లిస్ట్ ఎ క్రికెట్
పరిమిత-ఓవర్ల (వన్-డే) రూపంలో జరిగే మ్యాచ్‌ల వర్గీకరణ. / From Wikipedia, the free encyclopedia
లిస్ట్ ఎ క్రికెట్ అనేది క్రికెట్లో పరిమిత-ఓవర్ల (వన్-డే) రూపంలో జరిగే మ్యాచ్‌ల వర్గీకరణ. ఈ వర్గం లోకి వచ్చే గేమ్‌లు జరిగే వ్యవధి ఎనిమిది గంటల వరకు ఉంటుంది. లిస్ట్ ఎ క్రికెట్లో వన్ డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్‌లు, వివిధ దేశీయ పోటీలూ ఉంటాయి, దీనిలో ఒక్కో జట్టు ఆడే ఇన్నింగ్స్‌లో ఓవర్ల సంఖ్య నలభై నుండి అరవై వరకు ఉంటుంది. అలాగే అధికారికంగా వన్డే హోదాను సాధించని దేశాలతో కూడిన కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఉంటాయి. ఫస్ట్-క్లాస్, ట్వంటీ 20 క్రికెట్‌తో పాటు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గుర్తింపు పొందిన మూడు ప్రధాన క్రికెట్ రూపాలలో లిస్ట్ ఎ ఒకటి. [1] 2021 నవంబరులో ICC, మహిళల క్రికెట్‌కు కూడా లిస్ట్ ఎ స్థితిని ఇచ్చి, గతంలో జరిగిన మ్యాచ్‌లకు కూడా వర్తింపజేసి, దానిని పురుషుల ఆటతో సమం చేసింది. [2] [3]