సంతకము (from లాటిన్ signare, "sign") ఒక వ్యక్తి చేతితో వ్రాసిన స్వంత పేరు లేదా పేరు సూచిక మరేదైనా వ్రాత. ఇవి సామాన్యంగా ఆ వ్యక్తికి చెందిన న్యాయ సంబంధమైన పత్రాలపై గుర్తింపుకోసం చేస్తారు. కొన్ని రకాల సృజనాతజ్మకమైన పనుల మీద కూడా కొందరు సంతకాలు చేస్తారు. ఉదాహరణకు చిత్రలేఖకులకు సంబంధించిన చిత్రాలపైన, లేదా శిల్పాలపైన ఈ విధంగా వ్రాయడం కొందరికి అలవాటు. సంతకం చేసిన వ్యక్తి "సంతకందారుడు". ఒక వ్యక్తి సంతకం చేయడం అంటే ఆ వ్యక్తి దేనిపైన సంతకం చేశాడో దానిని సృష్టించాడని గాని లేదా ఆమోదించాడని గాని లేదా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని గాని భావన జనిస్తుంది.
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
సంతకం విధానాలు, ఉద్దేశ్యాలు
సాధారణంగా సంతకం చేయడం అనేది సాక్ష్యానికి సూచికా ఉంది. సంతకం చేయడం ద్వారా జరిగే పనులు
- ఒక డాక్యుమెంట్ నిజమైనదని నిర్ధారించడం.
- ఆ డాక్యుమెంటులో ఉన్న విషయం సంతకందారు ఆమోదించాడని చెప్పడం.
ఒక కంట్రాక్టు డాక్యుమెంట్‌లో రెండు పార్టీలు సంకం చేయడం ద్వారా ఆ కంట్రాక్టు ఒప్పుకుంటున్నారని మాత్రమే కాకుండా అందులోని విషయాలు అన్నీ పరిశీలించి ఆమోదించారని సంతకం ద్వారా తెలియబరచారనుకోవచ్చును. అందుకే సంతకం డాక్యుమెంట్ చివరిలో చేస్తారు. మొదటిలో కాదు.
చట్టబద్ధమైన డాక్యుమెంట్లు చాలా దేశాలలో ఒక పబ్లిక్ నోటరీ సమక్షంలో సంతకం చేయించి రికార్డు చేయబడతాయి. ఇలా చేయడం వలన ఆ డాక్యుమెంట్లకు చట్టపరంగా విశ్వసనీయత లభిస్తుంది. అక్షర జ్ఞానం లేని వ్యక్తి అక్షరాస్యుడైన మరొక వ్యక్తి సమక్షంలో (సాక్ష్యంగా) డాక్యుమెంట్ మీద ఏదో ఒక "గుర్తు" (often an "X" but occasionally a personalized symbol) పెట్టడం జరుగుతుంది. ఇది ఆ వ్యక్తి వ్యక్తిగతంగా ఆ డాక్యుమెంటుకు బాధ్యత తీసుకొన్నట్లు తెలియజేయడానికి అన్నమాట. కొన్ని దేశాలలో నిరక్షరాస్యుడైన వ్యక్తి వ్రేలి ముద్ర వేయడం జరుగుతుంది. ఈ వ్రేలి ముద్రకూడా మరొక అక్షరాస్యుడైన సాక్షి సంతకంతో ధ్రువీకరింపబడాలి.
ప్రసిద్ధులైన వ్యక్తుల సంతకాలు ఆటోగ్రాఫ్‌లుగా సేకరిస్తారు. ఇది ఒక డాక్యుమెంట్ నిర్ధారణకు కాకుండా ఒక జ్ఞాపికగా భావిస్తారు.
ఆధునిక సాంకేతికత
వ్యక్తుల సంతకాలను యాంత్రికంగా "ముద్రించే" పరికరాలను ఆటోపెన్‌లు అంటారు. చాలా ఎక్కువ సంఖ్యలో సంతకాలు చేసే అవసరాలున్న ప్రముఖులు - ఉదా: సినీతారలు, సెలబ్రిటీలు, దేశాధినేతలు, కంపెనీ ప్రధానాధికారులు - ఇలాంటి పరికరాలను వాడుతారు. అమెరికాలో కాంగ్రెస్ ప్రతినిధులు తమ సంతకాలను ట్రూ టైప్ ఫాంటు (True Type Font)లుగా రూపొందించుకొంటున్నారు. అనేక పత్రాలలో సంతకాలను ముద్రించడానికి ఇది అనువుగా ఉంటుంది.
పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల ఇంత సాధారణమైన "సంతకం" అనే భావన కొన్ని భాషలకు చెందిన వ్యవహారాలలో చలామణి కావడంలేదు. అంటే ఒక డాక్యుమెంటుపై పేరు వ్రాయడం అంటే "వ్యక్తిగతమైన పూచీతో సంతకం పెట్టడం" అన్న విశేషమైన ప్రాధాన్యత వారు ఇవ్వరు. వారి పద్ధతిలో డాక్యుమెంటు క్రింద పేరు వ్రాయడం అంటే మిగిలిన వ్రాతలో ఒక భాగమే. చైనా భాష, జపాన్ భాష, కొరియా భాష ఈ కోవలోకి వస్తాయి. వారి పద్ధతిలో పేరుకు చెందిన ఒక ముద్ర (seal) వాడుతారు. జపాన్ భాషలో సంతకం సూచించడం కోసం మామూలు లిపికి బదులుగా tensho లిపి వాడుతారు.
ఎలక్ట్రానిక్ యుగంలో సంతకాన్ని సూచించడానికి క్రొత్త విధానాలు రూపు దిద్దుకొంటున్నాయి. ఇ-మెయిల్, చర్చ సమూహం వంట వాటిలో ఒక వ్యక్తి సంతకాన్ని సూచించడానికి ప్రత్యేకమైన క్యారెక్టర్లు, బొమ్మలు, పదాలు, మాటలు, వాక్యాలు వంటివి వాడడం జరుగుతున్నది. వీటిలో కొన్నింటిని ASCII art అని అంటారు. ఇవే కాకుండా క్రొత్త సాంకేతికతలో ఎలక్ట్రానిక్ సంతకాలు (electronic signatures), డిజిటల్ సంతకాలు (digital signatures) వాడుతున్నారు. ఇవి మామూలుగా కంటికి కనిపించవు.
ఇవి కూడా చూడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.