Remove ads
రాజస్థాన్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో రాజసమంద్ జిల్లా ఒకటి. రాజసమంద్ పట్టణం ఈ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రంగా ఉంది. జిల్లాలో 17వ శతాబ్దంలో మేవార్ రాజా " రాణా రాజ్ సింగ్ " నిర్మించిన రాజసమంద్ " సరోవరం రాజసమంద్ పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తుంది.
రాజ్‌సమంద్ | |||||||
---|---|---|---|---|---|---|---|
రాజస్థాన్ జిల్లాలు | |||||||
Coordinates: 25°04′N 73°52′E | |||||||
దేశం | భారతదేశం | ||||||
రాష్ట్రం | రాజస్థాన్ | ||||||
స్థాపన | 1991 ఏప్రిల్ 10 | ||||||
Founded by | రాణా రాజా సింగ్ | ||||||
Named for | రాజ్‌సమంద్ సరస్సు | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 4,550.93 కి.మీ2 (1,757.12 చ. మై) | ||||||
• Rank | 19 | ||||||
జనాభా (2011) | |||||||
• Total | 11,56,597 | ||||||
• జనసాంద్రత | 217/కి.మీ2 (560/చ. మై.) | ||||||
భాషలు | |||||||
• అధికారిక | హిందీ | ||||||
• ప్రాంతీయ భాష | మేవారీ | ||||||
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) | ||||||
పిన్‌కోడ్ | 313324/26 | ||||||
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 02952 | ||||||
Vehicle registration | RJ-30 | ||||||
లోక్‌సభ నియోజకవర్గాలు | రాజ్‌సమంద్ లోక్‌సభ నియోజకవర్గం | ||||||
దగ్గిరి నగరాలు | ఉదయపూర్, చిత్తౌర్‌గఢ్, భిల్వార, అజ్మీర్ | ||||||
సగటు వార్షిక ఉష్ణోగ్రత | 22.5 °C (72.5 °F) | ||||||
సగటు వేసవి ఉష్ణోగ్రత | 45 °C (113 °F) | ||||||
సగటు శీతాకాలపు ఉష్ణోగ్రత | 00 °C (32 °F) |
జిల్లా వైశాల్యం 4,768 చ.కి.మీ. జిల్లా ఉత్తరభూభాగంలో ఉన్న ఆరావళి పర్వతాలు పాలి జిల్లా వరకు విస్తరించి ఉన్నాయి. జిల్లా ఉత్తర సరిహద్దులో అజ్మీర్ జిల్లా, తూర్పు, ఈశాన్య సరిహద్దులో భిల్వార జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో చిత్తౌర్‌గఢ్ జిల్లా , దక్షిణ సరిహద్దులో ఉదయపూర్ జిల్లాలు ఉన్నాయి. జిల్లాలో బనాస్ నది వాటర్ షెడ్, బనాస్ నది ఉపనదులు ఉన్నాయి. అంతే కాక జిల్లాలో అరి, గోమతి, చందా, భోగా నదులు ఉన్నాయి.
సంవత్సరం | జనాభా | ±% p.a. |
---|---|---|
1901 | 1,87,692 | — |
1911 | 2,32,110 | +2.15% |
1921 | 2,46,483 | +0.60% |
1931 | 2,82,066 | +1.36% |
1941 | 3,36,384 | +1.78% |
1951 | 3,95,465 | +1.63% |
1961 | 4,70,115 | +1.74% |
1971 | 5,53,189 | +1.64% |
1981 | 6,93,358 | +2.28% |
1991 | 8,19,014 | +1.68% |
2001 | 9,82,523 | +1.84% |
2011 | 11,56,597 | +1.64% |
source:[1] |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,158,283,[2] |
ఇది దాదాపు. | తైమూర్ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | రోడ్ ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 405 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 302 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 17.35%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 988:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 63.93%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
పిప్లాంట్రి గ్రామస్థులు గ్రామంలో ఎవరికి ఆడపిల్ల జన్మించినా వారు పుట్టిన సందర్భంగా 111 చెట్లను నాటుతారు. అక్కడి సమాజం ఈ చెట్లను బతికేలా చూస్తుంది. ఆడపిల్లలు పెరిగేకొద్దీ ఈ చెట్లు పెరిగి ఫలాలను పొందుతాయి. భారతదేశంలో ఆడపిల్లల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే సమాజం మగబిడ్డపై మక్కువ కలిగి, వరకట్న పద్ధతుల కారణంగా ఆడపిల్లలను ఆర్థిక భారంగా పరిగణిస్తారు.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.