ప్రముఖ సినీ నటుడు, నిర్మాత From Wikipedia, the free encyclopedia
అక్కినేని నాగార్జున (ఆగష్టు 29, 1959న చెన్నైలో జన్మించిన) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు. నాగార్జున సుమారు 100 పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు సినిమాలు కాగా కొన్ని తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాగార్జున నటుడిగా, నిర్మాతగా కలిపి తొమ్మిది నంది పురస్కారాలు, మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నాడు.
అక్కినేని నాగార్జున | |
---|---|
![]() అక్కినేని నాగార్జున | |
జననం | అక్కినేని నాగార్జున రావు ఆగస్టు 29, 1959 |
ఇతర పేర్లు | నాగ్, యువసామ్రాట్ King |
విద్యాసంస్థ | అన్నా విశ్వవిద్యాలయం |
వృత్తి | నటుడు, సినీ నిర్మాత, |
క్రియాశీల సంవత్సరాలు | 1986–ప్రస్తుతం |
గుర్తించదగిన సేవలు | శివ (1989), అన్నమయ్య (1997), శ్రీరామదాసు (2006) |
జీవిత భాగస్వామి | లక్ష్మీ రామానాయుడు దగ్గుపాటి (1984–1990 divorced) అమల అక్కినేని (1992–present) |
పిల్లలు | అక్కినేని నాగచైతన్య అక్కినేని అఖిల్ |
తల్లిదండ్రులు | అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని అన్నపూర్ణ |
1989 లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి సినిమా అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. 1990 లో రాం గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా 13 వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. అదే సంవత్సరంలోనే శివ సినిమా హిందీ పునర్నిర్మాణంతో బాలీవుడ్ లోకి ప్రవేశించాడు. నాగార్జున పలు జీవిత చరిత్ర ఆధారిత సినిమాల్లో నటించాడు. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీ సాయి, హథీరాం బావాజీ మొదలైన వారి జీవిత చరిత్ర సినిమాల్లో నటించాడు. 1995 నుంచి ఈయన సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. అన్నపూర్ణా స్టూడియోస్ అనే సినీ నిర్మాణ సంస్థకు అధినేత. హైదరాబాదులో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అనే లాభాపేక్షలేని సంస్థను కూడా నడిపిస్తున్నాడు.[1][2][3]
నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇతని ప్రథమ వివాహం ఫిబ్రవరి 18, 1984 [4] నాడు లక్ష్మితో [5] జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు వెంకటేష్ కు సోదరి.[6] వీరిరువురు విడాకులు తీసుకున్నారు.[7] తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను వివాహమాడారు. ఈమె మాజీ దక్షిణ భారత నటి. నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి కుమారుడు నాగ చైతన్య (పుట్టిన తేదీ నవంబర్ 23, 1986)[4] మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ ఏప్రిల్ 8 1994)[4] రెండవ భార్య కొడుకు.
నాగార్జున మొదటి చిత్రం విక్రం, 1986 మే 23లో విడుదల అయింది. ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన మజ్ను సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా కలెక్టరుగారి అబ్బాయి చిత్రంలో నటించారు. సినీనటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం., రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ, ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి. నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశము ఇస్తాడన్న పేరు ఉంది. ఈ చిత్రానికి గాను నాగార్జున ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. శివ చిత్రాన్ని హిందీలో శివ అనే పేరుతోనే పునర్నిర్మించి బాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు. ఈ చిత్రం హిందిలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రెసిడెంట్ గారి పెళ్లాం, హలో బ్రదర్ వంటి చిత్రాలు ఈయనకు మాస్ హీరో అన్న పేరును తెచిపెట్టాయి. ఆ తరువాత కృష్ణ వంశీ దర్శకత్వములో విడుదలైన నిన్నే పెళ్లాడుతా భారీగా విజయవంతమయ్యింది. ఆ తరువాత అన్నమయ్య చిత్రములో వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించారు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచింది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.
2006లో నాగార్జున తన తాజా చిత్రము శ్రీ రామదాసులో ముఖ్య పాత్రైన రామదాసును పోషించి విమర్శకుల ప్రశంశలందుకున్నారు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వము వహించారు. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవ సారి ఉత్తమ నటుడి అవార్దు అందుకున్నారు. 2008వ సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున చేసిన అద్భుత నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి. 2021లో వైల్డ్ డాగ్ సినిమాలో నటించాడు.[8]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు | మూ |
---|---|---|---|---|---|
1967 | సుడిగుండాలు | చైల్డ్ ఆర్టిస్ట్ | తెలుగు | అతిధి పాత్ర | |
1986 | విక్రమ్ | విక్రమ్ | తెలుగు | ||
కెప్టెన్ నాగార్జున | నాగార్జున | తెలుగు | |||
అరణ్యకాండ | చైతన్య | తెలుగు | |||
1987 | మజ్ను | రాజేష్ | తెలుగు | ||
సంకీర్తన | కాసి | తెలుగు | |||
కలెక్టర్ గారి అబ్బాయి | రవి | తెలుగు | |||
అగ్నిపుత్రుడు | కాళిదాసు | తెలుగు | |||
కిరాయి దాదా | విజయ్ | తెలుగు | |||
1988 | ఆఖరి పోరాటం | విహారి | తెలుగు | ||
చినబాబు | వేణు గోపాల్ | తెలుగు | |||
మురళీకృష్ణుడు | మురళీ కృష్ణ | తెలుగు | |||
రావు గారి ఇల్లు | అతనే | తెలుగు | అతిధి పాత్ర | ||
జానకి రాముడు | రంగా (రాము) | తెలుగు | |||
1989 | విజయ్ | విజయ్ | తెలుగు | ||
విక్కీ దాదా | విక్రమ్ | తెలుగు | |||
గీతాంజలి | ప్రకాష్ | తెలుగు | |||
అగ్ని | పవన్ కుమార్ | తెలుగు | |||
శివ | శివ | తెలుగు | |||
1990 | ప్రేమ యుద్ధం | కళ్యాణ్ | తెలుగు | ||
నేతి సిద్ధార్థ | సిద్ధార్థ | తెలుగు | |||
ఇద్దరు ఇద్దరే | రవి | తెలుగు | |||
శివుడు | శివుడు | హిందీ | |||
1991 | నిర్ణయం | వంశీ కృష్ణ | తెలుగు | ||
చైతన్య' | చైతన్య | తెలుగు | |||
శాంతి క్రాంతి | ఇన్స్పెక్టర్ సుబాష్ | తెలుగు | |||
జైత్రయాత్ర | తేజ | తెలుగు | 25వ సినిమా | ||
1992 | కిల్లర్ | ఈశ్వర్ ప్రసాద్ (ప్రేమ్ కృష్ణ) | తెలుగు | ||
ఖుదా గవాః | ఇన్స్పెక్టర్ రాజా మీర్జా | హిందీ | |||
అంతం | రాఘవ్ (శేఖర్) | తెలుగు | ద్విభాషా చిత్రం | ||
ద్రోహి | హిందీ | ||||
ప్రెసిడెంట్ గారి పెళ్ళాం | రాజా | తెలుగు | |||
1993 | రక్షణ | బోస్ | తెలుగు | ||
వారసుడు' | వినయ్ | తెలుగు | |||
అల్లరి అల్లుడు | కళ్యాణ్ (రాజేష్) | తెలుగు | |||
1994 | గోవిందా గోవిందా | శీను | తెలుగు | ||
హలో బ్రదర్ | దేవా / రవి వర్మ | తెలుగు | |||
క్రిమినల్ | డాక్టర్ అజయ్ కుమార్ | తెలుగు | |||
1995 | ఘటోత్కచుడు | చిత | తెలుగు | అతిధి పాత్ర | |
ఘరానా బుల్లోడు | రాజు | తెలుగు | |||
సిసింద్రీ | రాజా | తెలుగు | |||
క్రిమినల్ | డాక్టర్ అజయ్ కుమార్ | హిందీ | |||
వజ్రం | చక్రి | తెలుగు | |||
1996 | రాముడొచ్చాడు | రామ్ | తెలుగు | ||
మిస్టర్ బెచార | అజయ్ | హిందీ | |||
నిన్నే పెళ్లాడతా | శీను | తెలుగు |
|
||
1997 | అన్నమయ్య | అన్నమాచార్య | తెలుగు |
|
|
రచ్చగన్ | అజయ్ పద్మనాభన్ | తమిళం | |||
1998 | ఆవిడ మా ఆవిడే | విక్రాంత్ | తెలుగు | ||
ఆటో డ్రైవర్ | జగన్ | తెలుగు | |||
అంగారే | రాజా లోఖండే | హిందీ | |||
చంద్రలేఖ | రాజ్ కపూర్ (సీతా రామారావు) | తెలుగు | |||
జఖ్మ్ | రామన్ దేశాయ్ | హిందీ | |||
1999 | సీతారామరాజు | రామరాజు | తెలుగు | ||
రావోయి చందమామ | శశి | తెలుగు | |||
2000 | నువ్వు వస్తావని | చిన్ని కృష్ణ | తెలుగు | ||
నిన్నే ప్రేమిస్తా | శ్రీనివాస్ | తెలుగు | |||
ఆజాద్ | చంద్ర శేఖర్ ఆజాద్ | తెలుగు | ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డు - రజతం | ||
2001 | ఎదురులేని మనిషి | సూర్య మూర్తి / సత్య | తెలుగు | ||
బావ నచ్చాడు | అజయ్ | తెలుగు | |||
అధిపతి | జగన్ | తెలుగు | |||
ఆకాశ వీధిలో | చంద్ర శేఖర్ (చందు) | తెలుగు | 50వ సినిమా | ||
స్నేహమంటే ఇదేరా | అరవింద్ | తెలుగు | |||
2002 | సంతోషం | కార్తికేయ | తెలుగు | ఉత్తమ నటుడిగా నంది అవార్డు | |
అగ్ని వర్ష | యవక్రి | హిందీ | |||
మన్మధుడు | అభిరామ్ | తెలుగు | |||
2003 | శివమణి | సీఐ శివమణి | తెలుగు | ||
యల్ ఓ సి కార్గిల్ | మేజర్ పద్మపాణి ఆచార్య | హిందీ | |||
2004 | నేనున్నాను | వేణు మాధవ్ | తెలుగు | ||
మాస్ | గణేష్ (మాస్) | తెలుగు | |||
2005 | సూపర్ | అఖిల్ | తెలుగు | ||
2006 | స్టైల్ | మాస్ | తెలుగు | అతిధి పాత్ర | |
శ్రీరామదాసు | కంచెర్ల గోపన్న | తెలుగు | |||
బాస్ | గోపాల్ కృష్ణ | తెలుగు | |||
2007 | డాన్ | సూరి | తెలుగు | ||
2008 | కింగ్ | రాజా చంద్ర ప్రతాప్ వర్మ అకా కింగ్ (బొట్టు శీను, శరత్) | తెలుగు | ||
కృష్ణార్జునులు | శ్రీకృష్ణుడు / బంగారం | తెలుగు | |||
2010 | కేడి | రమేష్ (రమ్మీ) | తెలుగు | ||
తకిట తకిట | నాగ్ | తెలుగు | అతిధి పాత్ర | ||
రగడ | సత్య రెడ్డి | తెలుగు | |||
2011 | గగనం | మేజర్ ఎన్. రవీంద్ర | తెలుగు | ద్విభాషా చిత్రం | |
పయనం | తమిళం | ||||
రాజన్న | రాజన్న | తెలుగు | |||
2012 | షిర్డీ సాయి | షిర్డీ సాయిబాబా | తెలుగు | "ఒక్కడే దేవుడు" పాటకు గాయకుడు కూడా | |
ఢమరుకం | మల్లిఖార్జున | తెలుగు | |||
2013 | గ్రీకువీరుడు | చందు | తెలుగు | ||
జగద్గురు ఆదిశంకర | చండాలుడు | తెలుగు | |||
భాయ్ | విజయ్ | తెలుగు | |||
2014 | మనం | సీతారాముడు / నాగేశ్వరరావు "బిట్టు" | తెలుగు | ||
2015 | దొంగాట | అతనే | తెలుగు | "బ్రేక్ అప్ అంటూ" పాటలో ప్రత్యేక పాత్ర | |
అఖిల్ | తెలుగు | "అక్కినేని అక్కినేని" పాటలో ప్రత్యేక పాత్ర | |||
2016 | సోగ్గాడే చిన్ని నాయనా | బంగార్రాజు / డా. రామ్ మోహన్ | తెలుగు | "దిక్క దిక్క దమ్ దమ్" పాటకు గాయకుడు కూడా | |
ఊపిరి | విక్రమాదిత్య | తెలుగు | ద్విభాషా చిత్రం | ||
తోజ | విక్రమాధిత్య (విక్రమ్) | తమిళం | |||
నిర్మలా కాన్వెంట్ | అతనే | తెలుగు | పొడిగించిన కామియో; "కొత్త కొత్త భాష" పాటకు నిర్మాత మరియు గాయకుడు కూడా | ||
ప్రేమమ్ | విక్రమ్ తండ్రి | తెలుగు | అతిధి పాత్ర | ||
2017 | ఓం నమో వేంకటేశాయ | హథీరామ్ భావాజీ | తెలుగు | ||
రాజు గారి గది 2 | రుద్ర | తెలుగు | |||
2018 | ఆఫీసర్ | శివాజీరావు IPS | తెలుగు | 75వ సినిమా | |
దేవదాస్ | దేవా | తెలుగు | |||
2019 | మన్మధుడు 2 | సాంబశివ రావు / సామ్ | తెలుగు | ||
2021 | వైల్డ్ డాగ్ | విజయ్ వర్మ | తెలుగు | ||
2022 | బంగార్రాజు | బంగార్రాజు / డా. రామ్ మోహన్ | తెలుగు | "లడ్డుండా" పాటకు గాయకుడు కూడా | |
బ్రహ్మాస్త్రం | అనీష్ శెట్టి | హిందీ | |||
ద ఘోస్ట్ | విక్రమ్ నాయుడు | తెలుగు | |||
2024 | నా సామి రంగా | కిష్టయ్య | తెలుగు | ||
2025 | కూలీ † | సైమన్ | తమిళం | చిత్రీకరణ | |
TBA | కుబేరుడు † | TBA | తెలుగు | చిత్రీకరణ. తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు |
Seamless Wikipedia browsing. On steroids.