కేథరిన్ థ్రెసా
భారతీయ నటి From Wikipedia, the free encyclopedia
కేథరీన్ థెరీసా (జననం : సెప్టెంబరు 10 1996) దక్షిణ భారత నటి. ఈమె మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో నటించింది.
సినీ జీవితం
కన్నడంలో ప్రముఖ నటుడు దునియా విజయ్ సరసన శంకర్ IPS సినిమాతో తెరంగేట్రం చేసిన కేథరీన్ అదే సంవత్సరంలో పృథ్వీరాజ్ సరసన మలయాళంలో ది ధ్రిల్లర్ సినిమాలో నటించింది. అదే సంవత్సరంలో కన్నడ భాషలో ఉప్పుకుండం బ్రదర్స్, విష్ణు సినిమాలలో నటించింది. 2012లో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును సాధించింది. 2013లో కేథరీన్ వరుణ్ సందేశ్ సరసన చమ్మక్ చల్లో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా విఫలమైనా కేథరీన్ కు మంచి గుర్తింపు వచ్చింది. విమర్శకులు కూడా ఆమె నటన, అందచందాలే ఆ సినిమాకున్న ఏకైక మంచి అంశంగా అభివర్ణించారు. ప్రస్తుతం కేథరీన్ నానీ సరసన పైసా, అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో అనే తెలుగు సినిమాల్లో నటిస్తోంది.
వ్యక్తిగత జీవితం
కేథరీన్ దుబాయికి చెందిన మలయాళం కేథలిక్ కుటుంబంలో జన్మించింది.[1] ఆమె చెప్పిన ప్రకారం "నేను అనర్గళంగా మలయాళం మాట్లాడలేను. మేము ఇంటిలో ఆంగ్లంలో మాట్లాడుకుంటాము. నేను హిందీ లో కూడా చక్కగా మాట్లాడాగలను. ప్రస్తుతం తెలుగు భాషను నేర్చుకుంటున్నాను".[2] ఈమె దుబాయిలో 12 గ్రేడు వరకు చదివింది. అచటనుండి బెంగళూరుకు ఉన్నత విద్య అభ్యసించటానికి వచ్చింది. ఈమె సెయింట్ జోసెఫ్ కాలేజీ, బెంగళూరులో రెండు సంవత్సరములు విద్యాభ్యాసం చేసింది.[3] ఈమె విద్యాభ్యాసం చేసే కాలంలో సంగీత వాద్యాలను ఉపయోగించుట, పాడుట, నృత్యం నేర్చుకుంది. ఈమె ఐస్ స్కేటింగ్ కూడా చేయగలదు.[2] ఈమె "నల్లి సిల్క్స్", "చెన్నై సిల్క్స్", "ఫాస్ట్ ట్రాక్", "జోస్కో జ్యుయలర్స్", "దక్కన్ క్రానికల్" లకు మోడల్ గా వ్యవహరిస్తున్నది. ఈమె "శ్రీకంఠదత్త వొడియార్ కాలెండర్"లో ఒక షాట్ లో గలదు. ఈమె అనేక నగరాలలో గల వివిధ రాంప్ షోలలో పాల్గొంది.[4]
నటించిన చిత్రాలు
సంవత్సరం | చలన చిత్రం | పాత్ర | భాష | ఇతర వివరాలు | |
---|---|---|---|---|---|
2010 | శంకర్ ఐ.పి.ఎస్. | శిల్పా | కన్నడ | ||
ది త్రిల్లర్ | మీరా | మళయాళం | |||
2011 | ఉప్పుకండం బ్రదర్స్ బ్యక్ ఇన్ యాక్షన్ | వినిలా సత్యనేశన్ | మళయాళం | ||
విష్ణు | మీనాక్షి | కన్నడ | |||
2012 | గొడ్‌ఫాదర్ | వాణి | కన్నడ | ||
2013 | చమ్మక్ చల్లో | సునైనా | తెలుగు | ||
ఇద్దరమ్మాయిలతో | ఆకాంక్ష | తెలుగు | |||
2014 | పైసా | నూర్ | తెలుగు | ||
మద్రాస్ | కలైయరసి | తమిళం | |||
ఎర్రబస్సు | రాజి | తెలుగు | |||
2015 | రుద్రమదేవి | అన్నంబిక | తెలుగు | ||
2016 | కదకళి | మీను కుట్టి | తమిళం | ||
కణితన్ | అను | తమిళం | |||
సరైనోడు | ఎం.ఎల్.ఏ. హంసితా రెడ్డి | తెలుగు | |||
2017 | కదంబన్ \ గజేంద్రుడు (2019 తెలుగు) | రతి | తమిళం | ||
గౌతమ్ నంద | ముగ్ధా | తెలుగు | |||
నేనే రాజు నేనే మంత్రి | దెవికా రాణి | తెలుగు | |||
జయ జానకి నాయక | తెలుగు | "ఎ ఫర్ అప్పిలు" అనే పాటలో ప్రత్యేక ప్రదర్శన | |||
కథా నాయగన్ | కన్మణి | తమిళం | |||
2018 | కలగలప్పు 2 | హేమ | తమిళం | ||
ఆనెంగులుం అల్లెంగులుం | మళయాళం | చిత్రీకరణ జరుగుతుంది | |||
2019 | వదలడు | తెలుగు \ తమిళ్ | |||
2020 | వరల్డ్ ఫేమస్ లవర్[5] | స్మిత | తెలుగు | ||
2022 | భళా తందనానా | తెలుగు | |||
బింబిసారా | ఐర | తెలుగు | |||
మాచర్ల నియోజవర్గం | తెలుగు | ||||
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.