రాహుల్ ద్రవిడ్
From Wikipedia, the free encyclopedia
1973 జనవరి 11 న మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో మరాఠీ మాట్లాడే దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో[2] జన్మించిన రాహుల్ ద్రవిడ్ (Rahul Sharad Dravid) 1996 నుంచి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చే ప్రపంచంలోని 10 అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపును పొందినాడు.[3] అంతేకాకుండా టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ సగటులో భారతీయులలో అతనిదే అగ్రస్థానం [4] .సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్ ల తర్వాత భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ లో 9000 పరుగులు పూర్తిచేసిన మూడవవాడు రాహుల్ ద్రవిడ్.[5]. ఫిబ్రవరి 6, 2007న వన్డేలలో 10,000 పరుగులు పూర్తిచేసి ఈ ఘనతను సాధించిన ఆరవ బ్యాట్స్మెన్ గా, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీల తర్వాత మూడో భారతీయుడిగా అవతరించాడు.[6] సెప్టెంబర్ 14, 2007న భారత జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నట్లు ప్రకటించాడు.[7] ప్రస్తుతం భారత టెస్ట్, వన్డే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మార్చి 29, 2008న దక్షిణాఫ్రికాతో జరిగిన చెన్నై టెస్టులో 10,000 పరుగుల మైలురాయిని అధికమించి ఇందులోనే ఈ ఘనత వహించిన ఆరవ బ్యాట్స్మెన్గాను, మూడవ భారతీయుడిగాను రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అతి తక్కువ కెరీర్ సమయంలో 10 వేల పరుగులను పూర్తి చేసిన రికార్డు స్థాపించాడు.[8]
![]() 2012 లో ద్రవిడ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రాహుల్ శరద్ ద్రవిడ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | (1973-01-11) 1973 జనవరి 11 (వయసు 51) ఇండోర్, మధ్య ప్రదేశ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | ది వాల్, ది గ్రేట్ వాల్, జామీ, మిస్టర్ డిపెండబుల్[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.80 మీ. (5 అ. 11 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్మన్, అప్పుడప్పుడు వికెట్ కీపరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 207) | 1996 జూన్ 20 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2012 జనవరి 24 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 95) | 1996 ఏప్రిల్ 3 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2011 సెప్టెంబరు 16 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 19 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక T20I (క్యాప్ 38) | 2011 ఆగస్టు 31 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 19 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1990–2012 | కర్ణాటక | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000 | Kent | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003 | Scottish Saltires | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2013 | రాజస్థాన్ రాయల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ప్రధాన కోచ్గా | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2021 | India U-19 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2021 | India A | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021– | India | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2012 జనవరి 30 |
అంతేకాకుండా కెరీర్ లో 10 వేల పరుగులను వన్డేలలో, టెస్టులో పూర్తి చేసిన ప్రపంచ మూడవ ఆటగాడు. ఇప్పటికి ఆ ఘనతను సాధించినది సచిన్ టెండుల్కర్, బ్రియాన్ లారా మాత్రమే.
ఆయన 2021 నుండి 2024 వరకు భారత జట్టు కోచ్గా పని చేశాడు.[9][10]