Remove ads
From Wikipedia, the free encyclopedia
డబ్బింగ్ (Dub, Dubbing, Voice over) అనగా ఒక భాషలో తయారైన సినిమాని మరో భాషలోని మాటలు, పాటలు మాత్రమే మార్చి విడుదల చేయడం, దీనికి మాతృక భాషా చిత్రానికి చెందిన నిర్మాత నుండి హక్కులు కొనుగోలు చేస్తారు. "డబ్బింగ్ సినిమా అనేది నిర్జీవ దేహం లాంటిది. దానికి ప్రాణం పోసేది రచయితలే" అని శ్రీ శ్రీ నిర్వచించారు.
తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా ఆహుతి (1950). దానికి మాటలు, పాటలు శ్రీ శ్రీ రాసాడు. "నీరా ఔర్ నందా" అనే హిందీ సినిమాను ఆహుతి పేరుతో తెలుగులోకి అనువదించారు. దీని నిర్మాత జయభేరితో ప్రఖ్యాతుడైన నారాయణరావు. మాధవపెద్ది, చదలవాడ, వల్లం, కనకం తదితరులు ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. తారలందరూ హిందీ వారే, చిత్రం అంతా ఔట్ డోర్ లో తీయడం దీని ప్రత్యేకత, పడవ వాళ్ళ కథ. తెలుగు డబ్బింగ్ కు సాలూరు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు..
డబ్బింగ్ తొలిరోజుల్లో మూలంలో ఉన్నదాన్ని ఉన్నదున్నట్లుగా తెలుగులోకి అనువదించేవారు. వారికి అర్ధమే ముఖ్యం లిప్ సింక్ ఎలా ఉన్నా పట్టించుకునేవారు కాదు. ప్రస్తుత కాలంలో లిప్ సింక్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అవసరమైతే మూలంలోని థాట్ ని అధిగమించి తెలుగు తనాన్ని జొప్పిస్తున్నారు. మూలంలో ప్లెయిన్ గా ఉన్న డైలాగ్ ని తెలుగువాళ్ళకు ఇష్టమైన పురాణాలలోని సామ్యాన్ని చూపిస్తూ మార్చడం జరుగుతుంది. అంతేకాక మూలంలో ఏదైనా యాస వాడితే తెలుగులో మన ప్రాంతీయ మాండలికాలు (రాయలసీమ, తెలంగాణ, గోదావరి మొదలైనవి) వాడుతున్నారు.
డబ్బింగ్ లో ఒక్కో రచయితది ఒక్కో పద్ధతి. శ్రీ శ్రీ మాతృకను అనుసరించి మక్కీకి మక్కీగా అనువదించేవారు. ఆరుద్ర లిప్ సింక్ కంటే కూడా అందమైన తెలుగు జొప్పించేందుకు ఆరాటపడేవారు. అనిసెట్టికి లిప్ సింక్ ముఖ్యం. రాజశ్రీది శ్రీశ్రీ పద్ధతే కానీ ఆయనలాగా పాటలు, మాటలు రెండు చేతులతో రాసేవారు డబ్బింగ్ రంగంలో అరుదు.
డబ్బింగ్ సినిమా గౌరవార్హత పొందడం వెనుక ఎందరో రచయితల కృషి దాగివుంది. శ్రీ శ్రీ తరువాత ఆరుద్ర, ఆత్రేయ, అనిసెట్టి, మహారధి, రాజశ్రీ, గోపిమ్ బైరాగి పాప, డి.వి. నరసరాజు, మాగాపు అమ్మిరాజు, గణేశ్ పాత్రో, గురుచరణ్, వెన్నెలకంటి, శ్రీ రామకృష్ణ, సూర్యదేవర, కోల వెంకట్, గబ్బిట వెంకట్రావు వంటి ఎందరో రచయితలు డబ్బింగ్ రంగాన్ని సుసంపన్నం చేశారు.
కొందరు కళాకారులు గాత్ర దానాన్ని అందించినవారైతే, కొందరు పాటలు పాడి చిత్రాన్ని సంగీతభరితంగా తయారుచేస్తారు, ఈ రెండవ వారిని నేపథ్య గాయకులు అంటారు. తొలి తరపు గాత్ర దాతలలో కాటూరి, అన్నపూర్ణ, టి.జి.కమలాదేవి, పార్వతి, ప్రమీల, తిలకం, కె.ఉదయలక్ష్మి, వీరమాచనేని సరోజిని, జగ్గయ్య, కె.విఎస్.శర్మ, చుండ్రు సూర్యనారాయణ, అల్లు రామలింగయ్య, ఎ.వి.సుబ్బారావు, మోదుకూరి సత్యం, రామకోటి, దశరథరామిరెడ్డి వంటి వారు ప్రముఖులు. తర్వాతి కాలంలో సాయి కుమార్, రత్నకుమార్, శ్రీనివాస మూర్తి, పి.జె.శర్మ, రవిశంకర్, రవీంద్రనాథ్, భీమేశ్వరరావు, కాకరాల, ఈశ్వరరావు, సాయికిశోర్, ఉమామహేశ్వరరెడ్డి, ప్రవీణ్, మిమిక్రీ నాగేశ్వరరావు వంటి వారు ప్రసిద్ధులు. ఇక సరిత, రోజారమణి, రోహిణి, తులసి, దుర్గ, లక్ష్మి, గౌరీప్రియ వంటివారు స్త్రీ పాత్రలకు డబ్బింగ్ చెప్పడంలో పేరుపొందారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.