సినీ నటుడు From Wikipedia, the free encyclopedia
వరుణ్ తేజ్ భారతీయ సినిమా నటుడు. ఇతను నటుడు, నిర్మాత నాగేంద్రబాబు, పద్మజల కుమారుడు.[1][2] ఆయన పెదనాన్న సినిమా నటులు, రాజకీయ నాయకులైన చిరంజీవి, చిన్నాన్న పవన్ కళ్యాణ్ లు. తేజ్ టాలీవుడ్ లో పొడవైన వ్యక్తులలో ఒకరు. ఆయన ఎత్తు సుమారు 6 అడుగుల 4 అంగుళాలు ఉంటుంది.[3] ముకుంద, "కంచె", లోఫర్, మిస్టర్, ఫిదా, అంతరిక్షం, ఎఫ్ 2 మొదలైనవి వరుణ్ నటించిన సినిమాలు.[4][5][6]
వరుణ్ తేజ్ కొణిదెల | |
---|---|
జననం | |
వృత్తి | సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2014-ప్రస్తుతం |
ఎత్తు | 6.4 అడుగులు |
తల్లిదండ్రులు | నాగేంద్రబాబు పద్మజ |
బంధువులు | చిరంజీవి (పెదనాన్న) పవన్ కళ్యాణ్ (బాబాయి) నీహారిక కొణిదెల(సోదరి) |
సంవత్సరం | శీర్షిక | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
2000 | హేండ్సప్ | వరుణ్ | బాల నటుడు | |
2014 | ముకుంద | ముకుంద | ప్రధాన పాత్రలో అరంగేట్రం | |
2015 | కంచె | ధూపాటి హరిబాబు | ||
లోఫర్ | రాజా మురళి | |||
2017 | మిస్టర్ | పిచ్చయ్య నాయుడు / చై | ||
ఫిదా | వరుణ్ | |||
2018 | తొలి ప్రేమ | ఆదిత్య శేఖర్ | ||
అంతరిక్షం 9000 KMPH | దేవ్ | |||
నాన్నా కూచి | వ్యాఖ్యాత; ZEE5 లో వెబ్ సిరీస్ | |||
2019 | F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ | వరుణ్ యాదవ్ | ||
అల్లాదీన్ | అల్లాదీన్ (గాత్రం) | తెలుగు డబ్బింగ్ వెర్షన్ | [7] | |
గద్దలకొండ గణేష్ | గద్దలకొండ "గని" గణేష్ | |||
2022 | ఘని | ఘని | [8] | |
F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ | వరుణ్ యాదవ్ | [9] | ||
2023 | గాండీవదారి అర్జున | [10] | ||
2024 | ఆపరేషన్ వాలెంటైన్ | అర్జున్ దేవ్ అలియాస్ "రుద్ర" | హిందీలోనూ తీశారు | |
మట్కా | వాసు | చిత్రీకరణ | [11] |
వరుణ్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం 2023 జూన్ 09న హైదరాబాద్ లోని నాగబాబు ఇంట్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది.[12][13] వరుణ్‌తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం నవంబర్ 01న ఇటలీ సియెనాలోని బోర్గోశాన్ ఫెలిసీ రిసార్ట్ లో జరిగింది.[14][15]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.