ముజఫర్ నగర్

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia

ముజఫర్ నగర్ ఉత్తర ప్రదేశ్ లోని పట్టణం, ముజఫర్ నగర్ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది జాతీయ రాజధాని ప్రాంతం (NCR) లో భాగం. ఇది ఢిల్లీ - హరిద్వార్ / డెహ్రాడూన్ జాతీయ రహదారి ( ఎన్‌హెచ్ 58 ) పై ఉంది. ఈ పట్టణానికి రైలుమార్గాల ద్వారా ఇతర ప్రాంతాలకు చక్కటి రవాణా సౌకర్యముంది. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది.

త్వరిత వాస్తవాలు ముజఫర్ నగర్, దేశం ...
ముజఫర్ నగర్
పట్టణం
Thumb
ముజఫర్ నగర్
Coordinates: 29°28′56″N 77°42′00″E
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాముజఫర్ నగర్
విస్తీర్ణం
  Total204.8 కి.మీ2 (79.1 చ. మై)
Dimensions
  Length16.3 కి.మీ (10.1 మై.)
  Width16 కి.మీ (10 మై.)
Elevation
267 మీ (876 అ.)
జనాభా
 (2011)[1]
  Total4,95,543
  జనసాంద్రత2,400/కి.మీ2 (6,300/చ. మై.)
  పట్టణం
3,92,768
భాషలు
  అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
251001
PIN
251002
టెలిఫోన్ కోడ్0131
మూసివేయి

ఈ పట్టణం అత్యంత సారవంతమైన ఎగువ గంగా-యమునా దోఅబ్ ప్రాంతం మధ్యలో ఉంది. న్యూ ఢిల్లీ, సహారన్పూర్ లకు చాలా దగ్గరలో ఉంది. ఇది ఉత్తర ప్రదేశ్ లోని అత్యంత అభివృద్ధి చెందిన, సంపన్న పట్టణాలలో ఒకటి. ఇది సహారన్‌పూర్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ పట్టణం ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ (డిఎంఐసి), అమృత్సర్ -ఢిల్లీ -కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్ (ఎడికెఐసి) లలో భాగం. ఇది పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ప్రధాన వాణిజ్య, పారిశ్రామిక, విద్యా కేంద్రం.

భౌగోళికం

ముజఫర్ నగర్ ఇండో-గంగా మైదానంలోని దోఅబ్ ప్రాంతంలో, సముద్ర మట్టానికి 272 మీటర్ల ఎత్తున ఉంది.[2] ఇది దేశ రాజధాని ఢిల్లీకి 125 కిలోమీటర్లు, చండీగఢ్కు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. బిజ్నోర్, మీరట్, హస్తినాపూర్‌లకు సమీపంలో ఉంది.

శీతోష్ణస్థితి

ముజఫర్ నగర్ రుతుపవనాల ప్రభావంతో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వేసవికాలం ఏప్రిల్ ప్రారంభం నుండి జూన్ చివరి వరకు ఉంటుంది. వేసవి చాలా వేడిగా ఉంటుంది. రుతుపవనాలు జూన్ చివరలో వచ్చి, సెప్టెంబర్ మధ్య వరకు కొనసాగుతాయి. ఉష్ణోగ్రతలు కొద్దిగా పడిపోతాయి. మేఘాలు బాగా ఆవరించి ఉంటాయి. తేమ ఎక్కువగా ఉంటుంది. అక్టోబరులో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయి. అక్టోబరు చివరి నుండి మార్చి మధ్య వరకు తేలికపాటి, పొడి శీతాకాలం ఉంటుంది. జూన్ సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే నెల. 

జూన్లో సగటు ఉష్ణోగ్రత 30.2°C ఉండగా జనవరిలో 12.5°C  ఉంటుంది. ఇది మొత్తం సంవత్సరంలో అత్యల్ప సగటు ఉష్ణోగ్రత. ముజఫర్ నగర్‌లో సగటు వార్షిక ఉష్ణోగ్రత 24.2°C ఇప్పటివరకు నమోదైన అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు 45°C (1994 మే 29), -0.9°C. ఇక్కడ వర్షపాతం సగటున 929 మి.మీ ఉంటుంది. 8 మి.మీ. వర్షంపాతంతో నవంబరు, అత్యంత పొడిగా ఉండే నెల. జూలైలో అత్యధిక అవపాతం ఉంటుంది (సగటున 261.4 మి.మీ.)

మరింత సమాచారం శీతోష్ణస్థితి డేటా - Muzaffarnagar (1981–2010, extremes 1981–2010), నెల ...
శీతోష్ణస్థితి డేటా - Muzaffarnagar (1981–2010, extremes 1981–2010)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 28.9
(84.0)
31.5
(88.7)
37.4
(99.3)
42.6
(108.7)
45.0
(113.0)
44.4
(111.9)
42.0
(107.6)
39.0
(102.2)
37.0
(98.6)
42.0
(107.6)
33.1
(91.6)
28.7
(83.7)
45.0
(113.0)
సగటు అధిక °C (°F) 19.2
(66.6)
22.7
(72.9)
27.9
(82.2)
34.6
(94.3)
37.4
(99.3)
36.3
(97.3)
33.2
(91.8)
32.2
(90.0)
32.2
(90.0)
30.7
(87.3)
26.3
(79.3)
21.4
(70.5)
29.5
(85.1)
సగటు అల్ప °C (°F) 5.8
(42.4)
8.4
(47.1)
12.4
(54.3)
17.6
(63.7)
22.2
(72.0)
24.1
(75.4)
24.9
(76.8)
24.5
(76.1)
22.3
(72.1)
15.8
(60.4)
10.0
(50.0)
6.3
(43.3)
16.2
(61.2)
అత్యల్ప రికార్డు °C (°F) −0.9
(30.4)
1.5
(34.7)
0.0
(32.0)
6.2
(43.2)
11.0
(51.8)
15.4
(59.7)
18.4
(65.1)
17.4
(63.3)
12.6
(54.7)
7.0
(44.6)
2.6
(36.7)
−2.6
(27.3)
−2.6
(27.3)
సగటు వర్షపాతం mm (inches) 25.1
(0.99)
32.7
(1.29)
23.5
(0.93)
10.5
(0.41)
25.6
(1.01)
94.4
(3.72)
261.4
(10.29)
254.6
(10.02)
162.2
(6.39)
19.0
(0.75)
8.0
(0.31)
11.9
(0.47)
929.0
(36.57)
సగటు వర్షపాతపు రోజులు 1.9 2.5 2.2 1.2 2.1 4.4 9.5 9.9 5.5 1.1 0.5 1.1 42.0
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 58 51 45 31 34 48 69 72 65 54 54 58 53
Source: India Meteorological Department[3]
మూసివేయి

జనాభా వివరాలు

2011 జనాభా లెక్కల ప్రకారం, ముజఫర్ నగర్ పట్టణ జనాభా 3,92,451, పట్టణ సముదాయం జనాభా 4,94,792. పట్టణంలో 1,000 మంది పురుషులకు 897 మంది స్త్రీలు ఉన్నారు. జనాభాలో 12.2% మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు. ఏడేళ్ళ పైబడినవారిలో అక్షరాస్యత 80.99%; పురుషుల అక్షరాస్యత 85.82%, స్త్రీ అక్షరాస్యత 75.65%.

పట్టణంలో 55.79% హిందువులు, 41.39% ముస్లింలు, 1.5% సిక్కులు, 0.5% క్రైస్తవులు, 2% జైనులు ఉన్నారు . [4]

రవాణా సౌకర్యాలు

ముజఫర్ నగర్‌ నుండీ ఇతర ప్రాంతాలకు చక్కటి రోడ్డు, రైలు సౌకర్యలున్నాయి. ఘజియాబాద్ - సహారన్పూర్ మార్గం పట్టణం గుండా వెళుతుంది.భారత రైల్వే పట్టణం నుండి న్యూ ఢిల్లీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, దక్షిణ భారతదేశం లోని ఇతర ప్రాంతాలకు రైళ్ళను నడుపుతోంది.

జాతీయ రహదారి - 58 (NH-58) ముజఫర్ నగర్ పట్టణం గుండా వెళుతుంది. ఈ రహదారి ఉత్తర దిశలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రదేశాలకూ, దక్షిణ దిశలో ఢిల్లీకీ ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. ముజఫర్ నగర్ పట్టణంతో పాటు ఉత్తరాఖండ్ లోని గర్హ్వాల్ ప్రాంతానికి రహదారి రవాణాకు ఈ రహదారి వెన్నెముక. హర్‌ద్వార్, రిషికేశ్, డెహ్రాడూన్, బద్రీనాథ్, కేదార్నాథ్ పట్టణాలకు ఈ రహదారి ప్రయాణ మార్గంగా ఉంది.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.