ఆస్ట్రేలియా పురుషుల జాతీయ క్రికెట్ జట్టు పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో, ఇంగ్లాండుతో కలిసి ఇది అయ్తంత పురాతన జట్టు. 1877లో ఇంగ్లాండుతో మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది.[9] ఆస్ట్రేలియా జట్టు వన్డే ఇంటర్నేషనల్ (వన్డే), ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (టి20) క్రికెట్ కూడా ఆడుతుంది. 1970-71 సీజన్లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొట్టమొదటి వన్డే లోను, [10] 2004-05 సీజన్లో న్యూజిలాండ్‌తో జరిగిన మొట్టమొదటి టి20 లోనూ ఆడి [11] ఆ రెంటినీ గెలుచుకుంది. ఆస్ట్రేలియా దేశీయ పోటీలు - షెఫీల్డ్ షీల్డ్, ఆస్ట్రేలియన్ దేశీయ పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్, బిగ్ బాష్ లీగ్‌లలో ఆడే జట్ల నుండి ఆటగాళ్లను తీసుకుంటుంది.
త్వరిత వాస్తవాలు అసోసియేషన్, వ్యక్తిగత సమాచారం ...
ఆస్ట్రేలియాఆస్ట్రేలియన్ క్రికెట్ కోట్ ఆఫ్ ఆర్మ్స్ |
అసోసియేషన్ | క్రికెట్ ఆస్ట్రేలియా |
---|
|
టెస్టు కెప్టెన్ | పాట్ కమిన్స్ |
---|
ఒన్ డే కెప్టెన్ | పాట్ కమిన్స్ |
---|
Tట్వంటీ I కెప్టెన్ | మాథ్యూ వాడే (మధ్యంతర) |
---|
కోచ్ | ఆండ్రూ మెక్‌డొనాల్డ్ |
---|
|
టెస్టు హోదా పొందినది | 1877 |
---|
|
ICC హోదా | పూర్తి సభ్యుడు (1909) |
---|
ICC ప్రాంతం | తూర్పు ఆసియా-పసిఫిక్ |
---|
ఐసిసి ర్యాంకులు |
ప్రస్తుత[1] |
అత్యుత్తమ |
---|
టెస్టులు |
2వ |
1వ (1 January 1952) |
---|
వన్డే |
2వ |
1వ (1 January 1990) |
---|
టి20ఐ |
4వ |
1వ (1 May 2020)[2] |
---|
|
|
మొదటి టెస్టు | v. ఇంగ్లాండు at the Melbourne Cricket Ground, Melbourne; 15–19 March 1877 |
---|
చివరి టెస్టు | v. ఇంగ్లాండు at The Oval, London; 27–31 July 2023 |
---|
టెస్టులు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[3] |
859 |
408/231 (218 డ్రాలు, 2 టైలు) |
---|
ఈ ఏడు[4] |
11 |
4/4 (3 డ్రాలు) |
---|
|
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో పోటీ | 2 (first in 2019–2021) |
---|
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్స్ (2021–2023) |
---|
|
తొలి వన్డే | v. ఇంగ్లాండు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్; 5 జనవరి 1971 |
---|
చివరి వన్డే | v. భారతదేశం నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్; 19 నవంబర్ 2023 |
---|
వన్డేలు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[5] |
997 |
606/348 (9 ties, 34 no results) |
---|
ఈ ఏడు[6] |
22 |
14/8 (0 ties, 0 no results) |
---|
|
పాల్గొన్న ప్రపంచ కప్‌లు | 13 (first in 1975) |
---|
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్స్ (1987, 1999, 2003, 2007, 2015, 2023) |
---|
|
తొలి టి20ఐ | v. న్యూజీలాండ్ ఈడెన్ పార్క్, ఆక్లాండ్ వద్ద; 17 ఫిబ్రవరి 2005 |
---|
చివరి టి20ఐ | v. దక్షిణాఫ్రికా కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్; 3 సెప్టెంబర్ 2023 |
---|
టి20ఐలు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[7] |
177 |
94/76 (3 టైలు, 4 ఫలితం తేలలేదు) |
---|
ఈ ఏడు[8] |
3 |
3/0 (0 టైలు, 0 ఫలితం తేలలేదు) |
---|
|
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ | 7 (first in 2007) |
---|
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్స్ (2021) |
---|
|
|
|
As of 19 November 2023 |
మూసివేయి
జాతీయ జట్టు 858 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 408 గెలిచి, 230 లలో ఓడిపోయింది. 218 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.[12] 2022 మే నాటికి ఆస్ట్రేలియా ఐసిసి టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 128 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.[13] మొత్తం విజయాలు, గెలుపోటముల నిష్పత్తి, విజయాల శాతం పరంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టు.
టెస్ట్ పోటీలలో యాషెస్ (ఇంగ్లండ్‌తో), బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (భారత్‌తో), ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీ (వెస్టిండీస్‌తో), ట్రాన్స్-టాస్మాన్ ట్రోఫీ (న్యూజిలాండ్‌తో), దక్షిణాఫ్రికాతో ఉన్నాయి.
జట్టు 978 వన్డే మ్యాచ్‌లు ఆడి, 594 గెలిచి, 341 మ్యాచిల్లో ఓడిపోయింది, 9 టై అయ్యాయి, 34 ఫలితం లేకుండా ముగిసాయి.[14] 2002 మే నాటికి ఆస్ట్రేలియా, ఐసిసి వన్డే ఛాంపియన్‌షిప్‌లో 107 రేటింగ్ పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది.[15] అయితే 2002లో ప్రవేశపెట్టినప్పటి నుండి 185 నెలలకు గాను, 141 నెలల్లో మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు - ఆడిన మ్యాచ్‌లలో 60 శాతానికి పైగా గెలిచింది.[14] ఏడు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లు (1975, 1987, 1996, 1999, 2003, 2007, 2015) ఆడి, ఐదు సార్లు గెలిచింది: 1987, 1999, 2003, 2007, 2015. వరుసగా 3 ప్రపంచ కప్‌లను గెలుచుకున్న ఏకైక జట్టు (1999, 2003, 2007). 2011 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆప్ దశలో పాకిస్తాన్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడేవరకు ఆస్ట్రేలియా వరుసగా 34 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో అజేయంగా ఉంది.[16] భారత్ ( 2011) తర్వాత సొంతగడ్డపై ప్రపంచకప్ (2015) గెలిచిన రెండో జట్టు ఇది. ఆస్ట్రేలియా ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని రెండుసార్లు ( 2006, 2009) గెలుచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లలో వరుసగా రెండుసార్లు విజేతలుగా నిలిచిన ఏకైక జట్టుగా నిలిచింది.