![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4f/Glenn_McGrath_in_Circular_Quay%252C_Sydney%252C_Australia%252C_2018-02-03.jpg/640px-Glenn_McGrath_in_Circular_Quay%252C_Sydney%252C_Australia%252C_2018-02-03.jpg&w=640&q=50)
గ్లెన్ మెక్‌గ్రాత్
From Wikipedia, the free encyclopedia
గ్లెన్ డోనాల్డ్ మెక్‌గ్రాత్ (జ:1970 ఫిబ్రవరి 9) మాజీ ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెటరు. అతని కెరీర్ 14 సంవత్సరాలు కొనసాగింది. అతను ఫాస్ట్-మీడియం పేస్ బౌలరు. సార్వకాలిక గొప్ప బౌలర్లలో ఒకరిగా అతన్ని పరిగణిస్తారు.[1] 1990ల మధ్య నుండి 2000ల చివరి వరకు ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా సాధించిన ఆధిపత్యానికి ప్రముఖమైన దోహదకారి అతను. [2] [3] మెక్‌గ్రాత్ 1999 క్రికెట్ ప్రపంచ కప్, 2003 క్రికెట్ ప్రపంచ కప్, 2007 క్రికెట్ ప్రపంచ కప్‌లను - వరుసగా మూడు ప్రపంచ కప్ ట్రోఫీలను - గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. 2006 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న జట్టులో మెక్‌గ్రాత్ కూడా సభ్యుడు.
![]() 2018 మార్చి 3 న సిడ్నీలో గ్లెన్ మెక్‌గ్రాత్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | గ్లెన్ డోనాల్డ్ మెక్‌గ్రాత్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | (1970-02-09) 1970 ఫిబ్రవరి 9 (వయసు 54) డబ్బో, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | పీజియన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 197 cమీ. (6 అ. 6 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Right arm ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 358) | 1993 నవంబరు 12 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2007 జనవరి 2 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 113) | 1993 డిసెంబరు 9 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2007 ఏప్రిల్ 28 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 11 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 9) | 2005 ఫిబ్రవరి 17 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2005 జూన్ 13 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1992/93–2007/08 | న్యూ సౌత్ వేల్స్ (స్క్వాడ్ నం. 11) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000 | వోర్సెస్టర్షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004 | మిడిల్సెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010 | ఢిల్లీ డేర్ డెవిల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2017 ఆగస్టు 2 |
కచ్చితమైన లైను, లెంగ్తు వేయడంలో కెరీర్ మొత్తంలో పేరుగాంచిన మెక్‌గ్రాత్, అత్యంత పొదుపైన, అత్యంత విజయవంతమైన ఫాస్టు బౌలర్లలో ఒకడు. ఫాస్టు బౌలర్లు తీసుకున్న కెరీర్ మొత్తం టెస్టు వికెట్ల పరంగా, జేమ్స్ ఆండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ల తర్వాత మెక్‌గ్రాత్ మూడో స్థానంలో ఉన్నాడు. టెస్టు బౌలర్ల జాబితాలో, అతను ఐదవ స్థానంలో ఉన్నాడు. బౌలర్లందరిదీ అతనిదే అత్యల్ప సగటు. [4] అత్యధిక వన్డే అంతర్జాతీయ వికెట్లు (381) తీసుకున్న బౌలర్లలో అతను ఏడవ స్థానంలో ఉన్నాడు. క్రికెట్ ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు (71) సాధించిన రికార్డు మెక్గ్రాత్దే. [5] 2007 జనవరిలో సిడ్నీలో జరిగిన [6] యాషెస్ టెస్టు తర్వాత, 2006 డిసెంబరు 23న టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మెక్‌గ్రాత్, 2007 ప్రపంచ కప్, తర్వాత వన్డే కెరీర్‌కూ ముగింపు పలికాడు. ఆస్ట్రేలియా ఆ టోర్నమెంటును గెలవడంలో కీలకపాత్ర పోషించిన అతని అత్యుత్తమ బౌలింగ్‌కు గాను అతను మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు. [7]
ఆ తర్వాత మెక్‌గ్రాత్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కోసం ఆడాడు. దాని మొదటి సీజన్లో అతను అత్యంత పొదుపైన బౌలర్లలో ఒకడు. [8]
మెక్‌గ్రాత్, చెన్నై లోని MRF పేస్ ఫౌండేషన్‌కు డైరెక్టరుగా ఉన్నాడు.[9] అతను ప్రస్తుతం తన భార్య జేన్‌తో కలిసి స్థాపించిన రొమ్ము క్యాన్సరు సేవా సంస్థ అయిన మెక్‌గ్రాత్ ఫౌండేషనుకు అధ్యక్షుడిగా ఉన్నాడు.
[10] 2012 నవంబరు 1 న సిడ్నీలో జరిగిన ఏడవ వార్షిక బ్రాడ్‌మాన్ అవార్డుల సందర్భంగా మెక్‌గ్రాత్ సన్మానం అందుకున్నాడు. 2013 జనవరిలో మెక్‌గ్రాత్, ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించాడు [11]