రాహుల్ గాంధీ
రాజకీయ నాయకుడు / From Wikipedia, the free encyclopedia
రాహుల్ గాంధీ (జననం 19 జూన్ 1970) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడు, భారత యువజన కాంగ్రెస్, భారత జాతీయ విద్యార్థి యూనియన్ లకు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నాడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాడు. అమేథీ నియోజకవర్గం నుంచి 2004 నుండి 2019 వరకు లోకసభ సభ్యునిగా పనిచేశాడు. 2019 లో వయనాడ్ నుండి లోకసభ సభ్యుడయ్యాడు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రెండవ అతిఎక్కువ ర్యాంకు సాధించిన సభ్యుడు రాహుల్.
రాహుల్ గాంధీ | |||
12వ కాంగ్రెస్ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ | |||
పదవీ కాలం 10 జూన్ 2024 – ప్రస్తుతం | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
అఖిలేష్ యాదవ్ | |||
ముందు | సుష్మాస్వరాజ్ (2014) | ||
లోక్‌సభ సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 జూన్ 2024 | |||
ముందు | సోనియా గాంధీ | ||
నియోజకవర్గం | రాయ్‌బరేలి | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 7 ఆగష్టు 2023[2] | |||
నియోజకవర్గం | వాయనాడ్ | ||
ముందు | ఎం. ఐ. షానవాస్ | ||
తరువాత | రాహుల్ గాంధీ | ||
పదవీ కాలం 17 మే 2004 – 23 మే 2019 | |||
ముందు | సోనియా గాంధీ | ||
తరువాత | స్మృతి ఇరాని | ||
నియోజకవర్గం | అమేథి | ||
పదవీ కాలం 16 డిసెంబర్ 2017 – 10 ఆగష్టు 2019 | |||
ముందు | సోనియా గాంధీ | ||
తరువాత | సోనియా గాంధీ | ||
భారత జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు | |||
పదవీ కాలం 19 జనవరి 2013 – 16 డిసెంబర్ 2017 | |||
అధ్యక్షుడు | సోనియా గాంధీ | ||
ముందు | స్థానం ప్రారంభించబడింది | ||
తరువాత | స్థానం ప్రారంభించబడింది | ||
భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి | |||
పదవీ కాలం 25 సెప్టెంబర్ 2007 – 19 జనవరి 2013 | |||
అధ్యక్షుడు | సోనియా గాంధీ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 25 సెప్టెంబర్ 2007 | |||
ముందు | స్థానం ప్రారంభించబడింది | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1970-06-19) 1970 జూన్ 19 (వయసు 54) న్యూఢిల్లీ, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | రాజీవ్ గాంధీ (తండ్రి) సోనియా గాంధీ (తల్లి) | ||
బంధువులు | ప్రియాంక గాంధీ (చెలెల్లు) నెహ్రూ-గాంధీ కుటుంబం | ||
పూర్వ విద్యార్థి | ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్ (ఎం. ఫిల్. ) | ||
సంతకం |
రాహుల్ నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందినవాడు. భద్రతా కారణాల వల్ల చిన్నప్పుడు ఆయన ఎక్కువగా పాఠశాలలు మారాల్సి వచ్చేది. ఆయన విదేశాల్లో మారుపేరుతో చదువుకునేవాడు. కేవలం కొందరు భద్రతా అధికారులకు, విశ్వవిద్యాలయ అధికారులకు మాత్రమే ఆయన అసలు గుర్తింపు తెలిసేది. రాహుల్ కేంబ్రిడ్జ్ లోని రాలిన్స్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు, అభివృద్ధి కోర్సులో డిగ్రీ చేశాడు. ఆ తరువాత లండన్ లోని మానిటర్ గ్రూప్ అనే మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేశారు. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ చనిపోయిన తరువాత కొన్నేళ్ళకు, ఆయన పోటీ చేసే ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గంలో నిలబడి ఎంపిగా గెలిచారు. 2007లో రాహుల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2013లో పార్టీ ఉపాధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యారు.
2014 భారత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సారథ్యం వహించారు రాహుల్. ఈ ఎన్నికల్లో కేవలం 44 సీట్లు గెలిచి పార్టీ చరిత్రలో ఎన్నడూలేని వైఫల్యాన్ని చవి చూసింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 206 సీట్లను గెలుచుకుంది. 2019 భారత ఎన్నికలలో, భారత్ జాతీయ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మరల వైఫల్యం చెందాయి.