Remove ads
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
బాగ్పత్ ఉత్తర ప్రదేశ్‌లోని పట్టణం. ఇది బాగ్పత్ జిల్లా ముఖ్య పట్టణం. ఇది జాతీయ రాజధాని ప్రాంతంలో భాగం. [3]
నగరానికి అసలు పేరు పురాణాల్లో పేర్కొన్న వ్యాఘ్రప్రస్థం. పెద్ద సంఖ్యలో పులులుండే ప్రాంతం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందని ప్రతీతి. [4] మహాభారతంలో కూడా దీన్ని వ్యాఘ్రప్రస్థం అని ప్రస్తావించారు. భారత యుద్ధాన్ని నివారించడానికి, పాండవుల తరపున కృష్ణుడు కోరిన ఐదు గ్రామాలలో ఇది ఒకటి. [5]
మొఘలుల కాలంలో, నగరం లోని ఉద్యానవనాలను సూచిస్తూ దీనికి బాగ్పత్ (బాగ్ అంటే హిందూస్థానీలో తోట అని అర్థం) అని పేరు పెట్టారు. [6]
బాగ్పత్ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో, యమునా నది తూర్పు ఒడ్డున ఉంది. ఇది ఢిల్లీ నుండి ఈశాన్యంగా 40 కి.మీ. మీరట్ నుండి పశ్చిమంగా 52 కి.మీ. దూరంలో, ఢిల్లీ- సహారన్పూర్ రహదారిపై ఉంది. బాగ్పత్ జిల్లాకు ఉత్తరాన షామ్లీ, ముజఫర్‌నగర్ జిల్లాలు, తూర్పున మీరట్ జిల్లా, దక్షిణాన ఘాజియాబాద్ జిల్లా, పశ్చిమాన యమునకు ఆవల, ఢిల్లీ, హర్యానా లోని సోనీపత్ జిల్లాలు ఉన్నాయి. [3]
2011 భారత జనగణన ప్రకారం, బాగ్‌పత్‌లోని 7880 గృహాల్లో 50,310 జనాభా ఉంది, అందులో 26,435 మంది పురుషులు, 23,875 మంది మహిళలు. 8,781 మంది ఆరేళ్ళ లోపు పిల్లలున్నారు. బాగ్‌పత్‌లో అక్షరాస్యత రేటు 50.7%, పురుషుల అక్షరాస్యత 56.9%, స్త్రీ అక్షరాస్యత 43.8%. బాగ్పత్ లో ఏడేళ్ళకు పైబడీన వయసున వారిలో అక్షరాస్యత 61.43% కాగా, ఇందులో పురుషుల్లో అక్షరాస్యత 68.9%, స్త్రీలలో 53.1% ఉంది. షెడ్యూల్డ్ కులాల జనాభా 2,337.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.