ధౌల్‌పూర్ జిల్లా
From Wikipedia, the free encyclopedia
రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో ధౌల్‌పూర్ జిల్లా ఒకటి. ధౌల్‌పూర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 3084 చ.కి.మీ.జిల్లా దక్షిణ సరిహద్దులో చంబల్ నది ప్రవహిస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దును ఏర్పరుస్తుంది. జిల్లా ఆగ్నేయ సరిహద్దులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, వాయవ్య సరిహద్దులో భరత్‌పూర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో కరౌలి జిల్లా, చంబల్ నదీతీరంలో ఉన్న ధౌల్‌పూర్ జిల్లాలో పలు ఉపనదులు ప్రవహిస్తున్న్నాయి. పశ్చిమ భూభాగంలో దుగువ పర్వాతాలు ఉన్నాయి. ఇక్కడ క్వారీలు ఉన్నాయి.ఈ ప్రాంతంలో త్వరగా పగులకొట్టగలిగిన, మెత్తగా పొడిచేయగలిగిన ఎర్రని ఇసుక రాయి అధికంగా ఉన్నాయి.
ధౌల్‌పూర్ జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
మచ్‌కుండ్‌లోని రాణి కి హవేలీ, బారీలోని కాలియా మాత ఆలయం, తలాబ్-ఎ-షాహి, ధోల్‌పూర్ సమీపంలోని చంబల్ నది, షేర్‌ఘర్ కోట | |||||||
![]() రాజస్థాన్ రాష్ట్రంలో ధౌల్‌పూర్ జిల్లా స్థానం | |||||||
దేశం | భారతదేశం | ||||||
రాష్ట్రం | రాజస్థాన్ | ||||||
ప్రధానకేంద్రం | ధౌల్‌పూర్ | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 3,084 కి.మీ2 (1,191 చ. మై) | ||||||
జనాభా (2011) | |||||||
• Total | 12,06,516 | ||||||
• జనసాంద్రత | 390/కి.మీ2 (1,000/చ. మై.) | ||||||
Time zone | UTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం) |
విభాగాలు
జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి. (ధూల్‌పర్, బాడి, రాజఖేరా, బెసర్). 5 తాలూకలు ఉన్నాయి (ధోల్‌పూర్, బడి, రాజఖేరా, బసేడి, సైపౌ.జాలాప్రజలకు వ్యవసాయం ప్రధాన ఆదాయవనరుగా ఉంది.
చారిత్రిక జనాభా
సంవత్సరం | జనాభా | ±% p.a. |
---|---|---|
1901 | 2,98,547 | — |
1911 | 2,73,322 | −0.88% |
1921 | 2,41,508 | −1.23% |
1931 | 2,46,660 | +0.21% |
1941 | 2,86,788 | +1.52% |
1951 | 3,02,123 | +0.52% |
1961 | 3,63,727 | +1.87% |
1971 | 4,59,655 | +2.37% |
1981 | 5,85,059 | +2.44% |
1991 | 7,49,479 | +2.51% |
2001 | 9,83,258 | +2.75% |
2011 | 12,06,516 | +2.07% |
source:[1] |
2011 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,207,293, [2] |
ఇది దాదాపు. | బహరియన్ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | న్యూహ్యాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం..[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 394 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 398 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 22.78%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 845:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 70.14%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
సరిహద్దులు
మూలాలు
వెలుపలి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.