From Wikipedia, the free encyclopedia
తమిళ సినిమా లేదా కోలీవుడ్ కోడంబాకం కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలో ఒక భాగము. కోడంబాకం, హాలీవుడ్ పదాలను స్వీకరించి తమిళ సినిమా పరిశ్రమ కోలీవుడ్‌గా పిలువబడుతున్నది. దక్షిణభారతదేశంలో మొదటిసారిగా మూకీ కథా చిత్రం ‘కీచకవధ’ 1916 లో ఆర్.నటరాజ మొదలియార్ నిర్మించాడు.[1] భారతదేశంలో మొట్టమొదటి టాకీ ఆలం ఆరా విడుదలయిన ఏడు నెలలకే అంటే 1931 అక్టోబరు 31న మొట్టమొదటి తమిళ టాకీ (బహుభాషా చిత్రం) కాళిదాస్ విడుదయ్యింది.[2][3]
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
1939లో మద్రాస్ స్టేట్ వినోదపు పన్ను చట్టాన్ని అమలు చేసింది. చెన్నైను బాలీవుడ్ కు, దక్షిణ భారతీయ భాషా చిత్రాలకు, శ్రీలంక సినిమాకు రెండవ కేంద్రంగా మలచడంలో తమిళ సినిమా తన ప్రభావాన్ని చూపింది.[4][5] మలేసియా, సింగపూర్, పశ్చిమ దేశాలలోని తమిళప్రజల చలనచిత్ర నిర్మాణానికి తమిళ సినిమా పరిశ్రమ ప్రేరణగా నిలిచింది.[6]
2022 ఫిబ్రవరి 27న జరిగిన తమిళ చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికలలో దర్శకుడు ఆర్.కె.సెల్వమణి మరోమారు అధ్యక్షుడిగా విజయం సాధించారు.[7]తమిళ సినిమా హాస్యనటుడు మనోబాల 2023 మే 3న మరణించారు.
పురస్కారం ప్రదానం చేసిన సంవత్సరం | పేరు | బొమ్మ | వివరణ |
---|---|---|---|
1982 | ఎల్.వి.ప్రసాద్ | 1931లో విడుదలైన తొలి తమిళ టాకీ కాళిదాస్‌లో నటించాడు. 1965లో ప్రసాద్ స్టూడియోస్, 1976లో ప్రసాద్ కలర్ లాబొరేటరీస్ స్థాపించి 150కు పైగా సినిమాలను నిర్మించాడు. | |
1996 | శివాజీ గణేశన్ | 1953లో పరాశక్తి సినిమాతో వెండితెరపై తొలిసారిగా కనిపించి 300లకు పైగా సినిమాలలో నటించాడు. | |
2010 | కె.బాలచందర్ | నీర్కుమిళి సినిమాతో రంగప్రవేశం చేసిన దర్శకుడు. 100 సినిమాలను కవితాలయ బ్యానర్‌పై వివిధభాషలలో తీశాడు. |
సంవత్సరం | విభాగము | సినిమా | నిర్మాత | దర్శకుడు | నటుడు/నటి | బహుమతి |
---|---|---|---|---|---|---|
1990 | ఉత్తమ చలనచిత్రం | మరుపక్కం | నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ | కె.ఎస్.సేతుమాధవన్ | స్వర్ణ కమలం | |
2007 | ఉత్తమ చలనచిత్రం | కంచీవరం | పర్స్పెక్ట్ పిక్చర్ కంపెనీ | ప్రియదర్శన్ | స్వర్ణ కమలం | |
2014 | ఉత్తమ బాలల చిత్రం | కాకా ముత్తై | ధనుష్, వెట్రిమారన్ | ఎం.మణికందన్ | స్వర్ణ కమలం | |
1996 | ఉత్తమ దర్శకుడు | కాదై కొట్టై | అగతియాన్ | స్వర్ణ కమలం | ||
2001 | ఉత్తమ దర్శకుడు | ఊరుకు నూరుపెర్ | బి.లెనిన్ | స్వర్ణ కమలం | ||
2008 | ఉత్తమ దర్శకుడు | నాన్ కాడవుల్ | బాల | స్వర్ణ కమలం | ||
2010 | ఉత్తమ దర్శకుడు | ఆడుకలామ్ | వెట్రిమారన్ | స్వర్ణ కమలం | ||
1982 | దర్శకుని మొదటి సినిమాకు ఇందిరాగాంధి పురస్కారం | కణ్ శివందాల్ మన్ శివక్కుమ్ | ఆర్.వెంకట్రామన్ | శ్రీధర్రాజన్ | స్వర్ణ కమలం | |
1984 | దర్శకుని మొదటి సినిమాకు ఇందిరాగాంధి పురస్కారం | మీందమ్ ఒరు కాదల్ కథై | రాధిక | ప్రతాప్ పోతన్ | స్వర్ణ కమలం | |
1994 | దర్శకుని మొదటి సినిమాకు ఇందిరాగాంధి పురస్కారం | మొగముల్ | జె.ధర్మంబాళ్ | జ్ఞానరాజశేఖరన్ | స్వర్ణ కమలం | |
2011 | దర్శకుని మొదటి సినిమాకు ఇందిరాగాంధి పురస్కారం | అరణ్యకాండం | ఎస్.పి.బి.చరణ్ | త్యాగరాజన్ కుమారరాజా | స్వర్ణ కమలం | |
1986 | ఉత్తమ పాపులర్ సంపూర్ణ వినోదాత్మక సినిమా | సంసారం అధు మింసారం | ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ | విసు | స్వర్ణ కమలం | |
2000 | ఉత్తమ పాపులర్ సంపూర్ణ వినోదాత్మక సినిమా | వానథైప్పొలా | వేణు రవిచంద్రన్ | విక్రమన్ | స్వర్ణ కమలం | |
2004 | ఉత్తమ పాపులర్ సంపూర్ణ వినోదాత్మక సినిమా | ఆటోగాఫ్ | చరణ్ | చరణ్ | స్వర్ణ కమలం | |
2011 | ఉత్తమ పాపులర్ సంపూర్ణ వినోదాత్మక సినిమా | అళగర్ సామియిన్ కుదురై | పి.మదన్ | సుశీంద్రన్ | స్వర్ణ కమలం | |
2007 | ఉత్తమ ఏనిమేషన్ సినిమా | ఇనిమే నంగథాన్ | ఎస్.శ్రీదేవి | వెంకిబాబు | స్వర్ణ కమలం | |
1971 | ఉత్తమ నటుడు | రిక్షాకరన్ | ఎం.జి.రామచంద్రన్ | రజత కమలం | ||
1982 | ఉత్తమ నటుడు | మూండ్రం పిరై | కమల్ హసన్ | రజత కమలం | ||
1987 | ఉత్తమ నటుడు | నాయగన్ | కమల్ హసన్ | రజత కమలం | ||
1996 | ఉత్తమ నటుడు | ఇండియన్ | కమల్ హసన్ | రజత కమలం | ||
2003 | ఉత్తమ నటుడు | పితామగన్ | విక్రమ్ | రజత కమలం | ||
2007 | ఉత్తమ నటుడు | కంచీవరం | ప్రకాష్ రాజ్ | రజత కమలం | ||
2010 | ఉత్తమ నటుడు | ఆడుకలామ్ | ధనుష్ | రజత కమలం | ||
1976 | ఉత్తమ నటి | శిలా నేరంగలిల్ శిలా మణితారగళ్ | లక్ష్మి | రజత కమలం | ||
1979 | ఉత్తమ నటి | పాశి | శోభ | రజత కమలం | ||
1985 | ఉత్తమ నటి | సింధుభైరవి | సుహాసిని | రజత కమలం | ||
1987 | ఉత్తమ నటి | వీడు | అర్చన | రజత కమలం | ||
2006 | ఉత్తమ నటి | పరుత్తివీరన్ | ప్రియమణి | రజత కమలం | ||
2010 | ఉత్తమ నటి | తెన్ మెరుక్కు పరువకాట్రు | శరణ్య | రజత కమలం | ||
1994 | ఉత్తమ సహాయనటుడు | నమ్మవర్ | నగేష్ | రజత కమలం | ||
1997 | ఉత్తమ సహాయనటుడు | ఇరువర్ | ప్రకాష్ రాజ్ | రజత కమలం | ||
2002 | ఉత్తమ సహాయనటుడు | నాన్బా నాన్బా | చంద్రశేఖర్ | రజత కమలం | ||
2010 | ఉత్తమ సహాయనటుడు | మైనా | తంబి రామయ్య | రజత కమలం | ||
2011 | ఉత్తమ సహాయనటుడు | అళగర్ సామియిన్ కుదురై | అప్పుకుట్టి | రజత కమలం | ||
2014 | ఉత్తమ సహాయనటుడు | జిగర్ థండా | బాబీ సింహా | రజత కమలం | ||
2015 | ఉత్తమ సహాయనటుడు | విసరణై | చాముత్తిరకణి | రజత కమలం | ||
1982 | ఉత్తమ సహాయనటి | పుధే పాధై | మనోరమ | రజత కమలం | ||
1992 | ఉత్తమ సహాయనటి | దేవర్ మగన్ | రేవతి | రజత కమలం | ||
2010 | ఉత్తమ సహాయనటి | నమ్మగ్రామమ్ | సుకుమారి | రజత కమలం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.