Remove ads
బ్రెజిల్ దేశానికి చెందిన సినిమా నటి, మోడల్ From Wikipedia, the free encyclopedia
ఇజాబెల్లె లైట్ ( 1990 సెప్టెంబరు 2)[1] బ్రెజిల్ దేశానికి చెందిన సినిమా నటి, మోడల్.[2] హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది.
ఇజాబెల్లె లైట్ 1990, సెప్టెంబరు 2న బ్రెజిల్ దేశంలోని పారాబాలోని, జోనో పెసోవాలో జన్మించింది.
లాక్మే బ్యూటీ ప్రొడక్ట్స్, ప్రొక్టర్ & గాంబుల్, బిగ్ బజార్, పాకిస్తాన్ బ్రాండ్ నిషాత్ లినెన్ వంటి వస్తువుల ప్రచార చిత్రాలలో నటించింది.[3] 2012లో తలాష్: ది ఆన్సర్ లైస్ వితిన్ సినిమాతో బాలీవుడ్ సినిమారంగంలోకి అడుగుపెట్టిన ఇజాబెల్లె, 2013లో సిక్స్‌టీన్ సినిమాలో ప్రధానపాత్రలో నటించింది. 2014లో పురానీ జీన్స్ సినిమాలో నటించింది.[4] సిక్స్‌టీన్ చిత్రానికి ఉత్తమ తొలిచిత్ర నటిగా లైఫ్ ఓకే స్క్రీన్ అవార్డ్స్-2014కి నామినేట్ చేయబడింది.
సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2012 | తలాష్: ది ఆన్సర్ లైస్ వితిన్ | వేశ్య | హిందీ | |
2013 | సిక్స్‌టీన్ | అను | హిందీ | |
2014 | పురానీ జీన్స్ | నయనతార సప్రు | హిందీ | |
2018 | నరేంద్ర | తెలుగు | ||
2019 | మిస్టర్ మజ్ను | మాధవి | తెలుగు | |
2020 | వరల్డ్ ఫేమస్ లవర్[5] | ఇజ | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.