సౌర కుటుంబం
సౌర గ్రహాల వ్యవస్థ / From Wikipedia, the free encyclopedia
సూర్యుడు, దాని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల సముదాయాన్ని సౌర కుటుంబం అంటారు. దీన్ని సౌర వ్యవస్థ (Solar system) అని కూడా అంటారు. నేరుగా సూర్యుని చుట్టూ తిరిగే వస్తువుల్లో అతి పెద్దవి గ్రహాలు. మిగతావి మరుగుజ్జు గ్రహాల వంటి చిన్న ఖగోళ వస్తువులు. సూర్యుడి చుట్టూ పరోక్షంగా తిరిగే వస్తువులు సహజ ఉపగ్రహాలు. వీటిలో రెండు, బుధ గ్రహం కంటే పెద్దవి.[lower-alpha 1]
వయసు | 456.8 కోట్ల సంవత్సరాలు |
---|---|
స్థానం |
|
వ్యవస్థ ద్రవ్యరాశి | 1.0014 సౌరద్రవ్యరాశి |
అతి దగ్గరి నక్షత్రం |
|
అతి దగ్గరి గ్రహ వ్యవస్థ | ప్రాక్సిమా సెంటారి system (4.25 ly) |
Semi-major axis of outer known planet (నెప్ట్యూన్) | 30.10 AU (4.503 billion km) |
కైపర్ బెల్ట్ నుండి దూరం | 50 AU |
సంఖ్యలు | |
నక్షత్రాలు | 1 (Sun) |
తెలిసిన గ్రహాలు | |
తెలిసిన మరుగుజ్జు గ్రహాలు | |
తెలిసిన సహజ ఉపగ్రహాలు | |
తెలిసిన చిన్న గ్రహాలు | 778,897 (as of 2018-06-21)[4] |
తెలిసిన తోకచుక్కలు | 4,017 (2018-06-21 నాటికి)[4] |
గుర్తించిన గుండ్రటి ఉపగ్రహాలు | 19 |
Invariable-to-galactic plane inclination | 60.19° (ecliptic) |
గాలక్సీ కేంద్రం నుండి దూరం | 27,000 ± 1,000 కా.సం |
కక్ష్యావేగం | 220 కి.మీ/సె |
కక్ష్యాకాలం | 22.5–25 కోట్ల సంవత్సరాలు |
స్పెక్ట్రల్ రకం | G2V |
ఫ్రాస్ట్ లైన్ | ≈5 AU[5] |
హీలియోపాజ్ నుండి దూరం | ≈120 AU |
హిల్ స్ఫియర్ (en) వ్యాసార్థం | ≈1–3 కా.సం |
సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం ఖగోళంలో ఓ మహా పరమాణు మేఘం దాని గురుత్వ శక్తి కారణంగా కుంచించుకు పోయి సౌర వ్యవస్థ ఏర్పడింది. దీని మొత్తం ద్రవ్యరాశిలో అత్యధిక భాగం సూర్యుడిలోనే ఉంది. మిగతా దానిలో అత్యధిక భాగం బృహస్పతిలో ఉంది. అంతర సౌర వ్యవస్థలోని నాలుగు గ్రహాలు, రాతి గ్రహాలు (టెరెస్ట్రియల్ ప్లానెట్స్). ఈ గ్రహాలు ప్రధానంగా రాయి, లోహాలను కలిగి ఉంటాయి. ఇవి చిన్న గ్రహాలు కూడా. బాహ్య సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలు రాతి గ్రహాల కంటే చాలా పెద్దవి. వాటిలో అతి పెద్దవైన గురుడు, శని వాయువులతో కూడుకుని ఉంటాయి. ఆ వాయువుల్లో ముఖ్యమైనవి హైడ్రోజన్, హీలియమ్. అన్నిటి కంటే బయట ఉన్న గ్రహాలు - యురేనస్, నెప్ట్యూన్ లు అతిశీతల గ్రహాలు. మీథేన్, అమ్మోనియా వంటి వాయువులతో అవి కూడుకుని ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా దాదాపు వృత్తాకార కక్ష్యలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూంటాయి.
సౌర కుటుంబంలో ఇంకా చిన్నచిన్న వస్తువులు కూడా ఉన్నాయి.[lower-alpha 2] అంగారకుడు, గురుడి కక్ష్యల మధ్య ఉన్న ఆస్టెరాయిడ్ పట్టీలో ఉన్న వస్తువులు కూడా రాతిగ్రహాల లాగానే చాలావరకు రయి, లోహంతో కూడుకుని ఉంటాయి. నెప్ట్యూన్ కక్ష్యకు (ట్రాన్స్ నెప్ట్యూనియన్ వస్తువులు) ఆవల కయ్‌పర్ బెల్టు, స్కాటర్డ్ డిస్క్ లు ఎక్కువగా మంచుతో కూడుకుని ఉంటాయి. వాటికి అవతల ఇటీవలే కనుక్కున్న సెడ్‌నాయిడ్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ అనేక డజన్ల నుండి కొన్ని వేల వస్తువులు బాగానే పెద్దవి. ఎంత పెద్దవంటే అవి తమ గురుత్వ శక్తి కారణంగా అవి గుండ్రంగా మారాయి.[10] అలాంటి వస్తువులను మరుగుజ్జు గ్రహాలు అని వర్గీకరించారు. మరుగుజ్జు గ్రహాల్లో సెరెస్ ఒకటి. ట్రాన్స్-నెప్ట్యూనియన్ వస్తువుల్లో ప్లూటో, ఐరిస్ లు ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలతో పాటు, తోకచుక్కలు, సెంటార్లు, అంతర్గ్రహ ధూళి మేఘాల వంటి అనేక చిన్న వస్తువులు వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణిస్తూంటాయి. గ్రహాల్లో ఆరిటికి, మరుగుజ్జు గ్రహాల్లో కనీసం నాలుగిటికి, చిన్న వస్తువుల్లో చాలా వాటికీ సహజ ఉపగ్రహాలున్నాయి.[lower-alpha 3] బాహ్య సౌర వ్యవస్థ లోని గ్రహాలన్నిటి చుట్టూ ధూళి, చిన్న వస్తువులతో కూడిన వలయాలు తిరుగుతూంటాయి.
సూర్యుడి నుండి వెలువడే సౌర గాలులు (ఛార్జి పదార్థాల ప్రవాహం) ఇంటర్స్టెల్లార్ మీడియమ్‌లో ఒక బుడగ వంటి మండలాన్ని సృష్టిస్తాయి. దీన్ని హీలియోస్ఫియర్ అంటారు. సౌర గాలుల పీడనం, ఇంటర్స్టెల్లార్ మీడియమ్ లోని పీడనంతో ఎక్కడైతే సమానమౌతుందో ఆ బిందువును హీలియోపాజ్ అంటారు. హీలియోపాజ్ స్కాటర్డ్ డిస్క్ అంచు వరకూ ఉంటుంది. బహు దూరపు తోకచుక్కలకు మూలమని భావిస్తున్న ఊర్ట్ మేఘం హీలియోస్ఫియరుకు దాదాపు వెయ్యి రెట్ల దూరంలో ఆవల ఉంటుంది. సౌర కుటుంబం, పాలపుంత గాలక్సీలో ఓరియన్ బాహువులో గాలక్సీ కేంద్రం నుండి 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.