మీరట్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మీరట్ (Meerut) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా. మీరట్ నగరం దీనికి ముఖ్యపట్టణం. ఇది జాతీయ రాజధాని ఢిల్లీకి 70 కి.మీ దూరంలోనూ, రాష్ట్ర రాజధాని లక్నోకి 453 కి.మీ దూరంలోనూ ఉంది. ఇది జాతీయ రాజధాని ప్రాంతంలో ఢిల్లీ తర్వాత రెండవ పెద్ద ప్రాంతం.

మీరట్ జిల్లా
मेरठ ज़िला میرٹھ ضلع | |
---|---|
![]() ఉత్తర ప్రదేశ్ పటంలో మీరట్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | మీరట్ |
ముఖ్య పట్టణం | మీరట్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | మీరట్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,522 కి.మీ2 (974 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 34,47,405[1] |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 74.80 per cent[1] |
• లింగ నిష్పత్తి | 885[1] |
Website | అధికారిక జాలస్థలి |
భౌగోళికం
జిల్లా ఇండో - గంగా మైదానంలో 28°57’ నుండి 29°02’ డిగ్రీల ఉత్తర అక్షాంశం, 77°40’ నుండి 77°45’ డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. [2]
పురాణ ప్రశస్తి
మీరట్ నగరం మయరాష్ట్రంగా రావణుని మామ యైన మయాసురుడు స్థాపించాడు. రామాయణం ప్రకారం మీరట్ మయాసురుని రాజధాని. అందుకే ఈ పట్టణం "రావణ్ కీ ససురాల్"గా కూడా ప్రసిద్ధి చెందింది.
చరిత్ర
1818లో అప్పుడు తాలూకాగా ఉన్న మీరట్ రూపొందించబడింది. మీరట్ జిల్లాలో ఘజియాబాద్, మవానా, బగ్పత్, సర్ధానా , హర్‌పూర్ తాలూకాలు చేర్చబడ్డాయి.[3][4] ఇవి ప్రస్తుతం ఘజియాబాద్,హర్‌పూర్, బాగ్‌పత్, ముజఫర్ నగర్, బులంద్‌షహర్ , గౌతం బుద్దా నగర్ జిల్లాలుగా రూపొందాయి.[3]
మీరట్ సైనిక స్థావరం
మీరట్‌లోని సైనిక స్థావరం విస్తీర్ణరీత్యా, జనాభారీత్యా భారతదేశంలో రెండవ పెద్ద సైనిక స్థావరము. ఇది 1803 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీచే స్థాపించబడింది. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం ప్రారంభమైనది కూడా ఇక్కడ నుండే.
సరిహద్దులు
సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
ఉత్తర సరిహద్దు | ముజఫర్ నగర్ జిల్లా |
దక్షిణ సరిహద్దు | బులంద్‌షహర్ ఘాజియాబాద్ జిల్లాలు |
పశ్చిమ సరిహద్దు | బాగ్‌పత్ జిల్లా[5] |
నదులు
జిల్లాలో ప్రధానంగా గంగానది తూర్పు సరిహద్దును ఏర్పరుస్తూ జిల్లాను మొరాదాబాద్ జిల్లా, బిజ్నౌర్ జిల్లాలను వేరుచేస్తుంది.[5] జిల్లా పశ్చిమ సరిహద్దులో హిండన్ నది ప్రవహిస్తూ జిల్లాను భగ్‌పత్ జిల్లాతో వేరుచేస్తూ ఉంది.[5] జిల్లాలో పర్వతాలు కాని బండరాళ్ళు కానీ లేవు. జిల్లా మట్టి అర్ధ సారవంతంగా హిమయిగానికి చెంది ఉంటుంది. హిమాలయాల నుండి ప్రవహిస్తున్న నదులు తీసుకువస్తున్న సారవంతమైన మట్టి నదీతీరాల వెంట అక్కడడక్కడా ఉంటుంది.[2] సారవంతమైన మట్టి అంత దృఢంగా ఉండదు.[2] ఇది బంకమట్టి, బురద, ఇసుకమిశ్రితంగా ఉంటుంది.[2] భూమి పంటలకు అనుకూలంగా సారవంతమై ఉంటుంది. ప్రత్యేకంగా గోధుమ, చెరకు, కూరగాయల పెంపకానికి అనుకూలంగా ఉంటుంది.[2]
2001 గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,447,405, [1] |
ఇది దాదాపు. | పనామా దేశ జనసంఖ్యకు సమానం.[6] |
అమెరికాలోని. | కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[7] |
640 భారతదేశ జిల్లాలలో. | 94వ స్థానంలో ఉంది..[8] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1347 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 15.92%.[1] |
స్త్రీ: పురుష నిష్పత్తి. | 885:1000 (రాష్ట్ర నిష్పత్తి 908:1000) |
బాలికలు: బాలురు | 850:1000 (899:1000) |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 69.72%.[9][10] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |

చారిత్రిక జనసంఖ్య
సంవత్సరం | జనసంఖ్య |
---|---|
1872 | 1,267,167 |
1881 | 1,313,137 |
1891 | 1,391,458 |
1901 | 1,540,175 |
జనసఖ్య గణాంకాలు
1971 గణాంకాలు
1981 గణాంకాలు
వివరణ | పురుషులు | స్త్రీలు | మొత్తం |
---|---|---|---|
గ్రామీణ | లేదు | లేదు | 863,280 |
నగరప్రాంత | లేదు | లేదు | 1,903,280 |
మొత్తం | లేదు | లేదు | 2,767,246 |
అభివృద్ధి | 28.43%[c] | 841 (+11) | 708 (+145) |
1991 గణాంకాలు
2001 గణాంకాలు
2011 గణాంకాలు


అక్షరాస్యత
ప్రయాణసౌకర్యాలు
విమానమార్గం
అత్యంత సమీపంలోని విమానాశ్రయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలోని రద్దీని తగ్గించు ఉద్దేశంలో మీరట్ వద్ద ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.
రోడ్డు మార్గాలు
ఢిల్లీ, నొయిడా, ఫరీదాబాద్, ఘాజియాబాద్, హరిద్వార్ మున్నగు ప్రధాన పట్టణాలతో మీరట్‌కు చక్కని రహదారి సౌకర్యం ఉంది. మూడు జాతీయ రహదారులు 58,119, 235 నగరం గుండా పోతున్నాయి. ప్రస్తుతం నిర్మాణదశలో నున్న ఎగువ గంగా కాలువ ఎక్స్‌ప్రెస్ మార్గం కూడా మీరట్ గుండా పోతున్నది. 2007 సంవత్సరంలో మెట్రోపాలిటన్ గా ప్రకటింపబడినప్పటి నుండి నగరంలో జె.ఎన్.ఎన్.యు.అర్.ఎం పధకం అమలుజరుపబడి, అనేక బస్సులు తిరుగుచున్నవి. ఇవి కాక అనేక స్థానిక బస్సు సర్వీసులు, ఆటోరిక్షాలు మహానగర రవాణాకి ఉపయోగపడుతున్నాయి.
రైలు మార్గం
మీరట్ దేశరాజధాని ఢిల్లీతో చక్కగా అనుసంధానించబడి ఉంది. ముంబై నుండి కోచ్వెల్లి, మదురై లకు వారాంతపు రైళ్ళు ఉన్నాయి. బిలాస్‌పూర్- బిలాస్పూర్, జమ్ము, అమృత్సర్, బాంబే, లక్నో, అలహాబాద్, హరిద్వార్, డెహ్రాడూన్ వరకు దినసరి రైలు ఉంది. రైలు ద్వారా డెహ్రాడూన్ నుండి ముస్సోరీ చేరడానికి ఇది ప్రధాన మార్గం. మిస్సోరీ- మీరట్ మధ్య 7 రైలు స్టేషన్లు (మీరట్ నగరం, మీరట్ కంటోన్మెంట్, పర్తాపూర్, సకోటి అడోవాల్, దౌరాలా, మొహియుద్దీంపూర్, పబ్లి ఖాస్) ఉన్నాయి.
రైళ్ళ జాబితా
రైలు పేరు | సమయం | గమ్యం |
---|---|---|
ఎ.సి ఎక్స్‌ప్రెస్ | 1.18 ఉదయం | డెహ్రాడూన్ |
శతాబ్ది | 8.08 ఉదయం | డెహ్రాడూన్ |
శతాబ్ది | 16.38 ఉదయం | డెహ్రాడూన్ |
చత్తీగఢ్ | 2.20 ఉదయం | బిలాస్పూర్ |
అంబాలా పాస్ | 4.55 ఉదయం | అంబాలా |
రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ | 4.55 ఉదయం | మొర్దాబాద్ (లక్నో మీదుగా) |
నౌచండి ఎక్స్‌ప్రెస్ | 2.25 సాయంకాలం | లక్నో (అలహాబాద్, మొర్దాబాద్) |
సంగం ఎక్స్‌ప్రెస్ | 19.00 రాత్రి | కాంపూర్ (అలహాబాద్, అలిఘర్) |
గోల్డెన్ టెంపుల్ | 2.17 సాయంకాలం | అమృత్సర్ |
చత్తీస్ఘడ్ | 22.05 రాత్రి | అమృత్సర్ |
గోల్డెన్ టెంపుల్ | 5.20 సాయంకాలం | ముంబై సెంట్రల్ |
డెగ్రాడూన్ | 19.20 రాత్రి | బంద్రా |
కోచ్వెల్లి | 11 రాత్రి | కోచ్వల్లి |
ముంబై | 2.17 సాయంకాలం | చెన్నై |
నిర్వహణ
జిల్లా మీరట్ పార్లమెంటు నియోకవర్గంలో భాగంగా ఉంది. జిల్లాలో కింద ఉన్న అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. [25]
- కిథొరె
- మీరట్ కంటోన్మెంట్
- మీరట్
- మీరట్ దక్షిణ
- సివల్ఖస్
- సర్ధన
- హస్తినాపూర్
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.