Remove ads
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బిజ్నౌర్ జిల్లా (హిందీ:बिजनौर ज़िला) (ఉర్దూ: بجنور ضلع) is) ఒకటి. బిజ్నౌర్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం.
బిజ్నౌర్ జిల్లా
बिजनौर ज़िला بجنور ضلع | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | మొరాదాబాద్ |
ముఖ్య పట్టణం | బిజ్నౌర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,049 కి.మీ2 (1,563 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 36,83,896 |
• జనసాంద్రత | 910/కి.మీ2 (2,400/చ. మై.) |
Website | అధికారిక జాలస్థలి |
బిజ్నోర్ జిల్లా మొరాదాబాద్ డివిజన్ (చారిత్రకంగా రోహిత్‌ఖండ్, బరేలి భూభాగం) పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఇది త్రిభుజాకారంగా ఉంటుంది. పశ్చిమ సరుహద్దులో లోతుగా ప్రవహిస్తున్న గంగాప్రవాహం ఉంది. గంగా తీరం వెంట మీరట్ డివిజన్లోని 4 జిల్లాలు (డెహ్రాడూన్, సహారన్పూర్, ముజఫర్ నగర్, మీరట్) ఉన్నాయి. ఉత్తర ఈశాన్య సరిహద్దులో గఢ్వాల్ జిల్లా (ఉత్తరాఖండ్) ఉంది. తూర్పు సరిహద్దులో ఫికా నది ఉంది. ఫికా నదికి ఆవలివైపు నైనితల్ (ఉత్తరాఖండ్), మొరాదాబాద్ జిల్లాలు ఉన్నాయి. దక్షిణ సరిహద్దులో మొరాదామండలం లోని ఠాకూర్ద్వారా, అంరోహా, హాసన్‌పూర్ జిల్లా ఉన్నాయి.78° 0' 29°నుండి 2' 29° 58' ఉత్తర అక్షాంశం, 78° నుండి 57 తూర్పు రేఖాంశంలో ఉంది. లలిత్పూర్ నుండి ఉత్తర కోటి వరకు 56 మైళ్ళదూరం ఉంది. కోటీ రావు నుండి దక్షిణ దిశలోని కంహరియా వరకు 57 మైళ్ళ పొడవు ఉంటుంది. కంహరియా నుండి లలిత్పూర్ వరకు 62 మైళ్ళు ఉంటుంది. జిల్లా వైశాల్యం 1789.5 చ.మైళ్ళు.
చంద్పుర్, నూర్పుర్, ధంపుర్, మత (రిజర్వు), నజిబబద్, బిజ్నోర్, బర్హపుర్, నెహ్తౌర్ (రిజర్వ్డ్)
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,683,896, [1] |
ఇది దాదాపు. | లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | ఒక్లహామా నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 74వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 808 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 17.64%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 913:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 70.43%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
జిల్లాలో హిందీ, ఉర్దూ యాస కలిగిన పశ్చిమ హిందీ భాషవాడుకలో ఉంది.
బిజ్నోర్ జిల్లా ప్రజలకు వ్యవసాయం ప్రధానవృత్తి. చెరుకు ప్రధాన పంటగా పండిస్తున్నారు. జిల్లాకు బి.పి.ఒ కంపనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు కొంతమంది సమైక్యమై జిల్లాలో " సుక్స్యాం ఇంఫర్మేషన్ సర్వీసెస్ " పేరుతో గ్రామీణ బి.పి.ఒ స్థాపించారు. వీరంతా బిజ్నోర్, చందర్పూర్కు చెందినవారు. వీరంతా పైచదువులకు ఢిల్లీ వెళ్ళినవారే. 14 సంవత్సరాలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో పనిచేసిన తరువాత తిరిగి స్వస్థలానికి వచ్చి ఈ సంస్థను ప్రారంభించారు. కొన్ని సాంఘిక కారణాలు, బిజ్నోర్, చందర్పూర్ యువతకు ఉపాధి కల్పించాలన్న ధ్యేయంతో ఈ సంస్థ స్థాపించబడింది.
విదుర్ కుటి: ఇది బిజ్నోర్కు 12 కి.మీ దూరంలో ఉంది. పౌరాణిక ప్రాశస్థ్యం కలిగిన ప్రదేశాలలో ఇది ఒకటి. విదురుడు తన జీవితచరమాంకం ఇక్కడ పూర్తిచేడని భావిస్తున్నారు. శ్రీకృష్ణుడు ఇక్కడకు విజయం చేసాడని భావిస్తున్నారు. రవ్లి వద్ద విరిగిపోయిన స్థితిలో కణ్వాశ్రమం ఉంది. అభిఙాన శాకుంతలం నాయిక శకుంతల పెరిగిన ప్రదేశం ఇది. హస్థినాపుర చక్రవర్తి దుష్యంతుడు వేటాడుతూ అక్కడకు వచ్చి శకుంతలను చూసి ప్రేమించి గాంధర్వ వివాహం చేసుకున్నాడు. మహాభారతం కాలంలో కౌరవ పాండవులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇరువౌపులా ఉన్న స్త్రీలు, వృద్ధులు, పిల్లలు విదురుని ఆశ్రయం కోరారు. విదురిని వద్ద తగినంత ప్రదేశం లేదు కనుక ప్రదేశాన్ని విస్తరించి వారికి ఆశ్రయం కల్పించాడు. దీనిని ప్రస్తుతం " ధారానగర్" అని పిలుస్తున్నారు. ధారానగరుకు 12 కి.మీ దూరంలో గంగా తీరంలో గంజ్ ఉంది. ఇక్కడ పురాతన ఆలయాలు, ఆశ్రమాలు ఉన్నాయి.
జహానాబాద్ (పిలిభిత్) గంగానదీ తీరంలో ఉంది. ఇది గంజ్‌కు 1 కి.మీ దూరంలో ఉంది. ముగలుల కాలంలోఈ గ్ర్రమంలో " రియాసత్ " జరుగుతూ ఉండేది. సమీపంలోని 101 గ్రామాలకు ఇది రియాసత్ కేంద్రంగా ఉండేది. ఈ ప్రాంతంలో నివసించిన ఒక సన్యాసి పాముకాటుకు వైద్యం చేస్తూ ఉండేవాడు. ఒక సారి షాహహాన్ భార్య పాముకాటుకు గురైనప్పుడు సన్యాసి ఆమెకు వైద్యం చేసి బ్రతికించాడు. అందుకు షాజహాన్ ఆనందించి జహనాబాద్ రియాసత్‌ను సన్యాసికి కానుకగా ఇచ్చాడు. ఇక్కడ నుండి 2కి.మీ దూరంలో గంగానది ప్రవహిస్తుంది.
చందూర్పూర్- జలీజ్పూర్ రహదారిలో నానోర్ గ్రామానికి 1 కి.మీ దూరంలో ఉన్న సీతాలయంలో విగ్రహాలు ఉండవు. దీనిని సీతామందిర్ మఠ్ అంటారు. ఇక్కడ భూదేవి సీతను తిరిగి తనలో తీసుకున్న ప్రదేశం అని భక్తులు విశ్వసిస్తున్నారు. సేనాకాద్వార్ వద్ద పాండవ సేనలు నిలుపబడ్డాయి. ఇక్కడ ద్రోణాచార్యునకు ఆలయం ఉంది. దీనిని సైన్యద్వార్ అని కూడా అంటారు. ఇక్కడ జవహర్ నవోదయా స్కూల్ స్థాపించబడింది. అక్బర్ నవరత్నాలలో అబూల్ ఫాజిల్, ఆయన సోదరుడు ఫాజీ ఇక్కడ ఉన్న అజంపూర్ నివసించారు. గ్రామంలో పుట్టారు. అజంపూర్ బస్తా నుండి 4 కి.మీ దూరంలో ఉంది. నజిబుదౌలాహ్ కోట్ నజిబుదౌలాహ్ వద్ద ఉంది. దీనిని గులాం కాదిర్ నిర్మించాడు. గులాం కాదిర్ నజిబుదులాహ్ అని పిలువబడ్డాడు. 18 వ శతాబ్దం ముగల్ సామ్రాజ్యం పతనం ప్రారంభం అయిన తరువాత ఇది నిర్మించబడింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.