![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b6/IndoreMontage.jpg/640px-IndoreMontage.jpg&w=640&q=50)
ఇండోర్
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని అతిపెద్ద నగరం / From Wikipedia, the free encyclopedia
ఇండోర్, మధ్యప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద నగరం. [8] ఇది ఇండోర్ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇండోర్ డివిజనుకు ప్రధాన కార్యాలయం. ఇది విద్యా కేంద్రం కూడా. ప్రసిద్ధ విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థలు రెండూ ఇక్కడ ఉన్నాయి. [9] ఇండోర్ నగరం,మాళ్వా పీఠభూమికి దక్షిణపు టంచున, సముద్ర మట్టం నుండి 553 మీటర్ల ఎత్తున ఉంది. [10] ఇది మధ్య భారతదేశంలోని ప్రధాన నగరాల్లోకెల్లా అత్యధిక ఎత్తున ఉన్న నగరం. ఇండోర్, రాష్ట్ర రాజధాని భోపాల్ కు పశ్చిమాన 190 కి.మీ. దూరంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 19,94,397 [11] ఇండోర్ పట్టణ సముదాయం జనాభా 21,70,295. [4] నగరం 530 చ.కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
ఇండోర్ | |
---|---|
మెట్రోపాలిటన్ నగరం | |
![]() పైనుండి సవ్యదిశలో:మంగళ్ ప్రాంతం (విజయ్ నగర్), రాజ్వాడా ప్యాలెస్, డాలీ కాలేజి, అటల్ బిహారీ వాజపేయీ ప్రాంతీయ పార్కు, పాతాళపానీ జలపాతం | |
Coordinates: 22°43′0″N 75°50′50″E | |
దేశం | ![]() |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
ప్రాంతం | మాళ్వా |
జిల్లా | ఇండోర్ |
Government | |
• Type | మునిసిపల్ కార్పొరేషను |
విస్తీర్ణం | |
• మెట్రోపాలిటన్ నగరం | 530 కి.మీ2 (200 చ. మై) |
• Metro | 1,200 కి.మీ2 (500 చ. మై) |
• Rank | 8 |
Elevation | 550 మీ (1,800 అ.) |
జనాభా (2011) | |
• మెట్రోపాలిటన్ నగరం | 19,94,397 |
• జనసాంద్రత | 3,800/కి.మీ2 (9,700/చ. మై.) |
• Metro | 21,70,295 |
PIN | 4520XX |
టెలిఫోన్ కోడ్ | 0731 |
Vehicle registration | MP-09 |
అధికారిక భాష | హిందీ[6] |
అక్షరాస్యత | 80.63%[7] |
16 వ శతాబ్దంలో దక్కనుకు, ఢిల్లీకీ మధ్య ఒక వాణిజ్య కేంద్రంగా ఇండోర్ స్థాపించబడింది. పీష్వా మొదటి బాజీ రావు మాళ్వాపై పూర్తి నియంత్రణ సాధించడంతో 1724 మే 17 న నగరం, దాని పరిసర ప్రాంతాలూ మరాఠా సామ్రాజ్యం పరిధిలోకి వచ్చాయి. బ్రిటిషు పాలనా కాలంలో, ఇండోర్ సంస్థానానికి 19 -గన్ సెల్యూట్ (స్థానికంగా 21) సంస్థాన హోదా (అరుదైన ఉన్నత హోదా) ఉండేది. మరాఠా హోల్కర్ రాజవంశీకులు ఈ సంస్థానం భారతదేశంలో కలిసే వరకు పాలించారు. [12] ఇండోర్ 1950 నుండి 1956 వరకు మధ్య భారత్ రాష్ట్రానికి వేసవి రాజధానిగా ఉండేది.
ఇండోర్ నగర కేంద్రంలో ఉన్న ఆర్థిక ప్రాంతం, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఉంది. ఇక్కడే మధ్యప్రదేశ్ స్టాక్ ఎక్స్ఛేంజి ఉంది.
స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన 100 భారతీయ నగరాల్లో ఇండోర్ ఒకటి. [13] ఇది స్మార్ట్ సిటీస్ మిషన్ కు చెందిన మొదటి రౌండుకు అర్హత సాధించింది. స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయబడిన మొదటి ఇరవై నగరాల్లో ఒకటిగా ఎంపికైంది. [14] స్వచ్ఛ సర్వేక్షణ్ మొదలైనప్పటి నుండి ఇండోర్ అందులో భాగంగా ఉంది. 2016 లో ఇది 25 వ స్థానంలో నిలిచింది. [15] 2017, 2018, 2019, 2020 లలో, వరుసగా నాలుగు సంవత్సరాల పాటు జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ లలో ఇది భారతదేశపు అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. [16] [17] [18] [19]