From Wikipedia, the free encyclopedia
లోఫర్ అనే సినిమా 2015 డిసెంబరు 17 లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్, దిశా పటాని, రేవతి, పోసాని, తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.[1][2][3] ఈ చిత్రం 2015 డిసెంబరు 17న ప్రపంచవ్యాప్తంగా 750 కి పైగా స్క్రీన్లలో విడుదలైంది. విమర్శకుల నుండి బాగాలేదనే సమీక్షలు వచ్చాయి. ఇది తరువాత లోఫర్ ది హీరో పేరుతో హిందీ లోకి అనువదించారు. తరువాత దీనిని తమిళంలోకీ అనువదించారు.
లోఫర్ (సినిమా) | |
---|---|
![]() | |
దర్శకత్వం | పూరి జగన్నాధ్ |
రచన | పూరి జగన్నాధ్ |
నిర్మాత | సి.కళ్యాణ్ |
తారాగణం | వరుణ్ తేజ్ దిశా పటాని |
ఛాయాగ్రహణం | పి.జి. వింద |
కూర్పు | ఎస్.ఆర్.శేఖర్ |
సంగీతం | సునీల్ కష్యప్ |
విడుదల తేదీ | 17 డిసెంబరు 2015 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 25కోట్లు |
బాక్సాఫీసు | 30కోట్లు |
మురళి ( పోసాని కృష్ణ మురళి ), అతని భార్య లక్ష్మీ దేవి ( రేవతి ) లు రాజా ( వరుణ్ తేజ్ ) తల్లిదండ్రులు. మురళి, తన అత్తమామల నుండి డబ్బు డిమాండు చేస్తూంటాడు. దీనివల్ల లక్ష్మీదేవి అతని నుండి విడిపోతుంది. మురళి భార్యకు తెలియకుండా తమ కుమారుడు రాజాను దొంగిలించి జోధ్పూరుకు తీసుకు వెళతాడు, అక్కడ వారు చిన్నాచితకా దొంగతనాలు చేస్తూ నివసిస్తూంటారు. తనకిష్టం లేని పెళ్ళి నుండి తప్పించుకుని పారిజాతం ( దిషా పటాని ) అనే అమ్మాయి జోధ్‌పూర్ చేరుకుంటుంది. రాజా, పారిజాతాలు ప్రేమలో పడతారు.[4]
ఐదు పాటలతో కూడిన అధికారిక సౌండ్‌ట్రాక్‌ను సునీల్ కశ్యప్ స్వరపరిచారు. ప్రభాస్ ముఖ్య అతిథిగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది.
క్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "నొక్కేయ్ దోచేయ్" | సునీల్ కశ్యప్, స్ఫూర్తి | |
2. | "నువ్వేడుస్తుంటే" | యజీన్ నాజర్ | |
3. | "దియా జలే" | యజీన్ నాజర్, ప్రణవి | |
4. | "సువ్వీ సువ్వాలమ్మా" | కారుణ్య | |
5. | "చుట్టా బీడీ" | రాహుల్, శ్రావణ భార్గవి |
Seamless Wikipedia browsing. On steroids.