From Wikipedia, the free encyclopedia
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషక పదార్ధాలు లోపించిన ఆహారం తీసుకోవడాన్ని పోషకాహార లోపం (Malnutrition) అంటారు. దీనికి ఉపవాసాలు చేయడం, అనారోగ్య పరిస్థితులు, పేదరికం, మూఢ నమ్మకాలు, అవగాహనా రాహిత్యం, సాంఘిక, ఆర్థిక కారణాలు, అపరిశుభ్రత ముఖ్యమైన కారణాలు. దీర్ఘకాలంగా పోషకాహారం లోపిస్తే పెరుగుతున్న పిల్లల్లో ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. వీరిలో జీవక్రియా రేటు అధికంగా ఉండి తగినంత కార్బోహైడ్రేట్లు, కొవ్వులు నిల్వ ఉండవు. కాబట్టి కొద్దికాలంలోనే ఈ నిల్వలు కరిగిపోయి పిల్లలు తమ శరీర ద్రవ్య పదార్ధాన్ని కోల్పోతారు. దీనివలన వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనారోగ్యానికి గురవుతారు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
The orange ribbon—an awareness ribbon for malnutrition. | |
m:en:eMedicine | {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} |
MeSH | {{{m:en:MeshID}}} |
ఆఫీసులో పని కాస్త ఎక్కువయితే కాఫీలు, టీలు. కొద్దిపాటి విరామం దొరికితే సమోసాలు, బజ్జీలు. క్షణం తీరిక లేకుండా ఉంటే భోజన విషయం పక్కనపెట్టి పనిలో మునిగిపోవడం. ఉద్యోగినుల్లో ఎక్కువమంది పాటించే ఆహారపు అలవాట్లివి. బరువును పెంచి, ఉత్సాహాన్ని తగ్గించే ఈ అలవాట్లకు బదులుగా ఆఫీసులో ఉద్యోగినులు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి నిపుణులు ఇలా వివరిస్తున్నారు. ఆఫీసులో ఉన్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు టీ, కాఫీలు సేవించడం.. శీతలపానీయాలు తాగడం అందుబాటులో ఉండే జంక్‌ఫుడ్‌ను లాగించేయడం చాలామందికి అలవాటు. ఇవి శరీరానికి నూతనోత్సాహాన్ని అందించడానికి బదులు శక్తిహీనంగా మార్చేస్తాయి. ఏకాగ్రతని దెబ్బతీస్తాయి. అందుకే ఈ అలవాట్లను నియంత్రించడం లేదా కాఫీ, టీలను ఆరోగ్యకర పానీయాలుగా మలుచుకోవడం చాలా అవసరం. స్పానీటితో... శక్తినిచ్చే టీలు స్పా వాటర్.. మినరల్ వాటర్ మాదిరిగానే ఈ మధ్యకాలంలో మార్కెట్‌లో ఈ నీళ్ల సీసాలు లభ్యమవుతున్నాయి. ఆరోగ్యకరమైన, ప్రత్యేకమైన ఖనిజ లవణాలని అందించే ఈ నీటిని జోడించి ఆఫీసులో సొంతంగా హెర్బల్ టీలు చేసుకోవచ్చు. పంచదార వాడకాన్ని తగ్గిస్తే కెలోరీలు తగ్గి అధిక బరువు సమస్య ఉండదు.
నెక్టర్ వాడి చేసిన పండ్లరసం. నెక్టర్ అంటే సహజసిద్ధంగా పూలు, పండ్లను నుంచి సేకరించిన చక్కెర పదార్థం. ఆఫీసు బ్యాగులో పోషకాహారం * సాయంకాలం ఉపాహారం తినే సమయంలో చాలా మంది ప్రాధాన్యం ఇచ్చేది సమోసా, పిజా, బర్గర్, చిప్స్ వంటి వాటికే! బదులుగా ఉప్పు తక్కువగా ఉండే సూప్‌లు లేదా గుప్పెడు వాల్‌నట్లు, బాదం వంటివి తీసుకోవచ్చు. వీటి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. * మనకోసం మనం చేసుకొనే పదార్థాల్లో వేటి మోతాదు ఎంత మేరకు ఉంటే.. ఆరోగ్యదాయకమో మనకు బాగా తెలుస్తుంది. ఉద్యోగ పనుల్లో ఆరోగ్యం గురించి ఆలోచించడానికి క్షణం తీరిక లేదు అనుకొనేవారు ఒక రోజు ముందుగానే పండ్లని ముక్కలుగా తరిగి జిప్‌లాక్ బ్యాగులో వేసుకోవాలి. ఆఫీసుకెళ్లేటప్పుడు బాక్సులో తీసుకెళ్లిపోవచ్చు.
నలుగురితో కలిసి తినే బిస్కెట్లను తక్కువ అంచనావేయొద్దు. రెండు మూడు బిస్కెట్లలో కూడా బోలెడు కెలోరీలు, కొవ్వు, పంచదార ఉంటాయి. * ఆఫీసులో పార్టీ అనగానే క్యాంటీన్‌లో కనిపించే చాక్లెట్లని తినేస్తుంటారు చాలామంది. సాధారణ చాక్లెట్‌కన్నా హాట్ చాక్లెట్ డ్రింక్ మంచి ప్రత్యామ్నాయం. ఎందుకంటే దీనిలో మూడు గ్రాముల కొవ్వు, 140 కెలోరీలు శక్తి మాత్రమే ఉంటే, చాక్లెట్‌ని నేరుగా తినడం వల్ల 230 కెలోరీల శక్తి, 13 గ్రాముల కొవ్వు చేరుతుంది. ఎండుఫలాలు.. వేయించిన సెనగలు ఇంటి నుంచి వస్తూ వస్తూ తాజా పోషకాహారాన్ని తెచ్చుకోవడానికి వీలుపడట్లేదు అనుకొనేవారు.. ఆఫీసులో భద్రపరుచుకొనే ఆహారాలివి. ఒక డబ్బా నిండా ఎండు ఫలాలు, పీచు అధికంగా ఉండే పోషకాహార బిస్కెట్లు, ఇన్‌స్టంట్ భేల్‌పురీ, వేయించిన సెనగలు, బఠాణీలు, మరమరాలు ఉంచుకోవచ్చు. పనివేళల్లో ఆహారం.. అప్రమత్తం
పని ఎక్కువగా ఉంది' అని వేగంగా తినడం మంచి పద్ధతి కాదు. ఇలా అయితే అనుకొన్న దాని కంటే ఎక్కువగా తినేస్తారు. అలాగే చేయబోయే ప గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఆహారంపై దృష్టిపెట్టకపోయినా పెద్దగా ఫలితం ఉండదు. ఎంత పనిలో ఉన్నా సరే భోజనం తినేటప్పుడు కొంత విరామాన్ని తప్పక తీసుకోవాలి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.