వరల్డ్ ఫేమస్ లవర్
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 2020లో విడుదలైన తెలుగు చలనచిత్రం From Wikipedia, the free encyclopedia
వరల్డ్ ఫేమస్ లవర్ 2020, ఫిబ్రవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరీన్ థెరీసా తదితరులు నటించగా, గోపి సుందర్ సంగీతం అందించాడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించాడు.[4]
వరల్డ్ ఫేమస్ లవర్ | |
---|---|
![]() వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ లుక్ పోస్టర్ | |
దర్శకత్వం | క్రాంతి మాధవ్ |
స్క్రీన్ ప్లే | క్రాంతి మాధవ్ |
కథ | క్రాంతి మాధవ్ |
నిర్మాత | కె.ఎ. వల్లభ కె. ఎస్. రామారావు |
తారాగణం | విజయ్ దేవరకొండ రాశీ ఖన్నా ఐశ్వర్య రాజేష్ కేథరీన్ థెరీసా |
ఛాయాగ్రహణం | జయకృష్ణ గుమ్మడి |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 14 ఫిబ్రవరి 2020[2] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹35 కోట్లు |
బాక్సాఫీసు | ₹12.55 కోట్లు[3] |
కథా నేపథ్యం
ప్రేమికులైన గౌతమ్ (విజయ్ దేవరకొండ), యామిని (రాశీ ఖన్నా) సహజీవనం చేస్తుంటారు. పేరొందిన రచయిత కావాలన్న లక్ష్యంతో గౌతమ్ ఉద్యోగాన్ని వదిలేస్తాడు. ప్రతిరోజు ఇంట్లో ఏదో రాయాలని ప్రయత్నిస్తున్న గౌతమ్ కు ఏం రాయోలో అర్థంకాదు. గౌతమ్ ప్రవర్తనపై విసుగుచెందిన యామిని బ్రేకప్ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ బ్రేకప్ బాధలో గౌతమ్ ఒక ప్రేమకథను రాస్తాడు. ఆ కథ ఎవరిది, గౌతమ్ ఆ కథను ఎందుకు రాశాడు అనేది, ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[5][6][7]
నటవర్గం
- విజయ్ దేవరకొండ (సీనా/శ్రీను, గౌతమ్)
- రాశీ ఖన్నా (యామిని)
- ఐశ్వర్య రాజేష్ (సువర్ణ)
- కేథరీన్ థెరీసా (స్మిత)
- ఇజాబెల్లె లైట్ (ఇజ) [4]
- జయప్రకాశ్ రెడ్డి
- ప్రియదర్శి పుల్లికొండ
- శత్రు
- ఆనంద చక్రపాణి
సాంకేతికవర్గం
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: క్రాంతి మాధవ్
- నిర్మాత: కె.ఎ. వల్లభ, కె. ఎస్. రామారావు
- సంగీతం: గోపీ సుందర్
- ఛాయాగ్రహణం: జయకృష్ణ గుమ్మడి
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: క్రియేటివ్ కమర్షియల్స్
నిర్మాణం
అభివృద్ధి
క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మాణంలో చిత్రాన్ని రూపొందించడానికి దర్శకుడు క్రాంతి మాధవ్, నటుడు విజయ్ దేవరకొండను సంప్రదించాడు.[8] అక్టోబరు నెలలో కథపరమైన చర్చలు ముగిసి, 2018, అక్టోబరు 18న దసరా పండుగ సందర్భంగా సినిమా అధికారికంగా ప్రారంభించబడింది.[9] ఈ ప్రారంభోత్సవానికి టి. సుబ్బరామి రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా చిత్ర నటవర్గం, సాంకేతికవర్గం పాల్గొన్నారు.[10]
నటీనటుల ఎంపిక
ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజాబెల్లె లైట్ హీరోయిన్ పాత్రల్లో నటించనున్నట్లు చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రకటించారు.[10] 2019 జనవరి లో, కేథరీన్ థెరిసా కూడా నటిస్తుందని 2019, జనవరిలో తెలిపారు.[11]
చిత్రీకరణ
2019, ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లాలోని ఇల్లందు ఈ చిత్రం నిర్మాణం ప్రారంభమైంది.[12] 2019, జూన్ నెలలో ఫ్రాన్సులో విజయ్ దేవరకొండతో ఒక షెడ్యూల్ చిత్రీకరించబడింది.[13]
పాటలు
వరల్డ్ ఫేమస్ లవర్ | ||||
---|---|---|---|---|
పాటలు by గోపి సుందర్ | ||||
Released | 6 ఫిబ్రవరి, 2020 | |||
Recorded | 2019 | |||
Genre | సినిమా పాటలు | |||
Language | తెలుగు | |||
Label | ఆదిత్యా మ్యూజిక్ | |||
Producer | గోపి సుందర్ | |||
గోపి సుందర్ chronology | ||||
| ||||
మూస:Singles |
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "మై లవ్ (రచన: రెహ్మన్)" | శ్రీకృష్ణ, రమ్య బెహరా | 3:37 | ||||||
2. | "బొగ్గు గనిలో (రచన: రామజోగయ్య శాస్త్రి)" | నిరంజ్ సురేష్ | 3:00 | ||||||
3. | "రాలెత్తి (రచన: శ్రేష్ఠ)" | దివ్య ఎస్. మీనన్ | 4:30 | ||||||
4. | "కొమోసవా పారీస్ (రచన: రామజోగయ్య శాస్త్రి)" | బెన్నీ దయాల్ | 2:30 | ||||||
5. | "మన కథ (రచన: రామజోగయ్య శాస్త్రి)" | ఎల్.వి. రేవంత్ | 3:00 | ||||||
17:07 |
విడుదల
2020, ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున ఈ చిత్రం విడుదలయింది.[2] తెలుగుతోపాటు, ఈ చిత్రం హిందీ, మలయాళం, తమిళంలో కూడా విడుదలయింది.[14]
మార్కెటింగ్
2019, సెప్టెంబరు 17న ఈ చిత్రం టైటిల్ ప్రకటించబడింది.[15] 2019, సెప్టెంబరు 17న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయింది.[16] 2020, జనవరి 3న చిత్ర మొదటి టీజర్ విడుదలయింది.[17] 2020, ఫిబ్రవరి 6న ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.[18]
స్పందన
బాక్సాఫీస్
నాలుగు రోజులకు 12.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది.[3]
విమర్శకుల స్పందన
కథాంశం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంశాలలో ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రతికూల సమీక్షలను అందుకుంది. సీనయ్య, సువర్ణ, యామిని పాత్రలలో విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ నటనకు అనుకూల సమీక్షలు వచ్చాయి.[19]
మూలాలు
ఇతర లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.