సిరోహి జిల్లా
రాజస్థాన్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో సిరోహి జిల్లా ఒకటి. సిరోహి పట్టణం ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది. సిరోహి జిల్లాలో మౌంట్ అబూ పెద్ద నగరంగా, పెద్ద వాణిజ్య కేంద్రంగా ఉంది.2011 గణాంకాల ఆధారంగా సిరోహి జిల్లా రాష్ట్రంలో అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో మూడవదిగా గుర్తించబడింది.మొదటి రెండు స్థానాలలో జైసల్మేర్, ప్రతాప్‌గఢ్ జిల్లాలు ఉన్నాయి.[1]
సిరోహి జిల్లా | |
---|---|
![]() గురు శిఖర్, రాజస్థాన్‌లోని ఎత్తైన ప్రదేశం | |
![]() రాజస్థాన్ పటంలో సిరోహి జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
జిల్లా ముఖ్యపట్టణం | సిరోహి |
విస్తీర్ణం | |
• Total | 5,136 కి.మీ2 (1,983 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 10,36,346 |
• జనసాంద్రత | 200/కి.మీ2 (520/చ. మై.) |
Time zone | UTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం) |
చారిత్రిక జనాభా
సంవత్సరం | జనాభా | ±% p.a. |
---|---|---|
1901 | 1,62,965 | — |
1911 | 1,89,684 | +1.53% |
1921 | 1,88,781 | −0.05% |
1931 | 2,16,602 | +1.38% |
1941 | 2,35,760 | +0.85% |
1951 | 2,89,791 | +2.08% |
1961 | 3,52,303 | +1.97% |
1971 | 4,23,815 | +1.87% |
1981 | 5,42,049 | +2.49% |
1991 | 6,54,029 | +1.90% |
2001 | 8,51,107 | +2.67% |
2011 | 10,36,346 | +1.99% |
source:[2] |
2011 గణాంకాలు
2011 భారత జనాభా లెక్కల ప్రకారం రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో మొత్తం జనాభా 1,036,346. వీరిలో 534,231 మంది పురుషులు కాగా, 502,115 మంది మహిళలు ఉన్నారు. 2011 లో సిరోహి జిల్లాలో మొత్తం 201,785 కుటుంబాలు నివసిస్తున్నాయి. సిరోహి జిల్లా సగటు సెక్స్ నిష్పత్తి 940.మొత్తం జనాభాలో 20.1% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 79.9% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత 78.7% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 49%గా ఉంది. సిరోహి జిల్లాలోని పట్టణ ప్రాంతాల సెక్స్ నిష్పత్తి 897 కాగా, గ్రామీణ ప్రాంతాలు 951గా ఉంది.
సిరోహి జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 173364, ఇది మొత్తం జనాభాలో 17%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 91370 మంది మగ పిల్లలు, 81994 ఆడ పిల్లలు ఉన్నారు.బాలల లైంగిక నిష్పత్తి 897, ఇది సిరోహి జిల్లాలోని సగటు సెక్స్ నిష్పత్తి (940) కన్నా తక్కువ.జిల్లాలో మొత్తం అక్షరాస్యత రేటు 55.25%. సిరోహి జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 58.01%, మహిళా అక్షరాస్యత రేటు 33.24%గా ఉంది.[3]
2001 గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,037,185, [1] |
ఇది దాదాపు. | సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | రోడ్ ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం..[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 437వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 202[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 21.86%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 938:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 56.02%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
చరిత్ర
1948లో సిరోహి భూభాగాన్ని బాంబే రాజాస్థానం స్వాధీనం చేసుకుంది.[6]1950లో సిరోహి రాజస్థాన్ రాష్ట్రానికి ఇవ్వబడింది. అప్పుడు దీని భూభాగవైశాల్యం 787 చ.కి.మీ. ఇందులో అబూ రోడ్డు తాలూకా, దెల్వారా తాలూకాలోని కొంత భూభాగం బంబే రాజస్థానంలో కలుపబడింది.[7]1956 నవంబరు 1 న ఈ భూభాగం సిరోహి జిల్లాకు ఇవ్వబడింది.[8] చౌహాన్ డియోరా పాలనలో (15వ శతాబ్దం నుండి 1947 వరకు) సిరోహి పురాతన కాలంలో " దేవ్ నగరి " అని పిలువబడింది. ఈ ప్రాంతంలో అనేక ఆలయాలు ఉండడమే అందుకు కారణం.రెండువైపులా పదునైన కత్తుల తయారీకి సిరోహి ప్రత్యేకత సంతరించుకుంది., [9][10]
భౌగోళికం
జిల్లా వైశాల్యం 5136 చ.కి.మీ. జిల్లా పశ్చిమ సరిహద్దులో జలోర్ జిల్లా, ఉత్తర సరిహద్దులో పాలి జిల్లా, తూర్పు సరిహద్దులో ఉదయపూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రం లోని బనస్ కాంతా జిల్లాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 5139 చ.కి.మీ. సిరోహి జిల్లా రాజస్థాన్ రాష్ట్ర నైరుతీ భూభాగంలో ఉంది. ఇది 24 నుండి 20', 25 నుండి 17' ఉత్తర అక్షాంశం, 72 నుండి 16', 73 నుండి 10' తూర్పు రేఖాంశంలో ఉంది.
నైసర్గికం
సిరోహి జిల్లా కొండలు, రాళ్ళవరుసలతో విభజించబడి ఉంది. మౌంట్ అబూలోని గ్రానైట్ పర్వతభూభాగం జిల్లాను రెండు భాగాలుగా విభజిస్తూ ఈశాన్యం నుండి నైరుతీదిశగా విస్తరించి ఉంది.మౌంట్ అబూలో మద్యలో ఉన్న జిల్లాలోని ఆగ్నేయ భూభాగంలో ఉన్న ఆరవల్లీ పర్వతలోయల నుండి పశ్చిమ బనాస్ నది ప్రవహిస్తూ ఉంది. ఢిల్లీ, అహమ్మదాబాదు రైలు మార్గంలో బనాస్ నది పశ్చిమ తీరంలో అబూ రైలు స్టేషను ఉంది. కతివార్ డ్రై డిసెడ్యుయస్ ఫారెస్ట్స్ " ఈ ప్రాంతం అంతా విస్తరించి ఉంది. జిల్లాలోని ఎత్తైన మౌంట్ అబూ భూభాగంలో కొనీఫర్ అరణ్యాలు ఉన్నాయి. మౌంట్ అబూ నగరం సిరోహి జిల్లాలో పెద్దనగరంగా, వ్యాపారకేంద్రంగా ప్రత్యేకత కలిగి ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో గ్రామాలు అతి తక్కువగా ఉన్న జిల్లా సిరోహి ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది.
జిల్లా వాయవ్యభూభాగంలో ఉన్న మౌంటు అబూ పర్వతాలు జిల్లాలో వర్షపాతం కలిగించడంలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. ఇవి నైరుతీ ఋతుపవనాలను పట్టిఉంచి, సుక్రి నదీజాలాలను అధికరిస్తూ, జిల్లా నైరుతీ భూభాగ వ్యవసాయ భూములకు జలాలను అందిస్తుంది. జిల్లావాయవ్య భూభాగంలోని వ్యవసాయ భూములకు ల్యూని నది ఉపనదులు వ్యవసాయ జలాలను అందిస్తున్నాయి. " నార్త్‌వెస్టర్న్ థాం స్క్రబ్ ఫారెస్ట్స్ " జిల్లా పశ్చిమ, ఉత్తర భూభాగంలో విస్తరించి ఉన్నాయి. సిరోహి-సియాని రోడ్డులో ఉన్న వరదా గ్రామం జిల్లాలోని చిట్టచివరి గ్రామంగా ఉంది.
ఆర్ధికం
2006 గణాంకాలను అనుసరించి పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సిరోహిజిల్లా ఒకటి అని గుర్తించింది.[11] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న రాజస్థాన్ రాష్ట్ర 12 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[11]
విభాగాలు
- జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది: సిరోహి, మౌంట్ అబూ, రెయీడర్.
- జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి (గ్రామపంచాయితీలు ) ఉన్నాయి:- సిరోహి, షెయోగంజ్, పిండ్వారా, అబూరోడ్, మౌంట్ అబూ.
- జిల్లాలో 3 ఉప తాలూకాలు ఉన్నాయి: పిండ్వరా లోని భైరవి, సిరోహి లోని కలాండ్రి, రియోడర్ లోని మందర్.
ముఖ్యమైన ప్రదేశాలు
- ప్రాచీన మీర్పూర్ జైన్ ఆలయం (సిరోహి సిటీ నుండి 18 కి.మీ)
- అంబెష్వర్ మహాదేవ ఆలయం, కొలర్గర్హ్ ( ఆర్.ఎం సెంటర్ నుండి 6 కి.మీ),
- జబెష్వర్ మహాదేవ ఆలయం, వ్యాసాల
- మొరియ బాబా ఆలయం, సిలోయ (సిరోహి నగరం 16 కి.మీ)
- బనెషవరి మతాజి ఆలయం, సిలోయ (సిరోహి నగరం నుండి 17 కి.మీ)
- లఖవ్ మాతా ఆలయం (సిరోహి నుండి 40 కి.మీ;)
- మార్కండేశ్వర్ ఆలయం, మంజరి
- మౌంట్ అబూ
- పవపురి జైన్ ఆలయం
- చంద్రవతి ఆలయం, నగరం (చారిత్రక ఆలయం) అబూ రోడ్ నుండి 6 కి.మీ
- సరనెష్వర్ మహాదేవ ఆలయం, సిరోహి (సెంటర్ నుండి 2 కి.మీ)
- శ్రీ హనుమాన్ మందిర్ (వరద)
సరిహద్దులు
మూలాలు
వెలుపలి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.