రాజస్థాన్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
పాలి జిల్లా, ఇది పశ్చిమ భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఈ జిల్లాకు పాలి పట్టణం ప్రధాన పరిపాలనా కేంద్రంగా ఉంది.
పాలీ
పాలీ జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
రాజస్థాన్ జిల్లాలు | |||||||
దేశం | భారతదేశం | ||||||
రాష్ట్రం | రాజస్థాన్ | ||||||
జిల్లా | పాలీ | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 12,387 కి.మీ2 (4,783 చ. మై) | ||||||
జనాభా (2011) | |||||||
• Total | 20,38,533 | ||||||
• జనసాంద్రత | 165/కి.మీ2 (430/చ. మై.) | ||||||
భాషలు | |||||||
• అధికారిక | మార్వారీ, హిందీ | ||||||
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) | ||||||
పిన్ | 306401 | ||||||
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 02932 | ||||||
Vehicle registration | RJ-22 | ||||||
అక్షరాస్యత | 63.23% | ||||||
లోక్‌సభ నియోజకవర్గం | పాలీ లోక్‌సభ నియోజక వర్గం | ||||||
సగటు వార్షిక ఉష్ణోగ్రత | 22.5 °C (72.5 °F) | ||||||
సగటు వేసవి ఉష్ణోగ్రత | 45 °C (113 °F) | ||||||
సగటు శీతాకాలపు ఉష్ణోగ్రత | 00 °C (32 °F) |
కుషాను యుగంలో రాజు కనిష్కుడు సా.శ. 120 లో పాలి జిల్లాలో భాగమైన రోహత్, జైతరన్ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు. సా.శ. 7వ శతాబ్దం చివరి వరకు ఈ ప్రాంతాన్ని రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాలతో సహా చాళుక్య రాజు హర్షవర్థనుడు పాలించాడు.
10 నుండి 15 వ శతాబ్దం వరకు పాలి సరిహద్దులు ప్రక్కనే ఉన్న మేవార్, గాడ్వాడ్, మార్వార్ వరకు విస్తరించాయి. నాడోలు చౌహానుల రాజధానిగా ఉండేది. రాజపుత్ర పాలకులందరూ విదేశీ ఆక్రమణదారులను ప్రతిఘటించారు. వ్యక్తిగతంగా వారిలో, ఒకరికు ఒకరు భూభాగం మీద ఆధిపత్యం, నాయకత్వం కోసం పోరాడారు. మహమ్మద్ గౌరీ చేతిలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓటమి తరువాత ఈ ప్రాంతంలో రాజపుత్ర శక్తి విచ్ఛిన్నమైంది. పాలిలోని గాడ్వాడ్ ప్రాంతం అప్పటి మేవార్ పాలకుడు మహారాణా కుంభ పాలనలో ఉండేది. కానీ పొరుగున ఉన్న రాజపుత్ర పాలకుల ప్రోత్సాహంతో బ్రాహ్మణ పాలకులు పాలించిన పాలి నగరం శాంతియుతంగా, ప్రగతిశీలంగా ఉండేది.
16, 17 వ శతాబ్దాలలో పాలి పరిసర ప్రాంతాలలో అనేక యుద్ధాలు జరిగాయి. జైతరన్ సమీపంలో జరిగిన గిరి యుద్ధంలో షెర్షా సూరిని రాజపుత్ర పాలకులు ఓడించారు. మొఘలు చక్రవర్తి అక్బరు సైన్యం గోడ్వాడ్ ప్రాంతంలో మహారాణా ప్రతాప్‌తో నిరంతరం పోరాటాలలో పాల్గొంది. మొఘలులు దాదాపు రాజపుతానా అంతటినీ జయించిన తరువాత, మార్వారుకు చెందిన వీరదుర్గాదాస్ రాథోడ్ చివరి మొఘలు చక్రవర్తి ఔరంగజేబు నుండి మార్వార్ ప్రాంతాన్ని విడిపించడానికి వ్యవస్థీకృత ప్రయత్నాలు చేశాడు. అప్పటికి పాలి మార్వార్ రాష్ట్రంలోని రాథోరులకు లొంగిపోయింది. తరువాత పాలిని మహారాజా విజయ సింగ్ పునరుద్ధరించాడు. త్వరలోనే ఇది ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా మారింది.
1857 లో భారతదేశంలో బ్రిటీషు శకంలో ఔవాకు చెందిన ఠాకూరు నాయకత్వంలో పాలీకి చెందిన వివిధ ఠాకూర్లు బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. బ్రిటిషు సైన్యం ఆవా కోటను చుట్టుముట్టిన తరువాత ఘర్షణలు చాలా రోజులు కొనసాగాయి.
భౌగోళిక శాస్త్రవేత్తలు చరిత్రపూర్వకాలం నుడి పాలి ఉనికిలో ఉన్నట్లు గుర్తించారు. రాజస్థాన్‌లో ఎక్కువ భాగం విస్తరించి ఉన్న విస్తారమైన పశ్చిమ సముద్రం నుండి ఇది ఉద్భవించిందని పేర్కొన్నారు. పురాతన అర్బుడా ప్రావింసులో భాగంగా ఈ ప్రాంతాన్ని బల్లా-దేశ్ అని పిలుస్తారు.
సంవత్సరం | జనాభా | ±% p.a. |
---|---|---|
1901 | 3,93,837 | — |
1911 | 4,56,627 | +1.49% |
1921 | 4,03,318 | −1.23% |
1931 | 4,73,063 | +1.61% |
1941 | 5,55,586 | +1.62% |
1951 | 6,60,856 | +1.75% |
1961 | 8,05,682 | +2.00% |
1971 | 9,70,002 | +1.87% |
1981 | 12,74,504 | +2.77% |
1991 | 14,86,432 | +1.55% |
2001 | 18,20,251 | +2.05% |
2011 | 20,37,573 | +1.13% |
source:[1] |
ఆరావళి శ్రేణి జిల్లాకు తూర్పు సరిహద్దుగా ఉంది. దక్షిణ సరిహద్దు వైపున్న "సుమెర్పూర్ తహసీలు" లోని బామ్నేరా గ్రామంలో ముగుస్తుంది. పశ్చిమాన పర్వతప్రాంతం ఉంది. ఈ పర్వతశ్రేణి లూని నదికి, అనేక ఉపనదులకూ జన్మస్థానంగా ఉంది. జిల్లా పశ్చిమ భాగంలో లూని ఒండ్రు మైదానం ఉంది. ఈ జిల్లా సరిహద్దులలో 8 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరసరిహద్దున నాగౌర్ జిల్లా, ఈశాన్యసరిహద్దున అజ్మీర్ జిల్లా, తూర్పుసరిహద్దున రాజ్‌సమంద్ జిల్లా, ఆగ్నేయం సరిహద్దున ఉదయపూర్ జిల్లా, నైరుతిలో సిరోహి జిల్లా, పశ్చిమాన జలోర్ జిల్లా - బార్మర్ జిల్లా, వాయవ్యంలో జోధ్‌పూర్ జిల్లా ఉన్నాయి. జిల్లాలోని ప్రధాన భాగం సముద్రమట్టానికి 200 నుండి 300 మీటర్ల ఎత్తున ఉంది. కాని తూర్పున ఆరావళి పర్వతశ్రేణి వైపు క్రమక్రమంగా ఎత్తు పెరుగుతూ సగటు 600 మీ. నుండి కొన్ని ప్రదేశాలలో ఎత్తు 1000 మీ ఎత్తుకు చేరుకుంటుంది.[2] పాలిజిల్లా 24.75 డిగ్రీలు - 26.483 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 72.783 డిగ్రీల - 74.30 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది.
సాగునీటి సౌకర్యం ఉన్న భూమి విస్తీర్ణం 2824.02 చ.కి.మీ. జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఇది 22.79%. జిల్లాలో నీటిపారుదల ప్రధాన వనరులు బావులు. ఇవి మొత్తం నీటిపారుదల ప్రాంతంలో 75% శాతం. తరువాత, చెరువులు 20% నీటిని అందిస్తున్నాయి. గొట్టపు బావులు 5% ఉన్నాయి. జిల్లాలో 92% ఆనకట్టలు ఉన్నాయి. వాటిలో మూడు ఆనకట్టలు (గజ్ని, పొటాలియా, చిపాటియా వద్ద) శిథిలమయ్యాయి. అన్ని ఆనకట్టల మొత్తం పరీవాహక ప్రాంతం 2,38,150.14 ఎకరాలు (963.7594 చ.కి.మీ). 1990 లో 89 ఆనకట్టల సామర్థ్యం 20197.3 మిలియన్ల క్యూబికు అడుగులు.[3]
జిల్లాలో 48 ఆనకట్టలు ఉన్నాయి. ఇవి (పూర్తయిన తేదీ):[4][5] జాబితా
1 జవై డం (1957)
2 సర్దర్ సమంద్ ఆనకట్ట (1905)
3 హెమవస్ ఆనకట్ట (1911)
4 ఫులద్ ఆనకట్ట (1972)
5 సింద్రూ (1977)
6 సది ఆనకట్ట
7 బబ్ర (1981)
8 కన (1961),
9 కెర్ (1977),
10 జున మాలరి (1978),
11 దాండియ (1978),
12 షివ్నథ్ సాగర్ (1971),
13 గిరి-నంద ఆనకట్ట
14 బంక్లి ఆనకట్ట
15 ఖర్ద ఆనకట్ట
16 రజ్పుర ఆనకట్ట
17 తఖత్గర్హ్ ఆనకట్ట
18 మిథరి ఆనకట్ట
19 కలిబొర్ ఆనకట్ట
20 వయద్,
21 సలికి ధని,
22 ఖివంది,
23 బనియవస్,
24 ఎంద్ల,
25 గిరొలియ,
26 బొరినద ఆనకట్ట
27 సిరియరి,
28 కంతలియ,
29 జొగ్దవస్ 1
30 జొగ్దవస్ 2
31 సరన్,
32 సిందర్లి [6]
33 ఛిర్పతియ,
34 కొత్ బలియన్,
35 దంతివర,
36 లతర,
37 ఫుతియ,
38 పీప్ల,
39 సెవరి
40 రజ్సగర్ చోప్రా
41 మల్పురియ,
42 కనవస్,
43 ముథన,
44 బంది నెహర,
45 బొందర,
46 కెసులి,
47 లోదియ,
48 హరిఒం సాగర్,
49 సలికి నల్.
ఈ ఆనకట్టల వలన ఏర్పడిన జలాశయాలను సాగునీటి అవసరాలకు, అలాగే తాగునీరు, వరద నియంత్రణ కోసం ఉపయోగిస్తారు. పశ్చిమ రాజస్థాన్‌లో జవాయి ఆనకట్ట అతిపెద్ద ఆనకట్టగా ఉంది. ఇది వేసవి రోజులలో జిల్లా అంతటికీ తాగునీటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
లూని నది ఆరావళి పర్వతశ్రేణి పశ్చిమప్రాంత కొండవాలులలో అజ్మీరు సమీపంలో 550 మీటర్ల ఎత్తులో ఉద్భవించింది. రాజస్థాన్ నైరుతిలో ప్రవాహం తరువాత సుమారు 495 కిలోమీటర్ల దూరంలో, ఇది రాన్ ఆఫ్ కచ్ చిత్తడి భూమిలో అదృశ్యమవుతుంది. రాజస్థాన్‌లోని లుని నదీముఖద్వారంలో మొత్తం పరీవాహక ప్రాంతం 37,363 చ.కి.మీ. ఇది అజ్మీర్, పాలి, జోధ్పూర్, నాగౌర్, బార్మరు, జలోర్, గుజరాత్ జిల్లాల భూభాగాలను కలిగి ఉంది. రాజస్థాన్‌లో 330 చ.కి.మీ, గుజరాతులో 20 చ.కి.మీ ఉంది.జిల్లాలో అతిపెద్ద నది లూని. జిల్లాలో దాని ప్రధాన ఉపనదులు జవాయి, లిల్రి, మిథారి, సుక్రీ, బాండి, గుహియా ప్రవహిస్తున్నాయి.[7]
పాలి జిల్లాలోని ఖరీయానివ్, తారసాని గ్రామాల సమీపంలో కొండలలో గుహియా నది ఉద్భవించింది. ఇది ఫెకారియా గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న బండి నదిలో సంగమిస్తుంది. పాలి జిల్లాలో ఉన్న ఈ పరీవాహక ప్రాంతం 3,835 చ.కి.మీ. దానికి రాయ్పూరు లూని, రాడియా నాడి, గురియా నాడి, లిల్రి నాడి, సుక్రీ, ఫున్ఫారియా బాలా మొదలైన ఉపనదులు ఉన్నాయి.
సోరిసరు (మూలం: ఆరావళి పశ్చిమ వాలులలోని సోమెసరు గ్రామానికి సమీపంలో), ఖరీ ఖేర్వా, ఉమ్రావాసు కా నాలా (మూలం: ఆరావళి పశ్చిమ వాలులలో బాగోలు కంక్లావాసు సమీపంలో), కోట్కి నది (మూలం: డీవైరు రిజర్వు ఫారెస్టు భాకరు, సుమారు 30 కి.మీ ప్రవాహం తరువాత)ల సంగమం ద్వారా ఖారీ నది ఏర్పడుతుంది. ఈ చిన్న ప్రవాహాలన్నిటిలో చేరిన తరువాత ఈ నదిని ఖరీ అని పిలుస్తారు. సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రవహించిన తరువాత, ఇది హేమావాసు రిజర్వాయరు దిగువ బండి నదిలో కలుస్తుంది. దీని పరీవాహక ప్రాంతం 1,232 చ.కి.మీ.
బొంబాడ్రా సమీపంలో వీర్ ఖరీ, మిథారి నదులు చేరి బండి నదిని ఏర్పరుస్తాయి. తరువాత బండి నది సుమారు 45 కిలోమీటర్ల దూరం ప్రవహించిన తరువాత లఖరు గ్రామానికి సమీపంలో ఉన్న లూని నదిలో సంగమిస్తుంది. పరీవాహక ప్రాంతం సుమారు 1,685 చ.కి.మీ పాలి జిల్లాలో ఉంది.
పాలి జిల్లాలోని ఆరావళి శ్రేణి నైరుతి వాలులలో స్థానిక నాలాసు సంగమం ద్వారా మిథారి నది ఉద్భవించింది. జలోర్ జిల్లాలోని సంఖ్వాలి గ్రామానికి సమీపంలో ఉన్న ఇసుక మైదానాలలో ఇది కనుమరుగవుతుంది. ఇది జవాయి, బాలి, ఇండియా, ఫల్నా గుండా 80 కిలోమీటర్ల దూరం వాయవ్య దిశలో ప్రవహిస్తుంది. పరీవాహక ప్రాంతం పాలి, జలోర్ జిల్లాల్లో ఉంది. ఈ నది పరీవాహక ప్రాంతం 1,644 చ.కి.మీ.
పాలి, ఉదయపూరు జిల్లాలలోని ఆరావళిల నుండి ఉద్భవించిన ఘనేరవు నాడి, ముతనా కా బాలా, మాగై నాడి మొదలైన అనేక చిన్న నాలాల సంగమం ద్వారా సుక్రీ నది ఏర్పడుతుంది. ఇది 110 కిలోమీటర్ల దూరం ఆగ్నేయ నుండి వాయవ్య దిశలలో ప్రవహించి మార్గంలో బంక్లీ ఆనకట్టకు నీటితో నింపి, బార్మెరు జిల్లాలోని సమదారీ సమీపంలో ఇది లూని నదిలో సంగమిస్తుంది. ఈ ఉప-బేసిను ప్రాంతంలో జలోర్, పాలి, బార్మరు జిల్లాలు ఉన్నాయి. దీని పరీవాహక ప్రాంతం 3,036 చ.కి.మీ.
జవాయి నది ఉదయపూర్ జిల్లాలో ఆరావళి పర్వతశ్రేణి పశ్చిమ వాలులలో ప్రధాన ఉపనది సుక్రీతో ఉద్భవించి ఇది సయాలా సమీపంలోని జలూరు జిల్లాలోని ఖరీ నదిలో సంగమిస్తుంది. ఈ నది వాయవ్య దిశలో 96 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీని పరీవాహక ప్రాంతం 2,976 చ.కి.మీ.
జిల్లాలో తొమ్మిది ఉపవిభాగాలు ఉన్నాయి: సోజాతు, మార్వార్ జంక్షన్, జైతరన్, రాయ్పూరు, సుమేర్పూరు, బాలి, పాలి, రోహతు, దేశూరి.
జిల్లాలో తొమ్మిది తహసీళ్ళు ఉన్నాయి: సోజాతు, మార్వార్ జంక్షన్, జైతరన్, రాయపూరు, సుమేర్పూరు, బాలి, పాలి, రోహతు, దేశూరి.రాణిని రాజస్థాన్ బడ్జెటు సమావేశాలలో -2012-13లో 10 వ తహసీలుగా ప్రకటించారు.[8]
జిల్లాలో 8 పురపాలకాలు ఉన్నాయి: సొజత్, జైతరన్, సుమెర్పుర్, సద్రి, బలి, (ఈండీ) ఫల్న, తఖత్గర్హ్ అంద్ రని, రాజస్థాన్ వైల్ పలి ( రాజస్థాన్).పాలి జిల్లాలో 1012 గ్రామాలు 320 గ్రామపంచాయితీలు ఉన్నాయి. వీటిలో కొన్ని గ్రామాలు థాకుర్ల రాజ్పురోహితన్, మార్వార్ జంక్షన్, బంత టౌన్, షివ్లతొవ్, రాయ్పూర్ (రాజస్థాన్) సందెరవు, రొహత్, సొజత్ రోడ్, ఖరియ సొధ, బగ్రి నగర్, నిమజ్, నదొల్, అక్దవస్ (భటి), బగొల్, ఖిన్వర, పనొత, భరుంద, బమ్నెర, కొలివర, రానక్, సిందెర్లి, ఫిప్లియ కళ్ళన్, బిజౌఅ, బీజాపూర్, పదర్ల (పదల్ల), సెవరి, ష్రీ సెల (చౌహాన్ వీరులు) బొయ, భతుంద్, భందర్, ఘనెరవు,నన (పలి) బెద, బసంత్, చంచొరి, పునదియ, వింగర్ల, ఖిమెల్, మందియ మొదలైనవి.[9]
జిల్లాకు రాష్ట్ర శాసనసభలో ఆరుగురు ఎమ్మెల్యే నియోజకవర్గాలు (సోజాతు, జైతరన్, సుమేర్‌పూరు, బాలి, పాలి, మార్వార్ జంక్షన్) ఉన్నాయి. పార్లమెంటులో లోక్‌సభ సభ్యుడు (పాలి (లోక్‌సభ నియోజకవర్గం) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జిల్లాలో అందుబాటులో ఉన్న రెండు మార్గాలు రహదార్ల మార్గాలు, రైల్వేలు మాత్రమే.దాదాపు అన్ని గ్రామాలు రహదారులతో అనుసంధానించబడి ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని పాలి, ఫల్నాలలో రాష్ట్ర ప్రభుత్వ డిపోలు ఉన్నాయి.
జిల్లాలోని ఏకైక రైల్వే జంక్షన్ మార్వార్ జంక్షను. ఇది జోధ్పూరు, అజ్మీరు, అహ్మదాబాదు, ఉదయపూరులతో అనుసంధానించబడి ఉంది. జోధ్పూరు మార్గంలో ఉన్నపాలి రైల్వే స్టేషను అజ్మీరు డివిజనులో అత్యధికంగా సంపాదించే రెండవ రైల్వే స్టేషనుగా గుర్తించబడుతుంది. జిల్లాలోని ఇతర ముఖ్యమైన రైల్వే స్టేషన్లు రాణి, జవాయి బంధు, సోజాత్ రోడు, ఫల్నా ఉన్నాయి.
1881 లో రాజ్‌పుతానా స్టేట్ రైల్వే అహ్మదాబాద్-అజ్మీర్ మార్గం ప్రారంభించడంతో భారత రైల్వే ప్రారంభంలోనే ఈ జిల్లాకు రైల్వే వచ్చింది. పాలి 1882 జూన్ 24 న మార్వార్ జంక్షన్, 1884 జూన్ 17 న లూనితో అనుసంధానించబడింది. జోధ్పూరు 1885 లో రాజ్పుతానా-మాల్వా రైల్వే నెట్వర్కు లూని ద్వారా జిల్లాకు అనుసంధానించబడి ఉంది. ఈ మార్గం తరువాత జోధ్పూరు-బికానెరు రైల్వేలో భాగం అయింది.[10]
ఫులేరా-మార్వార్ జంక్షను మార్గం 1995 లో మీటరు గేజు నుండి బ్రాడు గేజుగా మార్చబడింది. అహ్మదాబాదు-అజ్మీరు మార్గం 1997 లో మార్చబడింది.[11] 1997-98 వరకు 72 కిలోమీటర్ల జలోర్-ఫల్నా మార్గాన్ని కూడా భారత రైల్వే సర్వే చేసింది. కాని మార్గం వేయలేదు.[12]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,038,533,[13] |
ఇది దాదాపు. | స్లోవేనియా దేశ జనసంఖ్యకు సమానం.[14] |
అమెరికాలోని. | న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[15] |
640 భారతదేశ జిల్లాలలో. | 225 వ స్థానంలో ఉంది.[13] |
1చ.కి.మీ జనసాంద్రత. | 165 [13] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 11.99%.[13] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 987:1000 [13] |
జాతీయ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 63.23%.[13] |
జాతీయ సరాసరి (72%) కంటే. | తక్కువ |
జిల్లాలో మెహంది తయారీ యూనిట్లలో టెక్స్టైలు డైయింగు అండ్ ప్రింటింగు, గొడుగులు, వైరు నెట్టింగు, కాటను జిన్నింగు, ఎసిఎస్ఆర్ కండక్టర్లు, వ్యవసాయ పరికరాలు, కండక్టు పైపులు, సిమెంటు (పోర్టుల్యాండు), గ్వార్గం, హ్యాండిలు తయారీ యూనిట్లు, మందులు, పురుగుమందులు, ఉక్కు ఫర్నిచరు ఉన్నాయి. జిల్లాలో పరిశ్రమలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 15 పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధి చేసింది: మాండియా రోడ్ (పాలి), పాత పారిశ్రామిక ప్రాంతం (పాలి) (పాలి మొదటి దశ), పాలి రాజస్థాన్ రెండవ దశ, పాలి ఐదవ దశ, మార్వార్ జంక్షను, పునయాట రోడ్ (పాలి), పిప్లియా కలాను, సోజాత్ సిటీ 1 & 2 ఫేజి, సోజాత్ సిటీ 3 ఫేజి, సుమేర్పూర్ ఇండస్ట్రియల్ ఏరియా, సుమేర్పూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఎమ్ / ఎస్, డి.ఎల్.ఎఫ్. సిమెంట్ లిమిటెడ్.
రణక్పూర్ జైన దేవాలయం - పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్ లోని పాలి జిల్లాలోని సద్రి పట్టణానికి సమీపంలో ఉన్న దేశూరి తహసీలులో ఉన్న గ్రామం రణక్పూరు. ఇది జోధ్పూరు, ఉదయపూరు మధ్య, ఆరావళి శ్రేణికి పశ్చిమాన ఒక లోయలో ఉంది. రణక్పూరు జైన దేవాలయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న జైనసమాజం ఎంతో గౌరవిస్తూ ఉంది. రాణాకుంభ పాలనలో నిర్మించిన ఈ దేవాలయాల కారణంగా రణక్పూరు భారతదేశంలోని జైనుల ఐదు ప్రధాన యాత్రికుల గమ్యస్థానాల జాబితాలో చేర్చబడింది. ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలనే తన కలను సాకారం చేసుకోవడానికి రాణాకుంభ ధన్నాషాకు విస్తారమైన భూమిని విరాళంగా ఇచ్చినట్లు చరిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ దేవాలయాలకు వార్షికంగా దేశ, విదేశాల నుండి వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుంది.
రణక్పూర్ గ్రామం ముఖ్యమైన జైన దేవాలయానికి నిలయం. ఈ ఆలయానికి 400 కంటే అధికమైన పాలరాయి స్తంభాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ జైన దేవాలయం ఎదురుగా చాలా పురాతనమైన సూర్య దేవాలయం ఉంది. రణక్పూరు దేవాలయాలు తమదైన శైలిని ప్రదర్శిస్తాయి. దేవాలయాల పైకప్పులు ఫోలియేటు స్క్రోలు వర్కు, రేఖాగణిత నమూనాలతో అలంకరించబడి ఉంటాయి. గోపురాల ఎగువ, దిగువ భాగం వాటి మీద దేవతల బొమ్మలతో బ్రాకెట్సు చేర్చబడ్డాయి. కాంప్లెక్సు పరిధిలోని అన్ని దేవాలయాలలో ముఖ్యమైనది చౌముఖ ఆలయం. మొదటి జైన తీర్థంకరుడు ఆదినాథుకు అంకితం చేయబడిన ఇది నాలుగు ముఖాల ఆలయం. ఇందులో 48,000 చదరపు అడుగుల (4,500, 2) నేలమాళిగ ఉంది. ఈ ఆలయంలో నాలుగు అనుబంధ మందిరాలు, 24 స్తంభాల మందిరాలు, 80 గోపురాలు దాదాపు 400 స్తంభాలు ఉన్నాయి (ఆలయ సముదాయంలోని మొత్తం స్తంభాల సంఖ్య 1444). ప్రతి నిలువు వరుసలు గొప్పగా చెక్కబడ్డాయి. వీటిలో ఏ రెండు స్తంభాలు ఒకే రూపకల్పనను కలిగి ఉండకపోవడం విశేషం. అంతేకాక నిలువు వరుసలు పగటిపూట ప్రతి గంట గడిచేకొద్దీ బంగారు వర్ణం నుండి లేత నీలం రంగులోకి మారుతాయి.
పశ్చిమ రాజస్థాన్ పాలి జిల్లాలోని సుమేర్పూరు తహసీలులో ఉంది. దీని సామర్థ్యం 6000 మిలియన్ల క్యూబికు అడుగులు. జవాయి ఆనకట్ట మంచి పర్యాటక ప్రదేశంగా ఉంది.
పరశురాం మహాదేవ ఆలయం దేశూరి తహసీలులో ఉంది. ఈ ఆలయం ఒక ఆరావళి కొండలలో మీద ఉంది. పరశురాముడు తన గొడ్డలితో నిర్మించిన శివుని ప్రసిద్ధ ఆలయం ఇది. ఈ ఆలయం పాలిలోని సద్రి పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పవిత్ర ఆలయం ఉన్న ఓం బన్నా నగరం జోధ్పూరు-పాలి హైవే నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓం బన్నా రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రదేశం ఇది. ఓం బన్నా మోటారు బైకు భక్తుల కోసం పూజలు కోసం ఉంచారు.
నింబో కా నాథు మహాదేవాలయం ఫల్నా - సాండెరావు మార్గంలో ఉంది. అరణ్యవాస సమయంలో పాండవులు తల్లి కుంతితో ఇక్కడే ఉన్నారని ఒక పురాణకథనం ఉంది. కుంతి ఈ ప్రదేశంలో శివుడిని పూజించింది.
లారియా మహారాజ్ కా ఆలయం సోరియా నగరంలో మార్వార్ కూడలి మార్గంలో ఉంది. ఇది ఖరియా సోధా గ్రామానికి సమీపంలో ఉంది. లావాజీ మహారాజ్ (క్షత్రియ యోధుడు) ఆవుల్లాంటి జంతువులను కాపాడటానికి తన జీవితాన్ని అంకితం చేసాడు.
రణక్పూరు ఆలయంతో జిల్లాలో శ్రీ వర్కనా పార్శ్వనాథు జైన తీర్థం, శ్రీ రతమహవీరు జైనతీర్థం, ముచ్చలు మహావీరాలయం, ఘనేరావు, శ్రీ నార్లై జైన తీర్థం, శ్రీ నాడోలు జైన తీర్థం, శ్రీ శాంతినాథు జైన చింతవాను శివ పాథు సుమవన్ వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి.
పాలి జిల్లాలో ప్రముఖ ఆలయాలే కాకుండా జదను ఆశ్రమం, బంగూర్ మ్యూజియం, లఖోటియా గార్డెన్, మన్పురా భఖారీ, మహారాణా ప్రతాప్ స్మారకం మొదలైన పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. జదాను ఆశ్రమం పాలి జిల్లాలోని మార్వార్ కూడలి తహసీలులో ఉంది. పాలి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. 'ॐ' (హిందువులలో ఓం-పవిత్ర అక్షరం) ఆకార భవనం.
పాలిలో ధన్మండి కచేడి సమీపంలోని నానిహాలు (తల్లి తండ్రి ఇల్లు) వద్ద మహారాణా ప్రతాప్ జన్మించాడు. ఇది మూడుసార్లు నాశనం చేయబడి పునః స్థాపించబడింది. మీరా బాయి 1498 లో జైతారను కుడ్కిలో జన్మించింది. నాడోలు ఒకప్పుడు పృథ్వీరాజు చౌహాను సామ్రాజ్యానికి రాజధానిగా ఉంది.
జిల్లాలో జరిగే ముఖ్యమైన ఉత్సవాలలో ఆనా ఉత్సవంలో శ్రీ సోనానా ఖెట్లాజీలు, పరశురామ మహాదేవ్జీ ఉత్సవం, నింబో కా నాథు (నింబేశ్వర మహాదేవ) ఉత్సవం ముఖ్యమైనవి. బై కొథారి కుటుంబం " ఆల్ ఆర్ వెల్కం " బాగోల్ ఫన్ ఫెయిర్ ఫాల్గన్-ఫెస్టివల్ సందర్భంగా భజన్ సంధియా & ఫాల్గుణమాసంలో మహాదేవ గైరు దండియా యాత్ర నిర్వహిస్తుంది. 16 వ శతాబ్దంలో సోలంకి పాలకులు (1515 లో) బోలంకి గ్రామం స్థాపించారు.
1991 లో అక్షరాస్యత 54.92% ఉండగా 2001 గణాంకాల నాటికి 63.23% నికి చేరుకుంది. వీరిలో పురుషుల అక్షరాస్యత 78.16%, స్త్రీల అక్షరాస్యత 48.35%. అక్షరాస్యత ప్రచారం పూర్తిస్థాయిలో చేసినందుకు జిల్లాకు 1994 లో సత్యెను మాత్రియా అవార్డు లభించింది.
జిల్లాలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి పాఠశాలలు చాలా ఉన్నాయి. 1986 విద్యా విధానం ఆధారంగా పాలీ జిల్లాలో మార్వార్ కూడలి తహసీలులో జవహరు నవోదయ విద్యాలయ గ్రామం జోజావరు ఉంది. దీనికి జవహరు నవోదయ విద్యాలయం; జోజవారు పాఠశాల ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.