రాజస్థాన్ జిల్లాల జాబితా

రాజస్థాన్ లోని జిల్లాలు From Wikipedia, the free encyclopedia

రాజస్థాన్ జిల్లాల జాబితా

భారతదేశం లోని రాజస్థాన్ రాష్ట్ర పరిపాలనా ప్రయోజనాల కోసం 50 జిల్లాలుగా విభజించబడింది.[1] 2023 మార్చి 17న, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ 19 కొత్త జిల్లాల ఏర్పాటును ప్రకటించాడు. జైపూర్ జిల్లా, జోధ్‌పూర్ జిల్లా ఉనికిలో లేవు, తద్వారా జిల్లాల సంఖ్య 50కి చేరుకుంది .[2] జిల్లా పరిపాలనా నిర్వహణ బాధ్యతలను, రాష్ట్రం నియమించిన అఖిల భారత అధికారులు నిర్వహిస్తారు. ప్రతి జిల్లాలో అఖిల-భారత అధికారులు డిప్యూటీ కమిషనర్ లేదా జిల్లామేజిస్ట్రేట్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుండి), ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్ నుండి), డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ నుండి) దీనికి వివిధ రాజస్థాన్ రాష్ట్ర సర్వీసుల అధికారులు సహాయం చేస్తారు. ఆరోగ్యం, విద్య, ఇతర ప్రాథమిక సౌకర్యాల వంటి విషయాలకు రాష్ట్రం నియమించిన అధికారులు బాధ్యత వహిస్తారు.

త్వరిత వాస్తవాలు రాజస్థాన్ జిల్లాలు, రకం ...
రాజస్థాన్ జిల్లాలు
Thumb
రాజస్థాన్ జిల్లాలు
రకంజిల్లాలు
స్థానంరాజస్థాన్
సంఖ్య50
జనాభా వ్యాప్తిజైసల్మేర్ – 669,919 (అత్యల్ప); జైపూర్ – 6,626,178 (అత్యధిక)
విస్తీర్ణాల వ్యాప్తిధౌల్‌పూర్మూస:కన్వర్ట్ (చిన్నది); జైసల్మేర్మూస:కన్వర్ట్ (అతిపెద్ద)
ప్రభుత్వంరాజస్థాన్ ప్రభుత్వం
ఉప విభజనరాజస్థాన్ తహసీల్‌ల జాబితా
మూసివేయి

కొత్త జిల్లాల ప్రకటన

2023 మార్చి 17న, సిఎం అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ శాసనసభలో రాష్ట్రంలో మూడు కొత్త డివిజన్లతో పాటు 19 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న జైపూర్ (యునైటెడ్), జోధ్‌పూర్ (యునైటెడ్) ఉనికిని కోల్పోతుండగా జిల్లాల సంఖ్య 50కి పెరిగింది. [3] [4] [5][6]

ప్రతిపాదిత విభాగాలు

ఈ దిగువ విభాగాలు ప్రతిపాదిత విభాగాలుగా ఉన్నాయి.[7]

మూడు కొత్త డివిజన్ల ప్రకటన తర్వాత పాత డివిజన్లన్నింటినీ కలిపి మొత్తం 10 డివిజన్లు రానున్నాయి.

పూర్వ జిల్లాల జాబితా

మరింత సమాచారం జిల్లా, ప్రాంతం (కిమీ²లో) ...
జిల్లా ప్రాంతం (కిమీ²లో) జనాభా విభాగం
1 అజ్మీర్ 8,481 2,584,913 అజ్మీర్ విభాగం
2 ఆల్వార్ 8,380 3,671,999 జైపూర్ విభాగం
3 బన్‌స్వార 5,037 1,798,194 ఉదయపూర్ విభాగం
4 బరన్ 6,992 1,223,921 కోట విభాగం
5 బార్మర్ 28,387 2,604,453 జోధ్‌పూర్ విభాగం
6 భరత్‌పూర్ 5,066 2,549,121 భరత్‌పూర్ విభాగం
7 భిల్వార 10,455 2,410,459 అజ్మీర్ విభాగం
8 బికనీర్ 30,247 2,367,745 బికనీర్ విభాగం
9 బుంది 5,550 1,113,725 కోట విభాగం
10 చిత్తౌర్‌గఢ్ 7,822 1,544,392 ఉదయపూర్ విభాగం
11 చురు 13,858 2,041,172 సికార్ విభాగం
12 దౌసా 3,432 1,637,226 జైపూర్ విభాగం
13 ధౌల్‌పూర్ 3,033 1,207,293 భరత్‌పూర్ విభాగం
14 దుంగర్‌పూర్ 3,770 1,388,906 ఉదయపూర్ విభాగం
15 హనుమాన్‌గఢ్ 9,656 1,774,692 బికనీర్ విభాగం
16 జైపూర్ (ఉనికిలో లేదు) 11,143 6,626,178 జైపూర్ విభాగం
17 జైసల్మేర్ 38,401 669,919 జోధ్‌పూర్ విభాగం
18 జలోర్ 10,640 1,828,730 జోధ్‌పూర్ విభాగం
19 ఝలావర్ 6,928 1,411,129 కోట విభాగం
20 ఝున్‌ఝును 5,928 2,137,045 సికార్ విభాగం
21 జోధ్‌పూర్ (ఉనికిలో లేదు) 22,850 3,687,165 జోధ్‌పూర్ విభాగం
22 కరౌలి 5,043 1,458,248 భరత్‌పూర్ విభాగం
23 కోట 5,217 1,951,014 కోట విభాగం
24 నాగౌర్ 17,718 3,307,743 అజ్మీర్ విభాగం
25 పాలీ 12,387 2,037,543 జోధ్‌పూర్ విభాగం
26 ప్రతాప్‌గఢ్ 4,117 867,848 ఉదయపూర్ విభాగం
27 రాజ్‌సమంద్ 4,550 1,156,597 ఉదయపూర్ విభాగం
28 సవై మధోపూర్ 10,527 1,335,551 భరత్‌పూర్ విభాగం
29 సికార్ 7,742 2,677,333 సికార్ విభాగం
30 సిరోహి 5,136 1,036,346 జోధ్‌పూర్ విభాగం
31 శ్రీ గంగానగర్ 11,154 1,969,168 బికనీర్ విభాగం
32 టోంక్ 7,194 1,421,326 అజ్మీర్ విభాగం
33 ఉదయ్‌పూర్ జిల్లా 11,724 3,068,420 ఉదయపూర్ విభాగం
మూసివేయి

గమనిక: పైన వివరింపబడిన 33 పాత జిల్లాలలో జైపూర్ జిల్లా, జోధ్‌పూర్ జిల్లా ఉనికిలో లేవు. కొత్తగా ప్రకటించిన 19 జిల్లాలలో పూర్వ జైపూర్ జిల్లాను విభజించగా , కొత్తగా జైపూర్ జిల్లా, జైపూర్ రూరల్ జిల్లా, డుడూ జిల్లా అనే పేర్లతో మూడు జిల్లాలు ఏర్పడ్డాయి.ఈ రెండు జిల్లాలకు జైపూర్ నగరం జిల్లా ముఖ్యపట్టణం. అలాగే జోధ్‌పూర్ జిల్లాను విభజించగా, కొత్తగా జోధ్‌పూర్ జిల్లా, జోధ్‌పూర్ రూరల్ జిల్లా, పలోడి జిల్లా అనే పేర్లతో మూడు జిల్లాలు ఏర్పడ్డాయి.ఈ రెండు జిల్లాలకు జోధ్‌పూర్ నగరం, జిల్లా ముఖ్యపట్టణం.

కొత్తగా ఏర్పడిన జిల్లాలు

మరింత సమాచారం వ.సంఖ్య, కొత్తగా ఏర్పడిన జిల్లా ...
వ.సంఖ్య కొత్తగా ఏర్పడిన జిల్లా గతంలో ఏ జిల్లాలో భాగంగా ఉండేది
1 బేవార్ అజ్మీర్, పాలి
2 కేక్రి అజ్మీర్, టోంక్
3 ఖైర్తాల్ తిజారా ఆల్వార్
4 బలోత్రా బార్మర్
5 డిగ్ భరత్‌పూర్
6 షాహపురా భిల్వారా
7 జైపూర్ జైపూర్
8 జైపూర్ రూరల్
9 డుడూ
10 కోట్‌పుట్లీ బెహ్రోర్ జైపూర్, అల్వార్
11 సంచోరే జలోర్
12 జోధ్‌పూర్ జోధ్‌పూర్
13 జోధ్‌పూర్ రూరల్
14 ఫలోడి
15 దివానా కుచమన్ నాగౌర్
16 గంగాపూర్ సిటీ సవై మధోపూర్
17 నీమ్ కా థానా సికార్, ఝున్‌ఝును
18 అనుప్‌ఘఢ్ శ్రీ గంగానగర్, బికనేర్
19 సాలుంబర్ ఉదయ్‌పూర్
మూసివేయి

విభాగాలు

Thumb
రాజస్థాన్ విభాగాలు
మరింత సమాచారం వ.సంఖ్య, విభాగం ...
వ.సంఖ్య విభాగం విభాగం లోని జిల్లాలు
1 అజ్మీర్
2 భరత్‌పూర్
3 బికనీర్
4 బన్‌స్వార
5 జైపూర్
6 జోధ్‌పూర్
7 కోట
8 పాలి
9 సికార్
10 ఉదయ్‌పూర్
మూసివేయి

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.