రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో చురు జిల్లా ఒకటి.ఈ జిల్లాకు చురు పట్టణం ప్రధానకేంద్రం.
చురు జిల్లా
चुरू जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
డివిజను | బికనీరు విభాగం |
ముఖ్య పట్టణం | చురు (రాజస్థాన్) |
మండలాలు | చురు, రతన్‌గఢ్ , తారానగర్, రాజ్‌గఢ్, సర్దర్‌షహర్, సుజన్‌గఢ్, బిదాసార్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | చురు[1] |
విస్తీర్ణం | |
• మొత్తం | 13,858 కి.మీ2 (5,351 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 20,41,172 |
• జనసాంద్రత | 150/కి.మీ2 (380/చ. మై.) |
• Urban | 5,76,481 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 67.46% |
ప్రధాన రహదార్లు | NH-65 |
Website | అధికారిక జాలస్థలి |
సరిహద్దులు
చురు జిల్లా, రాజస్థాన్ రాష్ట్ర ఉత్తర భూభాగంలో ఉంది. జిల్లాకు ఉత్తర సరిహద్దులో హనుమాన్‌గఢ్ జిల్లా, తూర్పు సరిహద్దులో హర్యానా రాష్ట్రం, ఆగ్నేయ సరిహద్దులో ఝున్‌ఝును జిల్లా, సికార్ జిల్లా దక్షిణ సరిహద్దులో నగౌర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో బికనీర్ జిల్లాలు ఉన్నాయి.
భౌగోళికం
జిల్లావైశాల్యం 16,830, పొడవు 190 కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,041,172. స్త్రీ పురుష నిష్పత్తి 938:1000. అక్షరాస్యత 67.46%,
విభాగాలు
- జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి: చురు, రత్నగర్ (చురు), రేణి (రాజస్థాన్), రాజ్‌గర్ (చురు), సర్దర్షహర్, సుజన్గర్.
- జిల్లాలో ప్రధాన పంటలు: జొన్న, పప్పులు.
- జిల్లాలో లభిస్తున్న ఖనిజాలు: రాగి, జిప్సం.
ఆకర్షణలు
జిల్లాలో సుజనగర్, రతనగర్, సర్దషహర్, తరంగర్, రాజ్‌గర్, రతన్నగర్, చప్పర్, బిద్సర్, రాజల్దేసర్ మొదలైన ప్రధాన పట్టణాలు ఉన్నాయి. జిల్లాలో తల్చప్పర్ అభయారణ్యం, బ్లాక్‌బక్ అభయారణ్యం పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి. బ్లాక్‌బాక్ అభయారణ్యంలో 1,680 బ్లాక్‌బక్, వసల పక్షులు ఉన్నాయి. రత్నగర్‌లో పలాటియల్ హవేలీలు ఉన్నాయి. హనుమాన్ ఆలయం, సలసర్ బాలాజీ, సుజనగర్ వద్ద వెంకటేశ్వరాలయం ఉన్నాయి. రాజల్దేసర్ వద్ద భధ్రకాళీ ఆలయం ఉంది. ఇది దేశం అంతటి నుండి శాక్తేయులు భధ్రకాళీని ఆరాధిస్తున్నారు. ఈ ఆలయాన్ని అనంత్ ష్రీ విభూషిత్ దండి స్వామీ జోగేంద్రాశ్రంజీ మహరాజ్ నిర్మించాడు. నవా సమీపంలో ఉన్న నాథ్ ఆలయం, నాథ్ ప్రజలు నివసిస్తున్న రాజ్‌గర్ ప్రజలలో ప్రాబల్యత కలిగి ఉన్నాయి.
2011 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,041,172,[2] |
ఇది దాదాపు. | బోత్సువానా దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 224 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 148 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 6.1%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 938 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 67.46%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
వివరణ
స్థానిక కార్మిక శక్తి పంపిణీ శాతం
- రైతులు: 73,17%
- వ్యవసాయ కార్మికులు: 3.16%
స్థానిక పరిశ్రమలు
- ప్రోసెసింగ్, సర్వీసింగ్,, మరమ్మతు: 2.26%
- ఇతర కార్మికులు: 21,41%
ప్రధాన పంట ఉత్పత్తి
- గోధుమలు: 60.654 టన్నుల
- రాప్ విత్తన, ఆవాల: 24.705 టన్నుల
- పప్పు దినుసులు: 9.594 టన్నుల
- గ్రామ: 316 టన్నుల
- సజ్జ: 2545467 టన్నుల
కమ్యూనికేషన్ సౌకర్యాలు
- పబ్లిక్ కాల్ కార్యాలయాలు: 682
- పోస్ట్ కార్యాలయాలు: 392
- టెలిగ్రాఫ్ కార్యాలయాలు: 89
- టెలిఫోన్ ఎక్స్చేంజ్: 83
విద్య సౌకర్యాలు , సంస్థలు
- ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు: 1,472
- ఉన్నత, పాఠశాలలు: 207
- ప్రైవేట్ బీఈడీ కళాశాలల్లో: 14
- పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్: 11
- ఐటీఐలు: 3
- ప్రభుత్వ బీఈడీ కళాశాలల్లో: 1
పారిశ్రామిక దృష్టాంతంలో
పెద్ద, మధ్య తరహా కర్మాగారాల 2, చిన్న తరహా యూనిట్ల 3.963, పారిశ్రామిక ప్రాంతాలు 6
మౌలిక సదుపాయాలు
జిల్లాలో భక్రా హైడల్ కాంప్లెక్స్ జిల్లకు అవసరమైన విద్యుత్తును అందిస్తుంది. ఈ ప్రణాళిక కారణంగా 926 గ్రామాలకు విద్యుత్తు అందుతూ ఉంది. జిల్లాలో సుజనగర్, తరంగర్ తాలూకాలలో కాక మిగిలిన ప్రాంతాలలో నీరు 30 నుండి 48 అడుగుల లోతులో నీరు లభిస్తుంది. జాతీయరహదారి-11 జిల్లాను దేశంలోని ఇతరప్రాంతాలతో అనుసంధానం చేస్తూ ఉంది.జిల్లాలో రహదార్ల మొత్తం పొడవు 3,010 కి.మీ. ఢిల్లీ నుండి 270 కి.మీ దూరంలో ఉంది. జిల్లాలో ఉన్న నార్త్ వెస్టర్న్ రైల్వే స్టేషను జిల్లాను ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేద్తుంది.జిల్లాకు సమీపంలో ఉన్న విమానాశ్రయం జైపూర్‌లో ఉంది.
ప్రాథమిక పరిశ్రమలు
- అల్యూమినియం పాత్రలు
- బ్లాంకెట్ నేత
- సిమెంట్ ఉత్పత్తి
- చురన్
- చట్ని
- గుయార్గం
- చేనేత వస్త్రం
- ఐరన్, ఉక్కు తయారీ
- ఆయిల్ ఉత్పత్తి
- ఉప్పు ఉత్పత్తి
సరిహద్దులు
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.