2015 సినిమా From Wikipedia, the free encyclopedia
శ్రీమంతుడు కొరటాల శివ దర్శకత్వంలో 2015 ఆగస్టు 7న విడుదలైన తెలుగు సినిమా. ఇందులో మహేష్ బాబు, శృతి హాసన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వై. నవీన్, వై. రవిశంకర్, సి. వి. మోహన్ లు మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై, ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్ళు రాబట్టింది. ఈ సినిమా పలు విభాగాల్లో సైమా పురస్కారాలు దక్కించుకుంది.
శ్రీమంతుడు | |
---|---|
దర్శకత్వం | కొరటాల శివ |
రచన | కొరటాల శివ |
నిర్మాత | వై. నవీన్ వై. రవిశంకర్ సి. వి. మోహన్ ఘట్టమనేని మహేశ్ బాబు |
తారాగణం | ఘట్టమనేని మహేశ్ బాబు శృతి హాసన్ |
ఛాయాగ్రహణం | ఆర్. మధి |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థలు | |
పంపిణీదార్లు | ఈరోస్ ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | 7 ఆగస్టు 2015 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹400—700 million[lower-alpha 1] |
పల్లెమీద కోపంతో పట్టణానికి వలసొచ్చి ఆగర్భ శ్రీమంతుడిగా ఎదిగిన తండ్రి. పల్లెలో తన మూలాలు వెతుక్కునేందుకు పట్టణం వదిలిపెట్టిన కొడుకు. ఈ రెండు జీవితాల మధ్య సామాజిక లింకు -ఊరు దత్తత.
హర్షవర్ధన్ (మహేష్ బాబు) తండ్రి రవి ( జగపతి బాబు) బిజినెస్ టైకూన్. రవి కి వ్యాపారమే ముఖ్యం. హర్ష కు ఈ వ్యాపార దుగ్ధ ఉండదు. తండ్రి వ్యాపార బాధ్యతలు చూసుకొమ్మంటే వాయిదా వేస్తాడు. స్నేహితుని కూతుర్ని పెళ్లి చేసుకోమంటే తిరస్కరిస్తాడు. ఆఫీస్ లో ఉద్యోగి కుమార్తె పెళ్లి కి లక్షలకొద్దీ ధన సహాయం చేస్తాడు. ఉత్తరాంధ్ర లోని దేవరపల్లి నుండి సిటీ కి వచ్చి రూరల్ డెవలప్ మెంట్ కోర్సు చదువుతూఉంటుంది చారుశీల. చారుశీలను చూసి ప్రేమలో పడతాడు. ఆమె తో పరిచయం ప్రేమ గా మారే సమయానికి హర్ష, రవికాంత్ కొడుకని తెలిసి అతని ప్రేమను చారు తిరస్కరిస్తుంది. నీ తండ్రి ఊరు దేవరపల్లిని పట్టించుకోలేదు, అందుకే నీకూ, నాకూ కుదరదని చెప్తుంది. దాంతో పల్లె మూలాలు వెతుక్కోవడానికి బయలుదేరుతాడు హర్షవర్ధన్. ఆ వూరి లో MP తమ్ముడు శశి అరాచకాలు చేస్తూవుంటాడు. హర్ష ఊరిని బాగుచేస్తాడు. చారు మనసు గెలుచుకొంటాడు. అతని మీద హత్యాప్రయత్నం జరుగుతుంది. అయినా సరే తండ్రి అనుమతి తీసుకుని ఊరికి తిరిగి వచ్చి MPని, శశిని అంతం చేసి ఊరికి పట్టిన పీడను వదిలిస్తాడు.
ఈ చిత్ర కథ విషయంలో వివాదం ఎదుర్కొన్నారు. శరత్ చంద్ర అనే రచయిత తాను స్వాతి వారపత్రికలో రాసిన కథను కాపీకొట్టి దర్శకుడు కొరటాల శివ కథను తయారు చేశాడని ఆరోపించాడు. మొదటగా శరత్ చంద్ర హైదరాబాదులోని నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ఆ కేసును విచారించిన కోర్టు కొరటాల శివపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని తీర్పునిచ్చింది. తర్వాత నాంపల్లి కోర్టు తీర్పును సవాలు చేస్తూ కొరటాల శివ తెలంగాణా హైకోర్టుకు తీసుకువెళ్ళారు. అక్కడా ఈ కేసు విచారణలో భాగంగా శరత్ చంద్ర కథను కాపీ కొట్టారు అనేందుకు పలు ఆధారాలు సమర్పించాడు. అవి నిజమైనవేనని నిర్ధారించిన హైకోర్టు రచయితల సంఘం ఇచ్చిన నివేదికను కూడా పరిగణనలోకి తీసుకుని నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. తర్వాత కొరటాల ఈ కేసును సుప్రీం కోర్టుకు తీసుకెళ్ళాడు. అక్కడ కూడా ఆయనకు పరాభవం ఎదురైంది.[3]
2015 సైమా అవార్డులు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.