ప్రపంచం లేదా బుగోళం From Wikipedia, the free encyclopedia
ప్రపంచము అని సాధారణంగా భూ గ్రహాన్ని గురించి వ్యవహరిస్తారు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ప్రపంచ చరిత్ర అంటే సాధారణంగా మానవ చరిత్రే. 30 లక్షల సంవత్సరాల పూర్వము భూమ్మీద మానవుని ఉద్భవముతో ఇది ప్రారంభమైనది. రాత నాలుగు వేర్వేరు ప్రాంతాలలో స్వతంత్రముగా 8,600 సంవత్సరాల క్రితము అభివృద్ధి చెందినది.
ఇటీవలి కాలములో, అనేక పెద్ద వ్యాపార సంస్థలు ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) వల్ల విశ్వవ్యాప్తము అవుతున్నాయి. ఇటువంటి ప్రమాణాలను కొందరు వ్యతిరేకిస్తుండటము వలన ఈ ప్రక్రియ చర్చనీయాంశము అయ్యింది.
2006 ఫిబ్రవరి 25 వ తేదీ అంచనా ప్రకారము ప్రపంచ జనాభా 6.5 బిలియన్లకు చేరినది. ఈ క్రింది పటము 2050 వరకు ప్రపంచ జనాభా పెరుగుదలను అంచనా వేస్తున్నది.
సంవత్సరము | జనాభా (బిలియన్లలో) |
---|---|
2006 | 6.5 |
2010 | 6.8 |
2020 | 7.6 |
2030 | 8.2 |
2040 | 8.7 |
2050 | 8.9 |
ఇదే గతిన జనాభా పెరిగితే మల్థూస్ కటొస్ట్రఫీ సంభవిస్తుందని చాలామంది భావిస్తున్నారు.
బుద్ధిజంలో, ప్రపంచ ఆశ్రమంలో నుండి వైవిధ్యంగా, సమాజం అంటే. ఇది భౌతిక ప్రపంచానికే సూచిస్తుంది,, అలాంటి సంపద, కీర్తి, ఉద్యోగాలు,, యుద్ధం వంటి ప్రాపంచిక పొందటానికి. ఆధ్యాత్మిక ప్రపంచములో ఆధ్యాత్మికపథంలో ఉంటుంది,, మార్పులు మేము మానసిక రాజ్యం కాల్ ఏలో కోరవచ్చు.
ప్రపంచ అధికార భాష అనేది ఏదీ Archived 2021-07-28 at the Wayback Machine లేనప్పటికీ, ఆంగ్లము, ఫ్రెంఛ్ భాషను అధిగమించి అందరూ సాధారణంగా ఉపయోగించే ప్రపంచ భాష అయినదని చాలా మంది యొక్క భావన. ఎలక్ట్రానిక్ మీడియాలో, రాయబార వ్యవహారాలలో కూడా అత్యంత తరచుగా ఆంగ్లమును ఉపయోగిస్తున్నారు. ఆంగ్లము, ఫ్రెంఛ్, స్పానిష్, అరబిక్, చైనీస్,, రష్యన్ భాషలు ఐక్యరాజ్యసమితి యొక్క అధికార భాషలు. వీటన్నిటినీ ప్రపంచ భాషలు అనవచ్చు. అయితే సోవియట్ సమాఖ్య పతనముతో రష్యన్ యొక్క ఉపయోగము చాలా వరకు తగ్గినది. కాబట్టి రష్యన్ భాష యొక్క ప్రపంచ భాషా స్థాయి సందేహాస్పదమే.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.