సుకన్య (నటి)
From Wikipedia, the free encyclopedia
పురాణాలలో చెప్పబడిన చ్యవన మహర్షి భార్య గురించిన వ్యాసం కొరకు సుకన్య చూడండి.
సుకన్య (జ. జూలై 8, 1969) దక్షిణ భారత సినిమా నటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషలలో 80కి పైగా సినిమాలలో నటించింది. ఈమె నర్తకి, సంగీతకారిణి కూడా.
నేపధ్యము
సుకన్య తమిళ సినిమా నిర్మాత రమేష్ కూతురు.[1] ఈమె భారతీరాజా దర్శకత్వము వహించిన తమిళ చిత్రం పుదు నెల్లు పుదు నాథు సినిమా రంగప్రవేశము చేసింది. తమిళ సినీ రంగములో అగ్రశేణి నటులైన కమల్ హాసన్, సత్యరాజ్, విజయకాంత్ ల సరసన నటించింది.
సుకన్య కళాక్షేత్రలో స్కాలర్‌షిప్పుతో నాట్యం అభ్యసించి, ఆ తరువాత ప్రముఖ నర్తకి చంద్రలేఖ నాట్యబృందముతో పాటు అనేక నృత్యోత్సవాల్లో పాల్గొన్నది. 1987 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొనటానికి రష్యా వెళ్లిన బృందములో అతి పిన్న వయస్కురాలు సుకన్య. ఈమె రష్యాలో క్రెమ్లిన్ స్క్వేర్లో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, మిఖాయిల్ గోర్బచేవ్ ల ముందు నాట్య ప్రదర్శన ఇచ్చింది.[2]
వ్యక్తిగత జీవితము
2002 మార్చి 18 న అమెరికాకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అయిన శ్రీధర్ ని పెళ్ళి చేసుకొని అమెరికాలో స్థిరపడింది.[3] అయితే సంవత్సరం తిరిగేలోపే ఈ పెళ్ళి అభిప్రాయ భేదాలవల్ల విడాకులకు దారితీసింది[4][5].
పునరాగమనము
భారతదేశం తిరిగి వచ్చిన సుకన్య అనేక నాట్యప్రదర్శనలు ఇచ్చింది. జయా టీవీలో శాస్త్రీయ నృత్యం ఆధారితమైన తకదిమిథ గేమ్‌షోకు యాంకరుగా పనిచేసింది,[6] కొన్ని సీరియల్లలో నటించింది. ఇటీవల తను స్వయంగా సంగీతము సమకూర్చి, గీతరచన చేసిన ప్రైవేటు ఆల్బం అయగు విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. అయగులో పాటలను ప్రముఖ సినీ గాయకులు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, జానకి, శ్రీనివాస్, నిత్యశ్రీలు పాడారు. తనకు సంగీతములో గురువెవ్వరూ లేరని. స్వతహాగా నేర్చుకున్నానని. అవకాశమొస్తే సినిమాలకు కూడా సంగీతం కూర్చడానికి సిద్ధమేనని చెప్పింది[2].
నటించిన చిత్రాలు
తెలుగు
సంవత్సరం | చిత్రం | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2015 | శ్రీమంతుడు (2015 సినిమా) | ||
2012 | అధినాయకుడు | ||
1996 | నేటి సావిత్రి | ||
1994 | కెప్టెన్ | ||
1993 | అమ్మకొడుకు | ||
1992 | పెద్దరికం |
తమిళము
మలయాళం
సంవత్సరం | చిత్రం | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1992 | అపారథ | సూర్య | |
1994 | సాగరం సాక్షి | నిర్మల | |
1996 | తూవల్ కొట్టరమ్ | సుజాత | |
1996 | కానాక్కినావు | ||
1997 | చంద్రలేఖ | చంద్ర | |
1998 | రక్తసాక్షికల్ సిందాబాద్ | శివకామి అమ్మాళ్ | |
1998 | మంజుకలవుం కఝింఝు | శోభ | |
1998 | అమ్మ అమ్మాయియమ్మ | ప్రభావతి | |
1999 | స్వస్తం గృహాభరిణం | అశ్వతి | |
1999 | ప్రేం పూజారి | నిజ జీవిత పాత్ర | అతిధిపాత్ర |
2000 | వినయపూర్వ విద్యాధరణ్ | శాలిని | |
2004 | కన్నియుం కనదిక్కుమ్ | నిజ జీవిత పాత్ర | అతిధిపాత్ర |
2005 | ఉదయోన్ | సుసియోమాల్ | |
2006 | నోట్బుక్ | శ్రీదేవి తల్లి | |
2008 | ఇన్నతె చింత విషయం | త్రీస | |
2012 | లాస్ట్ బెంచ్ | రోసిలి | |
2013 | మాణిక్య తంబురత్తియుం క్రిస్మస్ సరోలియం | సవతి తల్లి | |
2014 | మై లైఫ్ పార్టనర్ | డాక్టర్ లీలా అయ్యర్ | |
2014 | ఆమయుం ముయలుమ్ | బంధారవతి |
కన్నడ
సంవత్సరం | చిత్రం | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1992 | గురుబ్రహ్మ | ఉమ, సుమ | (ద్విపాత్రాభినయము) |
2013 | చంద్ర | రాణీ సరళాదేవి |
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.