భారతీయ నటుడు From Wikipedia, the free encyclopedia
అల్లు అర్జున్ తెలుగు సినిమా అగ్ర నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్ కు అభిమానులున్నారు. ఫేస్ బుక్ లో సుమారు రెండు కోట్ల మంది అభిమానులున్నారు. కేరళలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తారు.
అల్లు అర్జున్ | |
---|---|
జననం | [lower-alpha 1] మద్రాసు (ప్రస్తుతం చెన్నై), తమిళనాడు | 1982 ఏప్రిల్ 8
ఇతర పేర్లు | బన్నీ,[1] Mallu Arjun,[2] డ్యాన్సింగ్ డైనమైట్, స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2001–ప్రస్తుతం |
Works | అల్లు అర్జున్ చిత్రాలు |
జీవిత భాగస్వామి | స్నేహ రెడ్డి (m. 2011) |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు |
|
కుటుంబం | అల్లు కుటుంబం |
పురస్కారాలు | [[National award
Filmfare awards Nadhi awards]] |
2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా ఉద్భవించిన పుష్ప: ది రైజ్‌లో తన నటనకు అతను అధిక ప్రశంసలు అందుకున్నాడు, అన్ని కాలాలలో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలోని నటనకు 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న ఇతడు, తెలుగు సినిమారంగం నుండి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలిచిన తొలి తెలుగు హీరోగా నిలిచాడు.[3] ఆయన ఈ అవార్డును 2023 అక్టోబర్ 16న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులమీదుగా అందుకున్నాడు.[4] అల్లు అర్జున్ ప్రముఖ నటుడు.
అల్లు అర్జున్ చెన్నైలో 1982 ఏప్రిల్ 8న అల్లు అరవింద్, నిర్మల దంపతులకు రెండవ కుమారునిగా జన్మించాడు. అతని పెద్దన్నయ్య వెంకటేష్ (బాబీ), తమ్ముడు అల్లు శిరీష్. చెన్నైలోని పద్మ శేషాద్రి పాఠశాలలో చదువుకున్నాడు. చిన్నప్పుడే విజేత సినిమా చిత్రీకరణ చూడ్డానికి వెళ్ళినపుడు అందులో బాలనటుడి పాత్రలో మొదటి సారిగా నటించాడు. పాఠశాలలో ఉన్నప్పుడే జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాడు. ఎనిమిదో తరగతిలో ఉండగా కొన్నాళ్ళు పియానో కూడా నేర్చుకున్నాడు.[5]
చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభసందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన రామ్‌చరణ్ తేజ్, అర్జున్ ఇద్దరు ఆసక్తిగా పాల్గొనే వారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది. ఇతని వివాహము హైదరాబాదుకు చెందిన స్నేహారెడ్డితో జరిగింది.[6][7] వీరికి అయాన్ అనే కుమారుడు, అర్హ అనే కుమార్తె ఉన్నారు. ‘శాకుంతలం’ సినిమాతో వెండి తెరపై చిన్నారి అల్లు అర్హ ఎంట్రీ ఇవ్వడమేకాక ఐదేళ్లకే రెండు నెలల కాలవ్యవధిలో 50 మందికిపైగా చదరంగం ఆటలో శిక్షణ ఇచ్చింది. అత్యంత పిన్నవయసులోనే ఆమెలో ఉన్న అసమాన ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ అల్లు అర్హ కు వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా అవార్డు అందించారు.[8] అల్లు అర్జున్ ని అభిమానులు స్టయిలిష్ స్టార్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ ఎంటర్‌టైన్ కేటగిరిలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేతులమీదుగా అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నాడు.[9]
అల్లు అర్జున్ మొదటి చిత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి. చిరంజీవి డాడీ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి ఆకర్షించాడు. హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా తెలుగు సినిమా పరిశ్రమలో ఓ పెద్ద నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడిగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడుగా అల్లు అర్జున్ సినిమా పరిశ్రమ లోకి రావడం తేలికగానే జరిగింది కానీ దానిని సద్వినియోగం చేసుకొని తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాడు. గంగోత్రి తరువాత ఓ వైవిధ్యమైన పాత్రలో ఆర్యగా యువత మనసులో స్థానం సంపాదించాడు. ఆర్యతో తెలుగులోనే కాకుండా మలయాళ కన్నడ అభిమానుల ప్రశంసలు పొందాడు. ఇప్పటికి మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ డబ్ అయ్యి విడుదల అవుతుండటం విశేషం. ఆ తర్వాత రిలీజ్ అయిన బన్నీ విజయంతో హ్యాట్రిక్ పూర్తి చేసి కమర్షియల్ హీరోగా స్థిరపడ్డాడు. అక్కడ నుంచి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత చూపిస్తూ నటనలో ఇమేజ్తో డ్యాన్స్ లో స్టైల్ తో ప్రేక్షకుల అభిమానం కొల్లగొట్టాడు. పరుగులో కృష్ణగా చక్కని నటనతో ఆకట్టుకొని వేదంతో నవతరం నాయకులలో మల్టీస్టారర్ చిత్రాల సంస్కృతికి తెరతీసి ప్రయోగాలను ప్రారంభించాడు/ అంతేకాకుండా ఎవరో బాలీవుడ్ జనాలు చేసిన కామెంట్ ను సీరియస్ గా తీసుకొని ప్యాక్ బాడీ కల్చర్ ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత అల్లు అర్జున్ ది. ఆర్య, పరుగు సినిమాలకు నంది అవార్డు అందుకున్నాడు.
అల్లు అర్జున్ చిత్రాలన్నీ మలయాళం లోకి అనువదించ బడ్డాయి. కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అర్జున్ కే ఎక్కువ అభిమానులు ఉన్నారు, అక్కడి అభిమానులు ఆయన్ని మల్లు అర్జున్ అని పిలుస్తారు.[10]
సంవత్సరం | చిత్రం | పాత్ర | కథానాయిక | ఇతర విశేషాలు |
---|---|---|---|---|
1985 | విజేత | బాల నటుడిగా | ||
1986 | స్వాతిముత్యం | బాల నటుడిగా | ||
2001 | డాడీ | గోపి | అతిథి పాత్రలో | |
2003 | గంగోత్రి | సింహాద్రి | అదితి అగర్వాల్ | విజేత, సిని"మా" అవార్డ్ - ఉత్తమ నూతన నటుడు (2004) |
2004 | ఆర్య | ఆర్య | అనురాధా మెహతా | విజేత, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం (2004) |
2005 | బన్ని | రాజా/బన్ని | గౌరీ ముంజల్ | |
2006 | హ్యాపీ | బన్ని | జెనీలియా | |
2007 | దేశముదురు | బాల గోవిందం | హన్సిక మోత్వానీ, రంభ | పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2007) |
శంకర్‌దాదా జిందాబాద్ | అతిథి పాత్రలో | |||
2008 | పరుగు | కృష్ణ | షీలా | విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2008) విజేత, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం (2008) |
2009 | ఆర్య 2 | ఆర్య | కాజల్ అగర్వాల్ | పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2009) |
2010 | వరుడు | సందీప్ | భానుశ్రీ మెహ్రా | |
వేదం | కేబుల్ రాజు | అనుష్క శెట్టి, దీక్షా సేథ్ | విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2010) | |
2011 | బద్రీనాధ్ | బద్రీనాధ్ | తమన్నా | |
2012 | జులాయి | రవీంద్ర నారాయణ్ | ఇలియానా | |
2013 | ఇద్దరమ్మాయిలతో | సంజు రెడ్డి | అమలా పాల్, కేథరీన్ థెరీసా | |
2014 | ఐ యమ్ ధట్ చేంజ్ | లఘు చిత్రం, నిర్మాత కూడా | ||
రేసుగుర్రం | లక్ష్మణ్/ లక్కి | శృతి హాసన్ | విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2014) | |
ఎవడు | సత్య | కాజల్ అగర్వాల్ | కాజల్ అగర్వాల్ తో పాటు అతిథి పాత్రలో నటించాడు. | |
2015 | సన్నాఫ్ సత్యమూర్తి | విరాజ్ ఆనంద్ | సమంత, నిత్య మీనన్, అదా శర్మ | |
రుద్రమదేవి | గోన గన్నా రెడ్డి | అనుష్క శెట్టి, కేథరీన్ థెరీసా | ||
2016 | సరైనోడు | గణ | రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ థెరీసా | |
2017 | దువ్వాడ జగన్నాధం | దువ్వాడ జగన్నాధం / డి.జె. | పూజా హెగ్డే | |
2018 | నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా | సూర్యా | అను ఇమ్మాన్యుయేల్ | |
2020 | అల వైకుంఠపురములో | దేవరాజ్/బంటు | పూజా హెగ్డే | |
2021 | పుష్ప[11] | రష్మిక మందన |
జాతీయ చలనచిత్ర పురస్కారాలు (2021)
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.