రేవతి (నటి)
From Wikipedia, the free encyclopedia
రేవతి (జ. జులై 8, 1966) ఒక భారతీయ చలనచిత్ర నటి, దర్శకురాలు. ఈమె అసలు పేరు ఆశ. రేవతి మలయాళ సినిమా, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది.[5] మూడు వేర్వేరు విభాగాలలో జాతీయ చలనచిత్ర పురస్కారాలు, దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు గెలుచుకుంది.[6] రేవతి శిక్షణ పొందిన భరతనాట్యం నర్తకి. ఏడు సంవత్సరాల వయస్సు నుండి నాట్యం నేర్చుకుని 1979 సం.లో చెన్నైలో ఆమె ఆరంగేట్రం నాట్యం ప్రదర్శన ఇచ్చింది.[7]
రేవతి | |
---|---|
![]() | |
జననం | ఆశ 8 జూలై 1966 [1] కొచ్చి, కేరళ, భారతదేశం |
వృత్తి | నటి,దర్శకురాలు, సామాజిక కార్యకర్త |
క్రియాశీల సంవత్సరాలు | 1983 – ప్రస్తుతం |
గుర్తించదగిన సేవలు | రావుగారిల్లు, అంకురం, గాయం |
జీవిత భాగస్వామి | సురేష్ చంద్ర మేనన్ (m.1986–2002) (2013లో విడాకులు)[2][3] |
బంధువులు | నిరంజనా అనూప్(మేనకోడలు)[4] |
పురస్కారాలు | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు , ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు(దక్షిణ) |
సినిమాలకే కాకుండా, రేవతి అనేక రకాల సామాజిక సంస్థలలో పాల్గొంది. ఇందులో అత్యంత ముఖ్యమైనది బన్యన్, ఎబిలిటీ ఫౌండేషన్, ట్యాంకర్ ఫౌండేషన్, విద్యాసాగర్, చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, భారతదేశ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వంటి అనేక చిత్రోత్సవాలలో సభ్యురాలిగా కూడా పనిచేసింది.[8]
జననం
రేవతి కొచ్చిలో ఆశా కేలుని నాయర్ అనే పేరుతో కల్లిక్కాడ్, పాలక్కాడ్ ప్రాంతాలకు చెందిన, భారతీయ సైన్యంలో ఒక ప్రధాన వ్యక్తి అయిన కేలుని నాయర్, లలితే కేలున్ని దంపతులకు జనించింది. మలయాళ నటి గీతా విజయన్ ఈమె బంధువు.[9]
వ్యక్తిగత జీవితం
రేవతి 1986 సం.లో సినిమాటోగ్రాఫర్, దర్శకుడు సురేష్ చంద్ర మీనన్‌ను వివాహం చేసుకున్నది. ఈ జంటకు పిల్లలు లేరు. అయితే వీరి మధ్య వచ్చిన కుటుంబ మానసిక తేడాలు తరువాత, వీరు 2002 సం.నుండి విడిగా జీవిస్తూ,[10] 2013 ఏప్రిల్ 23 సం.న చెన్నై అదనపు కుటుంబ న్యాయస్థానం కోర్టు వీరికి విడాకులు మంజూరు చేశారు.[11]
నట జీవితం
ఆమె చాలా తక్కువ సంఖ్యలో వివిధ భాషా సినిమాలలో నటించింది.
డబ్బింగ్ కళాకారిణి
- 1995-పాంపన్ (శరణ్య పొన్వన్నన్ కోసం) - తమిళ సినిమా
- 1995 -అసాయి (సువాల్లక్ష్మి కోసం) - తమిళ సినిమా
- 1996-దేవరాగం (శ్రీదేవి కోసం) - మలయాళం సినిమా
- 1997 -మిన్సార కనవు (కజోల్ కోసం) - తమిళ సినిమా
- 1999-మేఘం (పూజా బత్రా కోసం) - మలయాళం మూవీ
- 2000 - కందుకొండైన్ కందుకొండైన్ (టబు కోసం) - తమిళ సినిమా
2001 -వేదం (దివ్య యునీ కోసం) - తమిళ సినిమా 2005 -చంద్రోల్సవం (కుష్బూ కోసం) - మలయాళం సినిమా 2018 పుణ్యకోటి (ఆవు కోసం) - సంస్కృతం సినిమా
దర్శకురాలు
- 2002 మిట్ర్ మై ఫ్రెండ్ : ఆంగ్లంలో ఉత్తమ చలన చిత్రంగా ఆంగ్ల జాతీయ చలన చిత్ర పురస్కారం
- 2004 ఫిర్ మిలేంగే : హిందీ
- 2009 కేరళ కేఫ్ : మలయాళం - "మకల్" విభాగం
- 2010 ముంబై కటింగ్ : హిందీ - "పార్శిల్" విభాగం
- 2022 సలామ్ వెంకీ: హిందీ
వెబ్ సిరీస్
రేవతి నటించిన తెలుగు చిత్రాలు
సంవత్సరం | చిత్రం | పాత్ర | వివరాలు |
---|---|---|---|
1984 | మానసవీణ | వీణ | |
1984 | సీతమ్మ పెళ్ళి | సీతమ్మ | |
1986 | డాన్స్ మాస్టర్ | ||
1988 | రావుగారిల్లు | చంటి | |
1989 | పగలే వెన్నెల | ||
1989 | ప్రేమ | మాగీ | |
1989 | లంకేశ్వరుడు | స్వప్న | |
1990 | అంజలి | చిత్ర | తెలుగు డబ్బింగ్ సినిమా. |
1991 | మృగతృష్ణ | ||
1992 | అంకురం | సింధూర | ఫిలింఫేర్ పురస్కారం |
1992 | క్షత్రియ పుత్రుడు | జాతీయ చలనచిత్ర ఉత్తమ సహాయనటి పురస్కారం | |
1993 | గాయం | అనిత | |
1994 | ఆడవాళ్ళకు మాత్రమే | ||
1998 | గణేష్ | రంగమ్మ | |
2002 | ఈశ్వర్ | సుజాత | |
2003 | జానకి వెడ్స్ శ్రీరామ్ | ||
2004 | ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి | ||
2010 | గాయం-2 | అనిత | |
2014 | అనుక్షణం | శైలజ | |
2015 | లోఫర్ | లక్ష్మీ | నామినేటెడ్—ఫిలింఫేర్ పురస్కారం ఉత్తమ సహాయనటి పురస్కారం |
2016 | బ్రహ్మోత్సవం | అజయ్ కు తల్లి | |
2017 | యుద్ధం శరణం | సీతాలక్ష్మీ | |
2021 | ఇట్లు అమ్మ |
కన్నడం
కన్నడంలో ఈ క్రింద సూచించిన రెండు చిత్రాలలో నటించింది. సంవత్సరం : చిత్రం : పాత్ర : వివరాలు
- 1989 : ఇడు సౌడియా : ఇందూ
- 1998 : నిశ్శబ్ద : డాక్టర్ వినీత
మళయాళం
- 1983 కట్టతే కిలికోడు
- 1985 ఎంటే కానకుక్కాయిల్
- 1987 ఆంకలియుడ్ తారట్టు
- 1988 కాక్కోటికవిలే అపోప్పన్ తడిగల్
- 1988 పురావృతం
- 1988 మూన్నం ముర
- 1989 వరవేల్పు
- 1989 నజాంగాలూడ్ కోచు
- 1990 ఒట్టాయాడిపాతకల్
- 1991 కిలుక్కం
- 1992 అద్వైతం
- 1993 దేవాసురం
- 1993 మాయ మయూరం
- 1994 పాథేయం
- 1995 అగ్నీ దేవన్
- 1997 మంగమ్మ
- 2001 రావణప్రభు
- 2002 నందనం
- 2002 కైయంతు దూరత్
- 2002 కృష్ణ పక్షక్కిలికల్
- 2003 గ్రామఫోన్
- 2003 మిజ్హి రండిలిమ్
- 2005 ఆనందభద్రం
- 2009 నమ్మాళ్ తమ్మిళ్
- 2010 పాట్టీంటే పాలజీ
- 2010 పెన్‌పట్టణం
- 2011 ఇండియన్ రుపీ
- 2012 ఫాదర్స్ డే
- 2012 మోలీ ఆంటీ రాక్స్!
- 2018 కినార్
పురస్కారాలు
- విజయాలు
- నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్
- 1992 - తేవార్ మగన్‌కు ఉత్తమ సహాయ నటి
- 2002 - మిథర్ మై ఫ్రెండ్ కొరకు ఇంగ్లీష్‌లో ఉత్తమ చలన చిత్రం
- 2011 - కుటుంబ సంక్షేమంపై ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ - రెడ్ బిల్డింగ్ వేర్ ది సన్ సెట్స్
- తమిళనాడు రాష్ట్ర ఫిలిం అవార్డులు
- 1990 - కిజ్హక్కు వాసల్ సినిమాకు ఉత్తమ నటి
- 1998 - తలైజురై సినిమాకు ఉత్తమ నటిగా ప్రత్యేక బహుమతి
- 2 వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్
- 2012 - ప్రతిపాదన - మోలీ ఆంటీ రాక్స్! సినిమా కొరకు ఉత్తమ నటి
- 1983 - మాన్ వాసనై సినిమాకి ప్రత్యేక అవార్డు
- 1988 - కాక్కోత్తిక్కవిలే అపోప్పన్ తాడికల్ సినిమాకు ఉత్తమ మలయాళ నటి
- 1992 - అంకురం సినిమాకు ఉత్తమ తెలుగు నటి
- 1992 - తేవార్ మగన్ సినిమాకు ఉత్తమ తమిళ నటి
- 1993 - మారుప్పాడియం సినిమా కొరకు ఉత్తమ తమిళ నటి
- 1994 - ప్రియాంక సినిమా కోసం ఉత్తమ తమిళ నటి
- సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులు
- 1984 - సీతమ్మ పెళ్ళి సినిమాకి ఉత్తమ తెలుగు నటి
- 1990 - కిజ్హక్కు వాసల్ సినిమాకి బెస్ట్ తమిళ నటి
- 1991 - కిలుక్కం సినిమా కోసం ఉత్తమ మలయాళ నటి
- 1991 - తేవార్ మగన్ సినిమాకు ఉత్తమ తమిళ నటి
- 1994 - ఎన్ ఆసాయ్ మచన్ సినిమాకు స్పెషల్ బెస్ట్ తమిళ నటి
- ఫిల్మ్ ఫాన్స్ (అభిమానుల) అసోసియేట్ అవార్డులు
- 1983 - కట్టాతే కిలిక్కూడు సినిమాకు ఉత్తమ మలయాళ నటి
- 1984 - పుధుమ పెన్న్ సినిమాకి బెస్ట్ తమిళ నటి
- 1984 - మానస వీణా సినిమా కోసం ఉత్తమ తెలుగు నటి
- 1986 - ప్రత్యేక ప్రశంసలు
- 1990 - అంజలి సినిమాకి ఉత్తమ తమిళ నటి
- 1991 - కిలుక్కం సినిమా కోసం ఉత్తమ మలయాళ నటి
- 1992 - తేవార్ మగన్ సినిమాకి ఉత్తమ తమిళ నటి
- 1994 - ప్రియాంక సినిమా కోసం ఉత్తమ తమిళ నటి
- మైలపూర్ అకాడమీ బెర్క్లీ డ్రామా అవార్డు
- 1989 - ఇరవిల్ ఒరు పాగల్ సినిమా కోసం టెలివిజన్‌లో ఉత్తమ నటి
- 1984 - పెన్న్ సినిమా కోసం టెలివిజన్‌లో ఉత్తమ నటి
- 33 వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా
- 2002 - మిట్ర్ మై ఫ్రెండ్ సినిమాకి కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సిల్వర్ పీకాక్ జ్యూరీ అవార్డు
- 2009 - కేరళ కేఫ్ సినిమా కోసం ఉత్తమ మలయాళ చిత్రం - నెట్‌ప్యాక్ (NETPAC) అవార్డు
- ఇతర అవార్డులు
- 1993 - తమిళనాడు ఇయాల్ ఇయిల్ నాటక మాన్రం: కలైమామణి
- 2007 - కర్మవీర్ పురస్కార్: సిఎంఎస్ (CMS) మీడియా సిటిజెన్
- నామినేషన్లు
- స్క్రీన్ అవార్డులు
- 2004 - ధూప్ సినిమా కొరకు ఉత్తమ సహాయ నటి
- జీ సినీ అవార్డులు
- 2004 - ధూప్ సినిమాకి ఉత్తమ సహాయ నటి
ఇవి కూడ చూడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.