కృష్ణా జిల్లా

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia

కృష్ణా జిల్లాmap

Hyderabad జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా. ఈ జిల్లాలో ప్రవహించే కృష్ణా నది వలన జిల్లాకు ఈ పేరు వచ్చింది. చరిత్రలో వివిధ కాలాల్లో శాతవాహనులు, చోళులు, రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు మొదలైనవారు ఈ ప్రాంతాన్ని పాలించారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం. 2022 లో ఈ జిల్లాను విడదీసి ఎన్టీఆర్ జిల్లాను, విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లాలో కూడా కొన్ని మండలాలను కలిపారు.[2]Map

త్వరిత వాస్తవాలు కృష్ణా జిల్లా, దేశం ...
కృష్ణా జిల్లా
.
Thumb
దేశంభారత దేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ప్రాంతంకోస్తా
ప్రధాన కార్యాలయంమచిలీపట్నం
విస్తీర్ణం
  Total3,775 కి.మీ2 (1,458 చ. మై)
జనాభా
 (2011)[1]
  Total17,35,000
  జనసాంద్రత460/కి.మీ2 (1,200/చ. మై.)
భాషలు
  అధికార భాషతెలుగు
Time zoneUTC+5:30 (IST)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 0( )
అక్షరాస్యత74.37 (2001)
పురుషుల అక్షరాస్యత79.13
స్త్రీల అక్షరాస్యత69.62
లోక్‌సభ నియోజక వర్గంమచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం
మూసివేయి

చరిత్ర

కృష్ణా పరీవాహక ప్రాంతం కనుక ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఈ జిల్లాలో ఉన్న ఇంద్రకీలాద్రి మీద అర్జునుడు పాశుపతాస్త్రం కొరకు పరమశివుని ఉద్దేశించి తపమాచరించాడని, దుర్గాదేవి ఇక్కడ మహిశాసురుడిని సంహారం చేసిందని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కృష్ణా నది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరి ఉన్న కనక దుర్గాదేవి భక్తజన పూజలను అందుకొంటూ ఉంది.

శ్రీకాకుళం రాజధానిగా శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శాతవాహన రాజులు నాలుగు శతాబ్దాల కాలం పాటూ ఈ ప్రదేశాన్ని పాలించారు. గుంటూరు జిల్లా మైదవోలులో లభించిన తామ్ర శాసనాలననుసరించి పల్లవులు ఈ ప్రాంతాన్ని 250 నుండి 340 సా.శ.॥ వరకూ పాలించారు. ఆ తదుపరి బృహత్పలాయనులు కోడూరు రాజధానిగా ఈ జిల్లా ప్రాంతాన్ని పాలించారు. వారి తరువాత విష్ణు కుండినులు సా.శ.॥5వ శతాబ్దంలో పాలించారు. వీరి కాలంలోనే మొగల్రాజపురం ఇంకా ఉండవల్లిలోని గుహలు తవ్వించి తీర్చిదిద్దబడ్డాయి. తూర్పుచాళుక్యులు ఉండవల్లిలో గుహామందిరాలు, శివాలయాలు కట్టించారు. కాకతీయులు సా.శ.॥1323 వరకు వీరి పాలన జరిగింది. రెడ్డిరాజులు కొండపల్లి రాజధానిగా పరిపాలించారు. అనంతరం గజపతుల పాలనలో కృష్ణా జిల్లా ప్రాంతం వచ్చింది. ప్రస్తుత పమిడిముక్కల మండలంలోని కపిలేశ్వరపురం గజపతి రాజయిన కపిలేశ్వర గజపతి పేరున నామకరణం చేయబడింది. కపిలేశ్వర గజపతి తదుపరి వచ్చిన విద్యాధర గజపతి విజయవాడలోని విద్యాధరపురాన్ని ఇంకా కొండపల్లి సరస్సుని నిర్మించాడు.

విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు సన్నిధిలోనే కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదను రచించి అంకితమిచ్చాడు. తరువాత సా.శ.॥1512 లో గోల్కొండ వద్ద సుల్తాన్ కులీ కుతుబ్ షా సామ్రాజ్యంలో భాగమైంది. మచిలీపట్నం ఓడ రేవుగా ఎగుమతి-దిగుమతులు జరిగేవి. తానీషాగా ప్రసిద్ధి చెందిన అబూ హుసేన్ షా మంత్రులయిన అక్కన్న ఇంకా మాదన్న వారి కార్యాలయాన్ని విజయవాడలో స్థాపించారు. వీరిరువురు కనక దుర్గ అమ్మవారిని ఆరాధించేవారు. నేటికీ ఇంద్రకీలాద్రి కొండ దిగువన వీరు ఆరాధించిన గుహలు మనకు దర్శనమిస్తాయి. ఔరంగజేబు సామ్రాజ్యంలో భాగమయిన గోల్కొండను 5 నవాబులకు విభజించి ఆసఫ్ ఝా సుబేదారుగా పాలించాడు. ఆర్కాటు, కడప, కర్నూలు, రాజమండ్రి, చీకకోల్ (శ్రీకాకుళం) నవాబుల కింద పాలించబడ్డాయి. ఈ ప్రాంతం రాజమండ్రి నవాబు పరిపాలనలో వుండేది.

సా.శ.॥1611 లో ఆంగ్లేయులు మచిలీపట్నం కేంద్రంగా తమ కార్యకలాపాలు జరపడం ప్రారంభమైంది. 1641 లో మద్రాసుకు తరలి వెళ్ళే వరకూ ఇది వారికి ముఖ్యపట్నంగా కొనసాగింది. ఆంగ్లేయుల తరువాత డచ్చి, ఫ్రెంచి వారు మచిలీపట్నాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. 1748 లో నిజాం-ఉల్-ముల్క్ మరణంతో ఈ ప్రాంతం ఆంగ్లేయులు, ఫ్రెంచి వారి హస్తగతమయింది. 1761 లో నిజాం అలీ ఖాన్ తిరిగి గోల్కొండ నవాబు అయినపుడు మచిలీపట్నం నిజాం పట్నం, కొండవీడులో కొంత భాగం బ్రిటిష్ వారికి కానుకగా ఇచ్చాడు. ఆ తరువాత సర్కారు ప్రాంతం మొత్తం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. కృష్ణా జిల్లాను ఇంతకు ముందు "మచిలీపట్నం జిల్లా" అని పిలిచేవారు. 1859లో గుంటూరు జిల్లాలోని కొన్ని తాలూకాలను ఈ జిల్లాలో కలిపి కృష్ణాజిల్లాగా పేరు మార్చారు. 1925లో కృష్ణాజిల్లాను కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు. 2022 లో కృష్ణా జిల్లాలో విజయవాడతో కలిసిన ఉత్తరభాగాన్ని ఎన్టీఆర్ జిల్లాగా విడదీశారు. ఉత్తరంలో కొంత భాగాన్ని ఏలూరు జిల్లాలో కలిపారు.[1]

భౌగోళిక స్వరూపం

  • ఉమ్మడి కృష్ణా జిల్లా పీఠభూమి, తీర ప్రాంతాలుగా విభజించబడింది. భారతదేశ అత్యంత పర్యావరణ సంబంధిత ముఖ్యమైన చిత్తడినేలలో కొల్లేరుసరస్సు ఒకటి ఈజిల్లాలో పాక్షికంగా ఉంది.[3]

నీటివనరులు

Thumb
కృష్ణ నది మీదుగా విజయవాడ వద్ద ప్రకాశం బారేజి
Thumb
ఉమ్మడి కృష్ణా జిల్లా నీటి పారుదల వ్యవస్థ

ఉమ్మడి జిల్లాలో కృష్ణా నది ముఖ్యమయిన నది. బుడమేరు, మున్నేరు, తమ్మిలేరు ఇతర నదులు. కృష్ణా నది బంగాళా ఖాతంలోకి హంసలదీవి, నాచుగుంట వద్ద కలుస్తుంది. ఇవి కాక జిల్లాలో చిన్న కొండవాగులు కూడా ప్రవహిస్తాయి. ఇవి జయంతి, కట్టలేరు, ఇప్పలవాగు, ఉప్పుటేరు, తెల్లేరు, బళ్ళలేరు, ఇంకా నడిమేరు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సులో కొంత భాగం కృష్ణా జిల్లాలో ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు, కృష్ణా డెల్టా, చింతలపూడి ఎత్తిపోతల పథకం, తమ్మిలేరు, పోలవరం ముఖ్యమైన పెద్ద, మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు.

భూమి, భూగర్భ వనరులు

ఉమ్మడి జిల్లావివరాలు:

  • నల్లమట్టి (57.6%), ఇసుక బంకమట్టి (22.3%) ఎర్ర బంకమట్టి (19.4%) అను మూడు రకాల నేలలు ఉన్నాయి.
  • సహజ వాయువు, ముడి పెట్రోల్: జిల్లా తీర ప్రాంతములో ఉన్నాయి.
  • ఇసుక: కృష్ణ, మున్నేరు నదుల నుండి త్రవ్వకాలు జరిపి సేకరిస్తారు.
  • క్రోమైటు: కొండపల్లి కొండలు, దగ్గర ప్రాంతాలలో ఉన్నాయి.
  • వజ్రాలు: పరిటాల, ఉస్తేపల్లి, కొండవీటికల్లు, రామన్నపేట, సూర్యవరం, కొత్తపేట, నెమలిపురం, మాగులూరు, పుట్రేల (రాజస్థాన్ లో ముఖ్యమైనవి) మొదలైన ప్రాంతాలు.
  • ఇనుము ధాతువు: జగ్గయ్యపేట ప్రాంతం.
  • సున్నపురాయి: జగ్గయ్యపేట ప్రాంతం.
  • మైకా: తిరువూరు ప్రాంతం.

ఆటవీ ప్రదేశం

ఉమ్మడి జిల్లాలో అటవీ ప్రాంతం 7.5%గా ఉంది. [ఆధారం చూపాలి]

పశుపక్ష్యాదులు

వృక్షజాలం, జంతుజాలం

  • ఉమ్మడి జిల్లాలో అడవి జిల్లా వైశాల్యంలో 9% మాత్రమే ఉంది. అయితే నందిగామ, విజయవాడ,నూజివీడు, తిరువూరు,గన్నవరము, మచిలీపట్నం ప్రాంతాలలో, దివి తాలూకాలలో రిజర్వు ఫారెస్ట్ కలిగి ఉంది. ఒక రకం అయిన పొనుకు (గైరోకాపస్ జాక్విని) అని పిలువబడే తేలికపాటి రకమయిన చెక్క కొండపల్లి ప్రాంతములో కనిపిస్తుంది. ఈ చెక్కను కొండపల్లి బొమ్మలు తయారీకి ఉపయోగిస్తారు. చాలా గుర్తించదగ్గ చెట్లు అయిన టెరోకార్‌పస్, టెర్‌మినాలియా, ఎనోజీస్సస్, లోగస్ట్రోయినయ్, కాజురినా లాంటివి కూడా ఉన్నాయి.
  • చిరుత పులులు, దుమ్ములగొండులు, అడవి పిల్లులు, నక్కలు, ఎలుగుబంట్లు, ఇతర మాంసాహార క్షీరదాల జంతుజాలం ఇక్కడ కనిపిస్తాయి. జింక, మచ్చల లేడి, సాంబార్, కృష్ణ జింక వంటి ఇతర శాకాహార జంతువులు ఈ భూభాగ అడవులలో గుర్తించవచ్చు.
  • జిల్లా సరిహద్దులోని కొల్లేరుసరస్సులో ఒక వలస బూడిద రంగు గల పెలికాన్ బిల్డ్ అనే ఒక రక్షిత పక్షి ఉంది.
  • అనేక ముర్రా జాతి గేదెలు, ఆవులు పెద్ద సంఖ్యలో కలిగి ఉంది.

వాతావరణం

ఉమ్మడి జిల్లా వాతావరణ పరిస్థితులు, వేసవికాలం చాలా వేడిగా, శీతాకాలం తక్కువ వేడిగా ఉంటాయి. . ఏప్రిల్ ప్రారంభ కాలం నుండి జూన్ వరకు చాలా వేడిగా ఉంటుంది. ఈ ప్రాంతానికి నైరుతి రుతుపవనాల ద్వారా 1028 మి.మీ. వర్షపాతం కలుగుతుంది.

జనాభా లెక్కలు

2011 జనాభా లెక్కల ప్రకారం, నూతన కృష్ణా జిల్లా విస్తీర్ణం 3775 చ.కి.మీ, జిల్లా జనాభా 17.35 లక్షలు.[1]

రెవెన్యూ డివిజన్లు,మండలాలు

కృష్ణా జిల్లా మండలాల పటం (Overpass-turbo)

భౌగోళికంగా కృష్ణా జిల్లాను మూడు రెవెన్యూడివిజన్లగా, 25 రెవెన్యూ మండలాలుగా విభజించారు.[4]

నగరాలు, పట్టణాలు

రాజకీయ విభాగాలు

లోక్‌సభ నియోజకవర్గాలు

అసెంబ్లీ నియోజకవర్గాలు

  1. అవనిగడ్డ
  2. గన్నవరం
  3. గుడివాడ
  4. పామర్రు
  5. పెడన
  6. పెనుమలూరు (పాక్షికం) (మిగతా భాగం ఎన్టీఆర్ జిల్లా)
  7. మచీలీపట్నం

రవాణా వ్వవస్థ

రహదారి రవాణా సౌకర్యాలు

సరిహద్దు లోని జాతీయ రహదారులు

సరిహద్దులో గల ఎన్టీఆర్ జిల్లా లోని విజయవాడను కలిపే జాతీయ రహదారులు.

రైలు రవాణా సౌకర్యాలు

  • ఎన్టీఆర్ జిల్లా లోని, విజయవాడ వద్ద రైల్వే స్టేషను భారతదేశంలో 2 వ రద్దీగా ఉండే జంక్షన్ ఉంది. 200 కంటే ఎక్కువ రైళ్లు ఈ రైల్వే స్టేషను ద్వారా (పాస్) ప్రయాణించడము, రైల్వే స్టేషను వద్ద రైలు ఆగిపోవడము లేదా (ప్రారంభము) బయలుదేరడము కాని జరుగుతుంది.

విమాన రవాణా సౌకర్యాలు

గృహోపకరణ సూచికలు

  • 2007–2008 సంవత్సరములో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాప్యులేషన్ సంస్థ వారు జిల్లా అంతటా 1229 గృహాలు 34 గ్రామాలలో ఇంటర్వ్యూ జరిపారు.[5] వారు 94.7% విద్యుత్, 93,4% నీటి సరఫరా, పారిశుద్ధ్యం, 60.3% టాయిలెట్ సౌకర్యాలు, 45.5 (శాశ్వత) నివాస గృహాసౌకర్యాలు ఉన్నట్లు కనుగొన్నారు.[5] 20.6% మంది స్త్రీలు అధికారక వయస్సు 18 సం.లు నిండక ముందే వివాహము చేసుకున్నారు.[6]
  • ఇంటర్వ్యూ నిర్వహించిన వారిలో 76,9% ఒక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఉన్నారు.

పరిశ్రమలు

ఉయ్యూరు వద్ద ఉన్న కెసీపి చక్కెర కర్మాగారం భారతదేశంలోని అతిపెద్ద చక్కెర కర్మాగారములలో ఒకటి. మచిలీపట్నం వద్ద బంగారం-లేపనం ఆభరణాలు (గిల్టు నగలు) పరిశ్రమలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని అతి పురాతన ఓడరేవు మచిలీపట్నంలో ఉంది. సిమెంటు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన సాంప్రదాయిక నృత్యరీతియైన కూచిపూడి నృత్యం జిల్లాలోని కూచిపూడి గ్రామంలో పుట్టింది.

సంస్కృతి

  • ప్రపంచ ప్రసిద్ధ కూచిపూడి నృత్య రూపం ఈ జిల్లాలో నుండి ఉద్భవించింది.
  • ఈ జిల్లా వాసులు మాట్లాడే తెలుగు యాసను తెలుగు భాషయొక్క సహజరూపమని భావించబడుతుంది.[ఆధారం చూపాలి]

విద్యాసంస్థలు

  1. కృష్ణా విశ్వవిద్యాలయం - మచిలీపట్నం.
  2. ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం

పర్యాటక ఆకర్షణలు

చారిత్రక స్థలాలు

ఆధ్యాత్మిక స్థలాలు

  • మొవ్వ గోపాల స్వామి ఆలయం, మొవ్వ: ఈ ఊరి స్థల పురాణము ప్రకారం మౌద్గల్య మహర్షి చేత ఇసుకతో ఇచటి మువ్వ గోపాల స్వామి విగ్రహం తయారుచేయబడెను. ఆ విగ్రహం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.
  • శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవస్థానం, శ్రీకాకుళం గ్రామం: ఈ ఆలయ ప్రధానదైవం "శ్రీమహావిష్ణువు". ఈ స్వామి ఆంధ్ర వల్లభుడు, ఆంధ్ర నాయకుడు, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు, ఇంకా మరెన్నో పేర్లతో భక్తుల పూజలందుకుంటున్నాడు. కలియుగంలో పాపభారం తగ్గించేందుకు ఈ స్వామి ఆవిర్భవించాడని భక్తుల విశ్వాసం.
  • శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం,మోపిదేవి
  • శ్రీ లక్ష్మి గాయత్రీ దేవి ఆలయం, తేలప్రోలు

క్రీడలు

  • ఈ జిల్లాలో కబాడీ ఆట అత్యంత ప్రజాదరణ ఉన్న క్రీడతో పాటు క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ ఆటలు ప్రాముఖ్యమైనవి. విజయవాడ లోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నందు, భారతదేశం యొక్క అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి. హాకీ క్రీడాకారుడు బలరాం ఈ జిల్లాకు చెందినవారు.

ప్రముఖ వ్యక్తులు

జిల్లాకు చెందిన చాల మంది వివిధ రంగాలలో పేరుగడించారు. వారిలో కొందరు: సిద్ధేంద్ర యోగి, క్షేత్రయ్య, విశ్వనాథ సత్యనారాయణ, గుడిపాటి వేంకటచలం, వేటూరి సుందరరామమూర్తి, వెంపటి చినసత్యం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పింగళి వెంకయ్య, ముట్నూరి కృష్ణారావు,కాశీనాథుని నాగేశ్వరరావు, గోపరాజు రామచంద్రరావు, పుచ్చలపల్లి సుందరయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య, సి. కె. నాయుడు, రఘుపతి వెంకయ్య నాయుడు, ఎస్. వి. రంగారావు, సావిత్రి, నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘంటసాల వేంకటేశ్వరరావు, రాజేంద్రప్రసాద్, శోభన్ బాబు, చంద్రమోహన్, మండలి వెంకటకృష్ణారావు,

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.