జయ జానకి నాయక

2017 యాక్షన్ ప్రేమకథా చిత్రం From Wikipedia, the free encyclopedia

జయ జానకి నాయక

జయ జానకి నాయక 2017 లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ ప్రేమకథా చిత్రం.[1][2] ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటించారు.

త్వరిత వాస్తవాలు జయ జానకి నాయక, దర్శకత్వం ...
జయ జానకి నాయక
Thumb
దర్శకత్వంబోయపాటి శ్రీను
రచనఎం. రత్నం (మాటలు)
స్క్రీన్ ప్లేబోయపాటి శ్రీను
కథబోయపాటి శ్రీను
నిర్మాతమిర్యాల రవీందర్ రెడ్డి
తారాగణంబెల్లంకొండ శ్రీనివాస్
రకుల్ ప్రీత్ సింగ్
ఛాయాగ్రహణంరిషి పంజాబీ
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
ద్వారక క్రియేషన్స్
విడుదల తేదీ
11 ఆగస్టు 2017 (2017-08-11)
సినిమా నిడివి
149 ని
దేశంభారతదేశం
భాషతెలుగు
మూసివేయి

జ‌య‌జాన‌కి నాయ‌క సినిమాను ఖుంఖార్‌ పేరుతో హిందీలో డ‌బ్బింగ్ వెర్ష‌న్ యూట్యూబ్‌లో కొత్త రికార్డును నెల‌కొల్పింది. ఈ సినిమాకు 800 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. యూట్యూబ్‌లో 800 మిలియ‌న్ల వ్యూస్ రాబ‌ట్టిన ఏకైన తెలుగు డ‌బ్బింగ్ మూవీగా జ‌య‌జాన‌కి నాయ‌క నిలిచింది.[3]

కథ

గగన్(బెల్లంకొండ శ్రీనివాస్) చక్రవర్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారసుడు. తన తండ్రి (శరత్ కుమార్), అన్నయ్య (నందు)లతో కలిసి జీవిస్తుంటాడు. గ‌గ‌న్ (బెల్లంకొండ శ్రీనివాస్‌), స్వీటీ (ర‌కుల్ ప్రీత్‌సింగ్) ప్రేమించుకుంటారు. అనుకోని కార‌ణాల వ‌ల్ల స్విటీకి వ్యాపారవేత్త అశ్విత్ నారాయణ (జగపతి బాబు) కొడుకుతో పెళ్లైపోతుంది. కొద్ది రోజుల‌కే ఆమె భ‌ర్త‌ను కొంద‌రు చంపేస్తారు. స్వీటీని కూడా చంపాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. వారు ఎవ‌రు ? స్వీటీని గ‌గ‌న్ ఎలా కాపాడుకున్నాడు? అనేదే మిగతా సినిమా కథ.

తారాగణం

పాటలు జాబితా

  • అందమైన సీతాకోక చిలుక , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.సూరజ్ సంతోష్
  • లెట్స్ పార్టీ ఆల్ నైట్, రచన: శ్రీమణి, గానం. పృధ్వీ చంద్ర , ఎం ఎం మానసి
  • రంగు రంగు కళ్లజోడు, రచన: శ్రీమణి,గానం. హేమచంద్ర, శ్రావణ భార్గవి
  • నువ్వేలే నువ్వేలే, రచన: చంద్రబోస్, గానం. శ్వేతా మోహన్
  • జస్ట్ చిల్ బాస్, రచన: శ్రీమణి, గానం. ఎం ఎం మానసి, దీపక్
  • వీడే వీడే, రచన: శ్రీమణి, గానం ఖైలాస్ ఖైర్
  • ఏ ఫర్ ఆపిల్, రచన: శ్రీమణి, గానం. మమత శర్మ.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.