![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e9/BJP_Party_leader_Sushma_Swaraj2.jpg/640px-BJP_Party_leader_Sushma_Swaraj2.jpg&w=640&q=50)
సుష్మాస్వరాజ్
From Wikipedia, the free encyclopedia
సుష్మా స్వరాజ్ (ఫిబ్రవరి 14, 1952 - ఆగస్టు 6, 2019) భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నాయకురాలు. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశ మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు. 1970లో రాజకీయ రంగప్రవేశం చేసిన సుష్మా విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో కాలుపెట్టారు. అదే సంవత్సరంలో కేంద్రంలో ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో స్థానం సంపాదించారు. 1996, 98లలో వాజపేయి మంత్రివర్గంలలో కూడా ఈమెకు చోటు లభించింది. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 మే 26 నాడు నరేంద్రమోడి కేబినెట్లో కేంద్రమంత్రిగా నియమితులైనారు. సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ ప్రముఖ న్యాయవాది, మిజోరాం గవర్నరుగా పనిచేశారు.
త్వరిత వాస్తవాలు నియోజకవర్గం, వ్యక్తిగత వివరాలు ...
సుష్మాస్వరాజ్ | |||
![]() | |||
విదేశీ వ్యవహారాల మంత్రి | |||
పదవీ కాలం 2014, మే 26 నుంచి | |||
నియోజకవర్గం | విదిషా లోక్సభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1952-02-14)1952 ఫిబ్రవరి 14 అంబాలా కంటోన్మెంట్, హర్యానా | ||
మరణం | 2019 ఆగస్టు 6(2019-08-06) (వయసు 67) ఢిల్లీ | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | స్వరాజ్ కౌశల్ | ||
సంతానం | బన్సూరి స్వరాజ్[1] | ||
నివాసం | ఢిల్లీ | ||
మే 26, 2014నాటికి |
మూసివేయి