సెజోంగ్ హంగుల్‌ను రూపొందించాడు.తరువాత కంఫ్యూజనిజం అభివృద్ధి చెందింది.
1592, కొరియా మీద 1598 లో జపాన్ దాడి చేసింది. జపాన్ సైన్యానికి తయోటిమి హిదెయోష్ నాయకత్వం వహించా డు. కొరియన్ సైన్యం జపాన్ సైన్యాన్ని అడ్డుకున్నాయి. దీనికి చైనా మింగ్ సైన్యం, రైటియస్ సైన్యం సహకారం అందించాయి. వరుస యుద్ధాల తరువాత జపాన్ సైన్యం వెనుతిరిగింది. తరువాత జపాన్ మింగ్ రాజ్యంతో శాంతి ఒప్పందం మీద సంతకం చేసింది. ఈ యుద్ధంలో అడ్మిరల్ యీ సన్ - సిన్, టర్టిల్ షిప్ అభివృద్ధి చేయబడింది. 1620, 1630 జొసెయాన్ రెండవసారి మంచు దాడులతో సమస్యలను ఎదుర్కొన్నది. అది చివరికి చైనా వరకు విస్తరించింది. రెండవ విడత మంచూరియన్ దాడుల తరువాత జొసెయాన్ రాజ్యంలో రెండు శతాబ్ధాల శాంతి నెలకొన్నది. యాంజియో (జొసెయాన్), జియాంగ్ (జొసెయాన్) ల పాలనలో జొసెయాన్ పాలన శిఖరాగ్రానికి చేరింది.
జొసెయాన్ రాజవంశం పాలన తరువాత కాలం వెలుపలి ప్రపంచం నుండి దూరంగా ఏకాంతంలో కొనసాగింది. 19వ శతాబ్దంలో కొరియా ఓంటరి విధానం కారణంగా కొరియా " హెర్మిత్ కింగ్డం "గా వర్ణించబడింది. జొసెయాన్ రాజవంశం తనతానే పశ్చిమ సాంరాజ్యవాదం నుండి రక్షించుకుంది. చివరికి వత్తిడి కారణంగా వ్యాపారం కొరకు అనుమతి ఇవ్వవలసిన పరిస్థితి ఎదురైంది. మొదటి సినో- జపాన్ యుద్ధం , రుస్సో - జపానీస్ యుద్ధం తరువాత (1910-45) జపాన్ కొరియాను ఆక్రమించుకుంది.
జపాన్ కొరియాను సంప్రదాయపరంగా , సంస్కృతి పరంగా ఆణిచివేతకు గురిచేసింది. అంతేకాక ఆదాయాన్ని తనస్వంత ప్రయోజనం కొరకు వాడుకుంది. 1919 మార్చి 1 న దేశమంతటా జపాన్ వ్యతిరేక ప్రదర్శనలు (మార్చి 1 ఉద్యమం) నిర్వహించబడ్డాయి. ఉద్యమం అణిచివేతలో 7,000 మంది మరణించారు. 1929లో దేశమంతటా విద్యార్ధుల ఉద్యమం వంటి ఉద్యమాలు కొనసాగాయి. ఉద్యమాల ఫలితంగా దేశంలో 1931లో సైనిక పాలన విధించబడింది. 1937లో రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా రెండవసారి సొనో - జపానీ యుద్ధం ఆరంభం అయిన తరువాత. జపాన్ కొరియన్ సంస్కృతని రూపుమాపడానికి ప్రయత్నించింది.
జపాన్ ప్రభుత్వం కొరియన్లు తమ పేర్లను మార్చుకొని జపాన్ పేరుకు మారాలని కొరియన్ల మీద వత్తిడి చేసింది. జపాన్ ష్రింటోలో ప్రార్ధనను చేయాలని ప్రజలు నిర్బంధించబడ్డారు. పాఠశాలలలో కొరియన్ భాషాబోధన , కొరియా చరిత్ర బోధన సమూలంగా రద్దుచేయబడింది. కొరియన్ కళాఖండాలు ధ్వంశం చేయబడడం , జపాన్‌కు తరలించబడడం సంభవించాయి. అడ్డగించిన గ్రూపులను డొంగ్నిప్గన్ (లిబరేషన్ ఆర్మీ) అని పిలువబడింది. ఇది సినో కొరియన్ సరిహద్దులో నిర్వహించబడ్డాయి. ఇవి జపాన్ సైన్యం మీద గొరిల్లా యుద్ధం చేసాయి. వీరిలో కొందరు చైనా , సౌతీస్ట్ ఆసియా సంకీర్ణంలో చేరారు. వీరిలో గొరిల్లా నాయకుడు " రెండవ రాజా - సుంగ్ " తరువాత కొరియా నాయకుడు అయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కొరియన్లు జపాన్ సైన్యానికి సహకరించాలని వత్తిడి చేయబడింది. వేలాది మంది సైనికులు జపాన్ సైన్యంలో చేరారు. మొత్తం 2,00,000 మహిళా సైనికులలో పలువురు కొరియన్లు ఉన్నారు.
1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో కొరియన్ ద్వీపకల్పం రెండు భాగాలుగా విడిపోయింది. ఉత్తర కొరియా ద్వీపకల్పాన్ని సోవియట్ యూనియన్ ఆక్రమించుకుంది. దక్షిణ కొరియా ద్వీపకల్పాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆక్రమించింది. తొలుత రెండింటిని సమైక్యం చేయాలని ప్రయత్నించినా ఇరు ప్రాంతాల మధ్య తలెత్తిన విబేధాల కారణంగా అది సాధ్యం కాలేదు. అప్పటినుంచి ద్వీపకల్పం రెండుగా విభజించబడింది.
1945 అక్టోబర్‌లో సోవియట్ జనరల్ " టెరెంటీ షితికోవ్ " సోవియట్ సివిల్ అథారిటీ " స్థాపించాలని ప్రతిపాదించాడు. అలాగే రెండవ రాజా సుంగ్‌ను " ప్రొవిషనల్ పీపుల్స్ కమిటీ ఫర్ నార్త్ కొరియా " చైర్మన్‌గా నిమించడానికి మద్దతు తెలిపాడు. 1946 ఫిబ్రవరిలో " ప్రొవిషనల్ పీపుల్స్ కమిటీ ఫర్ నార్త్ కొరియా " స్థాపించబడింది. ప్రొవిషనల్ గవర్నమెంట్ పాలనలో భూసంస్కరణలు చేపట్టబడ్డాయి. సంస్కరణలు సమాజంలో హెచ్చు తగ్గులు సరిదిద్దబడ్డాయి. భూస్వాములు, జపానీ సహాయకులు రాజకీయ అశాంతి, భూసంస్కరణ సమస్యలు లేని దక్షిణకొరియాకు పారిపోయారు.షికోవ్ ప్రధాన సంస్థనలు జాతీయం చేసాడు. తరువాత కొరియా భవిష్యత్తు గురించి చర్చించడానికి సోవియట్ ప్రతినిధులు మాస్కో, సియోల్‌లో సామావేశాలు జరిపారు.[37][38][39][40][41] 1946 సెప్టెంబరులో దక్షిణ కొరియా పౌరులు సంకీర్ణ దళాలకు వ్యతిరేకంగా బలం కూడదీసుకున్నారు. 1948 ఏప్రిల్‌లో జెయూ ద్వీపవాసుల తిరుగుబాటు " హింసాత్మకంగా అణిచివేయబడింది. 1948లో దక్షిణ ద్వీపకల్పం స్వతంత్రం ప్రకటించింది. రెండు నెలల తరువాత కమ్యూనిస్ట్ వ్యతిరేక సింగ్మంరీ దానికి పాలకుడు అయ్యా డు. 1948 సెప్టెంబరు 9న ఉత్తర కొరియాలో " డెమొక్రటిక్ ది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా " స్థాపించబడింది. రెండవ రాజా సుంగ్ ప్రీమియర్ అయిన తరువాత ష్తికోవ్ సోవియట్ అంబాసిడర్‌గా సేవచేసాడు.
1948లో సోవియట్ సైన్యం ఉత్తర కొరియా నుండి వెనుతిరిగారు. అలాగే తరువాత సంవత్సరం దక్షిణ కొరియా నుండి అమెరికన్ సైన్యం వెనుతిగింది. రీ ఉత్తర కొరియా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అంబాసిడర్ ష్తినోవ్ సందేహించాడు.[37][38][39][40]
1950 జూన్ 25న ఉత్తర కొరియా సైన్యం దైక్షిణ కొరియా మీద దండెత్తి వేగవంతంగా అత్యధిక భూభాగం ఆక్రమించింది. యునైటెడ్ స్టేట్స్ నాయకత్వంలో యునైటెడ్ నేషన్స్ కమాండ్ ఫోర్స్ కలుగజేసుకుని దక్షిణ కొరియాను రక్షించడానికి రంగంలోకి దిగింది. ఉత్తర కొరియాలో ప్రవేశించింది. వారు చైనా సరిహద్దును సమీపించగానే చైనా సైన్యం ఉత్తర కొరియాకు సహాయంగా కలిశాయి. యుద్ధ పరిస్థితిలో తిరిగి మార్పు సంభవించింది. 1953 జూలై 27న కొరియన్ యుద్ధవిరమణ ఒప్పందంతో యుద్ధం ముగింపుకు వచ్చింది. తరువాత ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మద్య సరిహద్దులు పునరుద్ధరించబడ్డాయి. యుద్ధంలో పదిలక్షల కంటే అధికంగా పౌరులు, సైనికులు మరణించారు. యుద్ధఫలితంగా కొరియాలోని భవనాలు గణనీయంగా ధ్వంసం అయ్యాయి.[42][43] అంతర్యుద్ధం ప్రభావం కొంత ఉన్నప్పటికీ ఉత్తర దక్షిణ ప్రాంతాల మద్య సాగిన యుద్ధం మరింత విధ్వంసం చేసింది.[44] అత్యంత సురక్షితంగా పర్యవేక్షించ బడుతున్న సైనిక రహిత భూభాగం ద్వీపకల్పాన్ని రెండు భాగాలుగా విభజిస్తూ ఉంది. ఉత్తర కొరియా వ్యతిరేకత, సోవియట్ యూనియన్ వ్యతిరేకత దక్షిణ కొరియాలో నిలిచి ఉంది. యుద్ధం జరిగిన నాటి నుండి యునైటెడ్ స్టేట్స్ సైన్యం కొరియాలో నిలిపి ఉంచబడి ఉంది. [45]
యుద్ధవిరమణ ప్రకటించిన తరువాత దక్షిణ, ఉత్తర కొరియాల మద్య ఉన్న శాంతి సరిహద్దు సంఘర్షణలు, ప్రముఖుల అపహరణలు, హత్యలు ఆటంకపరిచాయి. దక్షిణ కొరియా నాయకులను కాల్చివేయడానికి ఉత్తర కొరియా చేసిన ప్రయత్నాలు (1968, 1974లలో పలు ప్రయత్నాలు, 1983లో రంగూన్ బాంబింగ్ జరిగాయి) విఫలం అయ్యాయి. 1976లో పన్ముంజం వద్ద ఏక్సే హత్యచేయబడిన తరువాత ఇరు ప్రాంతాల మద్య యుద్ధం మొదలైంది. [46] 1973లో అత్యంత రహస్యంగా ఉన్నత స్థాయిలో రెడ్ క్రాస్ కార్యాలయాల ఆధ్వర్యంలో జరిగిన శాంతి ప్రయత్నాలు పన్ముంజం సంఘటనతో ముగింపుకు వచ్చాయి. అయినప్పటికీ రెండు ప్రాంతాలు విడివిడిగా అంతర్జాతీయ సేవాసంస్థలతో కలిసిపనిచేయడానికి అంగీకరించాయి.[విడమరచి రాయాలి][47] 1956లో " సోవియట్ కొరియన్ల కొరకు సోవియట్ యూనియన్ , చైనా రెండవ కిం సుంగ్‌ను తొలగించాలని చేసిన ప్రయత్నాలను రెండవ కిం సుంగ్‌ను విజయవంతంగా అడ్డగించాడు. [48][49] 1958 ఆగస్ట్‌లో చివరి విడత చైనా సైనిక బృందాలు ఉత్తర కొరియాను విడిచి పోయాయి. ఇది ఉత్తర కొరియా పూర్తిస్వతంత్రం పొందిన రోజుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. కొందరు 1956 ఆగస్ట్ సంఘటన స్వతంత్రదినంగా భావిస్తున్నారు.[48][49][50] ఉత్తర కొరియా చైనా , సోవియట్ యూనియన్‌తో సన్నిహిత సమంధాలు కలిగి ఉంది. సినో - సోవియట్ చీలిక కింకు ఉత్తర కొరియా మీద ఇరు దేశాల అధికారం తగ్గించడానికి ఉపకరించింది.[51] తరువాత ఉత్తర కొరియా " నాన్- అలైన్ మూవ్మెంట్ " కు ఉద్యమం వహించింది. జూచే విధానం అనుసరించడం ఉత్తరకొరియాను సోవియట్ యూనియన్ , చైనా లతో ప్రత్యేకంగా చూపుతుంది.[52] 1957 నాటికి ఉత్తర కొరియా యుద్ధం నుండి కోలుకొని 1949 పరిశ్రమల పునరుద్ధరణ స్థాయికి అయింది. 1959 లో జపాన్‌తో సంబంధాలు అభివృద్ధిచేయబడ్డాయి. ఉత్తర కొరియా జపానీయులను స్వదేశానికి తిరిగివెళ్ళడానికి అనుమతిస్తుంది. 1960 వరకు ఉత్తర కొరియా దక్షిణ కొరియా కంటే అధికంగా అభివృద్ధి చెందింది. 1976 వరకు ఉత్తర కొరియా తలసరి జి.డి.పి. దక్షిణ కొరియాతో సమానంగా ఉండేది. [53] 1970 లో చైనా పశ్చిమ దేశాలతో (ప్రత్యేకంగా యునైటెడ్ స్టేట్స్తో) సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించింది. ఉత్తరకొరియాతో సంబంధాల గురించి పునరాలోచన ఆరంభించింది. 1976 లో మావో జెడాంగ్ మరణం తరువాత ఉత్తర కొరియాతో దౌత్యసంబంధాలలో సమస్యలు ఎదురైయ్యాయి. రెండవ కిం సుంగ్ చైనా సంబంధాలను ఖండించి జూచే విధానం ద్వారా దేశం స్వయం ఆర్ధిక స్వావలబన సాధించాలని ప్రజలు చెప్పాడు. జూచే విధానం దేశానికి అవసరమైన ప్రతిదీ దేశంలో ఉత్పత్తి చేయాకన్న ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. 1980 నాటికి ఆర్ధికరంగం స్థంభన మొదలైంది. 1987 నాటికి ఆర్ధికరంగం దాదాపు క్షీణించింది. 1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నత తరువాత రష్యన్ సహాయం అంతా హఠాత్తుగా నిలిపివేయబడింది. ఉత్తర కొరియా చైనాతో వ్యాపారసంబంధాలను పునరుద్ధరించింది. అయినప్పటికీ చైనా ఉత్తర కొరియాకు అవసరమైన ఆహారాన్ని అందించడానికి అనుకూలంగా స్పందించలేదు.
1992 లో రెండవ కిం సుంగ్ ఆరోగ్యం క్షీణించడం ఆరంభం అయింది. కిం జంగ్ - ఇల్ క్రమంగా రాజ్యంలోని పాలనా బాధ్యతలు స్వీకరించాడు. 1994 లో రెండవ కిం సుంగ్ గుడేపోటుతో మరణించిన తరువాత కిం కొత్త నాయకుడిగా బాధ్యత స్వీకరించి ఉత్తర కొరియాకు మూడు సంవత్సరాల సంతాపం ప్రకటిస్తూ అణుబాంబు తాయారీ పట్ల ఉత్తర కొరియా వైఖరిని మూడుసంవత్సరాల అనతరం వెలువరిస్తామని ప్రకటించాడు.
యు.ఎస్. అధ్యక్షుడు బిల్ క్లింటన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలతో ఉత్తర కొరియా అణుబాంబు తయారీ ప్రయత్నాలు నిలిపివేయబడ్డాయి. రెండవ కిమ్- జాంగ్ " సొంగుం (మిలటరీ ఫస్ట్)" విధానం ప్రవేశపెట్టాడు. తిరుగుబాటు ప్రయత్నాలను నిరాశపరిచే ఈ విధానం పలువురు పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. దేశరక్షణ , పర్యటనలు కఠినతరం చేయబడ్డాయి.
1990 లో సంభవించిన వరదలు ఆర్ధికసంక్షోభాన్ని అధికం చేసింది. వరదలు పంతలను మౌళిక నిర్మాణాలను నాశనం చేయడం దేశమంతటా కరువు (ఉత్తర కొరియా కరువు) వ్యాపించడానికి దారితీసింది. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అయింది. 1996 లో ప్రభుత్వం ఐఖ్యరాజ్యసమితి ఆహారసహాయాన్ని అంగీకరించింది. కరువు సంభవించిన తరువాత ప్రభుత్వం అయిష్టంగానే బ్లాక్ మార్కెట్‌ను సహించవలసిన పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వం అధికారికంగా సోషలిస్ట్ ఆర్ధికవిధానం అనుసరించింది. లంచగొందితనం అధికం అయింది.
1990 లో ఉత్తర కొరియా పశ్చిమదేశాలతో సంబంధాలను మెరుగుపరచింది. యు.ఎస్తో నిరంతరంగా నిరాయుధీకరణ చర్చలకు సహకరించింది. పశ్చిమ దేశాల ఆర్ధికసాయం అందుకున్నది. [54][55]
2001 లో అమెరికన్ అధ్యక్షుడు జార్జి డబల్యూ బుష్ ఎన్నికతో అంతర్జాతీయ రాజకీయ వాతావరణంలో మార్పులు సంభవించాయి. బుష్ ప్రభుత్వం దక్షిణ కొరియా సంషైన్ పాలసీ , ది అగ్రీడ్ ఫ్రేం వర్క్ ను నిరాకరించుంది. యు.ఎస్. ప్రభుత్వం ఉత్తర కొరియాను " రోగ్ స్టేట్ " గా భావించింది. ఉత్తర కొరియా అణ్వాయుధాలు తయారీ ఆసక్తి అధికం చేసింది. [56][57][58] 2006 అక్టోబర్ 9న ఉత్తర కొరియా ఆణ్వాయుధ శోధన ప్రకటించబడింది.[59][60]
2009 లో మునుపటి యు.ఎస్. అధ్యక్షుడు బిల్ క్లింటన్ కిమ్- జొంగ్ - ఇల్‌తో సమావేశమై 2009 లో ఖైదుచేయబడిన అమెరికన్ పత్రికావిలేఖరులను విడుదల చేయమని అడిగాడు. చట్టవిరుద్ధంగా దేశంలో ప్రవేశించినందుకు వీరికి శిక్ష విధించబడింది.[61] ప్రస్తుత యు.ఎస్. అధ్యక్షుడు " బారక్ ఒబామా " ఉత్తర కొరియాతో సంబంధాలు ఏర్పరచుకోవడనికి ప్రతికూలంగా స్పందిస్తున్నాడు. [62] 2010లో దక్షిణ కొరియా యుద్ధ నౌక మునిగిన తరువాత దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ మద్య ఉద్రిక్తతలు అధికం అయ్యాయి. [63][64][65]2011 డిసెంబరు 17న ఉత్తర కొరియా సుప్రీం నాయకుడు కిం జొంగ్ - ఇల్ గుండె పోటుతో మరణించాడు.[66] ఆయన చిన్న కుమారుడు కిం జొంగ్ - అన్ ఆయన తరువాత పాలకుడుగా ఎన్నికయ్యడు. తరువాతి కాలంలో అంతర్జాతీయ వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉత్తర కొరియా అణ్వాయుధ నిల్వలను అభివృద్ధి చేస్తూ ఉంది.[67]
కొరియన్ ద్వీపకల్పంలోని ఉత్తర ప్రాంతంలో ఉత్తర కొరియా దేశం విస్తరించివుంది. ఈ దేశం లాటిట్యూడ్ ఉత్తరం 37°, 43° మధ్యన, లాంగిట్యూడ్ 124° తూర్పు, 131° తూర్పు మధ్యన ఉంది.
ఉత్తర కొరియా కొరియన్ ద్వీపకల్పం ఉత్తర భూభాగంలో ఉంది. ఇది 37-43 ఉత్తర అక్షాంశం, 124-131 తూర్పు రేఖాంశంలో ఉన్నాయి. ఉత్తర కొరియా వైశాల్యం 1205 చ.కి.మీ. దేశానికి ఉత్తర సరిహద్దులో చైనా, రష్యా దక్షిణంలో సైనికరహిత భూభాగం వెంట దక్షిణ కొరియా ఉన్నాయి. పశ్చిమ సరిహద్దులో ఎల్లో సీ, కొరియా బే ఉన్నాయి. తూర్పు సరిహద్దులో జపాన్ సీ తీరంలో జపాన్ ఉన్నాయి.[68] 80 % ఉత్తర కొరియా పర్వతమయంగా ఉంటుంది. ఎత్తైన భూభాగాలు ఇరుకైన లోయలతో ఒకదానిని మరొకటి వేరుచేస్తూ ఉంటుంది. కొరియా ద్వీపకల్పంలోని పర్వతాలన్నీ సముద్రమట్టానికి 2000 మీ ఎత్తైన భూభాగాలను కలిగి ఉన్నాయి. ఇవి అధికంగా ఉత్తర కొరియాలో ఉన్నాయి. ఉత్తర కొరియాలోని పర్వతాలలో పీక్తూ పర్వతం అత్యంత ఎత్తైనదిగా భావిస్తున్నారు. ఇది సముద్రమట్టానికి 2744 అడుగుల ఎత్తైన అగ్నిపర్వతం.[68] ఇతర పర్వతాలలో ఈశాన్యంలో ఉన్న హంగ్యంగ్ పర్వతం, రంగ్రిం పర్వతాలు ప్రధానమైనవి. టీబీక్ పర్వతశ్రేణిలో ఉన్న కుంగాంగ్ పర్వతం దక్షిణ కొరియాలో కూడా విస్తరించి ఉంది. ప్రకృతి సహజ సౌందర్యానికి ఈ పర్వతాలు ప్రఖ్యాతి చెందాయి.[68] పశ్చిమంలో ఉన్న మైదానాలు విశాలమైనవి. తూర్పు మైదానాల మద్యలో అక్కడక్కడా పర్వతశ్రేణులు అడ్డగిస్తూ ఉంటాయి. దిగువ భూములు మరొయు మైదాన ప్రాంతాలలో ప్రజలు అధికంగా నివసిస్తుంటారు. 2003 యునైటెడ్ నేషంస్ ఎంవిరాన్మెంట్ ప్రోగ్రాం నివేదిక అనుసరించి దేశం 70% భూభాగంలో అరణ్యాలు విస్తరించి ఉన్నాయని భావిస్తున్నారు. వీటిలో అధికంగా నిటారుగా ఉండే కొండలు ఉన్నాయి.[69] 790కి.మీ పొడవైన యలు నది దేశంలోని పొడవైననదిగా గుర్తించబడుతుంది. [70] ఉత్తర కొరియాలో కాంటినెంటల్, ఓషనిక్ వతావరణం ఉంటుంది.[69][71] శీకాలంలో స్పష్టమైన వాతావరణం నడుమ మంచుతుఫానులు సంభవిస్తూ ఉంటాయి. సైబీరియా నుండి వీచే గాలులు దేశం వాయవ్య, ఉత్తర దిశ నుండి దేశంలో ప్రవేశిస్తుంటాయి.[71] వేసవి అత్యంత వేడిగా అత్యంత తేమకలిగిన వాతావరణం నెలకొని ఉంటుంది. జూన్, సెప్టెంబరు మద్య 60% వర్షపాతం సంభవిస్తుంది.[71] వేసవి, శీతాకాలాల మద్య హేమతం, వసంతకాలంఉంటాయి.[71]
ఉత్తర కొరియా కేంద్రీకృత ఆధికారంతో పనిచేస్తుంది. ఇది ఒకపార్టీ పాలిత గణతంత్ర దేశం. 2009 ఉత్తరకొరియా రాజ్యాంగం తనను తానుగా వర్ణిస్తూ ఉత్తరకొరియా " రివల్యూషనరీ , సోషలిస్ట్ " దేశంగా అభివర్ణించారు.[72] "ది వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా "కు 30,00,000 మంది సభ్యులు ఉన్నారని అంచనా. ఇది ఉత్తర కొరియా రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వానికి కిం రాజవంశానికి చెందిన కిమ్- జంగ్- ఉన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన " వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాకు " మొదటి సెక్రటరీగా , కొరియన్ పీపుల్స్ ఆర్మీకి సుప్రీం కామాండర్ఉన్నాడు.[73][74] రెండవ కిం - సుంగ్ 1994 మరణించాడు) దేశానికి శాశ్వత అధ్యక్షుడుగా ఉన్నాడు.[75] ఆయన నరణించిన తరువాత 2011లో కిమ్- జంగ్ ఇల్ " శాశ్వత జనరల్ సెక్రటరీగా ప్రకటించబడ్డాడు.[73] ఉత్తర కొరియా ఏకసభా విధానం కలిగి ఉంది." సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ" రాజ్యాంగ ఉన్నతాధికారం, చట్టం రూపొందించే అధికారం కలిగి ఉంది. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో 687 మంది సభ్యులు ప్రతి 5 సంవత్సారలకు ఒక సారి ఎన్నిక చేయబడుతుంటారు. ఉంటారు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ అధ్యక్షుడు (1998 నుండి) దేశప్రతినిధిగా విదేశాలతో సంబంధాలను కలిగి ఉంటాడు. ప్రతినిధులు సంప్రదాయంగా అధ్యక్షుని, ఉపాద్యక్షుని, ప్రెసిడియం సభ్యులను ఎన్నుకుంటారు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ చట్టం రూపొందించడం, స్వదేశీ, విదేశీ విధానాలను రూపొందించడం, మంత్రివర్గనిర్మాణం, దేశ ఆర్థిక ప్రణాళిక అనుమతించడం మొదలైన బాధ్యతలు నిర్వహిస్తుంది.[76] ప్రతిపక్షరహితంగా సభ్యుల ఎన్నికతో సభరూపొందించబడుతుంది.[77] ఉత్తర కొరియా ప్రీమియర్ పాక్- పొంగ్ - జు నాయకత్వంలోని మంత్రివర్గగానికి పాలనాధికారం ఉంటుంది.[78] ప్రీమియర్ ప్రతినిధులు, ప్రభుత్వం స్వతంత్రంగా వ్య్వహరిస్తాయి. ప్రభుత్వంలో రెండు వైస్ ప్రీమియర్లు, 30 మంది మంత్రులు, ఇద్దరు క్యాబినెట్ కమిషన్ చైర్మన్లు, క్యాబినెట్ చీఫ్ సెక్రెటరీ ఉంటారు. సెంట్రల్ బ్యాంక్ పీపుల్స్ ఆర్ం ఫోర్సెస్ నేషనల్ డిఫెంస్ న్యాయపరిధిలో ఉంటాయి. [79]
పార్టీ కార్యకలాపాలకు, ప్రభుత్వ నిర్వహణకు జుచే విధానం మూలస్తంభంగా ఉంది.[80] జూచే విధానం ఆర్థిక స్వావలబన, సెల్ఫ్ - రిలయంస్ మిలటరీ, స్వతంత్ర విదేశీవిధానాలను సమర్ధిస్తుంది. జూచే విధానంలో గతకాలపు సోవియట్ - గతకాలపు చైనా, కొరియా శతాబ్ధాల చరిత్రకలిగిన స్వతంత్రపోరాటం మూలాలుగా కలిగి ఉంది. [81]2009 దేశం కమ్యూనిజ విధానానం విడిచి సోషలిజ విధానాన్ని కొనసాగించింది.[82] విదేశీ పర్యవేక్షకులు ఉత్తరకొరియా రాజకీయవిధానాన్ని రాచరికవ్యవస్థగా పరిగణిస్తుంది.[83][84][85] లేక వంశపారంపర్య పరిపాలనా విధానంగా పరిగణిస్తుంది.[86] ఇతర దేశాలు ఈ విధానం షోవా జపాన్ విధానాలకు సమీపంగా ఉన్న కొరియాసంప్రదాయ విధానం అని భావిస్తున్నారు.[87][88][89][90] యురేపియన్ ఫాసిజం లాంటిదని మరి కొందరు భావిస్తున్నారు.[91]
ఉతారకొరియా ప్రభుత్వం దేశసంస్కృతి పలు కోణాలలో నియంత్రిస్తుంది. కిమ్- జంగ్ ఇల్ తరచుగా ప్రజల సాధారణజీవితంలో కేంద్రబిందువుగా ఉన్నాడు. ఆయన పుట్టినరోజు ప్రభుత్వ శలవుదినంగా జరుపుకుంటారు. ఆయన 60వ పుట్టిన రోజును దేశం అంతటా కోలాహలంగా జరుపుకున్నారు. [92] ఉత్తర కొరియా ప్రభుత్వం మాత్రం ఇది నిజమైన హీరోవర్షిప్ అని చెప్తూ ఉంటుంది. [93] 2012 జూన్ 11 న 14 సంవత్సరాల బాలిక వరదలలో కొట్టుకు పోతున్న రెండవ కిం జంగ్, కిం జంగ్ ఇల్ చిత్రపటాలను రక్షించడానికి నీటిలో మునిగిపోయింది. [94]
ఉత్తర కొరియా పర్షియన్ తరహాలో ఉండే సివిల్ లా విధానాన్ని అనుసరిస్తుంది. ఇది జపాన్ సంప్రదాయం, కమ్యూనిస్ట్ సిధ్హాంతాల ప్రభావితమై ఉంటుంది. [95] న్యాయవ్యవహారాలను " సెంట్రల్ కోర్ట్ ", నగరస్థాయి కోర్టులు, స్పెషల్ కోర్టులు నిర్వహిస్తుంటాయి. నగరాలలో, కౌంటీలలో, అర్బన్ డిస్ట్రిక్స్లలో నిర్వహించబడే ప్రజా న్యాయస్థానాలు న్యాయవ్యవస్థలో దిగువన ఉంటాయి. స్పెషల్ కోర్టులు సైనిక, రైలుమార్గం, నౌకాయాన సంబంధిత వ్యవహారాలను పరిష్కరిస్తుంటాయి. [96] ప్రాంతీయ పీపుల్స్ అసెంబ్లీ సభ్యులచే న్యాయాధికారులు ఎన్నుకొనబడాలి. అయినప్పటికీ వాస్తవానికి న్యాయాధికారులను వర్కర్స్ పార్టీ నేతలు నియమిస్తుంటారు. నుల్లుం క్రిమెన్ సిన్ లెగే ఆధారితంగా పీనల్ కోడ్ రూపొందించబడింది.[96] కోర్టులు సివిల్, క్రిమినల్ కేసులతో రాజకీయ సంబంధిత కేసులను పరిష్కరిస్తుంటాయి. [97] రాజకీయ ఖైదీలు లేబరు కేంపులకు పంపబడుతుంటారు. క్రిమినల్ ఖైదీలకు ప్రత్యేక శిక్షలు అమలౌతూ ఉంటాయి.[98] మినిస్టరీ ఆఫ్ పీపుల్స్ సెక్యూరిటీ చట్టం అమలు కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. ఉత్తర కొరియాలో అత్యంత శక్తివంతమైన జాతీయ వ్యవస్థ రక్షణశాఖ. పోలీస్ వ్యవస్థ క్రిమినల్ కేసుల పరిశోధన బాధ్యతలను కూడా నిర్వహిస్తుంది.[99] పోలీస్ శాఖ దేశీయరక్షణలో భాగంగా ట్రాఫిక్ కంట్రోల్, అగ్నిపామకం, రైలు మార్గరక్షణకు బాధ్యత వహిస్తుంది. [100] 1973 నుండి ది స్టేట్ సెక్యూరిటీ డిపార్ట్మెంటు మినిస్టరీ ఆఫ్ పీపుల్స్ సెక్యూరిటీకి అతీతంగా దేశీయ, విదేశీయ నేరపరిశోధన, రాజకీయ జైలు నిర్వహణ, రాజకీయ శిబిరాల నిర్వహణ మొదలైన పనులను చేస్తుంది. [101] ఉత్తర కొరియాలో కీచర్న్ ఇంటర్న్మెంట్ కేంప్, [102] యోడక్ కాంసెంట్రేషన్ కేంప్,[103] బుక్చంగ్ కాంసెంట్రేషన్ కేంప్ [104] ఉన్నాయి. [105] ఉత్తరకొరియాలో రక్షణ వ్యయభరితమైనది.[106] నివాసగృహాలు, ప్రయాణం, వస్త్రధారణ, ఆహారం, కుటుంబజీవితం మీద గట్టి నియంత్రణ ఉంది. [107] నార్త్ కొరియా నిఘా విభాగం, సెల్యులర్, డిజిటల్ కమ్యూనికేషంస్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది. మినిస్టరీ ఆఫ్ పీపుల్స్ సెక్యూరిటీ, స్టేట్ సెక్యూరిటీ, పోలీస్ టెస్ట్ మెసేజెస్, ఆన్ లైన్ డేటా ట్రాంఫర్, ఫోన్ కాల్స్ నిర్వహణ, అప్రయత్నంగా తనతానుగా వినిపించే రికార్డ్ చేసిన సంభాషణలను పరిశీలిస్తుంటాయి. వీరి వద్ద వాడకందారుల ఖచ్ఛితమైన ప్రాంతం వివరాలు ఉంటాయి. దక్షిణప్రాంతంలో ఉన్న సైనిక రహిత ప్రాంతంలో ఫోన్, రేడియో మాధ్యమాలను సైనిక నిఘా విభాగం నియంత్రిస్తుంది.[108]
ఉత్తర కొరియా ఇతర కమ్యూనిస్ట్ దేశాలతో మాత్రమే దౌత్యసంబంధాలను కలిగి ఉంది. 1960 - 1970 నుండి ఉత్తర కొరియా స్వతంత్ర విదేశీవిధానం అనుసరించి అభివృద్ధి చెందుతున్న దేశాలతో దౌత్యసంబంధాలు ఏర్పరచుకుని " అలీన ఉద్యమం "లో భాగస్వామ్యం వహించింది. 1980 చివర , 1990 ఆరంభంలో సోవియట్ యూనియన్ పతనం తరువాత ఉత్తర కొరియా విదేశీవిధానం సంక్షోభానికి గురైంది. తరువాత సంభవించిన ఆర్ధిక సంక్షోభం కారణంగా ఉత్తర కొరియా 30 % దైత్యకార్యాలయాలను మూసివేసింది. అదే సమయంలో ఫ్రీ మార్కెట్ కలిగిన అభివృద్ధిచెందిన దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించింది..[109] ఉత్తరకొరియా ఒంటరితనం కారణంగా ఇది " హెర్మిట్ కింగ్డం " (జోసెర్ రాజవంశం ఆచారం) అనిపిలువబడుతుంది.[110]As of 2012[update], ఉత్తర కొరియా 162 దేశాలతో దౌత్యసంబంధాలను , 42 దేశాలతో దౌత్యకార్యాలయాలు కలిగి ఉంది. [109] ఉత్తర కొరియా ఆగ్నేయాసియా లోని సోషలిస్ట్ దేశాలైన వియత్నాం, లావోస్ , కంబోడియాలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది.[111] ఉత్తర కొరియాలోని అత్యధిక దౌత్యకార్యాలయాలు బీజింగ్‌లో ఉన్నాయి. [112] కొరియన్ " డిమిలిటరైజ్డ్ జోన్ " ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రక్షణవలయం ఉన్న ప్రాంతంగా గుర్తించబడుతుంది. [113]
రెండు కొరియాదేశాల మద్య ఉద్రిక్తలను తగ్గించడానికి " నార్త్ కొరియన్ న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రాం ", ది సిక్స్ పార్టీ టాక్స్ " ఏర్పాటుచేయబడ్డాయి. [114] 2008 అక్టోబరు 11 న ఉత్తర కొరియా అణుబాంబు తయారీ సంబంధిత వ్యవహారాలలో ఇరుదేశాల మద్య అంగీకారం కుదిరిన తరువాత యునైటెడ్ స్టేట్స్ " తీవ్రవాదానికి సహకారం అందిస్తున్న దేశాల జాబితా " నుండి ఉత్తర కొరియా తొలగించబడింది.[115] ఉత్తర కొరియా జపాన్ పౌరులను కిడ్నాప్ చేసింది.[116]
2000 లో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు " నార్త్ - సౌత్ జాయింట్ డిక్లరేషన్ " కొరకు సంతకం చేసాయి. శాంతి యుతంగా ఇరుదేశాలు తిరిగి సైఖ్యం కావడానికి అంగీకరించాయి.[117] 1980 అక్టోబరు 10న " ది డెమొక్రటిక్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా " అని ఉత్తర కొరియా అధ్యక్షుడు రెండవ కిం సుంగ్ ప్రతిపాదన చేసాడు.[118] గత కొన్ని దశాబ్ధాలుగా ఇరుదేశాలమద్య సంబంధాలు పలు రాజకీయాల పరిస్థితుల కారణంగా దెబ్బతిన్నాయి. .[119] 1990 వరకు సంబంధాలు కొతవరకు శాంతియుతంగానే సాగాయి. [120] 1998 లో ఉత్తర కొరియా అధ్యక్షుడు సన్ షైన్ పాలసీని వాటర్ షెడ్‌గా కిం డీ జంగ్ స్థాపించాడు. ఇది ఇతర దేశాలకు ప్రోత్సాహం కలిగించి అధికమైన యూరేపియన్ యూనియన్ దేశాలు ఉత్తర కొరియాతో పలు జాయింట్ వెంచర్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి దారితీసింది. 2000 లో ఉత్తర కొరియాలో జరిగిన ఇంటర్ కొరియా సమ్మిట్ సందర్భంలో కిం డీ జంగ్ కిం జంగ్ ఇల్ తో సమావేశం జరగడంతో సన్ షైన్ విధాన ఫలితాలు శిఖరాగ్రానికి చేరుకున్నాయి. [121] 2007 అక్టోబరు 4న దక్షిణ కొరియా అధ్యక్షుడు రాజ్- మూ - హైం, కిం జంగ్ ఇల్ 8 అంశాల శాంతి ఒప్పందం మీద సంతకం చేసాయి. [122]
ఉత్తర కొరియా సైనిక సంస్థ పేరు " ది కొరియన్ పీపుల్స్ ఆర్మీ ". ఇందులో 11,06,000 యాక్టివ్, 83,89,000 రిజర్వ్, పారామిలటరీ దళాలు ఉన్నాయి. కొరియా సైనికదళం ప్రపంచపు అతిపెద్ద సైనికదళాలలో ఒకటిగా భావించబడుతుంది.[123] వీరిలో 20% పురుషులు 17-54 వయస్కులు. వీరు రెగ్యులర్ ఆర్ండ్ ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. [28] ప్రతి 25 మంది పౌరులలో ఒకరు సన్యంలో పనిచేస్తూ ఉన్నారు.[29][124] సైనికదళంలో " కొరియన్ పీపుల్స్ ఆర్మీ గ్రౌండ్ ఫోర్స్, కొరియన్ పీపుల్స్ నేవీ, కొరియన్ పీపుల్స్ ఎయిర్ ఫోర్స్, నార్త్ కొరియన్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్, స్ట్రాటజిక్ రాకెట్ ఫోర్స్ ఉన్నాయి. వర్కర్స్ పార్టీక్ చెందున సెంట్రల్ మిలటరీ కమిషన్, ఇండిపెండెంట్ నేషనల్ డిఫెంస్ కమిషన్ సైనిక దళాలను నియంత్రిస్తుంది. [125]కె.పి.ఎ శాఖలలో గ్రౌండ్ ఫోర్స్ పెద్దది. ఇందులోని 80 ఇంఫాంటరీ డివిషన్లు (ఒక మిలియన్ సైనికులు ఉన్నారు) 30 ఆర్టిల్లరీ బ్రిగేడ్, 25 స్పెషల్ వార్ఫేర్ బ్రిగేడ్స్, 20 మెకానైజ్డ్ బ్రిగేడ్స్, 10 టాంక్ బ్రిగేడ్స్, 7 టాంక్ రెజిమెంట్స్ ఉన్నాయి. .[126] సైన్యంలో 3,700టాకులు, 2,100 ఆర్ండ్ పర్సనల్ కేరియర్లు, ఇంఫాంటరీ ఫైటింగ్ వాహనాలు ఉన్నాయి. [127] 17,900 ఆర్టిల్లరీ పీసెస్, 11,000 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గంస్,[128] 10,000 మాన్ పాడ్స్ అండ్ యాంటీ- టాంక్ గైడెడ్ మిసైల్స్, [129] 1,600 ఎయిర్ క్రాఫ్ట్ (ఎయిర్ ఫోర్స్), 1,000 వెసెల్స్ (నేవీ) [130] ఉత్తర కొరియాలో అతిపెద్ద స్పెషల్ ఫోర్సెస్, అధిక సంఖ్యలో జలాంతర్గాములు [131] ఉన్నాయి.
ఉత్తర కొరియా అణ్వాయుధాలను కలిగి ఉంది. అయినప్పటి సంఖ్యాపరంగా అణ్వాయుధాలు పరిమితంగానే ఉన్నాయి. వివిధ అంచనాలను అనుసరించి ఉత్తర కొరియాలో 10 కంటే తక్కువగా ప్లుటోనియం వార్ హెడ్స్ ఉన్నాయని భావిస్తున్నారు.[132][133] 12-17 అణ్వాయుధాలకు సమానమైన యురేనియం వార్ హెడ్స్ ఉన్నాయి.[134] రాకెట్ ఫోర్స్ 3,000 కిలోమీటర్లు పయనించగలిగిన 1,000 బాలిస్టిక్ మిస్సైల్స్ కలిగి ఉంది.[135] 2004 గణాంకాలను అనుసరించి ఉత్తర కొరియాలో 2,500 - 5,000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన రసాయన ఆయుధాలు ఉన్నాయని అంచనా. అవి నెర్వ్, బ్లెస్టర్, బ్లడ్, వామిటింగ్ ఏజెంట్లు సమర్ధత కలిగి ఉన్నాయి. అలాగే స్మాల్ ఫాక్స్, ఆంత్రాక్స్, కలరా వ్యాధులను కలిగించగలిగిన బయలాజికల్ ఆయుధాలు ఉన్నాయి. [136][137] దేశమంటా విస్తరించి ఉన్న 1800 భూ అంతర్గత ఇండస్ట్రీలలో ఆయుధాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి.[138] డిఫెంస్ ఇండస్ట్రీ ఇండివిజ్యుయల్, క్రూ- సర్వ్డ్ ఆయుధాలు, ఆర్టిల్లరీ, ఆర్మౌర్డ్ వెహికల్స్, మిస్సైల్స్, హెలికాఫ్టర్లు, సర్ఫేస్ కంబాటెట్స్, సబ్మెరీన్లు, లాండింగ్ అండ్ ఇంఫ్లేషన్ క్రాఫ్ట్, యాక్-18 ట్రైనర్స్, కో- ప్రొడక్షన్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. .[106] ఉత్తరకొరియా అధికారిక మాద్యమం ఆధారంగా 2010 మిలటరీ వ్యయం దేశ ఆర్థిక ప్రణాళికలో 15.8% నికి భాగస్వామ్యం వహిస్తుంది.[139]
స్వల్పసంఖ్యలో చైనీయులు, జపానీయులు కాక స్థానిక కొరియన్ల సంఖ్య 24,852,000.[140][141] 20వ శతాపబ్ధపు గణాంకనిపుణుల అభిప్రాయం అనుసరించి 2000 నాటికి ఉత్తర కొరియన్ల సంఖ్య 25.5 మిలియన్లు అభివృద్ధిచెందిందని, 2010 నాటికి అది 28 మిలియన్లకు చేరుకుందని అంచనా. 1995 ఉత్తర కొరియా కరువు సమయంలో జసంఖ్య అభివృద్ధి స్తంభించింది. కరువు కొనసాగిన మూడు సంవత్సరాలలో వర్షికంగా మరణాలు 3,00,000 నుండి 8,00,000 వరకు ఉన్నాయి.[142] పోషాకాహార లోపం సంబంధిత వ్యాధుల కారణంగా మరణాలు సంభవించాయి. కొంతమంది ఆహారలోపం కారణంగా కూడా మరణించారు.[142] కరువుతో పోరాడాడానికి 1997లో ఐక్యరాజ్యసమితి నాయకత్వంలో దాతలు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ద్వారా ఆహారాన్ని సరఫరా చేసారు.[143] అమెరికా అధ్యక్షుడు జార్జి డబల్యూ బుష్ ఆధ్వర్యంలో కనీసమైన సహాయం అందించబడింది.[144] పరిస్థితి మెరుగుపడిన కారణంగా 1998 లో 60%గా పోషకాహార లోపం 2008 నాటికి 37%కి,[145] 2013 నాటికి 28%కి చేరుకుంది.[146] 2013 నాటికి ఆహారధాన్యాల ఉత్పత్తి 5.37 మిలియన్ టన్నులకు చేరుకుంది.[147] అయినప్పటికీ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం నివేదిక ఆహార సమస్య ఇప్పటికీ కొనసాగుతుందని తెలియజేస్తున్నాయి.[148] కరువు ప్రభావంగా 2003 నాటికి 0.9 % క్షీణించిన జనసంఖ్య 2014 నాటికి 0.53%కి చేరుకుంది.[149] సైనిక సేవల తరువాత జరుగుతున్న వివాహాల జాప్యం, నివాస గృహాల కొరత, పనివేళల పొడిగింపు లేక రాజకీయ అస్థిరత జనసంఖ్య అభివృద్ధి మీద ప్రభావం చూపుతుంది. జాతీయ జననాలు ప్రతివెయ్యి మందిలో 14.5 సంభవిస్తున్నాయి.[150] మూడింట రెండువంతుల కుటుంబాలు రెండు గదుల నివాసాలలో నివసిస్తున్నారు. విడాకులు అరుదుగా మాత్రమే సంభవిస్తున్నాయి. [151]
2013 గణాంకాల ఆధారంగా ఉత్తరకొరియా ప్రజల సరాసరి ఆయుఃప్రమాణం 69.8 సంవత్సరాలు.[152] ఉత్తరకొరియా స్వల్ప - ఆదాయ దేశం (లో- ఇంకం కంట్రీ)గా వర్గీకరించబడింది. [153] ప్రపంచ సరాసరి ఆయుఃప్రమాణానికి ఇది సమీపంలో ఉంది.[153] 2013 అధ్యయనాలను అనుసరించి అంటువ్యాధులు, పోషకాహార లోపాలకారణంగా 29% మరణాలు సంభవిస్తున్నాయని తెలియజేస్తున్నాయి. అత్యధిక ఆదాయం కలిగిన దేశాలు, దక్షిణ కొరియా కంటే ఇది అధికం.[153] క్షయ,మలేరియా, కాలేయసంబంధిత వ్యాధుల వంటి అంటు వ్యాధులు కరువు వలన స,భవించాయని భావిస్తున్నారు.[154] 2013 అధ్యయనాలు గుండె, రక్తనాళాల వ్యాధులు ఉత్తరకొరియా ప్రజలలో అత్యధిక మరణాలకు కారణం అని తెలియజేస్తున్నాయి. [153] హృద్రోగాలు 13%, శ్వాశసంబంధిత వ్యాధులు 11%, సెరెబ్రొవ్యాస్కులర్ వ్యాధులు 7% మరణాలకు దారితీస్తుందని భావిస్తున్నారు.[155] 2003 " యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంటు ఆఫ్ స్టేట్ " నివేదికలు ఉత్తర కొరియా ప్రజలకు నీటిసరఫరా, శానిటేషన్ 100% అందుతుందని తెలియజేస్తున్నాయి.[154] 60% ప్రజలకు ఆధికీకరించబడిన శానిటరీ వసతులను కలిగి ఉన్నారు. ఉచిత భీమాపధకం అందుబాటులో ఉంది. ఆరోగ్య సంరక్షణ ప్రాంతాలవారిగా వేరుపడుతూ ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వివేదిక అనుసరించి ఆరోగ్యసంరక్షణ సరాసరి వ్యయం అతితక్కువ అని తెలియజేస్తుంది. వ్యాధులను నిరోధించడానికి వ్యాయామం, క్రీడలు, దేశీయంగా మాసాంతర వైద్యపర్యవేక్షణ, ప్రజలు సంచరించే ప్రదేశాలలో క్రమానుసారంగా వ్యాధినిరోధక ద్రవాను చిలకరించడం అవసరమని భావిస్తున్నారు. ఉత్తరకొరియాలో ప్రతివ్యక్తి పూర్తి ఆరోగ్యవివరాలు తెలియజేసే మెడికల్ గుర్తింపు కార్డులను కలిగి ఉన్నారు.
2008 ఉత్తర కొరియా గణాంకాలు 80 సంవత్సరాలలోపు ప్రజలందరూ అక్షరాశ్యులని తెలియజేస్తుంది.[151] ఆరంభకాల 11 సంవత్సరాల నిర్భంధ ప్రాథమిక విద్య అమలులో ఉంది. 27,000 నర్సరీ స్కూల్స్, 14,000 కిండర్‌గార్డెన్ స్కూల్స్, 4,800 నాలుగు సంవత్సరాల ప్రాథమిక పాఠశాలలు, 4,700 ఆరు సంవత్సరాల సెకండరీ విద్య పాఠశాలలు ఉన్నాయి. 30-34 సంవత్సరాల లోపు పురుషులలో 77%, స్త్రీలలో 79% సెకండరీ విద్యను పూర్తిచేసారు. [151] అదనంగా 300 విశ్వవిద్యాలయాలు, కాలేజీలు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. 4 సంవత్సరాల కోర్సులను రెండవ కిం సుంగ్ విశ్వవిద్యాలయం మాత్రమే అందిస్తుంది.
నిర్భంధవిద్య పూర్తిచేసిన వారు చాలామంది విద్యను కొనసాగించరు. బదులుగా సైన్యం, వ్యవసాయం, ఫ్యాక్టరీలలో పనిచేయడం ఆరంభిస్తారు. సోషల్ క్లాసెస్‌లో 50%, 20% సైన్సు క్లాసులను అందిస్తున్నాయి. సిలబస్‌లో అసమానతలు ఉన్నాయి. విద్యార్థులు నేచురల్ సైన్సు అధ్యయనంలో ఆసక్తిని, సోషల్ సైన్సు అధ్యయనంలో అనాసక్తి కనబరుస్తున్నారు. [156] 1978లో రష్యన్, ఆంగ్లభాషా అధ్యయనం నిర్బంధంగా ఉండేది.[157]
ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలలో కొరియన్ భాష వాడుకభాషగా ఉన్నప్పటికీ రెండింటిలో మాండలికాలలో భేదం ఉంది. ఉత్తర కొరియన్లు ప్యోంగ్యాంగ్ మండలికాన్ని ముంహ్వా (సాంస్కృతిక భాష) అంటారు. దక్షిణ కొరియా మాండలికాన్ని పీయోజునో (స్టాండర్డ్ భాష) అంటారు. ఇది జపానీయులు, ఆంగ్లేయులకు వాడుకభాషాగా ఉండేది. ప్రస్తుతం ఇది క్షీణదశలో ఉంది.[158] ఇందులో జపానీ, చైనీస్, పశ్చిమదేశాల పదాలు ఉన్నాయి.[158]
ఉత్తరకొరియా దస్తావేజులు, శరణార్ధుల సాక్ష్యాల ఆధారంగా [159] కొరియన్ల ప్రవర్తన, రాజకీయ, సాంఘిక, మూడుతరాలుగా వారి ఆర్థిక స్థితి ఆధారంగా వారి అంతస్తు నిర్ణయించబడుతుంది. వారి స్థితి (సొంగ్బన్) ఆధారంగా వారు బృందాలుగా విభజించబడతారు. సొంగ్బన్ ఆధారంగా పౌరులకు అవకాశాలు బాధ్యతలు నిర్ణయించబడతాయి.[160] వారికి తగినంత ఆహారం కూడా సొంగ్బన్ ఆధారంగా అందించబడుతుంది.[159][161] సొంగ్బన్ సాధారణంగా విద్య, ఉపాధి అవకాశాల మీద కూడా ప్రభావం చూపుతూ ఉంటుంది. పౌరులు రూలింగ్ పార్టీలో ప్రవేశించడం సొంగ్బన్ స్థితి ఆధారంగా నిర్ణయించబడుతుంది.[160] ఇందులో మూడు ప్రధాన వర్గీకరణలు 50 ఉప వర్గీకరణలు ఉంటాయి. 1958 నాటి రెండవ కింసుంగ్ మాట్ల ఆధారంగా కోర్ క్లాస్ 25%, వావరింగ్ క్లాస్ 55%, హోస్టైల్ క్లాస్ 20% ఉన్నారని భావిస్తున్నారు.[159] ఉన్నత స్థితి కలిగిన పౌరులు రెండవ ప్రపంచయుద్ధానికి ముందు, యుద్ధసమయంలో రెండవ కింసుంగ్కు మద్దతుగా ఉన్నారు.1950లో వీరు శ్రామికులు, కూలీలు లేక వ్యవసాయదారులుగా ఉన్నారు. [162] సమీపకాలంలో ప్రైవేట్ కామర్స్ సొంగ్బన్ విధానంలో మార్పులు తీసుకువచ్చిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.[163] ఉత్తర కొరియన్ శరణార్ధులు ఇది ప్రజల దైనందిక జీవితాన్ని శాసిస్తుందని భావిస్తున్నారు.[159] అయినప్పటికీ పౌరులందరూ సమానమేనని కుటుమబ నేపథ్యం ఆధారంగా ఎటువంటి వివక్షచూపడం లేదని ఉత్తర కొరియా ప్రభుత్వం వాదిస్తుంది.[164]
మానవహక్కుల ఉల్లంఘన అంతర్జాతీయ విమర్శనలను ఎదుర్కొంటున్నది.[165] ఉత్తరకొరియన్ ప్రజలు ప్రపంచంలో అత్యధికంగా ఆణిచివేతకు గురైనప్రజలలో ఒకరని " మానవ హక్కుల పరిశీలన బృందం " భావిస్తుంది. ఉత్తర కొరియా ప్రజల ఆర్థిక, రాజకీయ నిబంధనలకు లోనౌతున్నారని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.[166][167] ఉత్తరకొరియన్ పౌరులను ప్రభుత్వం కఠిన నియమాలతో ప్రణాళికాబద్ధంగా నియంత్రిస్తుంది. ప్రజల దైనందిక జీవితాన్ని ప్రభుత్వం, పార్టీ నియంత్రిస్తుంది. రాజకీయ విశ్వసనీయత ఆధారంగా పార్టీ ఉద్యోగనియామకాలను చేస్తుంది. " మినిస్టరీ ఆఫ్ పీపుల్స్ సెక్యూరిటీ " పౌరుల ప్రయాణాలను కఠినంగా నియంత్రిస్తూ ఉంటుంది. ఉత్తరకొరియా ప్రజల స్వతంత్రం సంబంధిత భావప్రకటన, ప్రవర్తన, ఏకపక్ష నిర్ణయం, హింస, ఇతర మరణానికి దారితీసే ఇతర చర్యలు మరణశిక్షల అమలు గురించి " ఆమెంస్టీ ఇంటర్నేషనల్ " నివేవిదిక సమర్పించింది.[168] ఉత్తరకొరియా మరణశిక్ష విధించడం (బహిరంగ మరణశిక్ష కూడా) అమలు చేస్తుంది. మానవహక్కుల పరిరక్షణ సంస్థ అంచనా ఆధారంగా 2009 లో 1,193 మరణశిక్షలు అమలు చేయబడ్డాయని భావిస్తున్నారు.[169] దేశంలో అమలౌతున్న రాజకీయం, మతం, జాతి, లింగ వివక్ష చూపడం బలవంతపు స్థల మార్పిడి, బలవంతపు పస్తులు అంతర్జాతీయంగా విమర్శలు గురౌతున్నాయి. [170][171][172] ఉత్తర కొరియాలోమానవత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న హింసను ఆపడానికి ఏర్పడిన " ఇంటర్నేషనల్ కోయిలేషన్ " ఉత్తర కొరియాలో ఖైదీ శిబిరాలలో వార్షికంగా 10,000 మంది మరణిస్తున్నారని వెల్లడించింది.[173] మనహక్కుల పరిరక్షణ సంస్థల విమర్శలను ఉత్తరకొరియా ప్రభుత్వం ఖండిస్తూ ఉంది.[174][175][176]
చైనా నుంచి ఉమ్మడి కొరియాకు బౌద్ధమతం సా.శ.374లో ప్రాకింది. చైనాకు అప్పటికే భారతదేశం నుంచి పలువురు భక్షువులు వెళ్ళి అందించిన బౌద్ధం 4వ శతాబ్ది నాటికి కొరియా చేరింది. సా.శ.374 ఆతో, షర్తో అనే ఇద్దరు బౌద్ధ భిక్షువులు అప్పటి రాజధాని పినాంగ్ పట్టణానికి చేరుకున్నారు. మతానందుడు అనే బౌద్ధుడు అనుచరులతో సహా కొరియా రాజ్యానికి ఆహ్వానింపబడి ప్రచారం చేశారు. 5వ శతాబ్దికి కొరియాలోని సిల్లరాజపుత్రికకు యోగశక్తితో, వైద్యనిపుణతతో చికిత్స చేసిన భిక్షువు తాంత్రికబౌద్ధాన్ని వ్యాపించారు. ఆపైన 50ఏళ్ళకల్లా కొరియా రాజవంశీకులు బౌద్ధదీక్ష స్వీకరించారు. దానితో మరి నాలుగు శతాబ్దాల్లో రాజాదరణతో కొరియాలో బౌద్ధం విలసిల్లి 10వ శతాబ్ది నాటికి మతం దేశవ్యాప్తమైన అభివృద్ధికి నోచుకుంది.[177]
ఉత్తరకొరియాలో మతస్వతంత్రం, మత ఉత్సవాలు జరుపుకోవడానికి హక్కూ ఉన్నాయి. అయినప్పటికీ మతావలనబన మీద కొన్ని నిబంధనలూ ఉన్నాయి.[178] ఉత్తరకొరియాలో 64.3% ప్రజలు నాస్థుకులు, 16% కొరియన్ షామినిజం, 13.5% చెయానిజం, 4.5% కొరియన్ బుద్ధిజం, 1.7% క్రైస్తవులు ఉన్నారు.[179] బుద్ధిజం, కొరియన్ కంఫ్యూషియనిజం ప్రజల సంకృతిక జీవితం మీద ఇప్పటికీ ప్రభావం చూపుతున్నాయి.[180][181] మతసంస్థలలో ప్రజాసంస్కృతి మీద బౌద్ధులు అధికంగా ప్రభావం చూపుతూ ఉన్నారు. వారికి ప్రభుత్వం నుండి మతాభివృద్ధికి పరిమితమైన నిధులుమాత్రమే అందుతూ ఉన్నాయి. [182] చొండోయిజం కొరియన్ షామనిజం, బుద్ధిజం, తాయిజం, కాథలికిజంలను సమైక్యం చేస్తూ ఉంది.[183] ప్రభుత్వం మంజూరు చేసిన చర్చీలు 4 ఉన్నప్పటికీ మతవాదులు ఇవి విదేశీయుల ప్రదర్శనశాలలుగా మాత్రమే ఉన్నాయని విమర్శిస్తున్నారు.[184][185] " ఆమెంస్టీ ఇంటర్నేషనల్ " ఉత్తర కొరియా మతహింస గురించి ఆందోళన వెలువరించింది.[186]
చరిత్ర ఆధారంగా చైనా ప్రభావంతో కొరియన్లు తమకే ప్రత్యేకమైన సంస్కృతిని ఏర్పరుచుకున్నారు.[187] 1910 నుండి 1945 వరకు కొనసాగిన జపాన్ దండయాత్ర కారణంగా జపాన్ బలవంతంగా కొరియాద్వీపకల్పంలో జపాన్ సంస్కృతిని ప్రవేశపెట్టింది. కొరియన్లు జపాన్ నేర్చుకోవడానికి, మాట్లాడడానికి ప్రోత్సహించబడ్డారు. జపాన్ కుటుంబాల పేర్లను స్వీకరించడం, షింటో మతావలంబనం చేయడం ప్రోత్సహించబడింది. అయినప్పటికీ పాఠశాలలలో, బహిరంగ ప్రదేశాలలో, వ్యాపార ప్రదేశాలలో కొరియన్ భాష మాట్లాడడం నిషేధించబడింది.[188] 1945లో ద్వీపకల్పం విభజించబడిన తరువాత కొరియన్ వారసత్వంలో రెండు ప్రత్యేక సంస్కృతులు చోటు చేసుకున్నాయి. ఉత్తర కొరియన్ల మీద విదేశీయుల ప్రభావం తక్కువగానే ఉంది.[189] నాయకత్వం ప్రతిభ, ఉద్యమాల సమస్యలు కళలకు ప్రధాన వస్తువుగా ఉంది. [189] కొరియన్ సంప్రదాయం ప్రభుత్వం చేత సంరక్షించబడుతూ ఉంది. [190] 190 చారిత్రక ప్రాంతాలను " నార్త్ కొరియా జాతీయ సంపద"గా వర్గీకరించారు. 1,800 కళాఖండాలు ఉత్తర కొరియా ఆస్తులుగా గుర్తించబడ్డాయి. కీసాంగ్ చారిత్రక స్మారక చిహ్నాలు , కాంప్లెక్స్ ఆఫ్ గోగుర్యెయో సమాధులు యునెస్కో వారసత్వసంపదలుగా గుర్తించబడ్డాయి. [191]
సోషలిస్ట్ వాస్తవాలను అందమైన విష్యుయల్ కళలుగా రూపుదిద్దుతున్నారు.[192] ఉత్తర కొరియన్ చిత్రకళలో సోవియట్ , జపానీ ప్రభావం కనిపిస్తుంది. [193] ఉత్తర కొరియాలోని కళాకారులందరూ ఆర్టిస్ట్ యూనియన్‌లో చేరాలని కోరబడుతుంటారు. వారిలో ఉత్తమ కళాకారులు అధికారిక లైసెంస్ పొందుతుంటారు. రెండవ కింసుంగ్ , కిం జాంగ్ - ఉన్ చిత్రాలు , శిల్పాలు మొదటి తరగతికి చెందినవిగా భావించబడతాయి. .[192] 1959లో స్థాపించబడిన " మంసుడీ ఆర్ట్ స్టూడియో " కళారంగం మీద ఆధిక్యత కలిగి ఉంది. 1,000 మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తూ ప్రపంచంలో అతి పెద్ద కళాపరిశ్రమగా గుర్తించబడుతుంది. ఇక్కడ చిత్రాలు, మురల్, పోస్టర్లు ఙాపికలు రూపుదిదిద్ది ఉత్పత్తి చేయబడుతుంటాయి. [194] స్టూడియో వాణిజ్యపరం చేయబడింది. ఇక్కడ ఉత్పత్తి చేయబడుతున్న చైనాలో (చైనాలో వీటికి గిరాకీ అధికం) విక్రయించబడుతుంటాయి.[193] " మంసుడీ ఓవర్సీస్ ప్రాజెక్టులు " మంసుడీ ఆర్ట్ స్టూడియోలో ఉపశాఖగా పనిచేస్తూ ఉంది. ఇది అంతర్జాతీయ వాడకందార్లకు పెద్ద ఎత్తున ఙాపికలను ఉత్పత్తి చేసి అందిస్తూ ఉంది. [194] ఇక్కడ తయరు చేయబడిన ప్రాజెక్టులలో " ఆఫ్రికన్ రినైసెంస్ మోన్యుమెంట్ " (సెనెగల్),[195] ది హీరోస్ ఆక్రె (నమీబియా) ఉన్నాయి.[196]
KPA State Chorus Song of Comradeship |
Moranbong Band Let us Dash towards the Future |
---|---|
దస్త్రం:Song of Comradeship excerpt.ogg | దస్త్రం:Moranbong Band excerpt.ogg |
20వ శతాబ్దం అంతా ప్రభుత్వం జానపద సంగీతానికి ముఖ్యత్వం ఇచ్చింది.[189] రివల్యూషనరీ ఆర్కెస్ట్రా పశ్చిమ దేశాలకు విభిన్నంగా సంగీత ప్రదర్శనలకు సంప్రదాయ సంగీత పరికరాలను ఉపయోగిస్తుంది.[197] 1971లో ఆరంభమైన " సీ ఆఫ్ బ్లడ్ " సంగీత ప్రదర్శన 1,500 మార్లు ప్రదర్శించబడింది.[198] 2010 ఈ బృందం వారు విజయవంతంగా చైనాయాత్ర పూర్తిచేసారు.[197] పాశ్చత్య సంప్రదాయసంగీత కళాకారులలో జోహాంస్ బ్రాహ్ంస్, ప్యోత్ర్ ఇలిచ్ త్చైకొవ్స్కి, ఇగార్ స్ట్రావింస్కి, ఇతర సంగీతకారులు కొరియా సింఫోనీ ఆర్కెస్ట్రా, స్టూడెంట్ ఆర్కెస్ట్రా ప్రదర్శనలు ఇస్తుంటారు.[199] 1980 నుండి కొరియాలో పాప్ మ్యూజిక్ ప్రవేశించింది.[200] ఇంటర్ కొరియన్ సమ్మిట్ తరువాత అభివృద్ధి చెందిన దక్షిణ కొరియా సంబంధాల కారణంగా సైద్ధాంతిక పాపసంగీతానికి ప్రాబల్యత తగ్గుతూ ఉంది. కామ్రేడ్షిప్, నోస్టాల్జియా, శక్తివంతమైన దేశనిర్మాణం ఆధారిత సంగీతం ప్రస్తుతం ప్రాబల్యం సంతరించుకుంటుంది. దేశలో ప్రఖ్యాత సంగీతబృందాలలో ఆల్ ఫిమేల్ బ్యాండ్, మొరాంబాంగ్ బాండ్ ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.[201] ఉత్తర కొరియాలో సరికొత్తగా " కె- పాప్ " రూపొందించబడింది. ఇది చట్టవిరుద్ధమైన మార్గాలలో దేశమంతటా విస్తరించి ఉంది. [202]
మునుపటి సోవియట్ యూనియన్ పాలన కారణంగా ఉత్తరకొరియాలో సాహిత్యం పునాదులు లేవు. అంతేకాక దేశంలో గుర్తించతగిన సాహిత్యవారసత్వం లేదు. [203] పబ్లిషింగ్ హౌసులన్ని ప్రభుత్వానికి స్వంతమై ఉన్నాయి. [204]వీటిలో " ది వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా పబ్లిషింగ్ హౌస్ " అధిక ప్రాధాన్యత కలిగి ఉంది. ఇది రెండవ కింసుంగ్ బయోగ్రఫీలన్నింటినీ, సిద్ధాంతిక విద్యా సంబంధిత పేచురణలను, పార్టీ విధానాల గురించిన దస్తావేజులను ప్రచురించింది. [205] విదేశీసాహిత్యం అరుదుగానే లభిస్తుంది. విదేశీసాహిత్యానికి ఉదాహరణగా ఇండియన్, జర్మన్, చైనీస్, రష్యన్ కథాసాహిత్యాలు లభిస్తున్నాయి. షేక్స్ఫియర్ రచనలు, బెరిటాట్ బ్రెచ్, ఎరిచ్ కస్ట్నర్ రచనలు లభిస్తాయి.[193] రెండవ కిం సుంగ్ రచనలు " క్లాసికల్ మాస్టర్ పీసులుగా " భావించబడుతున్నాయి. ఆయన రచనలలో " ది ఫేట్ ఆఫ్ ఎ సెల్ఫ్- డిఫెంస్ కార్ప్స్ మాన్ ", ది సాంగ్ ఆఫ్ కొరియా, ఇమ్మోర్టల్ హిస్టరీ (జపాన్ పాలనలో కష్టాలు అనుభవించిన కొరియన్ల గురించిన నవలల పంరర) ప్రధానమైనవి.[189][206] 1980-2000 మద్య 4 మిలియన్ల కంటే అధికంగా ప్రచురణలు వెలువడ్డాయి. అయినప్పటికీ వీటిలో అత్యధికం వైవిధ్యరహితంగా ఉన్నాయి.[207]సైన్సు ఫిక్షన్ రెండవస్థాయి రచనలుగా భావించబడుతుంటాయి. [208]
చలనచిత్రాల గురించి ప్రభుత్వ విధానాలు ఇతర కళలకంటే వ్యాత్యాసంగా ఉంటాయి. చలనచిత్రాలు ప్రజలకు సాంఘిక అఫ్హ్యయనం చేయడానికి సహకరిస్తుంటాయి. కొన్ని ప్రభావవంతమైన చిత్రాలు చరిత్రక నేపథ్యం కలిగిన కథాంశంతో, జానపదగాధల ఆధారంగా నిర్మించబడ్డాయి.[206] ప్రజలు అధికంగా తమ అభిమాన నటులు నటించే చలన చిత్రాలను ఆదరిస్తున్నారు. .[203] పశ్చిమదేశాల చిత్రాలు ఉన్నతస్థాయి పార్టీ సభ్యులకు మాత్రమే ప్రైవేట్ షోలుగా ప్రదర్శించబడుతున్నాయి. [209] అయినప్పటికీ 1997 టైటానిక్ చిత్రం విశ్వవిద్యాలయ విద్యార్థులకు పశ్చిమదేశాల సంస్కృతికి ఉదాహరణగా ప్రదర్శ్ంచబడింది. [210] స్మగుల్డ్ డి.వి.డి.లుగా, సరిహద్దు ప్రాంతాలలో టి.వి., రేడియో ప్రదర్శనలలో విదేశీ చిత్రాలు లభిస్తున్నాయి.[211] ప్రభుత్వం కఠిన నియమాల మద్య పనిచేస్తున్న మాద్యమాలలో ఉత్తర కొరియా మాధ్యమం ఒకటి. " ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఇండెక్స్ " నివేదిక ఆధారంగా ఉత్తరకొరియా ప్రెస్ స్వాతంత్ర్యం అంతర్జాతీయంగా 2003 లో 178దేశాలలో 177వ స్థానంలో ఉందని భావిస్తున్నారు.[212]" ఫ్రీడం హౌస్ " నివేదిక అనుసరించి మాధ్యమ ప్రచురణలు అన్నీ ప్రభుత్వానికి మౌత్ పీస్‌లుగా పనిచేస్తున్నాయి. పత్రికావిలేఖరులు అందరూ పార్టీ సభ్యులే. విదేశీ విలేఖరులకు మరణశిక్ష వంటి శిక్షలు విధించబడుతున్నాయి.[213] " కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెంసీ " దేశంలో వార్తాపత్రికల ప్రచురణలో మొదటి స్థానంలో ఉంది. ఉత్తరకొరియాలో 12 వార్తాపత్రికలు, 20 పీరియాడికల్స్ ప్రచురించబడుతున్నాయి.[214] దేశంలో ప్రభుత్వానికి స్వంతమైన మూడు టి.వి స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 2 వారాంతాలలో మాత్రమే ప్రసారాలను అందిస్తున్నాయి. కొరియన్ సెంట్రల్ టెలివిజన్ ప్రతిరోజు సాయంత్రం మాత్రమే ప్రసారాలు అందిస్తుంది.[215] ఉరిమింజోక్కిరి, సంబంధిత యూట్యూబ్, ట్విట్టర్ ద్వారా ప్రభుత్వం చిత్రాలు, వార్తలు, వీడియోలను ప్రసారం చేస్తూ ఉంది. [216] 2012 లో ప్యొంగ్యాంగ్లో అసోసియేటెడ్ ప్రెస్ వెస్టర్న్ ఆల్- ఫార్మాట్, ఫుల్- టైం బ్యూరో అందిస్తుంది.[217] ప్రాధాన్యత లేని అధికార పార్టీ నాయకుని గురించిన వార్తలు మాత్రమే ప్రసారం చేయబడుతూ ఉత్తర కొరియా మాద్యమం అంతర్జాతీయంగా ఏకాంతంగా ఉంది.[218]
కొరియన్ ఆహారసంస్కృతి శతాబ్ధాల సాంఘిక, రాజకీయ ప్రభావంతో మార్పులకు గురౌతూ ఉంది. కొరియన్ ఆహారసంస్కృతికి చరిత్రకాలానికి ముందునాటి వ్యవసాయక, నోమాడిక్ సంప్రదాయం మూలంగా ఉంది. దక్షిణ మంచూరియా, కొరియన్ ద్వీపకల్పంలో వాడుకలో ఉన్న ఈ ఆహారసంస్కృతి సహజసిద్ధమైన వనరులు, విభిన్నమైన సంస్కృతుల సమ్మిశ్రితమై ఉంది.[219] బియ్యంతో తయారుచేసిన ఆహారాలు, కించి కొరియన్ల ప్రధాన ఆహారంగా ఉన్నాయి. సంప్రదాయ భోజనంలో రెండు సైడ్ డిషులు (బంచన్), ప్రధాన ఆహారం (జుక్), బుల్గాగి లేక నూడిల్స్ ఉంటాయి. కొరియన్ స్ప్రిట్లలో సోజు (లికర్) ప్రధానమైనది.[220] ఉత్తర కొరియాలోని పోగ్యాంగ్లో కొరియాలోనే అత్యంత ప్రఖ్యాతిచెందిన ఒక్రుగ్వాన్ రెస్టారెంట్ ఉంది. ఇది " నియాంగ్మియాన్ కోల్డ్ నూడిల్స్"కు ప్రసిద్ధిచెందింది.[221] ఇక్కడ అన్నంతో " గ్రే ముల్లెట్ (చేప) సూప్", బీఫ్ రిబ్ సూప్, గ్రీన్ బీన్ పాంకేక్, సింసియోల్, టెర్రాపిన్ వంటి ఇతర ఆహారాలు సరఫరా చేయబడుతుంటాయి.[222][223] ఒక్రియుగ్వాన్ కొరియన్ ఆహార విధానాలను పరిశోధించడానికి, కొత్త ఆహారాలను పరిచయం చేయడానికి పరిశోధకబృందాలను గ్రామాలకు పంపింది.[221] కొన్ని ఆసియన్ నగరాలలో ప్యోంగ్యాంగ్ చైన్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో సర్వర్లు సంగీతం, నృత్యం ప్రదర్శిస్తుంటారు. [224]
ఉత్తర కొరియన్లకు క్రీడాస్ఫూర్తి అధికంగా ఉంది. అధికంగా పాఠశాలలలో అసోసియేషన్ ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, ఇతర క్రీడలలో దినసరి అభ్యాసం నిర్వహించబడుతుంది.డి.పి.ఆర్. కొరియా లీగ్ దేశంలో ప్రాబల్యత కలిగి ఉంది. ఈ క్రీడలు తరచుగా టెలివిజన్‌లో ప్రసారం చేయబడుతూ ఉంటాయి. [203] నేషనల్ ఫుట్ బాల్ టీం, కొరియా డి.పి.ఆర్. నేషనల్ ఫుట్ బాల్ టీం 2010 లో ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ కప్, పోర్చుగల్ నేషనల్ ఫుట్ బాల్ టీం,, ఐవరీ కోస్ట్ నేషనల్ ఫుట్ బాల్ టీంలలో బ్రెజిల్‌కు వ్యతిరేకంగా మూడు మ్యాచ్‌లలో పాల్గొన్నది.[225] 1966 ఎఫ్.ఎఫ్.ఎ. వరల్డ్ కప్ విజయవంతంగా క్రీడలలో పాల్గొంటున్నది.[226] నార్త్ కొరియన్ నేషనల్ ఫుట్ బాల్ టీం దేశం తరఫున బాస్కెట్ బాల్ క్రీడలలో పాల్గొంటూ ఉంది. 2013 మునుపటి అమెరికన్ బాస్కెట్ బాల్ ప్రొఫెషనల్ ఉత్తరకొరియా సందర్శించి కొరియన్ నేషనల్ టీంకు శిక్షణ ఇచ్చాడు.[227]
1964లో ఉత్తర కొరియా వింటర్ ఒలింపిక్స్ క్రీడలలో పాల్గొన్నది. 1972 లో సమ్మర్ ఒలింపిక్స్‌లో ఉత్తరకొరియా ఒక బంగారు పతకంతో మొత్తం 4 పతకాలను సాధించింది. 1984 లో లాస్ ఏజెల్స్‌లో జరిగిన ఒలింపిక్స్ క్రీడలను బాయ్‌కాట్ చేసింది. తరువాత 1988లో సియోల్‌లో జరిగిన ఒలింపిక్స్ నుండి అన్నింటిలో పాల్గొన్నది.[228] వెయిట్ లిఫ్టర్ కిం ఉన్ - గుక్ 2012 సమ్మర్ ఒలింపిక్స్- మెంస్ 62 కి.లో (లండన్) ప్రపంచ రికార్డును అధిగమించాడు. [229] ఒలింపిక్స్ విజేతలకు ప్రభుత్వం వారి సాధనకు గుర్తింపుగా విలాసవంతమైన అపార్ట్మెంట్లు ఇస్తుంది. [230] " ది అరిరంగ్ ఫెస్టివల్ " గిన్ని వరల్డ్ రికార్డులలో నమోదు చేయబడింది. ఇది ప్రపంచంలో అతి పెద్ద నృత్యప్రదర్శనగా గుర్తించబడుతుంది.[231] ఉత్తర కొరియాలో 1,00,000 మంది అథ్లెట్లు ఉన్నారు. అలాగే నృత్యంలో శిక్షణపొందిన 40,000 మంది కళాకారులు నేపథ్యంలో విస్తారమైన అనిమేటెడ్ దృశ్యాలను ప్రదర్శిస్తుంటారు.[231][232] ఉత్తర కొరియాలో ఉన్న " రుంగ్రాడో ఫస్ట్ ఆఫ్ మే స్టేడియం" పేపంచంలో అతిపెద్ద స్టేడియంగా గుర్తించబడుతుంది. ఇక్కడ 1,50,000 మంది అతిథులు క్రీడలను తిలకించవచ్చు.[232][233] ది ప్యోంగ్యాంగ్ మారథాన్ గుర్తించతగిన ఇతర క్రీడలలో ఒకటి. ఈ క్రీడలలో ప్రపంచం అంతటి నుండి వచ్చే అమెచ్యూర్ క్రీడాకారులు పాల్గొంటారు. [234]
మనకు స్వాతంత్య్రం వచ్చాక ఏడాదికి ఉత్తర కొరియాకి స్వతంత్రం వచ్చింది. కానీ ఆ తర్వాతే అక్కడి ప్రజల స్వేచ్ఛ హరించుకుపోయింది. గత కొన్ని ఏళ్లుగా వారికి మరో ప్రపంచం తెలియదు. తెలియకుండా చేశారు వాళ్ల అధ్యక్షులు. ఉత్తర కొరియా మొదటి అధ్యక్షుడు కిమ్ ఇల్ సంగ్ అధికారంలోకి రాగానే ఆ దేశంతో ప్రపంచానికి ఉన్న వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసేశాడు. అప్పట్నుంచీ బయట ఏం జరుగుతుందో కూడా వారికి తెలియని పరిస్థితి. అధ్యక్షుడే వారికి దైవం. మరో దైవాన్ని పూజించినా ఒప్పుకోరు. తినడానికీ బట్టకట్టడానికీ జుట్టు కత్తిరించడానికీ అన్నిటికీ ప్రభుత్వ నిబంధనలే. పాటించకపోతే కఠిన శిక్షలే. పోనీ దేశం విడిచి వెళ్లి ఎక్కడైనా బతుకుదామంటే పోనివ్వరు. అందుకే, మిగిలిన ప్రపంచంతో పోల్చితే తామెంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నామన్న విషయం కూడా అక్కడి జనానికి తెలీదు. ఇంటర్నెట్ వచ్చిన ఈరోజుల్లో ఏమూల ఏం జరుగుతున్నా తెలుస్తుందిగా అనుకోవచ్చు. కానీ వారికి ఇంటర్నెట్ ఉండదు. ఈమధ్యే ఫోన్ సదుపాయం వచ్చింది కానీ లోకల్‌కాల్స్ మాత్రమే మాట్లాడాలి. టీవీల్లో ప్రభుత్వానికి చెందిన మూడు ఛానెళ్లే వస్తాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.