అక్షరాస్యత

From Wikipedia, the free encyclopedia

అక్షరాస్యత

అక్షరాస్యత అనగా చదవడం, ఏదైనా పద్ధతిలో వ్రాయడం అని పేరుపొందిన నిఘంటువులలో అర్ధం వలన ఏర్పడిన సాధారణ అవగాహన.[1][2][3] [4]

అందువలన నిరక్షరాస్యత అనగా చదవడం, వ్రాయడం తెలియకపోవడం అనే అర్ధం.[5][6][7]

కొందరు పరిశోధకుల ప్రకారం, 1950 కు ముందు అక్షరాస్యత అనగా అక్షరాలు పదాల గుర్తింపుగా భావించగా, ఆ తరువాత విస్తృతభావన (చదవడం, వ్రాయడం, వినడం, మాట్లాడడం నైపుణ్యాలు), పద్ధతిగా మార్పు చెందింది(వ్యవహార అక్షరాస్యత(functional literacy).[8] అక్షరాస్యత అనగా చదవడం, ఏదైనా పద్ధతిలో వ్రాయడం అని పేరుపొందిన నిఘంటువులలో అర్ధం వలన ఏర్పడిన సాధారణ అవగాహన.[1][2][3] [4]

Thumb
వయోజనుల అక్షరాస్యత గణాంకాలు 2015 లేక ఆ తరువాతవి[9]


యునెస్కో వారి నిర్వచనం

యునెస్కో వారి నిర్వచనం ప్రకారం "అక్షరాస్యత" అనేదానికి, గుర్తించడం (identify), అర్థం చేసుకోవడం (understand), పాల్గొనడం (interpret), సృష్టించడం (create), వార్తాలాపన (communicate), లెక్కించడం (compute), ముద్రించిన, వ్రాయబడిన అనేక విషయాలను గ్రహించే నైపుణ్యాలు కలిగివుండడం "అక్షరాస్యత".[10] అని నిర్వచించబడింది.

Thumb
యల్లాయపాళెం అనే గ్రామంలో గ్రంథాలయం లోపల అక్షరదీప కార్యక్రమం

అక్షరాస్యతా రేట్లు

ఈ క్రింది పట్టిక, భారతదేశం, పొరుగుదేశాలలోగల మధ్యవయస్కుల, యౌవనుల అక్షరాస్యతను సూచిస్తుంది. గణాంకాలు 2001లో తీయబడినవి.[11]

ఈ గణాంకాలు 2001 భారత జనాభా లెక్కలులలో భాగంగా లెక్కించిన గణాంకాలు.క్రింది చార్టు 2001 నాటి అక్షరాస్యతా రిపోర్టును సూచిస్తుంది.[12]

మరింత సమాచారం దేశం, మధ్యవయస్కుల అక్షరాస్యత ...
దేశం మధ్యవయస్కుల అక్షరాస్యత యౌవనుల అక్షరాస్యత
చైనా 90.9 98.9
భారతదేశం 61.3 73.3
నేపాల్ 44.0 62.7
పాకిస్తాన్ 41.5 53.9
శ్రీలంక 92.1 97.0
బంగ్లాదేశ్ 41.1 49.7
మూసివేయి

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.