ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, నూజివీడు మండల పట్టణం From Wikipedia, the free encyclopedia
నూజివీడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఏలూరు జిల్లా లోని ఒక ముఖ్య పట్టణం. మామిడి తోటలకు, వీణలకు ప్రసిద్ధి.
పట్టణం | |
Coordinates: 16.78°N 80.85°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు జిల్లా |
మండలం | నూజివీడు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 31.69 కి.మీ2 (12.24 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 58,590 |
• జనసాంద్రత | 1,800/కి.మీ2 (4,800/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1012 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8656 ) |
పిన్(PIN) | 521201 |
Website | http://www.talk2nuzvid.com |
పూర్వం రాజుల పరిపాలనలో ఈ పట్టణం ఉండేది. నూజివీడు రాజుల కోట నుండి విజయనగర ఆస్థానం వరకు ఒక సొరంగం ఉండేది.అది ప్రస్తుతం కరెంటు ఆఫీసుగా ఉన్న రాజుల కోటకు ఆగ్నేయంగా ఉండేది.ఈ కోట కోడిగుడ్డు సొన, మినుప పిండి, సున్నం వేసి నిర్మించారు. తరువాత ఆ కోటలో ఆ.ప్ర సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలగా ఏర్పాటు చేసింది.
జిల్లా కేంద్రమైన ఏలూరుకు వాయవ్యంగా 32 కి.మీ దూరంలో ఉంది. విజయవాడకి 50 కి.మీ దూరములో ఉంది. సముద్రమట్టానికి 28 మీ. ఎత్తు.[2]
2011 జనగణన ప్రకారం జనాభా 58,590.
నూజివీడు పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
విజయవాడ, ఏలూరు నుండి రహదారి వ్యవస్థ ఉంది. సమీప రైల్వేస్టేషన్ ఏలూరులో ఉంది.
నూజివీడు మామిడి తోటలకు బాగా పేరున్న ప్రదేశం. పలు వందల రకాల మామిడి పళ్ళు ఇక్కడ లభించును. ప్రసిద్ధి చెందిన "నూజివీడు చిన్న రసం" పళ్ళకు నూజివీడు పుట్టినిల్లు.
పట్టణంలోని వెంకటేశ్వర కోవెల ప్రాంతములో వీణల తయరీ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ తయారుచేసిన వీణలకు, దేశంలోనే కాదు విదేశాలలో గూడా ప్రాచుర్యం ఉంది. రాజులకాలంలో ప్రారంభించిన వీణల తయారీదారులు ఇప్పటికీ తమ వృత్తిని కొనసాగించుచున్నారు. సరస్వతి, మయూర, విపంచి, డ్రాగన్, ఫోల్డింగ్, గోటు, మధుర వీణల తయారీలో షేక్ మాబు షేక్ మీరాసాహెబ్ నిష్ణాతులు. ఈ తండ్రీకొడుకులు రూపొందిన వీణలను ప్రముఖ వీణ చిట్టిబాబు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి, ద్వారం భవన్నారాయణ, డాక్టర్ పినాకపాణి, శ్యాంసుందర్ వంటి విద్వాంసులు తమ కచేరీలకు కొనుగోలు చేసేవారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.